(మొదటిభాగం తర్వాత)
ఒడిదుడుకులు నా జీవితంలో ఓ
భాగం అయిపోయినా, ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది. అంతేకాదు, వాటినుంచి
బయటపడే శక్తి చిన్నా నుంచే దొరుకుతూ ఉంటుంది నాకు. విమానం సాఫీగా సాగుతోంది. కుదుపు తగ్గడంతో మళ్ళీ నిద్రలోకి వెళ్ళాడు
చిన్నా. నేను వెళ్ళడానికి నా గతం ఉండనే ఉంది కదా..
అమ్మ నన్ను పురిటికి తీసుకెళ్ళడానికి వచ్చిన రోజునే శ్రీకాంత్ గారు ఇంటికి వచ్చారు. నేను ఏమీ అడిగింది లేదు. జరిగింది ఇదీ అని అమ్మకి చెప్పనూలేదు. గంగ గురించి నాకు తెలియకపోతే శ్రీకాంత్ గారు 'నా భర్త' లేదా 'మా ఆయన' అయ్యేవారేమో. తెలిసిన తర్వాత కూడా నాకు ఎవరిమీదా కోపం రాలేదు అని చెబితే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ అది నిజం.
పుట్టింట్లో అమ్మ పుస్తకాలు ప్రేమగా పలకరించాయి నన్ను. పెళ్ళికి ముందు చెప్పినట్టుగానే అమ్మ నాకు రోజూ జాగ్రత్తలు చెబుతోంది. తేడా అల్లా, ఇప్పుడావిడ నాకు బాగా అర్ధమవుతోంది.
చిన్నా భూమ్మీద పడ్డ రోజున, నాకంటూ ఓ ప్రపంచం ఏర్పాటయినట్టు అనిపించింది. వాడి సన్నని వేళ్ళూ, ఎర్రని గోళ్ళూ, బోసి నోరూ, కళ్ళు మూసుకుని ఆడుకునే ఆటలూ మరీ మరీ చూసుకునేదాన్ని.
కబురందుకుని కొడుకుని చూసుకోడానికి వచ్చారు శ్రీకాంత్ గారు. ఆ కళ్ళలో వెలుగు. ఒక బొమ్మని పూర్తి చేసినప్పుడు కనిపించే వెలుగు. ఓ బహుమతిని గెలుచుకున్నప్పుడు కనిపించే వెలుగు. రెండు రోజులుండి వెళ్ళారు. ఆలోగానే పిల్లవాడి బారసాల ఎలా జరిపించాలో నిర్ణయించేశారు అందరూ. ఇద్దరు జమీందార్ల మనవడు మరి.
నెలన్నా గడవక మునుపే అత్తింటినుంచి కబురు, మావగారు కాలం చేశారని. అమ్మా, నాన్నా నన్ను తీసుకుని ప్రయాణం అయ్యారు. బారసాల జరపకుండా, చీర, సారె పెట్టకుండా తీసుకెళ్ళాల్సి వస్తున్నందుకు అమ్మ ఎంతగానో నొచ్చుకుంది.
మావగారి కర్మకాండలు పూర్తవుతూనే, మరో చావు కబురు. అమ్మ మేనమామ అనారోగ్యంతో తీసుకుని ప్రాణం వదిలారు. అమ్మకి ఆయనంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. చివరిచూపుకి వెళ్ళడం మానొద్దని గట్టిగానే చెప్పాను. అప్పలనరసమ్మకి వెయ్యి జాగ్రత్తలు చెప్పి అమ్మా, నాన్నా ఆ ఊరికి బయల్దేరారు.
శ్రీకాంత్ గారు చిన్నాతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆ తండ్రీ కొడుకుల మధ్యకి వెళ్ళడం కన్నా, దూరంగా నిలబడి వాళ్ళని చూడడమే బాగుంటుంది నాకు. పిల్లవాడితో ఆడుతూనే మధ్య మధ్యలో తన గదికి వెళ్లి ఓ పెయింటింగ్ చేస్తున్నారు. ఏదో పోటీకి పంపాలి కాబోలు. వేళ మించకుండా పూర్తి చేయాలని తాపత్రయ పడుతున్నారు.
ఆ వేళ ఉదయం, చిన్నా పనులు చూస్తున్నాను నేను. స్నానం అవగానే నిద్రపోవడం వాడి అలవాటు. ఆవేళ మాత్రం చాలా తిక్కలో ఉన్నాడు. జోకొట్టే ప్రయత్నాలు చేస్తున్నాను నేను. పక్క గదిలో నుంచి అప్పలనరసమ్మ గావు కేక వినిపించి, చిన్నాని ఎత్తుకుని పరిగెత్తాను. నేలమీద అపస్మారకంగా పడి ఉన్నారు శ్రీకాంత్ గారు. కొయ్యబారిపోయాన్నేను.
పనివాళ్ళందరూ పోగు పడ్డారు. కబురు విని, శరత్ వచ్చి, డాక్టర్ని పిలిపించారు. "అయాం సారీ" అన్న డాక్టర్ మాట వింటూనే స్పృహ తప్పి పడిపోయాను.
నేను స్పృహలోకి వచ్చేసరికి శ్రీకాంత్ గారి అంతిమ యాత్రకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మా నాన్నే కాదు, బంధువులు కూడా ఎవరూ రాలేదు. ఆగమనే వాళ్ళు లేరు. "చివరి సారి నమస్కరించుకోండమ్మా," అన్న మాట విని, నన్ను పాడె దగ్గరకు తీసుకు వెళ్ళింది అప్పలనరసమ్మ.
నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. ఎప్పుడూ బంగారం రంగులో మెరిసిపోయే శ్రీకాంత్ గారి చెంపలు కమిలినట్టుగా కనిపించాయి. కళ్ళు తుడుచుకుని పరీక్షగా చూశాను. శవం నల్లబడుతోంది. ఒక్కుదుటన గదిలోకి పరిగెత్తాను. చిన్నా ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. వాడి పొట్ట కదలడం చూసేలోగా నేనెలా బతికున్నానో నాకే తెలీదు.
నేను పడగనీడలో ఉన్నానన్న నిజం తెలిసిన క్షణం నుంచీ, చిన్నాకి అక్షరాలా పహారా కాశాను. అమ్మా, నాన్నా రావడం ఆలస్యం. జరిగింది చెప్పేశాను.
"అయ్యో తల్లీ.. ఆస్తి కోసం సొంత వాళ్ళని చంపుకునే మనుషులనుకోలేదమ్మా వీళ్ళు," బావురుమంది అమ్మ. నాన్నెప్పుడూ నాతో పెద్దగా మాట్లాడింది లేదు. ఆవేళ మొదటిసారి నోరువిప్పారు.
"ఎంతోమంది ఆడపిల్లల ఉసురు పోసుకున్నానమ్మా నేను.. అదంతా నా కూతురికి తగులుతుందనుకోలేదు.. వద్దు.. నువ్వీ ఇంట్లో క్షణం కూడా ఉండొద్దు," అనడమే కాదు, శరత్ మాటలు కాదని నన్ను పుట్టింటికి తీసుకొచ్చేశారు.
అప్పటికప్పుడు తన ఆస్తిని మూడు భాగాలు చేశారు. ఒక భాగం అమ్మేసి డబ్బు చేశారు. తిండీ, నిద్రా మాని నా కోసం శ్రమించారు నాన్న. పెద్దన్నయ్య అప్పటికే బోస్టన్ లో డాక్టర్ గా సెటిల్ అయ్యాడు. శ్రీకాంత్ గారు పోయిన పదో రోజుకి మేము మద్రాస్ లో ఉన్నాం. నెల తిరక్కుండానే నేనూ, చిన్నా బోస్టన్ లో అడుగుపెట్టాం.
అన్నయ్య, వదిన మంచి వాళ్ళే. కానీ ఎన్నాళ్ళని వాళ్ళ మీద ఆధార పడడం? నాన్నిచ్చిన డబ్బుంది. కానీ, కూర్చుని తింటే కొండలైనా కరగవూ? పైగా రూపాయలని డాలర్లలోకి మార్చుకుని ఖర్చు చేయాలి. అమెరికాని అర్ధం చేసుకుని, నెమ్మదిగా నాకంటూ ఓ వ్యాపకాన్ని ఎంచుకున్నాను. దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాను.
నేను పెద్దగా చదువుకున్నదాన్ని కాదు. పుస్తకజ్ఞానం తప్ప, లోకజ్ఞానం బొత్తిగా లేనిదాన్ని. ఎన్నో ఒడిదుడుకులు. కష్టం వచ్చిన ప్రతిసారీ, చిన్నాని చూసుకుని ధైర్యం తెచ్చుకునే దాన్ని. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే వాటన్నింటినీ ఎలా దాటానో అనిపిస్తూ ఉంటుంది.
చిన్నాకి, తండ్రి గురించి పూర్తిగా నేనెప్పుడూ చెప్పలేదు. ఆ ఇంటికి, ఆ మనుషులకి వాడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఉద్దేశం. మాకంటూ ఉన్న బంధువులల్లా పెద్దన్నయ్య కుటుంబమే. అమ్మ పోయినప్పుడూ, నాన్న పోయినప్పుడూ ఇండియా వెళ్ళినా ఆ ఊరికి వెళ్ళలేదు.
ఆ ఇంట్లో నుంచి నేను తెచ్చుకున్న ఒకే ఒక్క వస్తువు శ్రీకాంత్ గారు పూర్తి చేయలేకపోయిన పెయింటింగ్. ఆ ఇంట్లో ఏ వస్తువూ వద్దనుకున్నాను కానీ, ఆ పెయింటింగ్ మాత్రం తెచ్చుకోకుండా ఉండలేకపోయాను. సాయం సంధ్య వేళలో వారణాసిలో ప్రవహిస్తున్న గంగానది వర్ణచిత్రమది. ఆ పెయింటింగ్ ని చూసినప్పుడల్లా నాకు రకరకాల ఆలోచనలు వస్తాయి.
ఇప్పుడు చిన్నా మనసులో ఉన్న ఆలోచన ఏమిటో? ఏమీ లేకుండా ఇండియా ప్రయాణం పెట్టడు. వాడు ప్రయాణం విషయం చెప్పగానే, పెద్దన్నయ్యతో మాట్లాడదామా అనిపించింది ఒక్క క్షణం. కానీ, నా కొడుకుని నేనే నమ్మకపోతే ఎలా? అందుకే ఆ ఆలోచన విరమించుకున్నాను.
విమానం నుంచి కారులోకి మారినా, ఆలోచనలు మాత్రం ఆగడం లేదు. దివాణం ముందు ఆగింది కారు. చాలా కోలాహలంగా ఉందక్కడ. రోడ్డు మీద కారుల బారు. పాతికేళ్ళ తర్వాత ఆ లోగిట్లోకి అడుగు పెట్టాలంటే ఎలాగో ఉంది నాకు. పైగా, ఏ పరిస్థితుల్లో నేనా గడప దాటానో ఈ జన్మకి మర్చిపోలేను.
చిన్నాకి మాత్రం ఇదేమీ పట్టడం లేదు. ఎక్కడా బెరుకు లేదు వాడిలో. దర్జాగా నడుస్తున్నాడు. తన ఇంట్లోకి తను వెళ్తున్నట్టుగా. అవును వాడి ఇల్లే కదూ ఇది? ఆస్తులు కోరుకుంటాడా వీడు? నా పెంపకం మీద నాకెంత నమ్మకం ఉందో అర్ధం కావడం లేదు.

అతిథులకి
స్వాగతం చెబుతూ బేనర్లు రెపరెపలాడుతున్నాయి. 'శరత్ బాబు చిత్రకళా
ప్రదర్శనకి స్వాగతం' ..ఆ పేరు చూడగానే చిన్నా చెయ్యి గట్టిగా
పట్టుకున్నాను. ఆగాడు వాడు. ద్వారబంధం దగ్గర ఉన్నాం ఇద్దరం. దర్బారు హాలు
నుంచి ప్రసంగం వినిపిస్తోంది. ఎవరో ప్రముఖ చిత్రకారుడు కావొచ్చు. భారతీయ
చిత్రకళని గురించి చెబుతున్నాడు.
"ఇక, తెలుగు దేశానికి వస్తే,
ప్రాక్పశ్చిమ వర్ణచిత్రాల్లో సొబగులని ఒడిసిపట్టుకుని చిన్న వయసులోనే
తనకంటూ ఓ శైలిని సృష్టించుకున్న చిత్రకారుడు కీర్తిశేషులు శ్రీకాంత్ బాబు..
మన శరత్ బాబు గారికి స్వయానా సోదరుడు. శ్రీకాంత్ బాబుని కోల్పోవడం భారతీయ
చిత్రకళ దురదృష్టం.." నిటారుగా నిలబడి చెవి ఒగ్గి వింటున్నాడు చిన్నా.
అంత
గొప్ప ఆర్టిస్టా శ్రీకాంత్ గారు!! ఆ మనిషిని మాయం చేసిన వాళ్ళకి, పేరుని
మాయం చేయడం మాత్రం సాధ్యపడలేదన్న మాట. తమ్ముడి ప్రస్తావన విని శరత్ మొహంలో
ఎన్ని రంగులు మారి ఉంటాయో. ఇంతకీ, ఈ కార్యక్రమం ఉందని చిన్నాకి తెలుసునా?
వీడూ, శరత్ ఎదురు పడగానే ఏం జరుగుతుంది?? నా ఆలోచనలు అనంతంగా
సాగిపోతున్నాయి.
చిన్నా కూడా అక్కడినుంచి కదిలే ప్రయత్నం చేయడం లేదు. గుమ్మంలోనే నిలబడిపోయిన మమ్మల్ని పనివాళ్ళు వింతగా చూస్తున్నారు.
"శ్రీ శరత్ బాబు గారు తన చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండడంతో పాటు, చిత్రకళ ని తగురీతిలో ప్రోత్సహించడం ఎంతైనా ముదావహం.." ఉపన్యాసం ముగియడంతోనే హాలంతా చప్పట్లు మారుమోగాయి.
సరిగ్గా అప్పుడే దివాణం లోపలినుంచి అప్పలనరసమ్మ పరుగున వచ్చింది. నన్ను చూస్తూనే గుర్తుపట్టి ముఖమింత చేసుకుంది.
"మైదిలమ్మా.. ఏవైపోయారు ఇన్నాళ్ళూ.. బావున్నారు కదా.. శానా సంతోసం తల్లే.. సిన్నబాబా? అచ్చం బాబుగారి పోలికేనమ్మా.. మా బాస తెలుత్తాదా అమ్మా సిన్నబాబుకి?" నా రెండు చేతులూ పట్టుకుని వరసగా ప్రశ్నలు వేసేస్తోంది.
"మీకోసమే వచ్చాం నరసమ్మా" అన్నాడు చిన్నా. అప్పలనరసమ్మతో పాటు, నేనూ ఆశ్చర్యపోయాను.
"గంగమ్మ గారింటికి తీసుకెళ్ళవూ మమ్మల్ని?" వాడి మాటకి అదిరి పడ్డాం మేమిద్దరం. నా చేతులు వదిలేసింది నరసమ్మ. ముందుగా తెరుకున్నది నేనే. ఇండియా ట్రిప్ ఎందుకో నెమ్మది నెమ్మదిగా అర్ధమవుతోంది. నా కాళ్ళ కింద నేల ఉందిప్పుడు.
"ఆయమ్మి నేదు బాబూ.. బాబుగోరి దినవోరాలు అవ్వకుండానే బెంగడి సచ్చిపోనాది.." నేల కదిలినట్టుగా అనిపించి, చిన్నా భుజాన్ని ఆసరా చేసుకున్నాన్నేను. ఈ సారి ముందుగా తేరుకున్నది చిన్నానే. హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న పనివాళ్ళు ఆగి మమ్మల్ని కుతూహలంగా గమనిస్తున్నారు, దూరంనుంచే.
"బయల్దేరతాం నరసమ్మా.." అన్నాడు చిన్నా. ఏం చేయాలో తెలియని అయోమయంలో మా వెనుకే కారు వరకూ వచ్చింది నరసమ్మ. కారెక్క గానే చిన్నాకేదో గుర్తొచ్చింది. జేబులో నుంచి చిన్న పేకెట్ తీసి "ఇది నీకోసం నరసమ్మా.. చూసి చెప్పు ఎలా ఉందో?" అని అడిగాడు.
పేకెట్లో ఉన్న బంగారు గొలుసు చూసుకుని అప్పలనరసమ్మ మొహం చింకి చేటంత అయ్యింది.
"సల్లగుండు మారాజా... మైదిలమ్మా, సినబాబుకి పేరేం యెట్టేరమ్మా?"
నేను నోరు తెరిచేలోగానే చిన్నా చిరునవ్వుతో చెప్పాడు "నా పేరు.. గంగాధర్..."
కారు కదిలిపోయింది.
(అయిపోయింది)
మీ అన్ని కథల్లానె ఈ వర్ణచిత్రం కూడ బాగుంది.
రిప్లయితొలగించండిమీ నుండి మరో కృష్ణవేణి లాంటి మిని నవల వస్తే చదవాలనిఉంది.
ఆ కథ మరుసటి భాగాలకోసం ఎదురుచూడటం .. ఎదురుచూపుల తర్వత వచ్చిన కథని చదవడం అదో రకం త్రిల్ల్.. వింత భావన.. మా కోసం మీరు ఇంకొసారి అలాంటి నవలని ..తీసుకురావలని..
ఆశిస్తు మీ అభిమాని
శ్రీ.
దివాణంలో నాలుగు రోజులు ఉందామనుకున్నామే..ఇంత త్వరగా ముగించారేమింటండీ?
రిప్లయితొలగించండిadbutam andi.
రిప్లయితొలగించండిగంగాధర వర్ణచిత్రం సర్వాంగశోభితంగా ఉందండీ
రిప్లయితొలగించండిEkantham gundela meeda etavalu katti!
రిప్లయితొలగించండిIntha abrupt ending istaranukoledu sumandee!!
Maro krishnaveni no andistaranukunnam...!!!
Bhasker koorapati.
బాగుందండీ...
రిప్లయితొలగించండి@శ్రీ: 'కృష్ణవేణి' కి మీ ప్రోత్సాహం మర్చిపోలేనండీ.. మరో నవలిక అంటే.. చూడాలండీ.. అన్నీ కలిసి రావాలి కదా.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@జ్యోతిర్మయి: ఈసారెప్పుడైనా ఉందురుగానండీ :)) ధన్యవాదాలు
@స్వాతి: ధన్యవాదాలండీ..
@శ్రీనివాస్ పప్పు: భలేగా చెప్పారండీ, ఒక్క మాటలో!! ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@భాస్కర్: అయ్యో, కథ అయిపోయింది కదండీ.. పొడిగించడానికి ఏమీ లేదు మరి.. మరో 'కృష్ణవేణి' అంటే, టైం కావాలండీ ..ధన్యవాదాలు
@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
ఇంకా చాలా భాగాలు నడుస్తుందనుకున్నానండీ...
రిప్లయితొలగించండిచాలా బాగుంది వర్ణచిత్రం...గోదారి నేపద్యంలో ఒక కధ చదువుతుంటే, సరిగ్గా మాటల్లో చెప్పాలేను కానీ ఎందుకో ఒక రకమైన ఫీల్ కేరీ అవుతుంటుంది నాకు...ఇప్పుడూ అంతే!!...
రిప్లయితొలగించండి@స్ఫురిత మైలవరపు: కథ అయిపోయిందండీ మరి.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: థాంక్యూ..
చిత్రలేఖనం... సంగీతం... నాట్యం.... నాటకాలు... రికార్డింగ్ డాన్సులు.... రాన్రానూ విశ్వనాథ్ తరహాలో వెళ్ళిపోతున్నారా? దహా :)
రిప్లయితొలగించండిఏ కథలో ఏయే నేపథ్యం ఎన్నుకున్నారో చూద్దామని కూచుని మీ కథల పుస్తకం రివిజన్ పూర్తి చేసేసాను.
ప్లెయిన్ స్పీక్ కథలో కూడా లేయర్లు మహా అందంగా సృష్టించడంలో సిద్ధహస్తులు సుమీ మీరు...
@పురాణపండ ఫణి: ఎంత యాదృచ్చికమో చూడండి.. ఈ పోస్టు పబ్లిష్ చేస్తూ "నేపధ్యాలు మరీ దగ్గరగా ఉన్నాయి" అనుకున్నాను.. మీదీ అదే మాట!! ఎంత శ్రద్ధగా చదువుతున్నారసలు!!! విశ్వనాథ్ ఏమీ కాదులెండి, మధ్య మధ్యలో 'ప్రయోగాలు' కూడా చేస్తున్నాను కదా :)) ...మెనీ మెనీ థాంక్స్..
రిప్లయితొలగించండినింపాదిగా, ఒడుపుగా చెప్తారండీ కథ. చదవడం ముగించాక ఆలోచింపజేస్తాయి కొన్ని సన్నివేశాలూ, పాత్రలు... అలాంటివి మీ కథల్లో చాలా ఉంటాయ్.
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: శ్రద్ధగా చదువుతున్నందుకు మెనీ థాంక్స్ అండీ..
రిప్లయితొలగించండి