'వన్ ఫోర్ త్రీ... వన్ ఫోర్ ఫోర్... వన్ ఫోర్ ఫైవ్... వన్ ఫోర్ సిక్.....' అబ్బా.. స్కిప్పింగ్ రోప్ షూ కింద పడింది. ఇంకొక్క ఐదు స్కిప్పులైతే నూట యాభై అయ్యేవి కదా.. సరే.. తీసుకునే బ్రేకేదో ఐదు స్కిప్పుల ముందే తీసుకుందాం. కౌంటర్ మీద సైలెంట్ మోడ్ లో పెట్టిన ఫోన్, కార్ కీస్, చిన్న టర్కీ టవల్.. హమ్మయ్య ఎవరూ కదపలేదు. ఫోన్ ప్రశాంతంగానే ఉంది. ట్రెడ్ మిల్ అంకుల్ పలకరింపు నవ్వుకి రిప్లై ఇచ్చేసి, మళ్ళీ నా స్కిప్పింగ్ రోపూ నేనూ. ఇటు పక్క కుర్రాడు బైసెప్స్, ఆ వెనుకతను పుషప్స్. 'కాంటా లగా' ఫుల్ వాల్యూం లో ఉంది, అందరినీ హుషారించడానికి కాబోలు.
"అంత పైకి గెంతద్దు.. త్వరగా అలిసిపోతావ్. అతను చూడు, ఫుట్ సౌండ్ కూడా వినిపించడం లేదు" ట్రైనర్ వచ్చి గుసగుసలాడాడు చెవిలో. మొట్ట మొదటిరోజు వందో స్కిప్పు అయ్యీ అవ్వడం తోనే వంటి నిండా చెమటలతో కూలబడి పోయిన నన్ను చూసి టెన్షన్ పడిపోయింది ఇతగాడే. "థౌజండ్ స్కిప్స్ అయ్యాక సైక్లింగ్, ట్రెడ్ మిల్ కంప్లీట్ చేసేస్తే, కొత్త ఎక్సెర్సైజ్ నేర్పిస్తా.." నేను పళ్ళు నూరడం తనకి వినిపించే చాన్స్ లేదు. సో, ఇవన్నీ అయితే తప్ప ఇతగాడు నన్ను విడుదల చెయ్యడు.. అప్పటికి స్వీటీ నిద్దరోతుందో ఏమిటో. ఈపాటికి ఈవెనింగ్ వాక్ అయిపోయి ఉంటుంది. తనెలాగూ టీవీ చూడదు కాబట్టి ఇక నిద్రే.
స్కిప్పింగ్ అయ్యేసరికి, ట్రెడ్ మిల్ ఖాళీ అయ్యింది. ఇంకెవరో వచ్చెయ్యక ముందే గబుక్కున అటు గెంతేసా. ట్రైనర్ రాక్షసుడు నన్ను ఖాళీగా చూశాడంటే ఏ రాళ్లో రప్పలో ఎత్తిస్తాడు.అంతకన్నా ట్రెడ్ మిల్ సుఖం. ఫోన్ వెలిగింది ఎందుకో. "రిపోర్ట్ నార్మల్ వచ్చింది బడ్డూ. నేను బజ్జుంటున్నా.. ఉదయం కాల్ చేస్తానూ.. లవ్యూ" స్వీటీ టెక్స్ట్. తల పైకెత్తితే అద్దంలో నేను. ముఖం కడుక్కుని తుడుచుకోడం మర్చిపోయినట్టుగా. "టూమచ్చాఫ్ ఫ్రెట్టింగ్ బడ్డీ.. తుడుస్తా ఉండు," అంటూ మంచం పక్కనే లుంగ చుట్టుకు పడున్న తన ఎర్రంచు తెల్ల పట్టు చీరని స్వీటీ అందుకోవడం నిన్నో, మొన్నో జరిగినట్టుంది. రోజులో ఇరవై మూడు గంటలు పరిగెత్తేస్తున్నాయి, ఈ ఒక్క గంటా తప్ప. ఇంటికెళ్ళి నిద్దరోతే, స్వీటీ కాల్ కే మళ్ళీ లేవడం.
ఆయనెవరో మహాకవి సంధ్యా సమస్యల గురించి కవిత్వం రాశాడు కానీ, నాకు మాత్రం తెల్లారుతూనే సమస్య మొదలవుతుంది. అటు చూస్తే డెనిమ్ జీన్సూ, ఇటు చూస్తే రేమాండ్ ట్రౌజర్స్.. ఇంకా కొత్త మెరుపు కూడా పోలేదు. కానీ, ఏం లాభం? ఎంత బలంగా ఊపిరి పీల్చుకున్నా బటన్ పట్టనంటుంది. వాటిని నిర్లిప్తంగా చూస్తూ, ఈ మధ్య కొనుక్కున్న ట్రౌజర్స్ నుంచి ఏదో ఒకటి పిక్ చేసుకోడం అలవాటైపోయింది. అదృష్టం బావుండి, షర్ట్స్ కి ఇంకా ఆ సమస్య రాలేదు. లేకపోతేనా? ట్రైనర్ రాక్షసుడు ఇంకెన్ని హింసలు పెట్టేవాడో. "మా వైజాగ్ లో బీచ్ ఉంది కదా.. రెగ్యులర్ గా రన్ చేసేవాడిని.. అందుకే ఇప్పటికీ నేను చాలా ఫిట్" టీమ్మేట్ పెళ్ళికాని ప్రవీణ్ ఎంత గర్వంగా చెప్పాడో, ప్రాజెక్ట్ మొదలైన కొత్తల్లో. "కమాన్ మేన్" అనాలనిపించినా, పైకి అనలేదు.
"మాణింగ్ బడ్డూ.. బ్రేక్ఫాస్ట్ ఏ రెస్టారెంట్ లో?" స్వీటీ పలకరింపు. "సలాడ్" అని చెబితే ఏమనేదో కానీ, నేను చెప్పలేదు. డాక్టర్ కబుర్లు అయ్యాక తనే అడిగింది "కొత్త ప్రాజెక్ట్ లో వర్క్ హెక్టిక్ గా ఉందా బడ్డూ?" అని.. దీనికీ సమాధానం చెప్పలేదు. ఒకప్పుడు 'బడ్డీ' అని ముద్దుగా పిలిచిన స్వీటీ, ఇప్పుడు 'బడ్డూ' అని అంతే ముద్దుగా పిలుస్తోంది. ముద్దుకి లోపం లేదు కానీ, పిలుపే.. ప్చ్. ప్రవీణ్ ని అయితే, "పెళ్లి కానీ, నీకూ తెలిసొస్తుంది" అని తిట్టేసుకున్నాను కానీ, అసలు పెళ్ళితో సంబంధం ఏముందీ? పెళ్ళయ్యాక కూడా మొన్నటి ప్రమోషన్ వరకూ ఆ డెనిమ్, రేమాండ్స్ చక్కగా సరిపోయాయి కాదూ? ఆ వేళ రెండు రకాల స్వీట్స్ తెప్పిస్తే కలీగ్స్ అంతా అనుమానంగా చూశారు, "ఒక్క ప్రమోషన్ కి రెండు స్వీట్సా?" అన్నట్టు. వద్దనుకుంటూనే ప్రవీణ్ చెవిలో వేశా, "ఇంట్లో కూడా ప్రమోషన్" అని. వందకోతులు కదూ. చూపించేసుకున్నాడు జాతి లక్షణం.
అసలు స్వీటీ సర్కిలే బోల్డంత పెద్దది. న్యూస్ మెలమెల్లగా అందరికీ తెలిసిపోయింది. అది మొదలు ఇంట్లో ఈట్ స్వీట్స్, డ్రింక్ స్వీట్స్. అక్కడికీ చాలాసార్లే చెప్పాను, "ఇవి నువ్వు తినడానికి స్వీటీ" అని. వింటే కదా.. పైగా "నీ కంట్రిబ్యూషనే కదా బడ్డీ.. కాబట్టి, నీకూ వాటా ఉంది" అని మురిపించేసింది. వాళ్ళ అన్న, తనని తీసుకెళ్ళడానికి వచ్చిన రోజున స్వీటీ కి ఇచ్చిన హగ్ నాకే చాలా ఆడ్ గా అనిపించింది. తనైతే కిసుక్కున నవ్వేసింది. "బేబీ బయటికి రాగానే నా టమ్మీ ఫ్లాట్ అయిపోతుంది. బట్, వాటెబౌట్ యువర్స్ బడ్డూ?" స్వీటీ లేని ఇంటికి ఆఫీస్ అవుతూనే వచ్చి మాత్రం ఏం చేస్తాను? బుద్ధిగా గూగుల్ చేస్తే బ్రహ్మాండమైన ఇన్ఫో దొరికింది. మా ఆఫీస్ కాంప్లెక్స్ వెనుకే ఉంది జిమ్. కొత్త ప్రాజెక్ట్ మొదలైన మొదటి వారంలోనే సైనప్ చేసేశా.
"గుడ్ ప్రోగ్రెస్ ఇన్ టు మంత్స్ యా.. కీప్ గోయింగ్," రాక్షసుడికి చీరప్ చెయ్యడం మాత్రమే వచ్చనుకున్నా, నవ్వడం కూడా తెలుసు. అబ్డామినల్ పూర్తి చేసి ముఖం తుడుచుకుంటూ అలవాటుగా ఫోన్ వైపు చూస్తే నాలుగు మిస్డ్ కాల్స్. స్వీటీ వాళ్ళన్న. సిజేరియన్ కి ప్రిపేర్ అవ్వమన్నారట డాక్టర్. ఎలా రెడీ అయ్యానో, జర్నీ ఎలా చేశానో అస్సలు గుర్తు లేదు. థియేటర్ బయట వెయిట్ చేస్తున్నారు అందరూ. "డోంట్ వర్రీ.. ఇట్స్ నార్మల్ డెలివరీ.. బై ద వే.. కంగ్రాట్స్.." డాక్టర్ చెబుతున్నవి పూర్తిగా అర్ధం కావడం లేదు. బెడ్ మీద వైట్ గౌన్ లో నీరసంగా స్వీటీ.. పక్కనే ఉయ్యాల్లో ఒత్తుగా వేసిన పక్క మధ్యలో చిన్న కదలిక.. గులాబీ రంగు పాదం,గాలికి కదులుతున్న గులాబి మొగ్గలా..స్వీటీ మగతలో ఉన్నట్టుంది.
ఉయ్యాల్లో సన్నని గొంతు కేర్ మంది. పాపని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకునే లోగానే, స్వీటీ కదిలింది "బడ్..డ్..డ్డీ" అంటూ. పాపని, తనని మార్చి మార్చి చూసుకుంటున్నా మురిపెంగా.. మళ్ళీ పిలిచింది. చాలా మాట్లాడాలని ఉంది..కానీ, మాటలు రావడం లేదు. "బడ్డీ" ..నా మోకాలి పైన చుర్రుమంది. "కొత్త ప్రాజెక్ట్ ఇదేనా?" నీరసంగా అడుగుతోంది స్వీటీ. అప్పుడు చూసుకున్నా, నేను వేసుకున్నది నా లాస్ట్ బర్త్ డే కి స్వీటీ కొన్న డెనిమ్. "లవ్ లీ" అంది తను. "ఎస్.. షీ ఈజ్ లవ్ లీ" అన్నాను, పాపని తనకి చూపిస్తూ.
(మిత్రులందరికీ 'వేలంటైన్స్ డే' శుభాకాంక్షలు!!)
లవ్లీ :-))
రిప్లయితొలగించండిchala bagundhandi.chadhavadaniki kuda hayiga undhi.
రిప్లయితొలగించండిమీ ప్రతి కథలొ ఎదో ఒక వైవిధ్యం ..అన్నిట్లానె ..ఈ కథ కూడ..చాల చాల బాగుంది..
రిప్లయితొలగించండిమురళి గారు ..
ఇట్లు..
మీ బ్లాగు అభిమాని( అభిమానుల్లొ ఒకన్ని ..)
simply superb Murali garu!
రిప్లయితొలగించండిశ్రీ గారు రాసిన కామెంట్ చదివాక గానీ తెలియలేదు ఇది కథని! కథకు తగ్గ పేరు పెట్టారు మురళి గారు. నిజంగా లవ్లీగా ఉంది..
రిప్లయితొలగించండిSweet!! :)
రిప్లయితొలగించండిస్వీట్ స్టోరీ...
రిప్లయితొలగించండితీపి కథలా లేదు...
మంచి తెలుగు రాస్తారు కదా... కథలో ఇంగ్లీషు డోసు కొంచెం తగ్గించి ఉండాల్సింది.
@వేణూ శ్రీకాంత్: హహహా.. థాంక్స్ అండీ..
రిప్లయితొలగించండి@ శ్వేత: ధన్యవాదాలండీ..
@శ్రీ: చదివి, మీ అభిప్రాయం పంచుకుంటున్నందుకు ధన్యవాదాలండీ..
@స్ఫురిత మైలవరపు: ఒహ్హ్.. చాలా థాంక్స్ అండీ..
రిప్లయితొలగించండి@ప్రియ: అవునా!! 'నా కథలు' అని ట్యాగ్ చేశాను కదండీ :)) ..ధన్యవాదాలు
@కొత్తావకాయ: అవునండీ, ఘాటు కాదు :)) ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@పురాణపండ ఫణి: అర్బన్ నేపధ్యం కదండీ, తప్పలేదు.. ఈసారి తెలుగు కథ రాసే ప్రయత్నం చేస్తాను :) .. ధన్యవాదాలు