నిజానికి ఈ పోస్టు రాయడమా, వద్దా అని చాలా ఆలోచించాను. బ్లాగింగ్ మొదలు పెట్టి పదిహేనేళ్ళు పూర్తవ్వడం సంతోషం కలిగించే విషయమే. కానీ, గడిచిన ఏడాది బ్లాగు చరిత్రని తిరిగి చూసుకుంటే ఏమున్నది గర్వకారణం అనిపించింది. వ్యక్తిగత జీవితం తాలూకు ప్రభావం బ్లాగింగ్ మీద ఉండడం అన్నది ఎప్పుడూ నిజమే అయినా, గడించిన సంవత్సర కాలంలో అది మరింతగా రుజువయ్యింది. రాయాలని అనిపించక పోవడం, మొదలు పెట్టబోతూ వాయిదా వెయ్యడం, నెమ్మదిగా రాద్దాం అనుకోవడం...ఇలాంటి అనేక అనుభవాలే గుర్తొస్తున్నాయి నెమరువేతల్లో. ఏమీ సాధించక పోయినా ఏడాది తిరిగేసరికి పుట్టినరోజు వచ్చేసినట్టే, పెద్దగా రాయకపోయినా కేలండర్ మారడంతో బ్లాగుకీ పుట్టినరోజు వచ్చేసింది. ఇదొక సహజ పరిణామ క్రమం అన్నమాట.
మరీ 'మా రోజుల్లో' అనబోవడం లేదు కానీ, పదిహేనేళ్ళు అయింది కాబట్టి నేను బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తోంది. అప్పటికే తెలుగులో వందకి పైగా బ్లాగులుండేవి. ప్రతి వారం కొత్త బ్లాగులు జతపడుతూ ఉండేవి. కొందరు ప్రతి రోజూ, చాలామంది కనీసం వారానికి ఒకటి రెండు పోస్టులు రాసేవాళ్ళు. ఆవకాయ మొదలు అమెరికా రాజకీయాల వరకూ ప్రతి విషయం మీదా పోస్టులు, కామెంట్లలో చర్చలూ ఉండేవి. ఆవేశకావేశాలు లేకపోలేదు కానీ, కామెంట్ మోడరేటర్ పుణ్యమా అని అసభ్య కామెంట్లు, వ్యక్తిగత దూషణలు అరుదుగా తప్ప కనిపించేవి కాదు. తెలుగు బ్లాగు అగ్రిగేటర్లకి ట్రాఫిక్ పెరుగుతున్న కాలంలోనే కొన్ని వెబ్ మ్యాగజైన్లు కూడా ప్రారంభం అయ్యాయి. చదివేవాళ్ళు, రాసేవాళ్ళతో మంచి సాహిత్య వాతావరణం ఉండేది.
Google Image |
అప్పటితో పోలిస్తే బ్లాగులు రాసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే, బ్లాగుల్ని చదివి, అభిప్రాయాలు పంచుకునే పాఠకులు ఇప్పటికీ కొనసాగుతున్నారు. అప్పట్లో ఆన్లైన్ లో తెలుగు కంటెంట్ అరుదుగా దొరికేది. ఇప్పుడు విస్తృతి పెరిగింది. చదవడానికి, చూసేందుకు కూడా కంటెంట్ కి లోటు లేదు. మోడరేషన్ లేని చర్చలు లైవ్ లో నడుస్తున్నాయి. సభా మర్యాదల్లోనూ మార్పు వచ్చింది. మైక్రో కంటెంట్ వెల్లువెత్తుతోంది. నాలుగైదు లైన్లు/అర నిమిషం వీడియోల్లో విషయాలని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చదివే/చూసే వాళ్ళ ధోరణిలోనూ మార్పు కనిపిస్తోంది. ఒకప్పటిలా సుదీర్ఘమైన పోస్టులు, అర్ధవంతమైన చర్చలు అరుదుగా కనిపిస్తున్నాయి. మార్పు అనివార్యం.
విస్తృతి పెరగడం తాలూకు విపర్యయం ఏమిటంటే కంటెంట్ చోరీ. బ్లాగుల్లో రాసుకున్న పోస్టులు లేదా వాటిలో కొన్ని భాగాలూ తెలియకుండానే ఇంకెక్కడో ప్రత్యక్షం కావడం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కానీ అప్పట్లో ఫలానా చోట వచ్చిందని పట్టుకోడానికి వీలు ఉండేది. ఇప్పుడు ఎక్కడని వెతకాలి? తాజా ఉదాహరణ 'గుంటూరు కారం' సినిమా. ఆ సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు యద్దనపూడి సులోచనా రాణి రాసిన 'కీర్తి కిరీటాలు' నవల ఆధారంగానే సినిమా తయారవుతోందనే గాలి వార్త ఒకటి బయటికి వచ్చింది. ఆ నవలని గురించి నేను రాసిన బ్లాగ్ పోస్టు, అందులో కొన్ని భాగాలూ నాకు తెలిసి నాలుగైదు చోట్ల ఉపయోగించుకో (చోరీ చేయ) బడ్డాయి. తెలియకుండా ఇంకెన్ని చోట్ల వాడారో మరి. సోర్సుకి క్రెడిట్ ఇవ్వడాన్ని అవసరం లేని పనిగానో, పరువు తక్కువగానో భావించే వాళ్ళు ఉన్నత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది బహుశా.
ఈ తరహా చౌర్యాలు తాత్కాలికంగా ఉసూరుమనిపిస్థాయి కానీ, 'ఎందుకొచ్చింది, రాయడం మానేద్దాం' అనిపించవు నాకు. చోరీ చేసిన వాళ్ళ మీద కోపం కన్నా చికాకే ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ముందే చెప్పినట్టుగా ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఏం చేసినా ఆగేది కూడా కాదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, బ్లాగింగ్ ఆపేసే ఉద్దేశమేమీ లేదు. వీలైనంత తరచుగా రాయాలనే ఉంది. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా మరింత గట్టిగా చేయాలన్నదే సంకల్పం. పదిహేనేళ్ళుగా నా రాతల్ని చదివి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇక్కడే మరింత తరచుగా మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను.
అభినందన మందార మాల...
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ..
తొలగించండిఅభినందనలు 💐.
రిప్లయితొలగించండి// “ బ్లాగింగ్ ఆపేసే ఉద్దేశమేమీ లేదు.” // …. బతికించారు 👍.
ధన్యవాదాలండీ..
తొలగించండిపదిహేనేళ్ల మీ కృషి అభినందనీయం మురళి గారు. ఆగకుండా ముందుకు సాగిపోయే మీకు నా ధన్యవాదాలు..మీ కోసమే కాదు మా కోసం కూడా..నా కైతే ఆ "కొత్త" చాలా ఇష్టం..All the best forever..
రిప్లయితొలగించండిచాలా రోజుల తర్వాత!! మీరు రాయడం బాగా తగ్గించేశారు కదా? ..ధన్యవాదాలండీ..
తొలగించండిcongratulation sir ,I am follower of your almost from past 12 years . very nice blog.
రిప్లయితొలగించండిThank you very much ma'am!!
తొలగించండిCongratulations and Hope you will write more in near future
రిప్లయితొలగించండిSure, thank you!!
తొలగించండిమరింత తరచుగా మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తా
రిప్లయితొలగించండి...
ఏమండీ ఇలా బెదిరించేస్తున్నారు ? :)
శుభాకాంక్షల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ టెల్గూ బ్లాగింగ్కి :)
జిలే బుల్స్
:) ధన్యవాదాలండీ.. మీ అభినందనకందాలకి (కందాలేనా?)
తొలగించండిసంవత్సరాల నుండీ వ్రాస్తున్న బ్లాగర్ల మనస్తత్వాలు చక్కగా విశ్లేషించారు. అస్త్ర సన్యాసం చెయ్యాల్సిన అవుసరం లేదు. వీలయినంతవరకూ వ్రాస్తూ ఉండండి. వాటికోసం మేమెప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాము.
రిప్లయితొలగించండితప్పకుండానండీ.. ధన్యవాదాలు..
తొలగించండిఅప్పుదె పదిహేనేళ్ళా... అమ్మో... మీరు వెన్నెల్లో పాలు తాగుతూ రాత కోతలు నిన్న కాక మొన్ననే మొదలెట్టినట్టుంది కదా... కాలం పరుగులు తీస్తూ మనల్ని ఊపిరి తీసుకోనివ్వకుండా, వెనక్కి తిరిగి చూసే అవకాశం ఇవ్వకుండా చెయ్యట్టుకు ఈడ్చుకుపోతున్నట్టుంది... మంచి మంచి కబుర్లతో మీ నెమలీకలు మరిన్ని వసంతాలు జరుపుకోవాలని ఆశిస్తూ
రిప్లయితొలగించండిభలే గుర్తు పెట్టుకున్నారండీ!! బహుశా రాసే ఉత్సాహాన్ని ఇచ్చేవి ఇలాంటి జ్ఞాపకాలే అనుకుంటాను.. ధన్యవాదాలు..
తొలగించండి-
రిప్లయితొలగించండిపదిహేనేళ్లాఅప్పుడె!
మొదలెట్టిరిగాదె నిన్నొ మొన్నో ? సమయ
మ్మదె నూపిరి గొననీయదు
కదా! నెమలికన్ను బ్లాగు కలికితురాయీ!
15 long years! That’s an amazing milestone you reached.Your CRISTAL ANNIVERSARY deserves a big round of applause👏
రిప్లయితొలగించండిThanks a lot for your wonderful support!!
తొలగించండిక్రిస్టలేనివర్సరి ! డిజర్వ్స్ క్రెడిట్! అమే
రిప్లయితొలగించండిజింగ్! యు ఆరె ప్రాడిజీ మురళిజి!
నెమలి కన్ను ఈజమేజింగ్క్రియెటివిటి!
విష్ యు ఆల్ ది బెస్ట్ ! ది బ్రెవిటి బ్యూటి!
చీర్స్
గత పది సంవత్సరాలుగా నేను మీ బ్లాగ్ చదువుతాను, కానీ ఎప్పుడూ కామెంట్ చేయలేదు, చాలా విషయాలు తెలుసుకున్నా , చాలా దగ్గర గా ఉంటాయి నా ఆలోచనలకు. చాలా ఇష్టంగా చదివే బ్లాగ్స్ లో మీది ఒకటి. వార్షిోత్సవ శుభాభిందనలు.
రిప్లయితొలగించండిAs a reader from the beginning, I feel the same way with change especially not crediting the content owners. I hope this year will bring more satisfaction to you from writing and publishing. Kudos for a long running blog.
రిప్లయితొలగించండి-
రిప్లయితొలగించండిగత పది సంవత్సరములు
సుతిమెత్తని మీ టపాలు , సూటిగ మది చే
రు తరమగు శైలి హృదయము
ను తాకె మురళీ! చదివితి నుడివిన దెల్లన్ !
పదిహేను సంవత్సరాలుగా వ్రాస్తున్నే ఉన్నారంటే గొప్పసంగతి.
రిప్లయితొలగించండిఅభినందనలు.
నేను బ్లాగులు చదవటం బాగా తగ్గించాను కాని మీరు వ్రాసేవి చదువుతూనే ఉన్నాను.
చదువుతున్నందుకు సంతోషమండీ.. ధన్యవాదాలు..
తొలగించండి-
రిప్లయితొలగించండికూడోస్ఫార్లాంగ్ రన్నింగ్
వైడేంగల్బ్లాగ్మురళిజి! వ్యాక్యూమ్ మై సెల్ఫ్
ఐడూ ఫీల్ పీపుల్ డోంట్
క్రేడిట్ ఓనర్స్! పిటీ! వి కేర్ ఫార్ యూ సర్!
-
రిప్లయితొలగించండిపదిహేనువత్సరమ్ములు
కుదురుగ వ్రాయటము మురళి గొప్ప విషయమౌ
చదువుట మానితి బ్లాగుల
మదిమది చదువంగ మీదు మరువనెపుడునే!
రాసే ఉత్సాహాన్ని
రిప్లయితొలగించండిచ్చే సుమధుర జ్ఞాపకాల సిరిమల్లియలం
దా సౌగంధములే జి
జ్ఞాసువులకెపుడు మదిని సుశక్తిని జేర్చున్
ఇప్పుడు ఫేస్బుక్ లో చాల మంది ఇలాంటి బ్లాగ్గింగ్ కథలు రాస్తున్నారు కదా. దాని వల్ల నేను కూడా బ్లాగర్ ఎక్కువగా చూడట్లేదు. మీరు ఫేస్బుక్ లో రాయచూ కదా. కొందరు హరిబాబు మద్దుకూరి, ఆలమూరు సౌమ్య లాంటి వారు చాల మంది రాస్తున్నారు.
రిప్లయితొలగించండినాకెందుకో బ్లాగులో ఉన్న సౌకర్యం మరెక్కడా ఉండదు అనిపిస్తుందండీ.. ధన్యవాదాలు..
తొలగించండిమురళి గారు,
రిప్లయితొలగించండిముఖపుస్తకంలో గానీ మరెక్కడైనా గానీ వ్రాసినప్పటికీ బ్లాగులో వ్రాయడం మాత్రం మానకండి. ఎందుకంటే చదువరులందరూ ఫేస్ బుక్ లో సభ్యులై వుండక పోవచ్చు (ఉదాహరణకు నేనే). అదే బ్లాగ్ అయితే ఎవరైనా చదవచ్చు.
అంతగా మీరు కూడా ఫేస్ బుక్ ప్రియులయ్యుంటే గనక మీ బ్లాగు పోస్ట్ ని కాపీ చేసి ఫేస్ బుక్ లో కూడా అతికించండి కానీ బ్లాగుని మాత్రం మరువకండి. థాంక్స్.
వేరే చోట రాసే ఆలోచన లేదండీ.. నాకు బ్లాగే సౌకర్యం..
తొలగించండిదాదాపుగా మొదలైన కొత్తల్లోనే ఓ స్నేహితురాలు పరిచయం చేసింది మీ బ్లాగు. అప్పటినుంచి క్రమం తప్పకుండా చదువుతున్నాను. పదిహేను సంవత్సరాల మీ శ్రద్ధ, క్రమశిక్షణ, ఇంకా తెలుగు భాష పై మీకున్న పట్టు, ఈ బ్లాగుని తెలుగు అంతర్జాల ప్రపంచంలో ఓ ప్రత్యేక స్ధానంలో నిలబెట్టాయి. మొదట్లో మీ జ్ఞాపకాలు, ఇంకా రక రకాల గరిటెలు, సినిమా రివ్యూలు చదివేవారం. తర్వాత తర్వాత సీరియస్ కంటెంట్ కూడా. కానీ జ్ఞాపకాలు మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. తెలుగు భాషకి దూరమై జీవితమంతా ఆంగ్లీకరించి బతికే వారికి మండుటెండల్లో కొబ్బరి నీళ్ళలా మీ బ్లాగు యథా ప్రకారం 'క్రమం తప్పకుండా ' తళుక్కుమంటుండేది.
రిప్లయితొలగించండి'మా రోజుల్లో' నుంచి, ఈ రోజుల్లోకి నిస్సహాయ వారధులం, తరాంతర ప్రతినిధులం, అందరం, మనమందరం. బాబోయ్ మంచి తెలుగుతో బాటు కవిత్వం కూడా వచ్చేస్తోంది చూసారా తెలుగు బ్లాగుల మహత్యం.. హహహ
మీ బ్లాగుని, పాఠకుల ఆనందాన్ని, మరింత ఉత్సాహంతో కొనసాగించాలని ఆశిస్తూ, అభినందనలు మరియు ధన్యవాదాలు. హరిః ఓం.
చాలా సంతోషమండీ.. ధన్యవాదాలు..
తొలగించండిఅభినందనలు మురళీగారు! మీ బ్లాగు నిరంతర నదీ ప్రవాహంలా నిరాటంకంగా కొనసాగించటం సంతోషంగా వుంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ..
తొలగించండి