వేసవి వచ్చేసింది.. కరెంటు ఉన్నంత సేపూ ఫ్యాన్లు నిర్విరామంగా తిరిగేస్తున్నాయి.. ఏసీలు, కూలర్ల సంగతి చెప్పక్కర్లేదు.. బిల్లు తడిపి మోపెడు అవుతుందన్న భయం ఎక్కడా కనిపించడం లేదు.. ఈ ఎండల గండం గడిస్తే చాలన్నట్టుగా ఉంది పరిస్థితి. నాల్రోజులు పోతే ఊరగాయల హడావిడి మొదలైపోతుంది. అప్పుడెలాగూ స్పెషల్స్ చేసుకునే టైం ఉండదు కదా.. అందుకని ఈలోగానే వేసవి ప్రత్యేక వంటలు చేసుకు తినేయడం మంచిది. ఇవేమీ బ్రహ్మాండం బద్దలయ్యే వంటలు కావు కాబట్టీ, గరిట పట్టిన అనుభవం లేని వాళ్ళుకూడా అవలీలగా వండి వార్చేసేవి కాబట్టీ డిస్క్లైమర్లూ గట్రా ఇవ్వకుండా నేరుగా వంటింట్లోకి తీసుకెళ్ళి పోతున్నా..
ముందుగా మనం పెరుగిడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ టిఫిన్ తినడానికి ప్రత్యేకంగా వేళా పాళా అంటూ ఏమీ లేదు. పిల్లలు ఎప్పుడు ఆకలని గోలెడితే అప్పుడు చేసి పెట్టేయొచ్చు. అలాగని పెద్దాళ్ళు తినకూడదని ఏమీ లేదు.. తినగలిగినన్ని తినొచ్చు. పెరుగిడ్లీ చేయడానికి కావాల్సిన పదార్ధాలు ఏవేవిటంటే చల్లారిపోయిన ఇడ్డెన్లు, ఫ్రిజ్లో నుంచి తీసిన చల్లని పెరుగు, దానిమ్మ గింజలు లేదా కారా బూందీ. వంటలో ఆరితేరిన వాళ్లకి ఈసరికే ఈ వంటకం ఎలా చెయ్యాలో అర్ధమైపోయి ఉంటుంది. అయినప్పటికీ, యావజ్జాతి ప్రయోజనాలనీ దృష్టిలో ఉంచుకుని నేను వీలైనంత వివరంగా చెప్పితీరతాను.
తయారు చేసే విధానానికి వచ్చేస్తే, బాగా చల్లారిపోయిన - ఇంకొంచం సొష్టంగా చెప్పాలంటే పనిమనిషికి ఇచ్చేద్దామని పక్కన పెట్టిన - ఇడ్లీలని ఓ అందమైన బౌల్ లోకి తీసుకోవాలి. ఫ్రిజ్ లోనుంచి తీసిన పెరుగు చల్లదనం పోకముందే తగుమాత్రంగా చిలకాలి. పెరుగు గనుక ఓ రవ్వ పులిసినట్టు అనిపిస్తే, చిలికేటప్పుడే ఓ రవ్వ ఉప్పు జోడించుకుంటే సరిపోతుంది. చిలికిన పెరుగుని జాగ్రత్తగా ఇడ్లీల బౌల్లోకి ఒంపాలి. ఓ రెండు నిమిషాలపాటు ఇడ్లీలని పెరుగులో నాననివ్వాలి. కమ్మకమ్మగా తినాలనుకుంటే దానిమ్మ గింజలతోనూ, కొంచం ఖారంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తే కారా బూందీతోనూ పెరుగిడ్లీని గార్నిష్ చేసుకోవాలి.
టిఫిన్ గురించి చెప్పేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు స్నాక్ చేయడం నేర్చుకుందాం. నూనె ఉండే స్నాక్స్ వేసవిలో తినడం కష్టం. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఏకాలంలోనూ తినలేరు. కాబట్టి మనం చేసుకోబోయే స్నాక్ ఏమాత్రం నూనె లేనిది. వంటకం అన్నాక ఏదో ఒక పేరు ఉండాలి కదా.. దీని పేరు 'ఉప్పు పల్లీ.' కావాల్సిన పదార్ధాలు పల్లీలు (వేరుశనగ గుళ్ళు) మరియు కాసింత ఉప్పు. తయారు చేసుకోవడం ఎలాగంటే, ఓ బౌల్ లో కొంచం నీరు తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. నీళ్ళు పొంగుతూ ఉండగా వాటిలో ఉప్పు వేసి, ఆ పై రాళ్ళు లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న పల్లీలని జారవిడవాలి. ఐదు నిమిషాలో పల్లీలు ఉడికిపోతాయి. మిగిలిన నీటిని ఒంపేసి పల్లీలని సర్వ్ చేసేయడమే.
'అబ్బా.. పొయ్యి వెలిగించాలా? అంత పని మావల్ల కాదు' అనుకునే వాళ్ళ కోసం మరో స్నాక్. దీనిపేరు మావిడి ముక్కలు. కావాల్సిన పదార్ధాలు మామిడి కాయ, ఉప్పు కలిపిన వేపుడు కారం. మీరు కనక గుంటూరులో పుట్టి పెరిగినట్టాయనా 'సంబారు కారం' కూడా ప్రయత్నించ వచ్చు. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి తుడవాలి. ఓ పదునైన చాకు తీసుకుని మామిడి కాయని సన్నని పొడవాటి ముక్కలుగా తరగాలి. టెంక పట్టిన కాయ అయితే తరిగేటప్పుడు చెయ్యి తెగకుండా జాగ్రత్త పడాలి. అదే జీడి కాయ అయితే, జీడి ముక్కల్ని జాగ్రత్తగా ఏరి పారేయాలి. తరిగిన ముక్కల్ని ఓ ప్లేట్లో అందంగా అమర్చి, కారాన్ని జత చేసి సర్వ్ చేయాలి. టీవీ చూస్తూ తినడానికి బాగుంటుంది.
అసలు ఎండలు ముదరడంతోనే చల్లగా చల్లగా ఏవన్నా గొంతులో పోసుకోవాలన్న కోరిక మొదలవుతుంది. ఈ గొంతు తడుపుకోవడంలో ఎవరి పధ్ధతి వాళ్లకి ఉన్నప్పటికీ, మనం సభా మర్యాద చెడకుండా, సంసార పక్షంగా ఉండేలాగా షర్బత్ తయారీ గురించి ముచ్చటించుకుందాం. నిమ్మకాయ, ఉప్పు, చక్కెర మరియు చల్లటి నీళ్ళు ఉంటే చాలు చల్ల చల్లని నిమ్మ షర్బత్ సిద్ధం చేసేసుకోవచ్చు. ముందుగా నిమ్మకాయ కోసి, గింజలు తీసేసి గ్లాసులోకి రసం పిండుకోవాలి. ఈ రసంలో తగినంత ఉప్పు, పంచదార కలిపి ఆపై చల్లని నీళ్ళతో గ్లాసు నింపితే చాలు, చక్కనైన షర్బత్ రెడీ. మధ్యాహ్నం వేళల్లో తాగే షర్బత్ లో చక్కెర బదులు గ్లూకోజ్ కలుపుకుంటే ఉభయ తారకంగా ఉంటుంది.. అంటే, దాహం తీరడంతో పాటు కొంచం ఓపిక కూడా వస్తుందన్న మాట. ఇప్పటికివీ వేసవిలో చేసుకునే వంటలు.. వీటిని 'వంటలు' అంటారా? అనొద్దు.. ఎందుకంటే,అదంతే..
మురళీ గారు.. భలే వచ్చేసారు కదండి !!! మంచి వంటల తయారీ విధానం తెచ్చి పంచారు. ధన్యవాదములు. నాకు ఆఖరిది బాగా వచ్చును. తేలికైనది సతత హరితమైనది. (Ever Green) .
రిప్లయితొలగించండిమీ పెరుగు ఇడ్లి చాలా బాగుంది. ఉప్పు పల్లీలు అదుర్స్. ఇక మావిడి ముక్కల గురించి చెప్పనే అక్కర్లేదనుకోండి. ఆ చివర్లో అందించిన షర్బత్ ఉంది చూశారూ... అబ్బబ్బబ్బ. ఇంక దీన్ని కామెంట్ అంటారా... మీ ఇష్టం. :)
రిప్లయితొలగించండి'తయారు చేసే విధానానికి వచ్చేస్తే, బాగా చల్లారిపోయిన - ఇంకొంచం సొష్టంగా చెప్పాలంటే పనిమనిషికి ఇచ్చేద్దామని పక్కన పెట్టిన - ఇడ్లీలని ఓ అందమైన బౌల్ లోకి తీసుకోవాలి." ఆహా !భలే నవ్వించారండీ .
రిప్లయితొలగించండిSummer special...Its cool cool:-)
రిప్లయితొలగించండిMurali gaaru, konchem blogs post cheyyadm lo mee nirlakshyam tagginchi, heenapaksham vaaraaniki rendu blog lainaa post cheyyandi.
రిప్లయితొలగించండిVantalu amogham gaa unnai.
అమ్మో అమ్మో, మీరు పాకశాస్త్రం కూడా కాచి వడపోసారన్నమాట. జయహో.
రిప్లయితొలగించండిబాగున్నారా! ఇప్పటినుంచి శతదినోత్సవం చేస్తారా మరి.
రిప్లయితొలగించండిమీ వంటకాలన్నీ చాలా బాగున్నాయండి:)
హ హ సూపర్ రేసిపీస్ :)))
రిప్లయితొలగించండిWelcome back..
రిప్లయితొలగించండిAgain...
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ అంతే మరోమాటలేదు
రిప్లయితొలగించండిచాకు, ప్లేటు కూడా అవసరం లేకుండా ఏ తాటి ముంజలో, మామిడి రసాలో కాకుండా పాకకళా నైపుణ్యం కాస్త ప్రదర్శించే వీలున్న వంటకాలని ఎంచుకున్నందుకు చప్పట్లు. :)
రిప్లయితొలగించండిబావున్నాయి మీ వంటలు,
రిప్లయితొలగించండి'అబ్బా.. పొయ్యి వెలిగించాలా? అంత పని మావల్ల కాదు'
మంతెన సత్యన్నారాయణ గుర్తువచ్చాడు ఈ పంక్తి చదివాక :)
మీ వంటలకు నేనిచ్చే ర్యాంకులు:
౧) మామిడికాయ ముక్కలు - మొదటి ర్యాంకు
౨) నిమ్మకాయ షర్బత్ - రెండవ ర్యాంకు
౩) ఉప్పు పల్లీ - మూడవ ర్యాంకు
౪) పెరుగిడ్లీ - ఇరవయ్యి మూడువేల నాలుగొందల తొంభై మూడో ర్యాంకు
అసలే ఎండాకాలం...వేడిలో పొయ్యిదగ్గర గంటలు గంటలు మాడిపొఖ్ఖర్లేకుండా మంచి వంటలు చెప్పారు మురళిగారూ...:)
రిప్లయితొలగించండిఇప్పుడు టి వి లలో వంటలు ఇలాగే ఉంటున్నాయి ..
రిప్లయితొలగించండిచేసే చిన్న వంటకి ఏదో కొత్త వంటలా పెద్ద హడావుడి చేస్తున్నారు ..
ఉడుకించిన వేరుశెనగ కాయలు (తొక్క ఉన్నవి ) భలే ఉంటాయి .. వేయించిన వాటికంటే ..
@vasu,
రిప్లయితొలగించండిఉడుకించిన వేరుశెనగ కాయలు (తొక్క ఉన్నవి ) భలే ఉంటాయి ..
వీటి శాస్త్రీయనామం "తంపడి కాయలు" :-)
మురళీ, ఎన్నెన్ని కొత్త వంటలు నేర్పించేశారండీ!! పెరుగిడ్లీ నా ఫేవరెట్లోకి వేశేశాను.. దీన్నే సిజన్ బట్టి, మిగిలిపోయిన ద్రవపదార్ధాల బట్టీ (అంటే మిగిలిపోయిన గులాబ్ జామూన్ పాకం, రసమలై పాలల్లో) మార్పులూ చేర్పులూ చేసుకొవచ్చనే కొత్తవిషయం తెలిసింది :)))
రిప్లయితొలగించండి@శ్రీ గారు, అవునండీ ఆ తంపడి కాయలు తినడం మొదలుపెడితే ఆపడం బహుకష్టం :))
ఆహా.. ఓహో... మురళి గారూ, ప్రతి విషయంలోనూ మీకు మీరే సాటని మరోసారి ఋజువు చేశారు. మీ వేసవి వంటలు అద్భుతం అంతే. ఏంటో, ఈ రెండు రోజులుగా వంటల టపాలు ఎక్కువ చదివేస్తున్నా, లాలాజలం వరద గోదారిలా ఊరిపోతుంది ;)
రిప్లయితొలగించండిyeppudu rammantaaru vesavi vindu bhojananiki?
రిప్లయితొలగించండిఈ పెరుగు ఇడ్లీ కాన్సెప్ట్ కొత్తగా బావుందండీ ..ట్రై చెయ్యాలి :) :)
రిప్లయితొలగించండి@వనజ వనమాలి: హ..హా.. ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@పురాణపండ ఫణి: అన్నీ నచ్చాయన్న మాట మీకు!! ధన్యవాదాలండీ..
@చిన్ని: :) :) ..ధన్యవాదాలండీ..
@పద్మార్పిత: థాంక్స్ అండీ..
రిప్లయితొలగించండి@నాగరాజు: అయ్యో.. నిర్లక్ష్యం కాదండీ.. కొద్దిగా పనుల వత్తిడి అంతే.. ఏమాత్రం సమయం ఉన్నా రాయకుండా ఉండను.. ధన్యవాదాలండీ మీకు..
@బులుసు సుబ్రహ్మణ్యం: అబ్బే.. ఫిల్టర్ తియ్యలేదండీ.. ద.హా.. ...ధన్యవాదాలు!!
@జయ: అది అనుకుంటే అయ్యేదా చెప్పండి?? బాగున్నానండీ.. థాంక్యూ..
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: హ..హ.. థాంక్స్ అండీ..
@బోనగిరి; థాంక్యూ..
@శ్రీనివాస్ పప్పు: కెవ్వులతో కూడిన ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: అయ్ బాబోయ్.. అందరికీ కొత్తావకాయ పెట్టడం చేతనవుతుందా చెప్పండి?? యేవో మాకు తోచిన వంటలు :) :) ..ధన్యవాదాలండీ..
@శ్రీ: ఇడ్లీ అంటే అంత ఇష్టమా అండీ మీకు?? :-) ధన్యవాదాలు..
@స్ఫురిత: యెంత చక్కగా అర్ధం చేసుకున్నారో.. (కొత్తావకాయ గారు మీ వ్యాఖ్య చూస్తే బాగుండును) ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@వాసు: నిజమండీ.. నాకూ అవే ఎక్కువ ఇష్టం :-) ..ధన్యవాదాలు.
@శ్రీ: అవునవును..
@నిషిగంధ: ఆ మిగిలిన పాకాల్లో ఇడ్లీ కన్నా, వడ వేసి చూడండి (ఉల్లి, మసాలా లేకుండా చేసింది..) మళ్ళీ మళ్ళీ చేసుకుని తినకపోతే అడగండి :-) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@మనసు పలికే: వేసవిలో వరదలు తెప్పించేస్తున్నారా అండీ అయితే :-) ..ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: ఏవిటండీ.. ఈ వంటల కోసమా? :-) :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: చెయ్యండి.. చెయ్యండి.. బాగుంటే నా పేరు చెప్పుకుని తినాలి మరి.. :) ధన్యవాదాలండీ..