బుధవారం, అక్టోబర్ 28, 2009

ప్రతిపక్షం

ఊహించినట్టుగానే కాంగ్రెస్ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని 'సాక్షి' దిన పత్రిక ప్రతిపక్ష పాత్రని పోషించడం మొదలు పెట్టింది. గత కొద్ది రోజులుగా -- మరీ స్పష్టంగా చెప్పాలంటే యువరాజ పట్టాభిషేకం ఇప్పట్లో లేదని పార్టీ హైకమాండ్ అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పేశాక - ప్రతిరోజూ కనీసం ఒక ప్రభుత్వ వ్యతిరేక వార్తా కథనం లో సాక్షి పాఠకుల ముందుకు వస్తోంది. టీవీ సంగతి నాకు తెలీదు.. ఎందుకంటే 'చక్కనోడు' పాటల భయంతో ఆ చానల్ చూడడం మానేశాను.

ఇంతకీ సాక్షి పోషిస్తున్న ఈ పాత్రని 'నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర' అంటారుట.. టీవీ లో ఎవరో విశ్లేషకులు (?!) చెబుతుండగా విన్నాను. ఇప్పుడా పత్రిక ప్రజల పక్షం వహిస్తోందిట. మంచిదే.. పత్రికలు అప్పుడప్పుడూ అయినా ప్రజల సమస్యలు పట్టించుకుంటే బాగానే ఉంటుంది. నిజానికి పత్రికలు ఇలా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం ఇదే మొదలు కాదనీ, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన ప్రతిసారీ 'ఆ రెండు పత్రికలు' అదే పాత్రను పోషించాయనీ ఎవరో అన్నారు. ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తోంది.

ఓడలు బళ్ళవడం అంటే ఇదేనేమో.. మొన్న మొన్ననే ప్రారంభమై ఆంధ్ర ప్రదేశ్ హరితాంధ్ర ప్రదేశ్ గా మారుతున్న వైనాన్నిరంగురంగులలో చూపించి, కాంగ్రెస్ ఇమేజ్ ని - ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ని - ఆ రెండు పత్రికల బారి నుంచి కాపాడి, రాష్ట్రంలో పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం లో తనవంతు పాత్ర పోషించిన పత్రిక ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలోకి వచ్చేసింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తనవంతు ప్రయత్నాలు సాగిస్తోంది. చాలా ఆశ్చర్యకరమైన పరిణామం ఏమిటంటే 'ఆ రెండు' పత్రికలు ఇప్పుడు ఆచి తూచి అడుగేస్తున్నాయి..దాదాపు ప్రభుత్వం మీద ఈగ వాలకుండా కాపాడుతున్నాయి.

ఆగస్టు రెండో వారంలో అనుకుంటా.. నాకు ఉన్నట్టుండి సాక్షి చదవడం మీద విసుగొచ్చింది.. మాన్పించి వేరే పేపర్ తెప్పించుకుందాం అనుకున్నా.. ఇంతలోనే సెప్టెంబర్ సంక్షోభం, అనంతర పరిణామాలు ఎలా ఉంటాయో, సాక్షి ఎలా స్పందిస్తుందో అన్న కుతూహలం.. మలుపులు తిరిగిన రాజకీయం.. మొత్తానికి సాక్షి ని విడవకుండా చదివేలా చేశాయి. ఇప్పుడింక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది కాబట్టి ఎలా అయినా చదవాల్సిందే. సాక్షి ఎలాంటి కథనాలు ప్రచురిస్తుందో, వాటికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.

ఇప్పటికిప్పుడు హైకమాండ్ మనసు మార్చుకుని యువరాజ పట్టాభిషేకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే సాక్షి కథనాలు ఎలా ఉంటాయి? ఊహాజనితమైన ప్రశ్న.. జవాబు వాస్తవం నుంచే వస్తుంది.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ రెండు పత్రికలు ఏం చేస్తాయో, అదే చేస్తుంది. అప్పుడు ఆ రెండు పత్రికలు 'నిర్మాణాత్మక ప్రతిపక్ష' పాత్రను పోషిస్తాయన్న మాట. ఊహ నుంచి వాస్తవానికి వస్తే, సాక్షి కథనాల పట్ల ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుంది? ఎంతైనా వేరే పార్టీ ముద్ర వేయించుకున్న పత్రికలు విమర్శించడం వేరు, సొంత గూటి పత్రిక విమర్శించడం వేరు కదా..

సాక్షి ఎలాంటి కథనాలు ప్రచురించినా రోశయామాత్యుడు పట్టించుకోడన్నది నా అంచనా.. ఎందుకంటే హైకమాండ్ తనని ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పినన్నాళ్ళూ తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తానా పదవిలో కొనసాగాల్సిందే అనీ, అధిష్ఠానం మనసు మారాక తాను అరిచి గీ పెట్టినా ఒక్క క్షణం కూడా కుర్చీ లో ఉండనివ్వరనీ ఆయనకి బాగా తెలుసు. అంతకు మించి 'అంతా అమ్మే చూసుకుంటుందని' కూడా తెలుసు. నిన్న కాక మొన్న 'రోశయ్య మా నాయకుడు కాదు' అని చెప్పిన కొండా సురేఖ ఉన్నట్టుండి 'ఆయన నా తండ్రి లాంటి వాడు' అన్నదంటే, అమ్మ లీల కాక మరేమిటి? అమ్మ కన్నెర్ర చేస్తే సాక్షి కథనాల బాణీ మారక తప్పదనడంలో సందేహం ఏముంది?

22 కామెంట్‌లు:

 1. ఈ టపాకి సరైన వ్యాఖ్య మా వారు రాయగలరు..:)రాజకీయాల పట్ల ఆయనకు బోలెడు ఆసక్తి. మారుతున్న పరిస్థితుల పట్ల అవగాహన, ఏది ఎలా జరిగితే బాగుంటుందీ అని అప్పుడప్పుడు నాకు పాఠం చెప్తూ ఉంటారు...ఇప్పుడిప్పుడే ఏ,బి,సీ,డీలు తెలుస్తున్నాయి..

  నా పోరు పడలేక "సాక్షి"ని కొన్నాళ్ళు వీక్షించారు కాని...మళ్ళీ పాత పేపరే వేయించేస్తున్నారు...

  రిప్లయితొలగించు
 2. వీళ్ళకి అమ్మ పవర్ ఈసారి బాగనే తెలిసినట్టుంది..రేపో మాపో 'సాక్షి' పేపర్ పేరు 'రాజీవ్ సాక్షి' గా పేరు మార్చమన్నా మనోళ్ళు కిక్కురుమనకుండా మార్చేస్తారు.
  నాకు కొండా సురేఖా మాటలు నవ్వుతెప్పించాయి...ఊరికే అన్లేదు రాజకీయం అంటే బొంకు అని...

  రిప్లయితొలగించు
 3. అమ్మ లీలతో పాటు పదవిలీలను కూడా జోడించవచ్చు.

  రిప్లయితొలగించు
 4. సాక్షి బాణీ మార్చకపోతే ఇప్పటికే వ్యాపారాలు ఆర్థిక మాంద్యంతో కుదేలెత్తిపోతున్న సమయంలో పేపరుకూడా మూతబెట్టుకోవాల్సి వస్తుంది. వస్తే గిస్తె అప్పుడు పవర్ పక్షమే వహించొచ్చు. లేకపోతే అంటకత్తెర వేస్తారు జనపథ్ తో పాటు జనం కూడా.

  రిప్లయితొలగించు
 5. ఏంటో? విష్ణుమాయ లాగా అంతా కలి మాయ.

  రిప్లయితొలగించు
 6. 'నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర' >> అసలు ఈ మాట వింటుంటేనే నవ్వొస్తుంది !
  మీకు మీరే సాటి మురళి గారు అది పుస్తకం గురించి గాని, సినిమా గురించి గాని, పాట గాని అసలు ఇది అది అని కాదు మీరు దేన్ని గురించి వ్రాసిన గాని సరే .

  రిప్లయితొలగించు
 7. సాక్షి ఎలా స్పందిస్తుందో అన్న కుతూహలం..


  హ హ మీకు కావాల్సింది న్యూస్ కాదు. సస్పెన్స్ సినిమా, లైవ్ లో :) ..అందుకే మీడియా రంగం స్పోయిల్ అయ్యింది .. కాబట్టి కారణం మీరే మీరే :)


  మలుపులు తిరిగిన రాజకీయం.. మొత్తానికి సాక్షి ని విడవకుండా చదివేలా చేశాయి.


  ఇదీ మరి. న్యూస్ పేపర్ డైలీ సీరియల్ లెవెల్ కి దిగాజారినది మనకు ఉన్న ఈ ఇంట్రెస్ట్ వల్లనే :( ..నాకయితే న్యూస్ పేపర్స్ వల్లే ఏదో script రాసి నాయకులను పరిగేట్టిస్తున్నాయా అనిపిస్తుంది . ఇది మరి ఆదిఎంస్ ని ఎంతెర్తైన్ చెయ్యాలి కదా మధ్యలో వాళ్ళు డ్రాప్ అవ్వకుండా పట్టి వుంచాలి అంటే ఒక వేల అంత కూల్ గ ఉన్న దిస్త్రుబ్ చెయ్యాల్సిందే ఎలోగోల.


  సాక్షి ఎలాంటి కథనాలు ప్రచురిస్తుందో, వాటికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.

  ఇదీ సంగతి. ప్రభుత్వం ఏమి అయినా మనకేం ఇబ్బంది లేదు .. సాక్షి scripts మూవీ ని ఎలా నడిపిస్తాయి, ఇలా సినిమా లో హీరో కి విలన్ కి ఫిఘ్త్ చూసినట్లు ఎంజాయ్ చేస్తున్నాం ...


  manaki sakshi pai nammakam leka order cancel cheyyalanukonnam, kani ippudu interesting gaa undi ...not just sakshi any other news daily.they stopped on writing on whats happening..they write on what they could imagine/guess.

  రిప్లయితొలగించు
 8. ఇప్పటికిప్పుడు హైకమాండ్ మనసు మార్చుకుని యువరాజ పట్టాభిషేకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే సాక్షి కథనాలు ఎలా ఉంటాయి? ఊహాజనితమైన ప్రశ్న.


  appudu meeru ye paper chaduvuthaaru annadi naa ఊహాజనితమైన ప్రశ్న :)

  just for fun...

  రిప్లయితొలగించు
 9. అవునండీ మురళీ గారూ , ఇంతకు అమ్మ , జగన్ ని ఎందుకు నొక్కేసింది అంటారు? :)

  రిప్లయితొలగించు
 10. సాక్షి లో పెట్టుబడులు పెట్టిన బడా అవినీతి బాబులు అన్యాపదేశంగా రోశయ్యని కాస్త బెదిరించడానికి చేస్తున్న ప్రయత్నాలు అయి ఉండవచ్చండీ.. ఆయన వాళ్ళ ఆటలు సాగనివ్వరేమో అని వాళ్ళ అనుమానం అనుకుంటా మొదటి నుండీ నూ..

  రిప్లయితొలగించు
 11. @చిన్ని: ధన్యవాదాలండీ..
  @తృష్ణ: ఏబీసీడీ లతో మొదలు పెట్టారు కదా.. కొనసాగించండి.. త్వరలోనీ మీరూ ఇలాంటి టపాలు రాసేస్తారన్న మాట! ..ధన్యవాదాలు.
  @rama108: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 12. @శేఖర్ పెద్దగోపు: తన పవర్ తెలిసేలా చేసుకోవడం అమ్మ ప్రత్యేకత.. నిజమేనండీ.. ఆమె ఏది చెబితే అదే.. ధన్యవాదాలు.
  @చిలమకూరు విజయమోహన్: పదవి-అమ్మదయ వేరు వేరు కాదండీ.. ధన్యవాదాలు.
  @కుమార్: నిజమేనండీ.. ఇప్పటికే నష్టాల్లో నడుపుతున్నారుట, టీవీ వాళ్ళు చెప్పారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 13. @సునీత: అమ్మ మాయ అనాలేమోనండీ :):) ..ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: నాక్కూడా బాగా నవ్వొచ్చిందండీ వినగానే.. ధన్యవాదాలు.
  @మౌళి: మీరు నా టపాతో పాటు, లంకె ఇచ్చిన మరో టపా కూడా చదివితే మీ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయండీ.. నేను రోజూ తెప్పించుకునే నాలుగు పేపర్లలో ఇరు పక్షాలదీ కనీసం చెరో పేపరైనా ఉండేలా జాగ్రత్త పడతాను.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 14. @భాస్కర రామిరెడ్డి; కొన్ని ప్రశ్నలకి కాలం మాత్రమే సమాధానం చెప్పగలదండీ.. కొన్నాళ్ళు వేచి చూద్దాం.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: అలా జరిగే అవకాశం లేకపోలేదండీ.. రోశయ్య నిమిత్తమాత్రుడని నా ఉద్దేశం.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 15. నేను రోజూ తెప్పించుకునే నాలుగు పేపర్లలో ఇరు పక్షాలదీ కనీసం చెరో పేపరైనా ఉండేలా జాగ్రత్త పడతాను


  asalu inni peparlu politics kosam chadavadam avasaramaa?

  oka paper ni guddi ga namma koodadu nizame. kani mana burra anedi okati undi kadaa.

  రిప్లయితొలగించు
 16. @మౌళి: కాలక్షేపం అవ్వాలి కదండీ...

  రిప్లయితొలగించు
 17. హ హ . నా కుళ్ళు అంతా సాక్షి, ఈనాడు తెగ సంపాదించేస్తున్నారు అనే :) ..వాల్లిద్దరివి మాత్రం కొనకండే. ఏదో బెరల్లేని వాళ్ళవి మూడో నాలుగో తెప్పించుకోండి

  రిప్లయితొలగించు
 18. ప్చ్ .....ఈ విషయాల్లో మనకంత ఉత్సాహం లేదండీ ఏదో నా పరిమళమూ ....కూడలి ...బ్లాగ్ మిత్రులూ ....ఇలా ......

  రిప్లయితొలగించు
 19. @పరిమళం: నాదంతా పేపర్లు, టీవీ చానళ్ళ వల్ల కలిగిన (అ) జ్ఞానం అండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు