బుధవారం, సెప్టెంబర్ 23, 2009

విమానస సంచరరే..

రెండేళ్ళ క్రితం.. ప్రైవేటు విమాన సర్వీసులన్నీ పోటీలు పడి టిక్కెట్ల రేట్లు తగ్గించినప్పుడు.. రైల్లో మొదటి తరగతి ప్రయాణం కన్నా విమాన ప్రయాణమే చౌక అని పత్రికలు కథనాలు రాసినప్పుడు.. వాయు ప్రయాణానికి చెల్లించే మొత్తం తగ్గడం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ ఏ రకంగా మెరవబోతోందో కొందరు మేధావులు టీవీ చానళ్ళలో బల్లలు గుద్ది చర్చించిన సమయంలో.. విమాన ప్రయాణం పై హాస్య వ్యంగ్య ధోరణిలో వచ్చిన కథ 'విమానస సంచరరే..'

ప్రసన్న కుమార్ సర్రాజు రాసిన ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురితమయ్యింది. పల్లెటూరి భూస్వాములు, బావ, బావమరుదులు పెద రాయుడు, చిన రాయుడు విశాఖపట్నంలో ఎంపీ రామ సుబ్బారెడ్డి గారింట్లో పెళ్ళికి విమానంలో బయలుదేరతారు, హైదరాబాద్ నుంచి. వాళ్ళు ఎప్పుడూ వెళ్ళే విమానానికి సమ్మర్ రష్ వల్ల టిక్కెట్లు దొరక్క ఓ 'చౌక' విమానానికి టిక్కెట్లు బుక్ చేసి సర్డుకోమంటాడు ట్రావెల్ ఏజంటు.

చినరాయుడికి చౌక విమానంలో ప్రయాణించిన అనుభవం ఉంది కానీ, పెద రాయుడికి అదే ప్రధమం. ఇద్దరూ కోలాహలం గా ఉన్న విమానాశ్రయంలో అడుగు పెడతారు. విమానం లేటు.. ఎంత సేపు లేటో తెలీదు. చౌక విమానంలో ప్రయాణం చేయాల్సిన జనమంతా గోతాలు, కోళ్ళ గంపలు వగైరా సామగ్రితో విసుగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. 'ఎప్పుడూ ఇమానమేనా..రైల్లో ఎల్దాం..' అని ఓ ఆరేళ్ల పిల్లాడు మారాం చేస్తే 'రైల్లో తీసుకెళ్ళే తాహతు ఈ అయ్యకి లేదని తెలీదు ఎదవకి..' అని ముద్దుగా విసుక్కుంటాడు తండ్రి.

కొడుకు ఆకలని గొడవ చేస్తుంటే గోతాల్లోనుంచి స్టవ్, గిన్నెలు, బియ్యం తీసి వంట ప్రయత్నం మొదలు పెడుతుంది తల్లి. సెక్యూరిటీ గార్డు వచ్చి ఆవిడని అడ్డుకుంటాడు. 'బ్రిలయన్స్' కూరగాయలు, ఆర్గానిక్ పళ్ళు అమ్మే వాళ్ళు, 'మట్టాటా' పల్లీలు అమ్మేవాళ్ళు, ప్రి పెయిడ్ ఫోన్ కనెక్షన్ తీసుకుంటే చిరంజీవి సినిమా టిక్కెట్టు ఫ్రీగా ఇస్తామని మొహమాట పెట్టేవాళ్ళు.. ఈ కోలాహలాల మధ్య ఏడో నెంబరు రన్వే మీదకి విమానం వస్తోందన్న ప్రకటన వస్తుంది.

బిలబిలా విమానాన్ని చుట్టుముడతారు జనం.. కోళ్ళగంపలు ఎక్కించడానికి వీల్లేదని ఎయిర్ హోస్టెస్ కోప్పడితే "లగేజీ కొట్టుకోవమ్మా" అని విసుక్కునే ఆసామీ, చొక్కా విప్పి విమానం తుడిచే ప్రయత్నం చేసే అడుక్కునే కుర్రాడూ, బోర్డింగ్ పాసుల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు సీట్లు ఆక్రమించుకునే ప్రయాణికులూ.. వీళ్ళందర్నీ దాటుకుని విమానం ఎక్కుతారు బావ, బావమరుదులు. వాళ్ళ ఊరి అమ్మాయి సుబ్బరతో జిలేల్లె (జిళ్ళేళ్ళ సుబ్బరత్నం) అదే ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ కావడం తో కర్చీఫులు వేసి వీళ్ళకోసం సీట్లు ఆపుతుంది.

విమానం ఎక్కింది మొదలు కనిపించే ప్రతి విషయమూ ఆశ్చర్యమే పెద రాయుడికి. ఫుడ్ సర్వ్ చేయడానికి బదులుగా చిరుతిళ్ళు అమ్ముతారు ఎయిర్ హోస్టెస్ లు. పల్లెటూరి ఆసాములకి అర్ధం కావడం కోసం ఫాన్సీ డ్రెస్ వేసుకుని, జానపద గీతానికి డాన్స్ చేసి మరీ నువ్వు జీడీలు, అప్పాలు లాంటి తినుబండారాలన్నీ మిగల్చకుండా అమ్మేస్తారు. వెనుక సీట్లో బామ్మగారొకావిడ ఒక్క క్షణం అన్నవరం కొండ మీద విమానం ఆపితే స్వామి దర్శనం చేసుకొచ్చేస్తానని బతిమాలుతుంది సుబ్బరత్నాన్ని.. పైలట్ ససేమిరా అంటాడు.

కార్పొరేటీకరణ గురించి పెద రాయుడు, చిన రాయుడు, మరికొందరు ప్రయాణికులతో మాట్లాడుతూ ఉండగా విమానం వైజాగ్ చేరుతుంది.. అరగంట సేపు గాలిలో చక్కర్లు కొడుతుందే కాని ఎప్పటికీ లాండ్ అవ్వదు.. మా గొడుగులు మాకిస్తే దూకేస్తాం అంటారు ప్రయాణికులు గోలగోలగా.. అరగంట క్రితం కురిసిన వర్షానికి వైజాగ్ విమానాశ్రయంలో రన్వే మునిగిపోయిందనీ, విమానం వెనక్కి తిప్పేస్తున్నామనీ ప్రకటిస్తాడు పైలట్. అన్నవరంలో ఆపనందుకే ఇలా జరిగిందని మొటికలు విరుస్తుంది బామ్మగారు. 'అమ్మా.. అయ్యకి సెప్పే.. ఈసారైనా రైల్లో ఎల్దామే..' అంటాడు కుర్రాడు.

ఇప్పుడు మళ్ళీ విమాన సంస్థలు చార్జీలు తగ్గిస్తున్నాయన్న వార్త చూడగానే ఈ కథ గుర్తొచ్చి, ఫైల్లో వెతికి మరోసారి చదివి నవ్వుకున్నాను.

34 కామెంట్‌లు:

 1. హహహ! ఈ కధ నేనూ చదివాను. ఇంకా గుర్తున్నది.

  రిప్లయితొలగించు
 2. ఈ కథ నేను కూడా చదివానండి . బాగుంది .

  రిప్లయితొలగించు
 3. కామెడీ కథ కాబట్టే ఇలా. నిజ జీవితంలో విమాన చార్జిలు ఎంత తగ్గినా పల్లెటూరి వాళ్ళు విమానం ఎక్కలేరు. ఎందుకంటే రైల్వే లోకోస్ లో వాడే హై స్పీడ్ డీజిల్ కంటే విమాన ఇంధనం చాలా ఖరీదైనది. మా తాతయ్య మాజీ MP. కానీ అతను ఎన్నడూ విమానం ఎక్కలేదు. రైల్వే వాళ్ళు MPలకీ, మాజీ MPలకీ ఇచ్చే ఫ్రీ పాస్ మీదే ప్రయాణిస్తాడు. మా తాతయ్య లాగ డబ్బున్న వాళ్ళు కూడా విమానం ఎక్కడానికి ఇష్టపడనప్పుడు ఇక కోళ్ళూ, గంపలూ ఉన్న వాళ్ళు విమానం ఎలా ఎక్కుతారు? నేను ఒక సారి శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళి విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను. వైజాగ్ RTC కాంప్లెక్స్ నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళడానికి ఆటో డ్రైవర్ తీసుకునే చార్జే ఎక్కువ. ఇక విమాన చార్జి నా లాంటి మిడిల్ క్లాస్ వాడికి ఎంత భారమో ఊహించడం కష్టం కాదు.

  రిప్లయితొలగించు
 4. మనం ఎంత జోకులు వేసుకున్నా ఇండియాలో 90% మందికి విమానం ఎక్కే అవకాశం రాదులెండి. నేను ఉండేది శ్రీకాకుళంలో. చిన్నప్పుడు మా అమ్మానాన్నల ఉద్యోగ రీత్యా మేము వరంగల్, కరీంనగర్, రాజోలు (తూ.గో.) లలో ఉండేవాళ్ళం. శ్రీకాకుళంలో గానీ, వరంగల్, కరీంనగర్, రాజోలులలో గానీ ఎయిర్ పోర్టులు లేవు. వరంగల్ లో ఎయిర్ పోర్ట్ ని పునరుద్ధరించాలని డిమాండ్ ఉన్నా ఎకనామికల్ వయెబిలిటీ మీద డౌట్లు ఉన్నాయి. పల్లెటూరివాళ్ళ విమాన ప్రయాణం అనేది కామెడీ కథలకి కాన్సెప్ట్ గా మాత్రమే ఉంటుంది.

  రిప్లయితొలగించు
 5. మురళి భలే కథ గుర్తు చేసారు ...ఆ కథ చదుతు నవ్వలేక చచ్చాం ...ముఖ్యంగా 'సుబ్బరత్తో జిల్లెల్లె 'అన్నవరం దర్శనం ...ఎంత జ్ఞాపకం !..ఉచితంగా విమానాలు ఎక్కే భాపతులో ప్రభుత్వ ఉద్యోగులు ముందు వుంటారేమో .(ఈ కామెంట్ మీక్కాదు -:)) మొత్తానికి మంచి కథ ని గుర్తు చేసారు ...అది మీదగ్గర ఉందా ?

  రిప్లయితొలగించు
 6. బాబ్బాబు..ఆ కామెడీ కదేంటో, ఆ కమామీసు ఏంటో సదవాలని నాకు మా ఇదిగా ఉంది. మీరొక్కల్లే సదివేసుకుని నవ్వేసుకుంటే అన్నాయం బాబయ్య...ఆ ఇమానంలో ఉన్న బుడ్డోడు చేత కద ప్రతి నాకు పంపిస్తే వారాంతంలో మీ పేరు సెప్పి కూసింత నవ్వుకుంటా!!!

  రిప్లయితొలగించు
 7. Yep like Sunita and Mala garu, ఈ కధ నేనూ చదివాను. ఇంకా గుర్తున్నది. And nice to recollect early in the morning... brought a good laugh on my face. Yey made my day with a bright opening..

  రిప్లయితొలగించు
 8. కధ బాగుంది మురళిగారు. టెంప్లేట్ మార్చారు కానీ సరిగ్గా సెట్ కాలేదు, వీలుంటే మార్చండి.

  రిప్లయితొలగించు
 9. ఒకసారి నేను డిల్లి నుంచి హైద్రాబాద్ ఫ్లైట్ లో వొచ్హాను. అప్పుడు నేను నిజంగా ఇటువంటి పరిస్థితులే ఎదుర్కున్నాను. అందరు కౌంటర్ చుట్టూ మూగి గోలగోల గా ఫ్లైట్స్ వివరాలు అడుగుతున్నారు. ఇంకో వైపు పల్లెటూళ్ళలో సర్వీస్ బస్సుల వాళ్ళు అరిచినట్లుగా కల్కత్త, కల్కత్తా, కల్కత్తా లోగ్ ఇస్ తరఫ్ ఆనా! అని ఒక వైపు నుంచి --- ఇంకోవైపు నుంచి మద్రాస్, మద్రాస్ , మద్రాస్ లోగ్ ఇస్ తరఫ్ బైఠ్నా! అని ఇంకో వైపు నుంచి హైద్రాబాద్ లోగ్ పీచ్హే జానా,అభి ఇస్తరఫ్ మత్ ఆనా, జావ్ పీచ్హే , అని దగ్గరికి ఒచ్హిన వాళ్ళని వెనక్కి తోసేస్తున్నాడు. నేను ఈ కథ చదవక పోయినా ఇప్పుడు ఇది చదివినాక నా ఈ అనుభవం గుర్తుకొచ్హింది. అది నాకొక ఎయిర్పోర్ట్ లాగా అనిపించలేదు. కాకపోతే ఫ్లైట్లో మాత్రం కథలో లాగ లేదులెండి. ఈ కథ చదువు తుంటే మాత్రం చాలా మజా వొచ్హింది మురళిగారు.

  రిప్లయితొలగించు
 10. కథ రచయిత లోతుగా ఆలోచించలేదు. ఒకవేళ విమాన ప్రయాణం కలలో కూడా అంత చవకైతే కరీంనగర్, వరంగల్ లలోనే కాదు, మహాదేవ్ పూర్, సారంగాపురం లాంటి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎయిర్ పోర్టులు కట్టొచ్చు. అప్పుడు గ్రామస్తులు మహాదేవ్ పూర్ నుంచి వైజాగ్ కైలాసగిరి చూడడానికి విమానంలో బయలుదేరినట్టు కథ వ్రాయగలను. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం మొదలవుతున్నట్టు కథ వ్రాయడం కంటే మహాదేవ్ పూర్ అడవి నుంచి విమాన ప్రయాణం మొదలవుతున్నట్టు కథ వ్రాస్తే ఇంకా కామెడీగా ఉంటుంది.

  రిప్లయితొలగించు
 11. @ PKMCT

  పల్లెటూరివాళ్ళ విమాన ప్రయాణం అనేది కామెడీ కథలకి కాన్సెప్ట్ గా మాత్రమే ఉంటుంది.

  ee line bavundi, endukO ..

  రిప్లయితొలగించు
 12. కామెడీ కథ గురించి వ్యాసం రాస్తే సీరియస్ ఆటోబయోగ్రఫికల్ కామేంట్లేంటి బాబో ......

  రిప్లయితొలగించు
 13. టైటిలుచూసి శశిథరూర్ మీదఏమైనా రాశారేమో అనుకున్నా. భలేగా ఉంది కథ. బిగినింగ్ నాకు స్నేహంకోసం సినిమా గుర్తొచ్చింది.

  రిప్లయితొలగించు
 14. కరీంనగర్ జిల్లా సారంగాపురం నుంచి ఒరిస్సాలోని పురీ జగన్నాథ ధామాన్ని దర్శించే వాళ్ళ కోసం చిన్న విమానం వేశారు. విమానం దారిలో దండకారణ్య అడవులు మీదుగా వెళ్తోంది. దందకారణ్యంలో అందమైన శబరి నది కనిపించింది. శబరి నదికి ఫొటో తియ్యాలే, విమానాన్ని జరా స్లో చెయ్యవయ్యా డ్రైవరూ అని పైలట్ తో అన్నాడు ఓ గ్రామస్తుడు. విమానాన్ని స్లో చెయ్యడానికి అవ్వదు, అలా చేస్తే దాని బాలెన్స్ తగ్గిపోయి అడవిలో దిగిపోతుంది అని పైలట్ గ్రామస్తునికి చెపుతాడు. అడవిలో దిగిపోతే పోనీ, మళ్ళా స్టార్ట్ చెయ్యొచ్చు అని గ్రామస్తుడు అంటాడు. అప్పుడు పైలట్ సమాధానం చెప్పలేకపోతాడు. విమానం రాయగడ అడవుల మీదుగా వెళ్తుండగా నాగావళి నది కనిపించింది. ఈ ఏటికాడ ఆపవయ్య డ్రైవరూ, కాస్త పాయఖాన్ కి పోయి రావాలే అన్నాడు ఇంకో వ్యక్తి.

  రిప్లయితొలగించు
 15. నుక సీట్లో బామ్మగారొకావిడ ఒక్క క్షణం అన్నవరం కొండ మీద విమానం ఆపితే స్వామి దర్శనం చేసుకొచ్చేస్తానని బతిమాలుతుంది సుబ్బరత్నాన్ని.. పైలట్ ససేమిరా అంటాడు.
  ఇది మాత్రం అదిరి అన్నయ్యా!!
  రచయితకి పై ఒక వ్యాఖ్యాత పాపం పరిచయం లేడనుకుంటా. ఇతన్ని అతనికి పరిచయంచేస్తే ఓ పనైపోతుంది.

  రిప్లయితొలగించు
 16. ఇది ఎలా మిస్ అయ్యానబ్బా.సరేలే ఓ ధాంక్స్ తీసుకోండి మురళి గారూ.
  అబ్రకదబ్రgaaruu కామెంటు కేక.నేను మనసులో అనుకుంటూ వుంటే కింద మీ కామెంటు కనపడింది :)

  రిప్లయితొలగించు
 17. title choosi inka meeru nenu cheppina novel chadivesaru anukunna...kadha bagundhi...

  రిప్లయితొలగించు
 18. @సునీత: ఒకసారి చదివిన వారెవరూ ఈ కథని మర్చిపోలేరండీ.. ధన్యవాదాలు.
  @లక్ష్మి: :-) :-) ..ధన్యవాదాలు.
  @మాలాకుమార్: ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 19. PMKCT: భారత దేశంలో పేదరికానికి కారణం అధిక జనాభా అంటారు శాస్త్రవేత్తలు. జనాభా పెరగడానికి కారణం నిరక్షరాస్యత. అధిక జనాభా వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయని 'మాల్తుస్ జనాభా పరిణామ సిద్ధాంతం' చెబుతుందనుకోండి.. అది వేరే విషయం. నిర్బంధ కుటుంబ నియంత్రాయణ ప్రవేశ పెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా జనాభా అదుపులోకి రాకపోవడానికి ప్రజల్లో ఉన్న అవిద్య, మూఢ నమ్మకాలు కారణం అనిపిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు కట్టడం కొందరికైనా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించొచ్చు.. కానీ, నిధుల కొరత వల్ల మండలానికో హెలిప్యాడ్ నిర్మించాలన్న ఆలోచననే ప్రభుత్వం విరమించుకుంది. ఇవన్నీ సామాజిక, ఆర్ధిక, రాజకీయాలకి సంబంధించిన విషయాలు.. ఇక్కడ నేను పరిచయం చేసింది ఒక హాస్య కథని కాబట్టి ఇవన్నీ చర్చించడానికి ఇది వేదిక కాదని నేను భావిస్తున్నాను.. ఈ విషయంపై ఇక్కడ ఇక చర్చ ఉండదు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 20. @చిన్ని: ఈ కథని భద్రంగా దాచుకున్నానండీ.. టపా రాసే ముందు మరో సారి చదివాను..ధన్యవాదాలు.
  @శేఖర్ పెద్దగోపు: మరి పాత బాకీల సంగతేం చేశారండీ? ..విమానయానానికి కొంచం ఓపిక పట్టండి.. ధన్యవాదాలు.
  @ఉష: Thank you very much..

  రిప్లయితొలగించు
 21. @నాగ: టెంప్లేట్ మార్చి చాలా రోజులయ్యిందండీ.. మీదే మొదటి ఫిర్యాదు.. కొంచం వివరంగా చెప్పరూ సమస్య ఏమిటో. ధన్యవాదాలు.
  @జయ: పైలట్ డోర్ దగ్గర నిలబడి 'వైజాగ్..వైజాగ్' అని అరుస్తాడండీ..ఈ కథలో.. మొత్తానికి మంచి విమాన ప్రయాణ అనుభవం అన్న మాట... టపా రాయండి వీలు చూసుకుని.. ధన్యవాదాలు.
  @అశ్విన్ బూదరాజు: ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 22. @అబ్రకదబ్ర: అనుభవజ్ఞులు.. మీరిలా అంటే ఎలా చెప్పండి? ...ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య: సాటి బ్లాగర్ల విషయంలో కొంచం సంయమనం పాటిద్దామండీ.. 'నెమలి ఈకలు పీకేందుకు' ఇది మాత్రం గ్రేట్... చాలాసేపు నవ్వుకున్నా.. శశి ధరూర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు కదా.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: బాగున్నది నా టపానే కదండీ? :-) :-) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 23. @భాస్కర్ రామరాజు: ఆ పరిచయ కార్యక్రమ పుణ్య ఫలం మీకే దక్కాలని మా అందరి కోరిక :-) ..ధన్యవాదాలు.
  @రాధిక: తీసుకున్నానండీ.. ధన్యవాదాలు.
  @శిరీష: ఇంకా చదవలేదండీ.. నాకు నెట్ లో చదవడం కొంచం బద్ధకం.. టైం తీసుకుంటాను.. మొదటి ప్రయారిటీ పుస్తకాలకే.. తప్పక చదువుతాను.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 24. ఈ కథని సినిమాగా తీస్తే 100 రోజులు ఆడుతుందనుకుంటాను.

  రిప్లయితొలగించు
 25. ఈ కధయితే చదివిన గుర్తు లేదు కాని, "ప్రసన్న కుమార్ సర్రాజు కధలు"(1999) పుస్తకం ఉందండి .పుస్తకం పబ్లిష్ అయినప్పుడు సర్రాజుగారే నాన్నకు ఇచ్చిన గుర్తు.కొన్ని కధలు చదివాను అప్పట్లో..

  రిప్లయితొలగించు
 26. ఓర్నాయినా,
  ఇంత వెటకారమా,విమానయానమంటే..
  ఏమో గుర్రాలు గాల్లో ఎగరనూవచ్చు...అని ఇంకా..ఇంకా.. ఎవరో అన్నట్లు కొంత కాలానికి ఇదేమి అసంభవం కాకపోవచ్చు..మరీ అంత పికేఎంసిటి గారిలా నిరాశ పడిపోనఖ్ఖర్లేదేమో..Any how ur post is a very nice 1.

  రిప్లయితొలగించు
 27. @ప్రవీణ్ శర్మ: నిజమేనండీ :-) ..ధన్యవాదాలు.
  @తృష్ణ: ఆ పుస్తకం లో ఈ కథ ఉండే అవకాశం లేదండి.. ఇది రెండేళ్ళ క్రితం రాసిన కథ.. ధన్యవాదాలు.
  @శ్రీనిక: :-) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 28. హహ్హ.. హ్హా :))
  భలేగా ఉందండీ కథ. దొరికితే తప్పక చదివి తీరాలన్నమాట :)
  మీరు భలే భలే మంచి మంచి కథల్ని పరిచయరం చేస్తారు సుమీ :)

  రిప్లయితొలగించు
 29. @మధురవాణి: సరదాగా సాగిపోయే కథండీ ఇది.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 30. చదివానీ కథ. కోళ్ళగంపకి లగేజి కట్టుకోవమ్మా లైను బాగా గుర్తుంది. అలాగే కర్చీఫులేసి సీట్లాపడం కూడా

  రిప్లయితొలగించు
 31. హ ..హ్హ ...హ్హా ...శీర్షిక వెరైటీగా ఉందే అనుకున్నా ! కధ కడుపుబ్బ నవ్వించింది .పాత కధల్ని మాకు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలండీ !

  రిప్లయితొలగించు
 32. @పరిమళం: కథ ఆసాంతమూ నవ్విస్తుందండీ.. దొరికితే మిస్సవ్వొద్దు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు