'రాయలసీమలో ప్రజలు నిత్యం కత్తులు నూరుకుంటూ, బాంబులు
విసురుకుంటూ ఉంటారు' ..ఇది చాలామంది సినిమావాళ్ళు చేసిన ప్రచారం. 'రాయలసీమ
ప్రజలు బూతు లేకుండా ఒక్క మాటా మాట్లాడరు' ..ఇది కొందరు రచయితలు ఆ
ప్రాంతానికి ఇచ్చిన ఇమేజి. అయితే.. మంచీ, చెడ్డా అన్నవి విశ్వం అంతటా
ఉన్నాయనీ, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నట్టే రాయలసీమలోనూ మంచి ఉన్నదనీ
తన కథల ద్వారా ప్రపంచానికి చాటిన కథా రచయిత ఒకరున్నారు. ఆయనే 'దామల్ చెరువు
అయ్యోరు' గా తెలుగు సాహితీలోకంలో సుప్రసిద్ధులైన మధురాంతకం రాజారాం.
రాయలసీమ
పల్లెల్ని, మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా పల్లె జీవితాలని తన కథల ద్వారా
పటం కట్టిన రాజారాం రాసిన మూడొందల పైచిలుకు కథల్లోనూ మట్టి వాసనలు
గుభాళిస్తాయి. సీమ ప్రజల భాష, యాస, పండుగలు, పబ్బాలు, సంప్రదాయాలు,
అభిమానాలు.. ఇవన్నీ పాఠకులకి కనిపింపజేస్తాయి, వినిపింపజేస్తాయి కూడా.
రాజారాం రాసిన ప్రతికథా దేనికదే ప్రత్యేకమైనదే అయినప్పటికీ, దాదాపు
యాభయ్యేళ్ళ క్రితం రాసిన 'హాలికులు కుశలమా!' కథ మరింత ప్రత్యేకమైనది.
ఎంచుకున్న వస్తువు మొదలు, కథని తీర్చిదిద్దిన విధానం, మరీ ముఖ్యంగా
ముగించిన తీరు ఈ కథని ఓ పట్టాన మర్చిపోనివ్వవు.
రాజు చదువయిన కొద్ది కాలానికి నరసప్ప గారు ఉద్యోగం వదిలేశారు. అందుకు కారణం కొత్తగా వచ్చిన కుర్ర హెడ్మాస్టారు. అతడికి అయ్యవార్లు సక్రమంగా పాఠాలు చెప్పడం కన్నా తనకి లొంగి ఉండడం ముఖ్యం.
ఆత్మాభిమానాన్ని వదులుకోలేని నరసప్ప ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రైతుగా
కొత్త జీవితం మొదలు పెట్టారు. అదేమంత సులభం కాలేదు. ఎందుకూ అంటే, "మనిషి స్వభావానికీ, వాడు చేస్తున్న పనికీ సామరస్యం లేకపోతే, బ్రతుకు బ్రతుకంతా ఒక తీవ్ర సంఘర్షణగా పరిణమిస్తుందేమో"
అంటారు. అయితే, ఇరుసుకీ, చక్రానికీ ఏనాటికీ ఘర్షణ తప్పదని తెలిసిన వాడూ,
ఇరుసుకి కందెన వేసి ఘర్షణని అదుపులోకి తెచ్చుకోవచ్చన్న సూక్ష్మం గ్రహించిన వాడూ కాబట్టి ఆ సమస్యని ఆయన పరిష్కరించుకున్నాడు.
తన
పొలంలో కొబ్బరి చెట్లనీ, అరటి చెట్లనీ, మామిడి తోటనీ, పండ్లు, పూల
మొక్కలనీ శిష్యుడికి ఇష్టంగా పరిచయం చేశారు నరసప్పగారు. అయితే, అర్ధం
చేసుకోడానికి రాజుకి కొంచం సమయం పట్టింది. అర్ధమైన మరుక్షణం తనూ ఉత్సాహంగా
ఎన్నో ప్రశ్నలు వేశాడు. చీకటి పడే వరకూ సంభాషణ సాగించాడు. బంధువుల ఇంటికి
వెళ్ళబోతున్న రాజుని ఆపి, ఆపూట తనతో భోజనం చేస్తే తప్ప వల్లకాదన్నారు
నరసప్ప గారు. అంతేనా? భోజనానికి కూర్చోబోతూ ఓ ఆర్ద్రమైన కోరిక కోరారు కూడా.
నరసప్ప గారు ఉపయోగించిన కందెననీ, ఆయన కోరిన కోరికనీ తెలుసుకోవాలంటే
మధురాంతకం రాజారం కథా సంపుటాల్లో అందుబాటులో ఉన్న 'హాలికులు కుశలమా!' కథని చదవాల్సిందే.. కథ పూర్తిచేశాక రాయదుర్గం నరసప్ప గారిని మర్చిపోడం ఏమంత సులభం కాదు.
ఆహా ! వేయుడీ నెమలి కన్ను వారికి వేయి వీరతాళ్ళు :) మధురాంతకం వారిని సెహ భేషు గా వారి హాలికులు కుశలమా ని పరిచయం చేసారు !
రిప్లయితొలగించండిహాలికులూ కుశలమా పీ డీ ఎఫ్ కొరకు ఇక్కడ నొక్క వలె :-> లింకు -->
https://archive.org/details/halikulukushalam019993mbp
అట్లాగే వారి కమ్మ తెమ్మర నీ పరిచయం చేద్దురూ !
చీర్స్ సహిత
జిలేబి
వీలయినప్పుడు ఒకసారి చూడండి...
రిప్లయితొలగించండిhttps://puranapandaphani.wordpress.com/2012/07/20/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%82-%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AE%E0%B1%82-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82/
నరసప్పగారి సమస్య బహుశా మన ముందు తరంలో చాలా మందికి ఎదురైన సమస్యే. మన తరంలోని సాహిత్యాభిలాషులకు మరీ విషమ సమస్య. ఈ విషయంలో గ్రంథాలయాలను నమ్ముకోవడంలో కూడా ప్రయోజనం ఉందనుకోను. మొన్నీ మధ్య ఏదో పనుండి తెలుగు విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి వెళ్ళాను. ఒక్కో పుస్తకం దుమ్ము సముద్రంలో మునిగి ఉంది. దులుపుతుంటే ధూళి తరంగాలు మీద మీదకు వచ్చి నన్నూ ముంచేసే ప్రయత్నం చేశాయి. అస్సలంటే అస్సలు మెయింటెనన్స్ బాలేదు.
రిప్లయితొలగించండిఅన్నట్టు ఎప్పటిలాగే మీ పరిచయం బాగుంది
@జిలేబి: 'కమ్మతెమ్మెర' నా మాటలకి లొంగుతుందా అని సందేహం అండీ :) లంకె ఇచ్చారు, బహుబాగు.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@పురాణపండ ఫణి: ఒకే కథ.. ఇద్దరం చెరోవైపు నుంచీ చూశాం!! ధన్యవాదాలండీ..
@సుభగ: అనుకోకుండా నాకు తద్భిన్నమైన అనుభవం అండీ.. ఈమధ్య చూసిన ఓ (ప్రైవేటు) లైబ్రరీ చాలా చాలా బావుంది, కేవలం లైబ్రేరియన్ ఆసక్తి వల్ల. 'కృత్యాద్యవస్థే' నండీ.. రావప్పంతులు నోట్లో పడి కురచైపోయింది :) ..నరసప్ప గారు ఉద్యోగం చేసిన తీరు (పరీక్షల నిర్వహణ లాంటివి తెలియకుండా), పాత హెడ్మాస్టారుతో ఆయన అనుభవాలు చదివిన తర్వాత ఆయనకా అవస్థ ఎదురై ఉంటుందనే అనిపించింది నాకు.. బహుశా, నా అనుకోలు తప్పేమో మరి. ధన్యవాదాలు..