ఓ నాయకుడు, ఇద్దరు నాయికలతో నడిచే కథలు చేసీ చేసీ తనకే విసుగొచ్చినట్టుంది. అందుకే ఈ సారి పంధా మార్చి ఓ నాయిక ఇద్దరు నాయకుల కథతో మన ముందుకు వచ్చాడు సుమన్ బాబు. సుమన్ ప్రొడక్షన్స్ సగర్వ సమర్పణలో, కె. సుభాష్ కుమార్ అనే నవతరం దర్శకుడు తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, ఇంద్రనాగుడి దర్శకత్వ పర్యవేక్షణలో రూపు దిద్దుకున్న 'నేనే మీ అల్లుడు' చిత్రరాజం ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా హాస్యరస భరితం.
నదులన్నీ చివరికి సముద్రంలో కలిసినట్టుగా మన సుమనుడు ఏ రసాన్ని చేపట్టినా అది హాస్యంగా రూపు మారిపోతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, అనేకానేక సెంటిమెంటు షోల అనంతరం విడుదలైన ఈ షోలో మాత్రం ప్రేక్షకులు ఇతర రసాలనుంచి హాస్య రసాన్ని పిండుకునే అవసరం లేకుండా నేరుగా హాస్యాన్నే ఆస్వాదించే వీలు కలిగిందన్న మాట.
పచ్చని పల్లెటూళ్ళో అనగనగా ఓ సుబ్బరాజు (మిశ్రో). అతగాడికి పేకాట పిచ్చి. ఆయన భార్య జానకి (శ్రీలక్ష్మి) కి టీవీ సీరియళ్ళ పిచ్చి. వాళ్ళబ్బాయి బాండ్ కి తనో డిటెక్టివ్ అనే పిచ్చి. వాళ్ళ పనిపిల్ల సీతాలుకి 'అష్టా చమ్మా' సినిమాలో కలర్స్ స్వాతిలాగా హీరో మహేష్ బాబంటే పిచ్చి. అదే ఇంట్లో పనివాడు మరియు సీతాలు బావ రంగయ్యకి సీతాలంటే పిచ్చి. వీళ్ళందరి మధ్యనా ఏ పిచ్చీ లేనిది సుబ్బరాజు కూతురు మహాలక్ష్మి (అంజూ అస్రానీ, 'శుభం' ద్వితీయ నాయిక హారిక!)
చూడ్డానికి రెండు పదహార్లు నిండి మూడో పదహారు నడుస్తోందేమో అనిపించే మహాలక్ష్మి అచ్చమైన పల్లెటూరి 'ముద్దబంతి'. పగటివేళ పట్టు పావడాలు, శిల్కు వోణీలు మరియు ఒంటి నిండా ధగద్ధగాయమైన నగలతో వెలిగిపోతూ, రాత్రి వేళల్లో కేవలం నైటీ మాత్రమే ధరించే సంప్రదాయమైన ఆడపిల్ల. ఓ రోజు పొద్దున్నే అలంకరణ పూర్తి చేసుకుని, కడవెత్తుకుని నీలాటిరేవుకెళ్ళి నీళ్ళు ముంచుకుని ఇంటికి వస్తుంటే, అప్పుడే ఎర్రబస్సు దిగిన ఓ అందమైన యువకుడు (ఎవరో ఎంతమాత్రమూ కాదు, మన సుమనుడే) స్ట్రాలర్ సహితుడై ఆమె వెంట పడతాడు.
ఇంట్లో పిచ్చాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పిచ్చిల్ని ప్రయోగించగా, వాటిని ఓపిగ్గా భరించి చివర్లో తను అమెరికా నుంచి వచ్చిన సుబ్బరాజు మేనల్లుడు 'చక్రధర్' అని చెబుతాడు. ఇటు మహాలక్ష్మి, అటు సీతాలూ కూడా అతగాడిని ఏకకాలంలో మోహించేస్తారు. ఆ అందాల చందమామే తన ఇంటి అల్లుడు కావాలని ఆశ పడుతుంది జానకి. సుబ్బరాజు ఆనందభాష్పాలు రాలుస్తాడు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో ఈ చక్రధరూ మహాలక్ష్మీ ఓ యుగళగీతం పాడేసుకుంటారని ఊహిస్తూ ఉండగా, సుబ్బరాజు ఇంటిముందు ఓ కారు ఆగుతుంది. నేనే చక్రధర్ అంటూ ఇంకో కుర్రాడు (ఇంద్రనాగు) దిగుతాడు.
వచ్చిన ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియకుండా చేయాలని సుబ్బరాజు అండ్ కో ప్రయత్నం. ఇందులో భాగంగా రంగయ్య మన సుమన్ బాబుని గేదెల దగ్గరికి తీసుకెళ్ళి పాలు పిండమంటాడు. అప్పుడేమో బాబు 'అమెరికా గేదల' గురించి బోల్డన్ని విషయాలు చెబుతాడు. గుడికి వెళ్లి, మహాలక్ష్మితో సహా భక్తులందరికీ వినపడే విధంగా మహాలక్ష్మితో తనకి పెళ్ళి జరిపించమని షిరిడీ సాయిబాబాని కోరుకుని నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తాడు. మహాలక్ష్మితో బోల్డన్ని చిలిపి రొమాంటిక్ కబుర్లు చెబుతాడు. అంతేనా, మహాలక్ష్మి అతగాడిని తాకగానే గ్రాఫిక్స్ మెరుపులు కనిపిస్తాయి కూడా. విశాల హృదయ అయిన సీతాలు ఇంద్రనాగుని కూడా తగుమాత్రంగా ప్రేమించేస్తుంది.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఓ రోజు చక్రధర్లిద్దరూ ఎదురు పడిపోతారు. నలుపు తెలుపుల్లో దృశ్యం మాత్రమే కనిపించే వెనక మెరుపొకటి కనిపించి మాయమవుతుంది. ఇద్దరూ 'నువ్వెంత?' అంటే 'నువ్వెంత?' అనుకోవడం, 'మహాలక్ష్మి నాది' అంటే 'నాది' అనుకోవడం, ఈ ఇంటికి 'నేనే అల్లుడు' అనుకోవడం మాత్రం సొష్టంగా వినిపిస్తాయి. అప్పుడింక సుమనుడు అత్తగారినీ, ఇంద్రనాగు మావగారినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడతారు. 'గుండమ్మకథలో ఎన్టీ వోడిలాగా' రుబ్బురోలు దగ్గర అత్తయ్యకి పప్పు రుబ్బిపెట్టీ, టీవీ సీరియల్ కబుర్లు చెప్పీ సుమనుడు అలరిస్తే, పేకాటతో సుబ్బరాజుని పడగొట్టేస్తాడు ఇంద్రనాగు.
ఇది పని కాదని తలచిన సుమనుడు ఏకంగా కోయదొర వేషం వేసుకుని 'కుర్రో కుర్రు' అనుకుంటూ వచ్చి ముందొచ్చిన వాడే అల్లుడు అనే హింటుని సుబ్బరాజు కుటుంబానికి అందించి చటుక్కున మాయమై, గబుక్కున తెల్ల పేంటు, నల్ల చొక్కాలో ప్రత్యక్షం అవుతాడు. సుమన్ బాబు శ్రమ ఫలించి మారువేషంలో అతగాడిని ఎవరూ కూడా గుర్తుపట్టరు. మహాలక్ష్మి కూడా ఇంక తప్పదురా బాబూ అనుకుని, సుమన్ తో కలిసి ఫిలిం సిటీలో "ఏ మాయ చేసేసావో ఓ మైనా.. ఏ మంత్ర మేసేసావో.." అనే డ్యూయట్టు పాడేసుకుంటుంది. డ్యూయట్టు అయిపోయాక వచ్చేది క్లైమాక్సే అని కొత్తగా చెప్పక్కర్లేదు కదా.
షిరిడీ సాయిబాబా సాక్షిగా సుమన్ బాబు చెప్పే నిజం అల్లప్పుడెప్పుడో రవిరాజా పినిశెట్టి తీసిన 'రుక్మిణి' సినిమాని జ్ఞాపకం చేస్తుంది. సుమనుడి మంచితనానికి అంతటి ఇంద్రనాగుడూ కరిగి కన్నీరవుతాడు. మహాలక్ష్మి పరుగున వెళ్లి వాటేసుకుంటుంది. అత్తమామలు ఆనందభాష్పాలు విడుస్తుండగా, నును సిగ్గుతో 'నేనే మీ అల్లుడు' అని ప్రకటిస్తాడు అనాధ సాఫ్టవేర్ ఇంజినీర్ వాసు పాత్రని ధరించిన సుమన్ బాబు. ఆద్యంతమూ హాస్యరసం అవ్వడం వల్లేమో తెలీదు కానీ తన పాత్రని అనాయాసంగా భరించేశాడు సుమనుడు. వాచికాన్ని మినహాయించుకుంటే, నటనలో కూసింత ఇంప్రూవ్మెంట్ కనిపించిందో, నాకు చూడడం అలవాటైపోయిందో అర్ధం కావడం లేదు.
మిత్రులొకరు చెప్పినట్టుగా, సినిమాల్లోనే కాదు టీవీ సీరియళ్లలోనూ అవుట్ డేటెడ్ అయిపోయిన పల్లెటూళ్ళు, మండువా లోగిళ్ళు లంగావోణీలని ఇంకా గుర్తుపెట్టుకున్నందుకైనా సుమన్ బాబుని అభినందించాల్సిందే. టైటిల్స్ లో యానిమేషనూ, అక్కడక్కడా గ్రాఫిక్సులూ ఈ షో ప్రత్యేకత. భోలేషావలీ సంగీతం ఈసారి కూడా బాగుంది. ఇంద్రనాగ్ కూడా సుమన్ తో సరిసమానంగా కాస్ట్యూమ్స్ ధరించడం కొంచం మింగుడు పడలేదు. పాసివ్ పాత్రల పట్ల బాబుకి ఉండే మక్కువ వల్ల కావొచ్చు, కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఇంద్రనాగు సుమన్ని దబాయించాడు. దర్శకత్వ పర్యవేక్షణ కొంచం శ్రుతిమించడం వల్ల కాబోలు ఆద్యంతమూ ఇంద్రనాగ్ మార్కు (మరేదో కాదు సుమన్ బాబు మార్కే) కనిపించింది. అయినప్పటికీ, కాసిన్ని సీన్లలో మనస్పూర్తిగా నవ్వించింది. అన్నట్టు తదుపరి షో పేరు 'చూడు చూడు తమాషా' .. ఇవాళే ప్రకటన వచ్చింది, బాబుది రాక్ స్టార్ పాత్ర అనుకుంటా!!
సినిమా ఒక అరగంట తర్వాత భరించలేకపోయా, తర్వాత మీరెలాగూ రివ్యూ రాస్తారు మిగిలిన కథ ఇక్కడ చదవచ్చు లెమ్మని టీ వీ ఆఫ్ చేసేసాను.
రిప్లయితొలగించండిబాగుంది బాగుంది.
wow... 1st comment
రిప్లయితొలగించండిmurali garu.. baga chepparu..nenu koya dora episode chusanu.. t shirt meeda puli charala gudda kattukuni comedy chesadu..
రిప్లయితొలగించండితినగా తినగా వేము తియ్యన ఐనట్లు , మీరు రాను రాను నిజం సుమన్ అభిమాన సంఘ అధ్యక్షులు అయి పోతున్నారు. మీరు చారిత్రక తప్పు చేస్తున్నారని , ఇంకా ........ ద్రోహులని ప్రకటిస్తున్నాము
రిప్లయితొలగించండిఇట్లు
సు .బా . సా
(సుమన్ బాధిత సంగం )
meeru babu natinchina anni cinemalu ilaa post cheyatam chaala baagundi, veelunte aa youtube link lu kuda post cheste baguntundi, atleast songs anna video post cheyandi. Meeru oka universal suman babu abhimana sangham sthapiste nenu urgent gaa membership teesukuntaanu. Meekelaa thanks cheppalo teleetledu, kallaku kattinattugaa suman babu nata vishwaroopaanni maa mundu aavishkarimpa chestunna meeku vela vela vandanalu, vandanaalayyo meeku vandanaalayyo...
రిప్లయితొలగించండిvideos ekkada labhistayo cheppandi.
రిప్లయితొలగించండిmee review chadivaka choodalani undi.
ila sumanoharam chesthu vundandi, padi kaalalapaatu.
రిప్లయితొలగించండిఎప్పుడూ టీవీ మొఖం కూడా చూడని నాకు మంచి కథ చెప్పి,, ఇంటర్నెట్ లో యేమైనా దొరుకుతుందేమో..చూసి తీరాలని ఆశ కల్పించిన మీ రచన చతురతకి నా జోహార్లు. జొహారు "నెమలి కన్ను " మౌళీ...!!!
రిప్లయితొలగించండిమీరీ షో చూశాక కూడా ఇంత పెద్ద రివ్యూ రాయగలిగారంటే మీరు ఎక్సెప్షనల్ లేదా సుమనుడు చాఆఆఆఆఆఆఅలాఆఆఆఆఆఆఅ ఇంప్రూవ్ అయ్యాడు. నాకు రెండో దాని మీద పిసరంత కూడా నమ్మకం లేదు. :)
రిప్లయితొలగించండిసారీ, జెమినీ, ఈటీవీ, మాటీవీ లాంటివి అస్సలు చూడను కాబట్టి నాకు ఓ చిన్న డౌట్. ఇది ఈటీవీలో వచ్చే సీరియలా, టెలీ ఫిల్మా? లేక సినిమాలా తీసి థియేటర్లలో విడుదల చేయకుండా ఒకేసారి టీవీలో చూపించేశారా?
రిప్లయితొలగించండిHonestly .. ur review is fantastic. Hail Suman Fans Community.
రిప్లయితొలగించండినిన్న మా అత్తగారు సుమనుడి సినిమా కాదు కాదు సీరియల్ ఏదో వస్తోంది పెట్టమ్మాయి..నేను చూస్తాను...అని అన్నారు.....ఓరి భగవంతుండా...అత్తమ్మకి ఇలాంటి కోరిక ఎందుకు కలిగింది?? అయినా చాలా రోజులుగా మనం అనుకుంటున్నాము కదా...సుమనుడి చిత్రరాజాన్ని చూడాలని..దానికి టైం వచ్చినట్లుంది అని లాప్ టాప్ లో పని చేసుకుంటూ ఓ చెవు టి.వి వైపు పడేసా.బాబు గారి డవిలాగ్స్ విందామని...పది నిమిషాలకి తలనొప్పి వచ్చి లేచి వెళ్ళిపోయా..తరువాత ఏకంగా క్లైమేక్స్ చూసా...ఇప్పుడర్ధమయ్యింది మీరు సుమనుడి వీరాభిమనులు ఎలా అయారో...మీకు జోహార్లు అధ్యక్షా..:)
రిప్లయితొలగించండినటనలో కూసింత ఇంప్రూవ్మెంట్ కనిపించిందో, నాకు చూడడం అలవాటైపోయిందో అర్ధం కావడం లేదు
రిప్లయితొలగించండిమురళిగారు,
తినగ తినగ వేము తియ్యనుండు..
కనగ కనగ కలుపు కమలమగును.. :)
కానీ ఈటీవీ లో వచ్చే చెత్త సీరియళ్ళ కన్నా ఇది బానే ఉంది అని అనుకున్నాను.
ఏమైపోయారు?ఎక్కడా కనిపించడం లేదు అనుకున్నా,మరలా సుమన్ బాబు సినిమా ఉందికదా!డెఫినిట్గా ఎన్ని పనులున్నా రివ్యూతో వస్తారు అనుకున్నా :))నా అంచనా తప్పలేదు. నేను మీ రివ్యూ చదవొచ్చులే అని హాయిగా అవార్డ్ ఫంక్షనూ షారూక్ వెర్రి చేష్టలూ చూసాను :((.మీ ఇస్టైలు పోస్ట్ వేరే చెప్పే పని లేదు కానీ "నునుసిగ్గు" భలేటర్మ్ కాయిన్ చేసారండి.ప్రతి సుమన్ టపాలో ఎక్కడో అక్కడ వస్తుందీ మాట. అతని ముఖమూ ఈపదమూ భలే కరెక్ట్ గా పెట్టారు:))
రిప్లయితొలగించండిబాబు రాక్ స్టార్ కి కొత్త అర్ధం స్రుష్టించబొతున్నారు. ఉన్నచోటనుంచి కదలకుండా రాయీ లాగా నుంచునేవాడే రాక్ స్టార్
రిప్లయితొలగించండివామ్మో ....ఓర్నాయన్నోయ్ ...బాబోయ్
రిప్లయితొలగించండి>>నటనలో కూసింత ఇంప్రూవ్మెంట్ కనిపించిందో, నాకు చూడడం అలవాటైపోయిందో అర్ధం కావడం లేదు.
రిప్లయితొలగించండికేకో కేకస్య కేక: :D
దురదృష్టవశాత్తూ సుమారు ఒక 20-25 mins. మిస్ అయ్యాను సినిమా. ఈ సినిమా కొంచెం నిరుత్సాహం కలిగించింది. ఇందులో ఇంద్రనాగ్ డామినేట్ చేశాడు సుమన్ ని. ఇది నేను ఖండిస్తున్నాను.
రిప్లయితొలగించండిహాస్య చిత్రం అంటారా ? మీరు మరీ అంత జోక్ చేస్తే ఎలాగండి.
6వ దశాబ్దానికి ఎగబాకుతున్న వీరొ 4 1/2 దశాబ్దాలు చూసేసిన విరోయిన్ బుగ్గ మీద ముద్దుపెట్టుకున్న సీను మీ రివ్యూ లో హైలైటు చేయక పోవడాన్ని గర్హిస్తున్నాను.
>>>'చూడు చూడు తమాషా' .. ఇవాళే ప్రకటన వచ్చింది, బాబుది రాక్ స్టార్ పాత్ర అనుకుంటా!!
oh అందుకునా ఈ సినిమాలో గిటార్ పట్టుకొని కొన్ని క్షణాలు కనిపించాడు డ్యూయట్ లో.
మీ రివ్యూ గురించి చెప్పటానికి ఏముంది. ఎప్పటి లాగానే అదిరింది.
జై సుమన్ జై జై సుమన్.
ఒక పాత్ర గొప్పతనాన్ని ఇతర పాత్రలతో చెప్పించటం ఒక ఎత్తైయితే..ఆ పాత్రకి ప్రతి గా ఇంకొక పాత్ర స్రుష్టించి ఆ పాత్రని పరమ చెత్తగా చూపించటం ద్వారా మొదటి పాత్రని Elevate చెయ్యాలనే గొప్ప సత్యాన్ని బాబు , నాగు , పేరుకి మాత్రమే దర్శకుడయిన సుభాష్ చాలా చక్కగా చూపించారు..బాబు కాస్ట్యూంస్ ఈ సారి కూడా చీరల్లొ మిగిలిన ముక్కలతో అతుకుల బొంతలాగా చేసి నా లాంటి అభిమానులను నిరుత్సాహపరిచారు..మరీ ఆ పాటలో డ్రైవర్లు వేస్కునే తెల్ల డ్రెస్ with shoulder collars అహా....తెలుగు లోగిళ్ళలోకి వరసబెట్టి ఈ టీవీ ద్వారా ఇలాంటీ అపూర్వ ప్రీమియర్లను అందిస్తున్నదుకు మరొక్కసారి బాబుకి క్రుతఙ్ఞతలు..
రిప్లయితొలగించండిఅమెరికానుండి వాళ్ళ అమ్మగారు ఫోనే చేస్తారు తన నాటకం బయట పడిపోతుందేమో అని పడుకొని ఆలోచించేటప్పుడు బాబు ఒలికించిన టెన్షన్ అనితర సాధ్యం. విగ్గుకి పెట్టుకున్న క్లిప్పులనుకుంటా అవి కూడా కనపడేలా టెన్షన్ పడ్డాడు బాబు..
రిప్లయితొలగించండిమీరీ విషయం ప్రత్యెకంగా రాయక పోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
Rockstar kadandi babu, mana sumanoharudu double photo anukuntanu esari :)
రిప్లయితొలగించండిమీరు ఎలాగూ కథ చెప్తారని తెలిసినా నా కళ్ళతో నేను బాబుని చూసే దాకా మనసాగలేదు. సినిమా ఆసాంతం ఎన్ని చెమకులున్నా చివరలో "అయితే, నేనే మీ అల్లుణ్ణి కదూ!" అని బాబు ముద్దుగా, నునుసిగ్గుతో కూడిన అపనమ్మకం నటిస్తూ టైటిల్ కి పరిపుష్టత తెచ్చిన సన్నివేశం నా మనసుని ఆ ఫళాన నమిలిమింగేసిందని తెలియజేసుకోవడమైనది.
రిప్లయితొలగించండిఏతావాతా తేలిన విషయమేమిటంటే బాబు ఈ సినిమాలో "వ్యంగ్య రసానికి" ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రససృష్టి గావించాడనిన్నూ, మనం ధన్యులమయ్యామనిన్నూ!
ఎవ్వరూ ఎంతమాత్రం బాగోలేరు. కాకపోతే చాలా రోజులకి శ్రీలక్ష్మి కనిపించింది. కాని, ఆయన ప్రతిసినిమాలో ఒక డ్యూయెట్, హీరోయిన్ ని ముద్దుపెట్టుకోటంతో మరీ చూపించుకుంటున్నాడు. నవరసపాత్రపోషణ కోరిక బాగానే తీర్చుకుంటున్నాడు. ఇంకపోతే చూడుచూడు తమాషా లో డబల్ ఆక్షన్ ఏమో అనిపిస్తోంది నాకు. స్టిఫ్ గా నిలబడి బొద్దుగా, ఒకటే రిథం లో చెప్పే ఆయన డైలాగ్స్ మాత్రం ఈ సారి బాగానే విన్నాను.
రిప్లయితొలగించండిఇంతలా పొగుడుతుంటే ఆగలేక కష్టపడి నవ్వాపుకుని ఒక క్లిప్పు చూశాను. నా అదృష్టం ఎలా ఉందంటే 'గేదెకి డిసిప్లిన్ 'లేదని హీరో గారు సెలవిచ్చే సీనుతో మొదలయ్యింది దొరికిన మొదటి లంకె. అది దాటి ఓ ఐదు నిమిషాలు ఓపికగా చూశాను.ఐనా అసలు కామెడీ ఈ టపాలో ఉంటే ఎక్కడో వెతకడం నాదే తప్పని తెలుసుకున్నాను. ఇలా వీరాభిమానంతో మీరు వ్రాసే పోస్టుల్లో బోలెదంత వినోదం. ఐతే వీటి వెనక ఒక నిజమైన మనిషి ఉన్నడే అని బాధ. బాధ ఎందుకంటే అతను అనుకున్న వినోదం ఒకటైతే చూసేవారికి అందేది ఇంకొకటి అని తెలియకపోవడం అతని అమాయకత్వమేమో అనే చిన్న అనుమానం. ఐనా, టివీ సీరియళ్ళలో ఏవైనా బావున్నవి, ఏ మాత్రమైనా రీజనబుల్ గా ఉన్నవి ఏవైనా ఉన్నాయంటారా? ఈ మధ్యే ఏవో హిందీ చానెళ్ళు వస్తున్నాయి మాకు. పదిహేను నిమిషాలకంటే ఎక్కువ చూడలేకపోయాను కొత్త మోజులో కూడా. పాత సినిమాలు వేస్తున్నారు, చాలా మటుకు మంచివే వస్తున్నాయి. అవి చూస్తుంటే తృప్తిగా ఉంటోంది.
రిప్లయితొలగించండిఈ సిరీస్ లో మీ టపాలు ఇప్పటి వరకూ రెండు చదివాను, ఇంకేమీ మిస్ అవ్వలేదు కదా? ఈ టపాలూ, వ్యాఖ్యలూ మటుకు ఆపుకుందామన్నా ఆగలేకుండా నవ్విస్తున్నాయి, చదివిస్తున్నాయి. ఇక మీ మిగిలిన టపాల గురించి చెప్పేదేముంది? చదువుకోవడమే.
నేనూ ఒక గంట చూసి ఆనందించిన తర్వత ఇంటి జనుల కోరిక (బెదిరింపు)పయిన మార్చ్హవలసి వచ్చ్హింది.
రిప్లయితొలగించండిఆ తర్వాత ఏదో విరామంలో ఈ సినిమపెఢితే నా మిత్రుడు ఇలాంటివి ఎవరన్నా చూస్తారానడిగితే నన్నూ, సుమనోహరుడి వీరాభిమానియిన మా నెమలికన్ను మురళిగారిని అవమానించినట్లేనని మీ బ్లాగు చూపించాను.
మీ సమీక్షకు కృతజ్~నతలు, జోహార్లు
బాపురే , ఈ సుమన్ కి ఇంతమంది ఫాన్ లా ! unbelievable
రిప్లయితొలగించండి@కృష్ణ ప్రియ: అరగంట చూశారంటే మంచి ప్రోగ్రెస్ అండీ.. త్వరలోనే పూర్తి షో చూసేస్తారు :-) :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@గోరా: అబ్బో.. బ్రహ్మాండమైన ఎపిసోడ్ చూశారుగా :-) :-) ధన్యవాదాలు.
@రాజశేఖర్ దాసరి: అంతేనంటారా? సుబాస కూడా సుఅస గా మారిపోతుందేమో :)) ధన్యవాదాలు.
@dnc:ఒక షోషో పూర్తిగా చూసిన వాళ్ళంతా తదుపరి షోషో ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారండీ మరి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@రవితేజ: వీడియోల గురించి నాకు పెద్దగా తెలీదండీ.. మిత్రులు కొందరు సేకరిస్తున్నారు.. చూద్దాం.. ఎవరన్నా లంకె ఇస్తారేమో.. ధన్యవాదాలు.
@శ్రీధర్: :-) :-) ధన్యవాదాలండీ..
@ఎన్నెల: అయ్ బాబోయ్.. నాదేమీ లేదండీ.. ....ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పద్మ: ఒకరిద్దరు మిత్రులు కూడా సుమన్ ఇంప్రూవ్ అయ్యాడని ఒప్పుకున్నారండీ మరి.. ..ధన్యవాదాలు.
@కృష్ణ: ఇవన్నీ 'టెలి ఫిలిం' లాంటివేనండీ.. కాకపొతే సుమన్ బాబు 'ప్రీమియర్ షో' అని పేరు పెట్టి సినిమా అనే ఫీల్ కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. ధన్యవాదాలు.
@సుజాత: నిజమా?!!!! ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@స్నిగ్ధ: మెళ్ళ మెళ్లగా మీకూ అలవాటైపోతుంది లెండి :)) ...ధన్యవాదాలు.
@శ్రీ: సీరియళ్ళతో పోలిస్తే... నిజం!! ..ధన్యవాదాలండీ..
@సునీత: అవునండీ.. 'నునుసిగ్గు' అనే ఎక్స్ ప్రెషన్ మీద పేటెంట్ సుమనుడిదే :)) ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పూర్ణిమ: హ...హ.. అంతేనంటారా?? ఈ మధ్యన స్టెప్పులూ అవీ వేస్తున్నాడండీ.. ధన్యవాదాలు.
@ఆదిత్య: :-) :-) ..ధన్యవాదాలండీ..
@కార్తీక్: నా పరిస్థితి అదేనండీ మరి :-) :-) ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బులుసు సుబ్రహ్మణ్యం; అలా డామినేట్ చేయబడడం సుమన్ బాబుకి ఇష్టమండీ.. ప్రతి షోలోనూ ఎవరోఒకరు డామినేట్ చేస్తూనే ఉంటారు కదా.. పిల్లలు కూడా చదువుతారని చుంబన దృశ్యాల జోలికి డిటైల్డ్ గా వెళ్ళలేక 'చిలిపి రొమాంటిక్ కబుర్లు' తో ఆపేశాను.. ..ధన్యవాదాలు.
@నైమిష్: నిజమండీ ఈ సారి కాస్ట్యూమ్స్, మరీ ముఖ్యంగా పాటలో వాడిన కాస్ట్యూమ్స్ బాహా నిరాశ పరిచాయి నన్నుకూడా.. ధన్యవాదాలు.
@వీకెండ్ పొలిటీషియన్: బాబు నటన గురించి రాయడం ఒక్క టపాలో సాధ్యమా చెప్పండి? బ్లాగర్లో గూగులమ్మ ఇచ్చిన చోటు చాలొద్దూ?? :)) ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@lostchild : డబల్ ఫోటో డౌటు నాకూ ఉందండీ.. చూడాలి.. ధన్యవాదాలు.
@కొత్తావకాయ: అయ్యో.. నేను హాస్యం అనుకుని చూసేశానండీ.. అయితే అది వ్యంగ్యమా?? ఇప్పుడెలా??? :-) :-) ధన్యవాదాలు..
@జయ: చూశారా..చూశారా? మీరు కూడా జాగ్రత్తగా పట్టి పట్టి మరీ చూసేస్తున్నారు :-) :-) స్టిల్స్ చూస్తుంటే డబల్ ఫోజేమో అనే అనుమానం బలపడుతోందండీ.. చూడాలి మరి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@లలిత జి: 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' 'ఐలవ్యూ డాడీ' ల గురించి రాయలేక పోయానండీ :( ..ధన్యవాదాలు.
@జేబీ: ఎవరూ చూడకపోతే బాబెందుకు తీస్తాడు చెప్పండి? అంతమంది స్పాన్సర్లు ఎందుకు వస్తారు? తనే నిర్మాత కూడాను.. :)) ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జిలేబి: అవునండీ అవును.. నమ్మాల్సిందే :-) :-) ..ధన్యవాదాలు.
ఈ టపా చదివిన క్షణం నుండి నన్నో అనుమానం తొలిచేస్తూ ఉంది. మీరిలా ప్రతి సారీ సుమన్ సినిమాలు చూసీ చూసీ, చివరికి సుమన్‌ని మాత్రమే చూడడానికి అలవాటు పడి, అతడిని మాత్రమే ఒక హీరోగా పరిగణిస్తారేమో.. అవార్డులు రివార్డులు అతడినే వరించాలని ధర్నాలు గట్రా చెయ్యరుగా??? అంటే ఒక నాలుగు సినిమాలు చూసేసరికి మీకు సుమన్ బాగా అలవాటయ్యాడు కదా. ఇంకొద్ది రోజులాగితే అతడు మాత్రమే అలవాటవుతాడేమో అని అనుమానం :):):)
రిప్లయితొలగించండిటపా మాత్రం సూఊఊఊఊఊఊఊపరు అంతే:):)
@మనసు పలికే: మీ దిష్టే తగిలినట్టుందండీ, 'చూడు చూడు తమాషా..' చూడలేకపోయాను :-) :-) ....ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిmay his soul RIP eenadu.net lo newschudagaane ikkada comment cheyalani anipinchindi... papam chinna age lone vellipoyaru
రిప్లయితొలగించండి