శనివారం, మే 30, 2020

ఏడాది పాలన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో కనీసం నాలుగైదు సందర్భాల్లో జగన్ నిర్ణయాలని గురించి రాద్దామనుకునే, ఏడాది పూర్తయ్యే వరకూ ఏమీ మాట్లాడకూడదని నేను పెట్టుకున్న నియమం గుర్తొచ్చి ఆగిపోయాను. ఏడాది ఆగడం ఎందుకంటే, జగన్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కాదు. ముఖ్యమంత్రిగా కాదు కదా, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేదు. ఇప్పుడు మాట్లాడడం ఎందుకంటే, ఆయన వెనుక ఏడాది కాలపు పాలనానుభవం ఉంది. మరే ఇతర నాయకుడికైనా ఐదేళ్ల కాలంలో ఎదురయ్యే అనుభవాలన్నీ జగన్ కి తొలి సంవత్సరంలోనే అనుభవానికి వచ్చేశాయి. 

శెభాష్ అనిపించే నిర్ణయాలతో పాటు, అయ్యో అనిపించే నిర్ణయాలనీ తీసుకుని అమలు పరిచారు గత  పన్నెండు నెలల్లోనూ.  అనేక ఇబ్బందులనీ ఎదుర్కొన్నారు. చెయ్యదల్చుకున్న పనులన్నీ వరుసగా చేసేయాలనే తొందర  కొన్ని వివాదాస్పద  నిర్ణయాలకి తావివ్వగా, మరికొన్ని నిర్ణయాలు కేవలం రాజకీయ కారణాల వల్లే వివాదాస్పదం అయ్యాయి.  వ్యక్తిగతంగా నన్ను కలవర పెట్టిన నిర్ణయాలు రెండు. మొదటిది పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనేది. వినడానికి ఇది చాలా బాగుంది. కానీ ఆచరణలో కష్టనష్టాలు అనేకం. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే, వెనక్కి వచ్చేసే అందరికీ రాష్ట్రం ఉపాధి చూపించగలదా? 

రెండో నిర్ణయం, ఏదో ఒక పేరుతో చేస్తున్న ఉచిత పంపిణీలు. నిజానికి ఈ ఉచితాలు మొదలై చాలా ఏళ్ళే గడిచినా, ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో అమలు చేసిందే అయినా, ప్రస్తుత ప్రభుత్వం వీటిని పరాకాష్టకి తీసుకెళ్లినట్టు అనిపిస్తోంది. విద్య, వైద్యం ఈ రెండు సేవలనీ అర్హులకి ఉచితంగా అందించడం అవసరం. వ్యవసాయం చేసుకునే రైతులు సమయానికి రుణాలని, పంటలకు గిట్టుబాటు ధరల్నీ ఆశిస్తున్నారు తప్ప అంతకు మించి కోరుకోవడం లేదు. ప్రతివర్గానికీ ఏదో ఒక పేరిట నిరంతరంగా డబ్బు పంపిణీ అన్నది సుదీర్ఘ కాలంలో ఒక్క ఆర్ధిక వ్యవస్థకి మాత్రమే కాక అన్ని వ్యవస్థలకీ చేటు చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇదో పులి స్వారీలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఉచితాల మీద కన్నా ఉపాధికల్పన మీద దృష్టి పెట్టడం శ్రేయస్కరం. 

Google Image

వినగానే నచ్చిన నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం. ఈ నిర్ణయం వల్ల పేదల జీవితాల్లో  రాత్రికి రాత్రే వెలుగొచ్ఛేస్తుందన్న భ్రమలేవీ లేవు కానీ, దీర్ఘ కాలంలో ప్రయోజనాన్ని ఇచ్చే నిర్ణయం అవుతుంది అనిపించింది. అయితే ఈ నిర్ణయం అమలులో చాలా సాధకబాదకాలున్నాయి. తెలుగుని ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెట్టే మాటుంటే,  దానిని కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రయివేటు సంస్థల్లోనూ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. బాగా పనిచేస్తున్న మరో వ్యవస్థ గ్రామ వాలంటీర్లు. మా ఊరు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నాకున్న సమాచారం ప్రకారం ఈ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. ముఖ్యంగా కరోనా కాలంలో వాలంటీర్లు చాలా బాధ్యతగా పనిచేశారు. నిరుద్యోగ సమస్యని కొంతవరకూ పరిష్కరించడం ఈ వ్యవస్థలో మరో పార్శ్వం. 

"మొండివాడు రాజుకన్నా బలవంతుడు అంటారు, ఇప్పుడు మొండివాడే రాజయ్యాడు," ఏడాది క్రితం ఒక మిత్రుడన్న మాట ఇది. జగన్ మొండితనాన్ని తెలియజెప్పే దృష్టాంతాలు గత కొన్నేళ్లుగా అనేకం జరిగాయి. కాంగ్రెస్ ని వ్యతిరేకించడం మొదలు, తెలుగు దేశం పార్టీని ఢీ కొనడం వరకూ అనేక సందర్భాల్లో, "మరొకరైతే ఈపని చేయలేకపోయేవారు" అనిపించింది. ఒక ఓటమితో ప్రయాణాన్ని ఆపేసిన/మార్గాన్ని మార్చుకున్న నాయకులతో పోల్చినప్పుడు జగన్ ని ముందుకు నడిపించింది ఆ మొండితనమే అని చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా జగన్ కి  అంది ఉంటే కథ  వేరేగా ఉండేది. ప్రస్తుతానుభవాలని బట్టి చూస్తే, అప్పట్లో ఆ పదవిని నిలబెట్టుకోవడం ఆయనకి బహుశా కష్టమై ఉండేది. 

ప్రజలు  అఖండమైన మెజార్టీ ఇచ్చి ఉండొచ్చు కానీ, బలమైన ప్రతిపక్షం అనేక రూపాల్లో చుట్టుముట్టి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకోవడం అవసరం. ప్రతి ప్రకటన వెనుకా ఒక సమగ్ర సమీక్ష ఉండాల్సిందే. సమస్యలు ఏయే రూపాల్లో ఉండొచ్చు అన్న విషయంలో ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఆ వైపుగానూ ఆలోచనలు సాగాలి. మూడు రాజధానులు, మండలి రద్దు వంటి నిర్ణయాల అమలులో కనిపించిన తొందరపాటు విమర్శలకి తావిచ్చింది. (వీటిలో మండలి రద్దు నాకు బాగా నచ్చిన నిర్ణయం). అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిలోనూ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అలాగే, సంక్షేమం అంటే కేవలం ఉచిత పంపిణీలు మాత్రమే అనే ధోరణి నుంచి  బయటికి వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏడాది కాలపు అనుభవాల నుంచి జగన్ ఏం నేర్చుకున్నారన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 

20 వ్యాఖ్యలు:

 1. ఈ విధమైన నిష్పాక్షిక సమీక్ష పచ్చ మీడియా నుంచి ఎన్నటికీ రాదు. మంచి చెడూ రెండూ చెప్పినప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది. జగన్ పాలనలో తప్పులు లేవని కాదు. కానీ అతను చేపట్టిన మంచి పనులు కూడా ద్వేషంతో విమర్శించే మీడియా వుంది. మీ సమీక్ష బాగుంది.

  శాసన మండలి రద్దు సరికాదు అని నేను అనుకుంటాను. Though it may not be decision making body, it is useful to accommodate important leaders who cannot get elected in direct polls. Also it gives a scope for some stop gap arrangement for ministers.

  Also politically council comes in handy to accommodate ఆశావహులు.

  Jagan has to function in a calm and composed manner to counter the disgusting opposition party.

  The role of Babu has been unbecoming of his stature.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీరు చెప్పదలిచింది టూకీగా చెప్పారు. మీ విశ్లేషణలో నాకు సమ్మతమయిన అంశాలు ఎక్కువున్నా, నేను విభేదించే రెండు అంశాలు మాత్రం రాస్తున్నాను:

  1. అనుభవం లేదేమో అంటూ అప్రైసల్ గడువు ఇవ్వడం ఎంట్రీ లెవెల్ ప్రొబేషన్ సిబ్బందికి సబబేమో కానీ, అత్యున్నత బాధ్యతాయుతమయిన పదవులలో ఉన్నవారికి చెల్లదు.
  2. "ఉచితాలు" శ్రేయస్కరమా కాదా వగైరా merits based చర్చకు కాలం చెల్లిపోయింది. ఎన్నికల సూచీపత్రంలో ఉన్న అంశాలను తూచా తప్పకుండా శిరసావహించకుంటే లభించిన ప్రజామోదాన్ని ఉల్లంఘించడం అవుతుంది. Irrespective of whether one considers them good or bad, the proposals have received thumping public support.

  ఇకపోతే నా విమర్శలు కొన్ని (unrelated to your own analysis):

  1. టీడీపీ ప్రభుత్వం చేసిన అతికొద్ది మంచి పనులలో ఒకటయిన సబ్సిడీ క్యాంటీన్ల రద్దు చేయడం మూలాన పేదలకు నష్టం జరిగింది
  2. నీటి పారుదల రంగంలో నత్త నడక
  3. జిల్లా పునర్వ్యవస్తీకరణ జరగకపోవడం వలన వికేంద్రీకరణ ఫలాలు హస్తగతం అవడంలో జాప్యం
  4. సమాచార వ్యవస్థా లోపాల మూలాన యెల్లో మీడియా & పచ్చ గోబెల్స్ దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదురుకోలేకపోవడం

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఎటూ అప్రయ్జల్ పోలిక తెచ్చారు కాబట్టి, అలా చూసుకున్నా చేరిన తొలిరోజు నుంచే అప్రయిజ్ చేయరు కదండీ :) మీ విమర్శల్ని గురించి ఆలోచించాల్సిందే.. ధన్యవాదాలు 

   తొలగించు
 3. అన్నింటికన్నా ముఖ్యమైన రాజధాని, పోలవరం ప్రాజెక్టు మూలన పడ్డాయి. ఈ రెండు పూర్తయినప్పుడే రాష్ట్రానికి సమగ్ర రూపం వస్తుంది. లేకపోతే అప్పులే దిక్కు.
  ప్రతిపక్షం బలహీనంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభ, శాసనమండలి పని చెయ్యడం అవసరం. లేకపోతే అధికార పార్టీ నేతలు నియంతలలా వ్యవహరించే ప్రమాదం ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తుక్కుతుక్కుగా ఓడిపోయిన వాళ్లెవరో గోప్ప రాజధాని కడతామని చేసిన వాగ్దానం తీర్చాల్సిన ఖర్మ జగన్ గారికుందా లేదే. Not only did he win fair & square, he win big too.

   తాడికొండ & (బుజ్జి విజనరీ భారీ పటాలం & హంగామాతో పోటీ చేసిన) మంగళగిరి స్థానాలు కూడా వైకాపా గెలిచింది. జనక్షేత్రంలో మ్యాటర్ సెటిల్ అయ్యాక మళ్ళీ ఎన్నని ఏమి లాభం?

   Nature abhors a vacuum. ప్రతిపక్షం బలహీనంగా ఉందనుకోవడం పొరబాటు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజానాడి అందుకోలేకపోతే కొత్త పార్టీలు/నాయకత్వం పుట్టుకు రావాలి తప్ప తిరస్కృత దళాలనే దొడ్డిదారిలో నిలపడం పరిష్కారం కాదు.

   తొలగించు
  2. యుద్ధ ప్రాదిపదికన ప్రోజెక్టుల నిర్మాణం పేరుతొ ఖర్చుని రెండు మూడింతలు పెంచేయడమూ సమర్ధనీయం కాదు కదండీ.. ఇప్పుడు వృధా వ్యయం జరగడం లేదని కాదు కానీ, ఒక్కొక్కరిదీ ఒక్కో పధ్ధతి, ఒక్కో మొత్తం, అంతే. ..ధన్యవాదాలు 

   తొలగించు

 4. Surprise :) నెమలికన్ను పాలిటిక్సు గురించి వ్రాయడమా !

  ప్రత్యుత్తరంతొలగించు
 5. #ప్రశ్న : సంబరాలు ఎందుకు #ప్రత్యేకహోదా తెచ్చారా ??
  #జవాబు :లేదు లేదు

  ప్రశ్న: #బాబాయ్ ని చంపిన వాడిని కనిపెట్టారా?
  జవాబు: లే లే

  ప్రశ్న : #కోడికత్తి కేసు కనిపెట్టారా..?
  జవాబు :దర్యాప్తులో ఉంది

  ప్రశ్న : ప్రతిపక్ష నాయకుడి #అవినీతి వెలికి తీశారా..?
  జవాబు :లే లే

  ప్రశ్న : #అమరావతి లో అవినీతి అన్నారు నిరూపించారా..?
  జవాబు : లేదు లేదు

  ప్రశ్న: రాష్ట్ర #ఆదాయాన్ని ఏమైనా పెంచారా..?
  జవాబు: లే లే ఇంకా ఫుల్లుగా అప్పులు చేశాం..

  ప్రశ్న: #ప్రాజెక్టులు ఏమైనా కట్టారా..?
  జవాబు: లేదు లేదు

  ప్రశ్న : #పరిశ్రమలు ఏమైనా తెచ్చారా..?
  జవాబు :లేదు_లేదు

  ప్రశ్న: #రాజధాని కట్టారా..?
  జవాబు :లేదు లేదు (మూడు కడతాం)

  ప్రశ్న : కరెంట్ ,ఆర్టీసీ చార్జీలు తగ్గించారా..?
  జవాబు :లేదు లేదు ఇంకా పెంచాం..

  ప్రశ్న : #సంక్షేమపథకాలు అమలు చేస్తున్నారా ..? ?
  జవాబు :ప్రభుత్వ భూములు అమ్మి చేస్తాం..

  #ప్రశ్న: 45 ఏళ్ల వాళ్లకు #పింఛన్ ఇస్తున్నారా ..?
  #జవాబు : లేదు లేదు

  #ప్రశ్న: మరి ముసలి వాళ్లకు 3000 పింఛన్ ఇస్తున్నారా??
  #జవాబు: లేదు లేదు

  ప్రశ్న : మరి #సన్నబియ్యం ఇస్తున్నారా..?
  జవాబు : లేదు లేదు

  #ప్రశ్న : #కోర్టు మీ పనితీరును మెచ్చుకుందా..?
  #జవాబు : లేదు లేదు చివాట్లు పెడుతుంది..

  #ప్రశ్న : మరి సంబరాలు ఎందుకో చెప్పండి .?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఓ వారం పదిరోజుల క్రితం టీడీపీకి పనిచేసే మిత్రుడి నుంచి తొలిసారిగా వాట్సాప్లో వచ్చిందండీ ఈ మెసేజ్. తర్వాత చాలా ఫార్వార్డ్లు వచ్చాయి. ఆలోచించాల్సిన విషయాలే.. వీటితో పాటు, ఇరవైనాలుగు స్టేలలో ఒక్కదాన్నీ వెకేట్ చేయించలేదు. సాక్షాత్తూ దేశ ప్రధానే "పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎంగా మారిపోయింది" అని పబ్లిక్ మీటింగ్ లో ప్రకటించినా కూడా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ లేవు (మళ్ళీ అధికారంలోకి వచ్చినా). 'నీరు-చెట్టు' లో వందల కోట్ల వృధా వ్యయం జరిగింది, సంబంధిత మంత్రి జైలు పాలే అన్నారు ఏడాది క్రితం, అక్కడా చర్యలేమీ లేవు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ..ధన్యవాదాలు.. 

   తొలగించు
  2. 5 ఏళ్ళు పరిపాలించి, ప్రతిపక్ష నాయకుడి అవినీతిని ఏమాత్రమూ టచ్ కూడ చేయకుండా సో కాల్డ్ సామాజిక మాధ్యమాలలో A1 అంటం వరకే పరిమితమైన ప్రహసనం.
   ఇవన్నీ కల్లబొల్లి కబుర్లు.

   జనం నాడి పట్టి గెలిచాడు ఇతను.
   ఊర్కే యాగి చేసే ధోరణిలో ప్రతిపక్షం.

   అప్పట్లో ప్రతిపక్షానికి స్థాయి లేదూ అంటే యెల్లో మీడియా ప్రతిపక్షం నోరు నొక్కేసిందనేది నిజం.

   ఇప్పుడు అదే పాలకవర్గం ప్రతిపక్షంలోకొచ్చి కూర్చోగానే పచ్చి వెలక్కాయ గొంతులోకిచ్చి పడింది.

   తొలగించు
  3. @BhaskarRamaraju
   పాయింట్ 1:5 ఏళ్ళు పరిపాలించి,ప్రతిపక్ష నాయకుడి అవినీతిని ఏమాత్రం టచ్ చెయ్యకుండా సో కాల్డ్ సామాజిక మాధ్యమాలలోA1 అంటం వరకే పరిమితమైన ప్రహసనం.

   పాయింట్ 2:జనం నాడి పట్టి గెలిచాడు ఇతను.

   పాయింట్ 3:అప్పట్లో ప్రతిపక్షానికి స్థాయి లేదూ అంటే యెల్లో మీడియా ప్రతిపక్షం నోరు నొక్కేసిందనేది మిజం.

   పాయింట్ 4:ఇప్పుడు అదే పాలకవర్గం ప్రతిపక్షంలో కొచ్చి కూర్చోగానే పచ్చి వెలక్కాయ గొంతులో పడింది.

   హరి.S.బాబు
   కొశ్ఛెన్ 1:2011 ఆగస్టు 10న మాజీ మంత్రి P Shankar Rao రాష్టర్ హైకోర్టులో అతని మీద CBI విచారణ కోసం పిటిషన్ వేశాడు - అభియోగం 2004-2009 మధ్య కాలంలో తండ్రి యొక్క ముఖమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల ప్రజాధనాన్ని హారతి కర్పూరం చేశాడని.ఆగస్టు 17న FIR దాఖలు అయ్యింది - ప్రస్తుతం 13 కేసులు మాత్రమే ఉన్నాయని అంటున్నారు గానీ అవి కొన్ని ఒకేలాంటి కేసుల్ని కలిపి నమోదు చేసిన చార్జిషీట్ల సంఖ్య. 120-భ్ (criminal conspiracy), 420 (cheating), 409 (criminal breach of trust) అంద్ 477A (falsification of accounts) సెక్షన్ల కింద 74 కేసులు నమోదు అయ్యాయి.Section 13 of the Prevention of Corruption Act అనేది అదనం.

   ఇవన్నీ కోర్టులు నిర్ధారించినవే తప్ప TDP వాళ్ళు చేస్తున్న ప్రచారం కాదు."సో కాల్డ్ సామాజిక మాధ్యమాలలో A1 అంటం వరకే పరిమితమైన ప్రహసనం" అని ఎదటివాళ్ళ మీద పడి యాడవకుండా A1 లేబుల్ తొలగించుకోగలిగిన దమ్ము మీకు ఉందా?

   కొశ్ఛెన్ 2:జనం నాడి పట్టి గెలిచే సత్తా ఉంటే 2014లో ఎందుకు ఓడిపోయాడు?కాబోయే ముఖ్యమంత్రి జగనే అని తెలిస్పోయి కేంద్రం రాజధాని కోసం సర్వే చెయ్యమని చెప్పిన కమిటీకి పులివెందులని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన సాక్ష్యం ఉంది నా దగ్గిర.అంత ధీమాగా ఉండి
   కూడా వోడిపోవటం అంటే జనం నాడి తెలియనట్టే కదా!

   కొశ్ఛెన్ 3:అప్పట్లో ప్రతిపక్షనాయకుడిగా ఉన్న జగన్ గారు ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద షూట్ చెయ్యాలనడం కూడా మీడియాలో వచ్చింది - అది కూడా నోరు నొక్కెయ్యడమేనా?

   కొశ్ఛెన్ 4:2009లో కడప నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడు అయినప్పటినుంచి అంత సుదీర్ఘమైన ఎన్నికల తర్వాత కూడా ఎన్నికల కమిషనర్ పదవి గురించి బేసిక్స్ కూడా తెలియని 151 సీట్లు గెల్చిన ప్రజానాడీవైద్యుడి గొంతులో ఇరుక్కున్న పచ్చి వెలక్కాయల సంఖ్య ఇప్పటికి 60 పైనే ఉన్నాయి.అవన్నీ ఎప్పటికి బయటికి లాక్కోగలరు?

   తొలగించు
 6. ఇంతటి సంస్కారవంతమైన ముఖ్యమంత్రిని 16 నెలలు జైలులో ఉంచినవారిని ఏమనాలో అర్ధం కావడం లేదు. సంవత్సర పాలన గురించి జేడీ లక్ష్మీ నారాయణ గారు కూడా మీలాగే స్పందించారు. అదేదో సినిమాలో తిడతాండా పొగుడుతాండా అన్నట్లుంది పరిస్థితి.

  గ్రామాల్లో ఉద్యోగవాతావరణం నాకు నచ్చింది.

  కోర్టుల్లో వ్యవహారం అంత త్వరగా తేలదు అని తెలిసి కోర్టులతోనే ఆటాడుకోవడం ఇంకా బాగా నచ్చింది.

  ఆడు మగాడ్రా బుజ్జీ !

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మాస్కు కొనుక్కోలేనంత పేదవాడైన డాక్టర్ సుధాకర్ కు.. ప్రభుత్వమే ఒకటి కొనివ్వలేకపోవడం.. ఎంత ఘోరం.. దాన్ని సుప్రీం కోర్టుకు కూడా తీసుకెల్తాంగానీ.. మేమో మాస్కు కొనివ్వం మరి.

  ప్రత్యుత్తరంతొలగించు