ఆదివారం, ఆగస్టు 01, 2010

ఇలా జరక్కపోతే బాగుండును..

....ఉదయం నుంచి ఇప్పటివరకూ ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నానో లెక్క లేదు. ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్లు చదివే సమయంలో 'సాక్షి' ఫ్యామిలీ సెక్షన్ దగ్గర ఒక్కసారి ఆగాను. 'రీచార్జ్' అనే వారాంతపు కాలమ్ లో 'Hello శంకర్ శాస్త్రి' శీర్షికతో 'శంకరాభరణం' సినిమా గురించి సచిత్ర కథనం. విడుదలై మూడు దశాబ్దాలు గడిచాక ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్తగా ఏం రాసి ఉంటారా అనే ఆసక్తి తో మిగిలిన పేపర్లు పక్కన పెట్టి చదవడం మొదలు పెట్టాను. నాలుగు పేరాలు చదవగానే ఎక్కడో చదివినట్టు అనిపించడం మొదలైంది. మరో రెండు పేరాలు చదివేసరికి అర్ధమయ్యింది...వంశీ రాసిన 'వెండితెర నవలలు' నుంచి మక్కీ కి మక్కీ దించేశారని.

కథనం రాసిన ప్రియదర్శిని రాం తన ఫోటోను ప్రచురించుకోవడంతో పాటు చివర్లో ఇన్ పుట్స్ అంటూ మరో ఇద్దరి పేర్లు రాశారు కానీ, ఎక్కడా 'వెండితెర నవలలు' పుస్తకాన్ని ప్రస్తావించలేదు. 'శంకరాభరణం' గురించి వైవిధ్యంగా ఏమన్నా రాసి ఉంటే బాగుండేది.. 'సాక్షి' వారికి ఇది అసాధ్యమైన విషయం ఏమీ కాదు. లేదూ, కనీసం ప్రచురించిన కథనానికి మూలాధారమైన పుస్తకానికి క్రెడిట్ ఇచ్చినా బాగానే ఉండేది.. ఈ రెండూ జరక్కపోవడం దురదృష్టకరం. ఇది కేవలం 'పొరపాటు' అని సరిపెట్టుకోలేక పోతున్నాను నేను.

13 కామెంట్‌లు:

  1. ఆహా, ఒహో, ప్రింట్ రంగంలో కుడా సరికొత్త ఒరవడికి తెర తీసాడు కామోసు ప్రియదర్శిని రామ్, ఎలాగూ మన సినిమాలు అన్నీ కాపీనే, ఇదీ అలనే తగలెడదాం అనుకున్నట్టున్నాడు.

    రిప్లయితొలగించండి
  2. అదొక "బాకా" పత్రిక అంతకంటే వాళ్ళకు చేతనయినది ఏమున్నది??!!

    రిప్లయితొలగించండి
  3. నాదీ అదే ఫీలింగ్ అండీ, మరీ మొన్నే వంశీ ‘వెండితెర నవలలు’ చదివానేమో, రామ్ అన్నయ్య(?) ఆర్టికల్ చదువుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది

    రిప్లయితొలగించండి
  4. ప్రింట్ మీడియాలో చాలా మందికి ఇదొక జబ్బు...మేటర్ అంతా ఎత్తేస్తారు కానీ కనీసం ఆ ఆధర్ కి క్రెడిట్స్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఉండదు.. ప్రియదర్శిని రాం ఎలాంటి మేటర్ అయినా ఎత్తేసే టైపు అని నా అనుమానం..ఆ మాటకొస్తే సాక్షి ఫ్యామిలీలోని కొన్ని ఫీచర్స్ మక్కీ మక్కీ ఎత్తేసేవే కనిపిస్తాయి చాలా వరకు...

    రిప్లయితొలగించండి
  5. నేను 'వెండితెర నవలలు ' పుస్తకం చదవలేదు, సాక్షి ఆదివారం సంచిక చూసి మహదానందపడ్డా శంకరాభరణం గురించి రాసారని..ఛ! ఇంత దారుణమా? మరీ రోజు రోజుకీ పత్రికల స్థాయి దిగజారిపోతోందండీ!!

    రిప్లయితొలగించండి
  6. అసలు నాకు ఎందుకో మొదటి నుండీ సాక్షి "అరటి పండు అన్నయ్య" రాతలే నచ్చవు.ఎక్కడో కాపీ కొట్టినట్లో లేదా ఘోస్టు రైటర్ లతో రాయించినట్లో అనిపించేవి.లేదా చాలా అతి గా అనిపిస్తుంది.
    "అతి" గా అనిపించే విషయాలే ఈయన స్వంతం గా రాస్తారేమో.మిగతావన్నీ ఇలా రాసినవేనేమో.మీరు సీక్రెట్ చెప్పేసారు.గుడ్.

    రిప్లయితొలగించండి
  7. నాది కూడా "సుభగ" గారి కామెంటే.

    రిప్లయితొలగించండి
  8. @తార: నాకు తెలిసి పూర్తి స్థాయి కాపీ ఇదే మొదటిసారండీ.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @శివ: అంతేనంటారా? ..ధన్యవాదాలు.
    @బాలు: ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందండీ.. కళ్ళు మూసుకుని పాలు తాగడం అనాలా దీన్ని? ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @శేఖర్ పెద్దగోపు: ఇనాళ్ళూ నాకు అంత డౌట్ లేదు కానండీ, ఇప్పుడు మొదలైంది.. తెనాలి రామలింగడి పిల్లి కథ గుర్తొస్తోంది.. ధన్యవాదాలు.
    @సుభగ: వీలయితే పుస్తకం చదవండి.. శంకరాభరణం గురించి చాలా బాగా రాశారు వంశీ.. ధన్యవాదాలు
    @రిషి: ఈ 'అరటిపండు' గొడవ ఏమిటండీ? ఎనీ ఇంట్రస్టింగ్ స్టోరీ?? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @బోనగిరి: స్పందనకి ధన్యవాదాలండీ..
    @పరిమళం: నా తొలి స్పందన కూడా అదేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @మురళి గారు
    సాక్షి ఫ్యామిలి పేజ్‌లో లవ్‌డాక్టర్, నీలాంబరి, అరటిపండు, అరటితొక్క అంటూ చంపుకుతినేస్తాడు. మీరు ఎప్పుడూ చదవలేదా? తిక్క ప్రశ్నలు, పిచ్చి సమాధానాలూ.
    @రిషి గారు,
    >>"అతి" గా అనిపించే విషయాలే ఈయన స్వంతం గా రాస్తారేమో.మిగతావన్నీ ఇలా రాసినవేనేమో.
    హ్హహ్హహ్హా... నిజమేనేమోనండి.

    రిప్లయితొలగించండి
  12. @శిశిర: మొదట్లో అతి కొద్ది రోజులు 'లవ్ డాక్టర్' చదివి, ఆ తర్వాత మానేశానండీ.. అందువల్ల ఈ అరటిపండు అర్ధం కాలేదు. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి