'సమర్ధత ముఖ్యమా? విధేయత ముఖ్యమా?' ఎందుకో తెలీదు కానీ, ఈ ప్రశ్న తలెత్తినప్పుడల్లా నాకు పతంజలి 'వీరబొబ్బిలి' కి ఎదురైన క్లిష్ట సమస్య 'విశ్వాసం ముఖ్యమా? బోయినం ముఖ్యమా?' గుర్తొస్తూ ఉంటుంది. అప్పగించిన పనిని పూర్తి చేసి శెభాష్ అనిపించుకోడానికి సమర్ధత అవసరం. సమర్ధత కలిగి ఉండడం ద్వారా బాధ్యతని కొంత సులువుగా నిర్వహించడానికి వీలవుతుంది. కానీ, విధేయత లేకపొతే మెజారిటీ సందర్భాలలో ఈ సమర్ధత బూడిదలో పోసిన పన్నీటి చందమవుతుంది.
అప్పగించిన పనిని పూర్తిచేసే సామర్ధ్యం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కచ్చితంగా. ఈ ఆత్మవిశ్వాసం చాలామందికి అహంభావంగా కనిపిస్తుంది, మరీ ముఖ్యంగా పైవాళ్ళకి. ఆత్మవిశ్వాసానికీ అహంభావానికీ మధ్య ఉన్న రేఖ అతి సన్ననిది కావడం ఇందుకు ఒక కారణం. అలాగే తమ కింద పనిచేసేవాళ్ళ నుంచి ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రమూ ఆశించని పైవాళ్ళ తత్వం కారణంగా చాలా సార్లు ఈ లక్షణం అహంభావంగా కనిపించే అవకాశం ఉంది.
విధేయత అవసరమే. పెద్ద వాళ్ళని గౌరవించాలి. అప్పగించిన పనిని పూర్తి చేయడం ద్వారా సమర్ధతని నిరూపించుకోవడంతో పాటుగా వాళ్లకి మనం విధేయులమే అన్న సంకేతాన్ని పంపుతూ ఉండడం అవసరం. ఎంత అవసరం అంటే, మన సమర్ధతే మన పనితీరుకి గీటురాయి అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతూ, విధేయత ఉన్నా దానిని తగిన విధంగా ప్రకటించకపోవడం వల్ల న్యాయంగా అందాల్సినవి అందక పోగా 'పొగరుబోతు' లాంటి బిరుదులు అయాచితంగా వచ్చి పడతాయి.
కేవలం విధేయత ద్వారా బండి లాగించేసే వాళ్ళు ఉంటారు. ఈ విధేయత వారిలోని సమర్ధతా లోపాన్ని చాలా చక్కగా కవర్ చేసేయగలుగుతుంది. అప్పగించిన పని అటూ ఇటూ అయినా, పైవారి యెడల వీరు ప్రకటించే మోతాదు మించిన విధేయత సాయంతో క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడిపోతూ ఉంటారు. 'ఎంతకాలం?' అన్నది కేవలం కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్న. ఎందుకంటే, 'కేవలం విధేయత' ఎల్లకాలమూ ఎవరినీ రక్షించలేదు. నెమ్మదిగా సమర్ధతని పెంచుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళకి మాత్రం ఇక్కడ కొంచం మినహాయింపు ఇవ్వొచ్చు.
సామర్ధ్యాన్నీ, ఫలితాలనీ మాత్రమే ఆశించేవారి ముందు విధేయతా మాత్రం పఠించి, అతి వినయం చూపడం అనవసరం. ధూర్త లక్షణం ప్రదర్శించ వద్దని చెప్పించుకోవాల్సి వస్తుంది. కానీ, సమర్ధత కన్నా విధేయతకి పెద్ద పీట వేసే వాళ్ళదగ్గర ఈ ప్రదర్శన తప్పదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, తమ సామర్ధ్యం మీద ఎక్కువ నమ్మకం ఉన్నవాళ్ళు, విధేయతని 'ప్రదర్శించడానికి' ఇష్టపడరు. పైవాళ్ళు, ఈ 'ప్రదర్శన' ని ఇష్టపడే వారైనప్పుడు కొంత సంఘర్షణ తప్పదు.
సమర్ధతతో పనిచేస్తూ, తగుమాత్రం విధేయత చూపడం ద్వారా మనం పని చేస్తున్న విషయాన్ని పైవారి దృష్టిలో పడేయడం అన్నది కత్తి మీద సాము, తాడు మీద నడకాను. చెప్పినంత సులువేమీ కాదు. అలాగని కేవలం ఏ ఒక్క దాన్నో మాత్రమే నమ్ముకోవడమూ సమర్ధనీయం కాదు. మరీ ముఖ్యంగా విధేయతని. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ విధేయత, సమర్ధత అనేవి ఒకే ఒరలో ఇమడ్చాల్సిన రెండు కత్తులు. ఏ ఒక్కదానిని నిర్లక్ష్యం చేసినా కూడా దుష్పరిణామాలు తప్పవు. రెంటినీ సమన్వయం చేయడానికి ప్రయత్నించాల్సిందే.. సాధనమున పనులు సమకూరు ధరలోన...
cheppina vidham baagundi Murali garu...videyata choopadam ante..thandaana anaali kadhaa.samrdhata unnavaaru videyulu gaa undakundaa, marakunda unte baagundunemo anukuntaanu. Pch..rendu avasrame annamaata!
రిప్లయితొలగించండిచాల కరెక్టు గా చెప్పారు ! కాని ఇది ఆచరణ లోనే కొంచెం కష్టం :))))
రిప్లయితొలగించండిసమర్ధత ఉన్న చోట విధేయత ఎందుకూ అనిపిస్తుంది. కానీ తప్పదు.
రిప్లయితొలగించండివిధేయత ఉన్నచోట సమర్ధత లేదేమో అని అనుమానం వస్తుంది. నిరూపించుకుంటూ ఉండాలి.
అసిధారా వ్రతం!
మంచి ప్రస్తావన. బిగి సడలకుండా, మీమాంస తెగనివ్వకుండా చక్కగా రాసారు.
ఏం చెప్పారండీ మురళిగారు..!!
రిప్లయితొలగించండి"మన సమర్ధతే మన పనితీరుకి గీటురాయి అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతూ, విధేయత ఉన్నా దానిని తగిన విధంగా ప్రకటించకపోవడం వల్ల న్యాయంగా అందాల్సినవి అందక పోగా 'పొగరుబోతు' లాంటి బిరుదులు అయాచితంగా వచ్చి పడతాయి."
-- ఈ విషయం ఎన్నోసార్లు అనుభవంలోకి వచ్చినా, నా బుద్ధి మారదు ఎందుకో..?
మురళిగారు, బాగా చెప్పారు, కర్ర విరక్కుండా పాము చావకుండా పనిచెయ్యడం కొంచం కష్టమే మరి.
రిప్లయితొలగించండిసమర్ధత కి నానార్ధాల్లో విధేయత ఒకటి అనుకుంటాను. విధేయత వల్ల సమకూరు పనులు ధరణి లోనా అన్నారు నేటి గురువులు. సమర్ధత కన్నా విధేయతనే నమ్ముకోవాలని నేను సలహా ఇస్తున్నాను. సమర్ధులైనా ముక్కుకు సూటిగా పోయే వాళ్ళందరూ శంకర గిరి మాన్యాల్లోనే కనిపిస్తారు.
రిప్లయితొలగించండివిధేయతలేని "సమర్ధత "ఆకర్షణీయంగా కనబడే సువాసనలేని బోగన్విలియా (కాగితం పూవు ) లాటిది :-)
రిప్లయితొలగించండి"నీ బాంచన్ కాల్మోక్కుతాన్ "అని అనకపోయినా గురువులు పెద్దలు పై అధికారుల పట్ల కూసంత వినయ విధేయతలు కలిగి వుండలంటాను ....ఆహా బొబ్బిలిని గుర్తుచేశారు మరొక్కసారి చుసిరావాలి .
@వనజ వనమాలి: అవునండీ.. రెండూ అవసరమే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: కొంచం కాదండీ, చాలా కష్టం :)) ..ధన్యవాదాలు.
@కొత్తావకాయ: నిజంగా అసిధారా వ్రతమేనండీ.. ధన్యవాదాలు.
@రవికిరణ్: అనుభవం అండీ.. అనుభవం.. తత్త్వం బోధ పడకుండా ఉంటుందా మరి!! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రీ: అనేకానేక కష్టాల్లో ఇదీ ఒకటండీ.. ధన్యవాదాలు.
@బులుసు సుబ్రహ్మణ్యం: కానైతే ఈ ఆత్మాభిమానం అన్నది ఉంది చూశారూ, అది మోతాదు మించిన విధేయతని ప్రకటించనివ్వదు. అప్పుడు మొదలవుతాయండీ సమస్యలు. నిజమే శంకరగిరిమాన్యాలే! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిన్ని: ఎక్కడా కూడా అతి కూడదు కదండీ.. అలాగని అస్సలు ఉండకుండానూ ఉండకూడదు.. ప్రదర్శన దగ్గరికి వచ్చేసరికే మొదలవుతుంది సమస్య.. ధన్యవాదాలు.
విధేయత, సమర్ధతా ఉన్నప్పటికీ ఇతరుల అసూయలను తట్టుకొని, నెట్టుకొని రావటం కష్టమేమొ. అధికారులకు మనపట్ల నమ్మకమున్నా అది ఎప్పుడో అప్పుడు చెడుప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. ప్రతివక్కటీ సవ్యసాచిలా అందరూ తట్టుకోలేరుగా. మరి అప్పుడేం చేయాలి? మనసు బాధపడకుండా ఎలా ఆపాలి? మనతో స్నేహంగా ఉంటూనే వెనక గోతులు తవ్వుతారుగా...మరి అప్పుడేం చేయాలి. ఏమో...అన్నిటికన్నా ముఖ్యం లౌక్యమేమో.... చాలాసార్లు, అసలేం చేయాలో తోచదుకూడా:(
రిప్లయితొలగించండి@జయ: ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికలా ఉండడం ఒకరు నేర్పేది కాదు కదండీ.. అనుభవాలే విలువైన పాఠాలు నేర్పుతాయి మనకి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి