శుక్రవారం, జూన్ 19, 2009

'వంద'నాలు

"అసలు నేను ఎన్ని టపాలు రాయగలను? మహా ఐతే ఓ పాతికో ముప్ఫయ్యో.. ఇందుకోసం ఓ బ్లాగు మొదలు పెట్టడం అవసరమా?" ఓ బ్లాగు వాడిని అవ్వాలన్న పురుగు నా బుర్రలో ప్రవేశించినప్పుడు దానిని తరమడం కోసం నేను వెతుక్కున్న అనేకానేక కారణాలలో ఇదీ ఒకటి. ఇది జనవరి మూడో వారంలో జరిగిన ముచ్చట. చివరికి ఆ పురుగు గెలవడం నేను బ్లాగడం మొదలు పెట్టడం జరిగింది.

ప్రారంభంలో అన్నీ సందేహాలే.. ఏం రాయాలి? ఎలా రాయాలి? అన్న విషయంలో కాదు.. ఎలా పోస్టు చేయాలి? సెట్టింగులలో ఏ మార్పులు చేసుకోవాలి? కూడలి, జల్లెడలకి లంకె వేయడం ఎలా? సలహా చెప్పే వాళ్ళెవరూ లేరు. నా మిత్రులెవరికీ బ్లాగుల గురించి తెలియదు.. అప్పటికే కొన్ని బ్లాగులు చదివినా ఆ బ్లాగర్లతో ఎలాంటి పరిచయం లేదు. 'ముందు మొదలు పెడదాం..అన్నీ అవే అర్ధమవుతాయి' అనుకున్నా.

గ్రీక్ అండ్ లాటిన్ లా అనిపించిన బ్లాగర్ గైడ్ నాలుగైదు సార్లు చదివి, అప్పటికే ఉన్న జిమెయిల్ ఐడీ సాయంతో బ్లాగు మొదలు పెట్టేశా..జల్లెడ, కూడలి తెలుసు కాబట్టి వాటిల్లో బ్లాగుని లంకె వేయమన్న చోట లంకె వేశా.. తదుపరి కర్తవ్యం? ...వీవెన్ గారినుంచి మెయిల్ వచ్చింది, బ్లాగుని స్వీకరిస్తున్నట్టు. నీళ్ళలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోచ దొరికిన ఫీలింగ్. ఇక ఆయన్ని మెయిళ్ళతో విసిగించడం మొదలు పెట్టాను.

ప్రతి టపాకీ లంకె వేయాలా? వేరే వెబ్సైట్ల లంకెలు ఇవ్వడం ఎలా? ఇలాంటి సందేహాలు. ఆయన చాలా ఓపిగ్గా స్పందించారు. ధన్యవాదాలు వీవెన్ గారూ.. నా రాతలతో జనాల తలరాతలు మార్చెయ్యాలి లాంటి అజెండాలు ఏవీ లేవు కాబట్టి ఫలానా విషయాలు మాత్రమే రాయాలి అని అనుకోలేదు. ఇది నా డైరీ.. కాకపొతే మరికొందరు చదివేందుకు అందుబాటులో ఉంచుతున్నాను.. వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు.. అప్పుడూ ఇప్పుడూ నా అభిప్రాయం ఇదే.

బ్లాగు లోకం యావత్తూ నా బ్లాగు ముందు క్యూలు కట్టాలని కోరుకోలేదు కానీ, అసలు ఎవరైనా నా బ్లాగు చూస్తున్నారా అన్న కుతూహలం.. ఒకరిద్దరితో మొదలైన స్పందన నెమ్మదిగా పెరిగింది. టెక్నికల్ విషయాలకి సంబంధించి బ్లాగరు 'మధురవాణి' కొన్ని సూచనలు చేశారు. అప్పుడప్పుడూ వ్యాఖ్యలతో పలకరించేవారు. తర్వాత 'అనంతం' ఉమాశంకర్ గారు, 'కొత్తపాళీ' గారు పరిచయమయ్యారు. 'మృచ్చకటికం' సంస్కృత నాటకం చదవగలిగానంటే అది బ్లాగు వల్లే.

నీళ్ళు లేక ఎండిపోతున్న మా గోదారిని తల్చుకుని నేను రాసిన టపా 'చీకట్లో గోదారి.' ఇలా మొదలు పెట్టాలి, ఇలా ముగించాలి లాంటివి ఏమీ అనుకోకుండా అలా అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను..పావు గంటలో రాయడం పూర్తయ్యింది. ఇప్పటికీ ఆశ్చర్యమే.. ఇది నేనే రాశానా? అని. 'మీలో చాలా భావుకత ఉంది' అని వ్యాఖ్య రాశారు 'మనసులో మాట' సుజాత గారు. నేను నాకు కొత్తగా పరిచయం అయ్యాను..బ్లాగు వల్ల.

'పరిమళం' గారు 'పద్మార్పిత' గారు 'హిమబిందువులు' చిన్ని గారు ఇలా ఒక్కొక్కరే పలకరించడం మొదలు పెట్టారు. బ్లాగు ద్వారానే 'నిషిగంధ' ఆవిడ కవిత్వం ఇంకా 'కౌముది' అలాగే 'స్నేహమా' రాధిక గారి కవితలూ పరిచయమయ్యాయి. 'పర్ణశాల' కత్తి మహేష్ కుమార్, 'విశ్వామిత్ర' శ్రీనివాస్ పప్పు, 'నాన్న' భాస్కర్ రామరాజు, 'హృదయస్పందనల చిరు సవ్వడి' భాస్కర్ రామి రెడ్డి, 'ఏటిగట్టు' శేఖర్ పెద్దగోపు, 'జాజిపూలు' నేస్తం, 'సరిగమలు' సిరిసిరిమువ్వ, 'చైతన్యం' చైతన్య 'నాబ్లాగు' సునీత, 'మరువం' ఉష, 'కృష్ణ పక్షం' భావన, 'నేను-లక్ష్మి' లక్ష్మి గార్లు అప్పుడపుడూ పలకరించే అతిధులు.

కొన్నాళ్ళకి 'చిన్నమాట' భవాని, 'నాలోనేను' మేధ, 'అరుణమ్' అరుణ పప్పు, 'నాతోనేను నాగురించి' వేణూ శ్రీకాంత్ 'అక్షరాపేక్ష' మెహర్ గార్లూ ఇంకా మరికొందరు బ్లాగర్లూ, బ్లాగు పాఠకులూ ఓ లుక్కేయ్యడం మొదలుపెట్టారు. నా స్నేహితుల్లో నేనో బ్లాగు రాస్తానని తెలిసిన వాళ్ళు కేవలం నలుగురు. వారిలో ఒకరు ఇప్పటివరకూ నా బ్లాగుని చూడలేదు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు మాత్రం క్రమం తప్పకుండా చదువుతూ అభిప్రాయాలు చెబుతున్నారు.. గడిచిన ఐదు నెలల కాలంలో అనేకమంది బ్లాగ్మిత్రులని సంపాదించుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తోంది.

నా బాల్యం, నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, అప్పుడప్పుడు నన్ను వెంటాడే ఆలోచనలు ఇవన్నీ పదిమందితో పంచుకోడానికి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొడానికి వేదిక కల్పించింది నా బ్లాగు. చాలా రోజుల క్రితం చదివి దాచుకున్న పుస్తకాలూ, చాలా ఏళ్ళ క్రితం చదివిన కథలూ బ్లాగు కోసం మళ్ళీ చదవడంలో ఆనందాన్ని అనుభవించాను. 'అమ్మ చెప్పిన కబుర్ల'ని గుర్తు చేసుకున్నాను. బ్లాగ్మిత్రుల ద్వారా చదవాల్సిన పుస్తకాల గురించి, చూడాల్సిన సినిమాలగురించితెలుసుకున్నాను. 'నవతరంగం' నాకు బ్లాగుల్ని పరిచయం చేస్తే, బ్లాగు నన్ను 'పుస్తకం' కి పరిచయం చేసింది.

ఓ రోజు ఉదయాన్నే నా బ్లాగుని గురించి పరిచయ వ్యాసం ప్రచురించింది 'ఈనాడు.' ఆ పత్రిక చదివే వాళ్ళలో బ్లాగుల గురించి తెలిసిన వాళ్ళందరి దృష్టికీ వెళ్ళింది నా బ్లాగు. అతిధులూ, మిత్రులూ ఒక్కసారిగా పెరిగారు. ఏ బ్లాగరికైనా ఇది సంతోషం కలిగించే పరిణామమే..ఇలాంటివి అస్సలు ఊహించని నాకు ఇదో పెద్ద సర్ప్రైజ్. మిత్రులు తమ బ్లాగుల్లోనూ, నా బ్లాగులోనూ అభినందనలు కురిపించారు. సర్వదా కృతజ్ఞుడిని. కొత్తగా పరిచయమైన బ్లాగ్మిత్రులు పాత టపాలు చదివి అభిప్రాయాలు చెబుతున్నారు. బ్లాగు చదువుతున్న, అభిప్రాయాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా వందనాలు.

నేను ఎలాంటి ప్రణాళికా లేకుండా మొదలు పెట్టానీ బ్లాగుని.. నాకు ఏ విషయాన్ని గురించి రాసుకోవాలనిపిస్తే ఆ విషయాన్ని రాస్తూ ఇప్పటికి వంద టపాలు పూర్తి చేశాను. ఇది నా గమ్యం కాదు, ఒక మజిలీ. నా అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు కాదు..వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాదు.. అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి. ఇంకా ఎన్ని టపాలు రాస్తాను అన్న సందేహం ఇప్పుడు నాకు లేదు.. ఎందుకంటే రాయాలనిపించి నన్నాళ్ళు, పంచుకునేందుకు కబుర్లు ఉన్నన్నాళ్ళు రాస్తూనే ఉంటాను. ప్రస్తుతానికి మాత్రం ఒక చిన్న విరామం.. అతి త్వరలోనే మళ్ళీ కలుస్తాను.

32 కామెంట్‌లు:

  1. తప్పక తిరిగి రండి.
    పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుని మరీ తిరిగి రండి. చాలా మంది వెయిటింగ్ :)

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు, వంద టపాలు పూర్తి చేసిన మీకు శుభాభినందనలు. విరామం తీసుకుని మరిన్ని మదిని దోచే టపాల మూటతో మళ్ళీ వెంటనే వచ్చేయండి.

    రిప్లయితొలగించండి
  3. congrats murali garu...takkuva time lo entho sadincharu...mee next post kosam waiting..

    రిప్లయితొలగించండి
  4. మురళి గారూ, వంద టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు చెప్పాలా లేక ఇలా హఠాత్తుగ్గా విరామం ప్రకటించేసినందుకు బాధ పడాలా? ఏమీ తేల్చుకోలెని సంగ్దిగ్ధం లో పడెయ్యటం న్యాయమా?? సరే త్వరగా వెనక్కి వచ్చి ఇంకొక సెంచరీ కొట్టెయ్యండి

    రిప్లయితొలగించండి
  5. Oh!!! Century over!!!
    Congrats Murali garu...
    Wishing you all the best ahead...
    Waiting for more and more posts from you..

    P.S. I couldnt Type in Telugu Here Murali garu!.. Even, last time also, same thing happened -- Please check your settings once...

    రిప్లయితొలగించండి
  6. ప్రతి రోజూ మీ టపా చదవడానికి అలవాటు పడి పోయిన నాలాటి వారి కోసం ఈ విరామాన్ని అతి కొద్ది రోజులకు, వీలైతే కొన్ని గంటలకు :-) కుదించేసేసి త్వరలో మళ్ళీ మొదలు పెట్టేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్షా...

    రిప్లయితొలగించండి
  7. tondarlo dani pakkana inko marinni sunnalu churchagalani bhavistu....

    రిప్లయితొలగించండి
  8. మురళీ అభినందనలు.ఎక్కువ విరామం తీసుకోకు.గమ్మున వచ్చెయి,వినాయక చవితికి పత్రి కోసుకోడానికి మన తోటల్లోకి వెళ్లాలి మనం...

    రిప్లయితొలగించండి
  9. chinnappudu pustakallo dachukunnano ledo nemali kannu telidu kani ippudu matram chala jagrattaga dachukuntunna..
    prati roju okasari terichi choosukuntunna(chaduvukuntunna)..

    13 rojula kritaniki ippatiki yentha marpu..!!

    manasulo bhavalaki akshara roopam ivvagala saamardhyam meelanti kontha mandiki maatrame saadhyam..

    murali garu mee blog chaduvutoo chaduvutoo nannu nenu malli educate chesukuntunna..
    innallu oka craving vundedi naku..kani adi yela tagginchukovalo telisedi kadu..ippudu mee blog parichayamayyaka yenno yennenno telusukuntunna..manchi manchi blog mitrulni choostunna(chaduvutunna)...

    kevalam feel cheyyadame kani express cheyyaleni nenu mee chalava valla konnallaki na feelings anni matallo cheppagalananna nammakam vachindi..

    muraligaru...meeku nenu aajanmantham krutagnuralini..

    రిప్లయితొలగించండి
  10. మురళి చాలా సంతోషం అదే టైం లో కన్నీరు, ఆనంద బాష్పాలు అనుకుంటా... చాలా సున్నితం గా చెప్పేరు వందనాలు..
    వందనాలు వందనాలు తలపుల హరి చందనాలు..

    రిప్లయితొలగించండి
  11. ento murali garu.. me tapa chusaka naku kuda oka blog modalupettalani undi.. but naaku meelage chala questions... endukante nenu kotta kada.... avasaramite mee salahani adugutaa.. help chestaru kaduu....

    రిప్లయితొలగించండి
  12. మొదటి నాలుగు పేరాలు నేను బ్లాగు ప్రారంభించినప్పుడు నేను అనుకున్నట్లు గానే ఉన్నాయండీ.ఇంకా నేను కుస్తీలు పడుతూనే ఉన్నాను.
    బాగుంది మీ వందనం!!
    అరే ,మరి రోజూ మీ టపాలు ఇక కనిపించవా?

    రిప్లయితొలగించండి
  13. Congratulations and expecting many more useful posts from you.

    Unable to post comment in telugu.

    రిప్లయితొలగించండి
  14. మీ మొదటి పోస్టు నాకిప్పటికీ బాగా గుర్తు. ఆరోజు అది చదవగానే నాకు కలిగిన ఫీలింగ్, ఇదొక మంచి చదవదగ్గ బ్లాగు అవుతుంది అని. ఎందుకలా అనిపించిందో నాకే తెలీదు.రాజకీయ పరిభాషలా ఉండొచ్చుగాని, మీ బ్లాగు చదివి చాలా తెలుసుకున్నాను, చదవాల్సిన పుస్తకాలు కానీండి, మరింకేదైనా కానీండి..


    "నా అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు కాదు..వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాదు"

    వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలే అందంగా ఉంటారా? తనమానాన తనపని చేసుకొనివెళ్ళే ఆడపిల్లలు అంతకంటే అందంగా ఉంటారు. :)

    అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి.

    మీలో ఈ భావన ఉన్నంతకాలం మీకు అలుపే ఉండదు, రాసుకున్న అక్షరాలను మళ్ళీ మళ్ళీ చదువుకున్నప్పుడు కలిగే ఆ ఆనందమే వేరు. మీరు ఆ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించాలని ఆశిస్తూ..

    రిప్లయితొలగించండి
  15. మురళీ, ముందుగా 100 టపాలకీ అభినందనలు. ఇది మీకు మీరుగా తీసుకున్న స్వనిర్ణయమైతే విరామాన్ని చక్కగా ఆస్వాదించి మళ్ళీ క్రొత్త పుంతలు తొక్కే రచనలతో రండి. లేదూ ఏదైనా విపత్కర పరిస్థితైతే మాత్రం అది త్వరగా మిమ్మల్ని వీడిపోయి మీ స్తబ్థద తొలగిపోవాలని ఆశిస్తూ.. ఉష.

    రిప్లయితొలగించండి
  16. మీ వందవ టపా చదివి శుభాకాంక్షలు చెబుదామని
    చివరి వరకూ ఆసక్తిగా చదివిన నాకు చివర తగిలింది షాక్ !
    మీ ఉపోద్ఘాతమంతా విరామం గురించి చెప్పడానికా ?
    విరామం చిన్నదే అన్నారు కనుక కొంత ఊరట ...
    మీ అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు,
    వెన్నెల్లోఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాకపోయినా
    ఈ బ్లాగ్ వనంలో వికసించే అరుదైన పుష్పాలు ..
    వాటి పరిమళాల కోసం ఎదురుచూసే మా అందరి కోసం
    మీ విరామాన్ని త్వరలోనే విరమించుకుంటారుగా ?
    మీ కొత్త టపాను స్వాగతించడానికి మేం సిద్ధం !

    రిప్లయితొలగించండి
  17. మురళీ గారూ,
    వంద టపాల తరవాత నెమలికన్ను మీకిచ్చిన అనుభూతి బావుందన్న మాట. అభినందనలు.
    అసలు మేము మీకు వందనాలు చెప్పాలి. ఎందుకో తెలుసా..ఇంత చక్కని టపాలతో మమ్మల్ని అలరించినందుకు, మీ బ్లాగు చదివినప్పుడల్లా ఒక చక్కని అనుభూతిని కలిగించినందుకు. మీ నెమలి కన్ను ప్రయాణం ఇలాగే అప్రతిహతంగా సాగిపోవాలని, తద్వారా మంచి మంచి టపాలు వందలు వేలుగా మీ చేతి నుండి జాలువారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  18. ఇద్దరం ఒకేసారి మొదలు పెట్టాం బ్లాగులను చూడటం అని ఒకసారి నాతో మీరన్నారు గుర్తుందా.. కాని 100 టపాలతో బ్లాగ్లోకానికి అతితక్కువ కాలం లో చాలా చేరిక అయిపోయారు ..అభినందనలు మురళీగారు

    రిప్లయితొలగించండి
  19. @కొత్తపాళీ: వచ్చేశానండి.. ధన్యవాదాలు.
    @దొంగనా కొడుకు: ధన్యవాదాలు.
    @వినయ్ చక్రవర్తి గోగినేని: ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: వచ్చేశానండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @సిరిచందన: ధన్యవాదాలు
    @లక్ష్మి: చిన్న విరామమేనండి.. అది కూడా పూర్తయ్యింది.. ధన్యవాదాలు.
    @మేధ: మార్చానండి.. ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నా.. ఒకవేళ ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: అతి చిన్న విరామం అని చెప్పాను కదండీ.. చెప్పిన ప్రకారం వచ్చేశాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @love, sriatluri: ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: వినాయక చవితికన్నా ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి..అందుకే వచ్చేశా.. ధన్యవాదాలు.
    @ప్రణీత: చాలా సంతోషంగా ఉండండి.. ఏం చెప్పాలో కూడా అర్ధం కావడం లేదు.. ధన్యవాదాలు.
    @భావన: ఇష్టమైన పాటని గుర్తు చేశారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @స్వాతి: మరి ఇంకెందుకు ఆలస్యం..మొదలు పెట్టెయ్యండి.. మేమందరం ఉన్నాం.. ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.
    @తృష్ణ: ఇకనుంచీ కనిపిస్తాయండీ.. ధన్యవాదాలు.
    @సునీత: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @సిరిసిరి మువ్వ: మరి కొందరు బ్లాగు మిత్రుల నుంచి కూడా ఇదే కంప్లైంట్ వచ్చిందండి.. సెట్టింగులు మార్చాను.. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దయచేసి చెప్పండి. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: 'అందరికీ చదవడానికి అందుబాటులో ఉంచాను కదా.. ఎవరికైనా ఒక్క విషయమైనా పనికొస్తోందా?' అన్న సందేహాన్ని పటాపంచలు చేశారు.. ధన్యవాదాలు.
    @ఉష: ఒక చిన్న వ్యక్తిగత కారణం అండి.. ఇప్పుడు మళ్ళీ 'బ్లాగు జీవన స్రవంతి' లోకి వచ్చేశాను. ధన్యవాదాలు.
    @పరిమళం: "ఈ బ్లాగ్ వనంలో వికసించే అరుదైన పుష్పాలు .." చాలా పెద్ద ప్రశంస అండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @మధురవాణి: మీలాంటి బ్లాగు మిత్రులందరి సహకారం, ప్రోత్సాహం అండి.. ధన్యవాదాలు.
    @నేస్తం: ధన్యవాదాలు.
    @హరికృష్ణ: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. మీ పదాహారణాల సంస్కారానికి మేము చెప్పాలి వందనాలు.

    రిప్లయితొలగించండి
  26. @సుబ్రహ్మణ్య చైతన్య మామిడిపూడి: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి