చాలా రోజుల తరువాత వీధిలో ఉదయపు కోలాహలం మొదలయ్యింది. ఎనిమిదయ్యిందో లేదో ఆటోలు వచ్చేశాయి. బద్ధకానికి అలవాటు పడ్డ పిల్లలు ఒక్కసారి పాతరోజులు గుర్తు చేసుకుని "ఫైవ్ మినిట్స్" అంటూ ఆటో అంకుల్ ని బతిమాలుకున్నారు. యూనిఫాం, బ్యాగ్, షూస్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ కొత్తవే. అమ్మకీ నాన్నకీ బై చెప్పేసి హడావిడిగా ఆటో ఎక్కేశారు.
దాదాపు నెలన్నర వేసవి సెలవుల తర్వాత స్కూళ్ళు తెరిచారు. చిట్టి తల్లులకీ, బుజ్జి నాన్నలకీ అర్ధరాత్రి వరకూ టీవీ చూడడానికీ, బారెడు పొద్దెక్కే వరకూ మంచం దిగకుండా మారాం చేయడానికీ ఇంక అవకాశం లేదు. 'పొద్దున్న మనము లేవాలి' పద్యం వచ్చినా, రాకపోయినా ఆ ప్రకారం నడుచుకోవాల్సిందే. అధికారికంగా స్కూళ్ళు తెరవాల్సింది ఇవాళే అయినా, చాలా కాన్వెంట్లలో ఈసరికే పాఠాలు మొదలైపోయాయి. ఏవో కొన్ని ప్రైవేటు స్కూళ్ళు మాత్రం ఇవాల్టివరకూ ఓపికపట్టాయి. ఈ పిల్లలకి ఇంక చదువుకి తప్ప వేరే ఎందుకూ టైం దొరకదు, మళ్ళీ వేసవి వరకూ.
సర్కారు స్కూళ్ళ విద్యార్ధులకి ఎప్పటిలాగే సమస్యలు స్వాగతం చెబుతున్నాయి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పాఠ్య పుస్తకాలింకా సిద్ధం కాలేదు. కొన్ని ప్రింటింగ్ దశలో ఉండగా, మరి కొన్ని ఇంకా శ్రీకారం దగ్గరే ఉన్నాయని సర్కారీ పత్రిక మొదటి పేజిలో ప్రకటించింది. కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న డీఎస్సీ పరీక్ష ఎట్టకేలకి మొన్ననే పూర్తయ్యింది. పిల్లల అదృష్టం బాగుండి అన్నీ సక్రమంగా జరిగితే ఏ అర్ధ సంవత్సర పరిక్షల నాటికో కొత్త మేష్టార్లు స్కూళ్ళకి చేరతారు.
చెట్ల కిందే పాఠాలు చెప్పే ఆధునిక గురుకులాల్లో చదువుతున్న పిల్లలకి ఈ సంవత్సరం కూడా 'వానాకాలం చదువు' తప్పక పోవచ్చు. తరగతి గదులు కట్టడం కోసం ప్రభుత్వం 'సర్వ శిక్ష అభియాన్' కింద నిధులు విడుదల చేసింది. పిల్లలకి తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినే అదృష్టం లేకపోవడం వల్ల ఆ నిధులు కాస్తా రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోయాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి పధకం పేరు 'రాజీవ్ విద్యా మిషన్' అని మార్చేసింది. పేరు బలం గొప్పదైతే ఈసారి పిల్లలకేమైనా మేలు జరగొచ్చు.
ఈమాత్రం చదువుకి కూడా నోచుకోని పిల్లలున్నారు. వాళ్ళకోసం ఐక్యరాజ్య సమితి ఇవాల్టి రోజుని 'బాలకార్మిక వ్యతిరేక దినం' గా జరుపుతోంది. ఇళ్ళలోనూ, పొలాల్లోనూ, హోటళ్ళ లోనూ ఇంకా శివకాశి లాంటి చోట్లా రూపాయికీ రెండు రూపాయలకీ కూలీ చేస్తున్న యెంత మంది పిల్లలకి ఇవాళ తమ రోజు అన్న సంగతి తెలుసో? ఇలాంటి పిల్లలు ఎందరు ఉన్నారు? అని అడగడం పాపం. సర్కారు ఒక లెక్క, స్వచ్చంద సంస్థలు మరో లెక్కా చూపిస్తాయి. 'సర్కారు పరువు పోతుందనే భయంతో తక్కువ లెక్క చూపుతోంది' అంటాయి స్వచ్చంద సంస్థలు. 'సంస్థలే ప్రాజెక్టుల నిధుల కోసం పిల్లల సంఖ్యని ఎక్కువ చేస్తున్నాయి' అంటుంది సర్కారు. ఈ లెక్క తేలేది కాదు.
వీళ్ళందరి గొడవా మనమెక్కడ పట్టించుకోగలం? ఎవరి అదృష్టం వాళ్ళది. ప్రైవేటు స్కూళ్ళు ఇంత చక్కగా చదువు చెబుతోంటే ప్రభుత్వం స్కూళ్ళు నడపడం ఎందుకు? డబ్బు దండుగ.. తల్లిదండ్రులందరూ పిల్లల్ని స్కూళ్ళలో వెయ్యొచ్చు కదా..పనికి పంపడం ఎందుకు? అంత తిండి పెట్టలేని వాళ్ళు, చదివించలేని వాళ్ళు కనడం ఎందుకో? ఏం.. మనం మన పిల్లల్ని చదివించడం లేదూ... పాపం ప్రభుత్వం మాత్రం ఎన్నని చేస్తుంది? దానికెన్నెన్నిపనులూ.....
మేము ఒక మురికివాడలో ఆరోగ్యసేవలు(ఏదో మా పరిధిలో) అందించేవాళ్ళం. ఓరోజు ఒకావిడకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోమని అడిగితే, ఆ ఇంట్లో ముసలావిడ మమ్మల్ని తిట్టి మా ఎదురుగానే ఆవిడతో "నువ్వుగానీ ఆ ఆపరేషను చేసుకుంటే ఇంటి నుండి పంపించేస్తా" అని అంది. ఆవిడకు అప్పటికే ఇద్దరు కొడుకులున్నారు. కూతురు కోసం మూడోసారి కనాలట. అంతమందిలో(60 కుటుంబాలు) ఒక్కరు కూడా పిల్లల్ని చదివించేవారు కాదు. చదివించినా తొమ్మిదో తరగతి నుండీ పనిలో పెట్టేసేవారు. కేవలం పని చేసి సాయం చేస్తారనే పిల్లల్ని కంటున్నారేమోననిపించేది.
రిప్లయితొలగించండిme digin marchandi
రిప్లయితొలగించండివీళ్ళందరి గొడవా మనమెక్కడ పట్టించుకోగలం? ఎవరి అదృష్టం వాళ్ళది. ప్రైవేటు స్కూళ్ళు ఇంత చక్కగా చదువు చెబుతోంటే ప్రభుత్వం స్కూళ్ళు నడపడం ఎందుకు? డబ్బు దండుగ.. తల్లిదండ్రులందరూ పిల్లల్ని స్కూళ్ళలో వెయ్యొచ్చు కదా..పనికి పంపడం ఎందుకు? అంత తిండి పెట్టలేని వాళ్ళు, చదివించలేని వాళ్ళు కనడం ఎందుకో? ఏం.. మనం మన పిల్లల్ని చదివించడం లేదూ... పాపం ప్రభుత్వం మాత్రం ఎన్నని చేస్తుంది? దానికెన్నెన్నిపనులూ.....
రిప్లయితొలగించండికొంచం అటు ఇటు గా ఇలాంటి అభిప్రాయం నేను ఎన్ని సార్లు విన్నానో... ఇంకా కొంత మంది చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లు వాదిస్తారు... మళ్ళీ అనిపిస్తుంది చదివి మనం చేసే కూలి చదవక వాళ్ళు చేసే కూలి అంతా ఒకటే లే అని పలాయన వాదమేమో మరి..
"పేరు బలం గొప్పదైతే ఈసారి పిల్లలకేమైనా మేలు జరగొచ్చు".
రిప్లయితొలగించండిమేలు జరగాలని ఆశిద్దాం!!!!
ప్చ్ ...కాల చక్రం ఆగదు ...మరో తరగతి గది ...
రిప్లయితొలగించండిభావనగారు చెప్పినట్లు చదివి మనము చేసే కూలీ చదవక వాళు చేసే కూలీ ఒక్కటి కాదు చదువుకొంటె మీకు ఎక్కువ కూలీ వస్తూంది అదే చదువు విలువ తెలియజేస్తుంది. చదువందరి ప్రాధమిక హక్కు.
రిప్లయితొలగించండిమా అమ్మాయి ఇవాళే మొదటిసారి క్యారేజీ పట్టుకేళ్ళింది.ఏమి తింటుందో ఏమో!?
రిప్లయితొలగించండిచిన్నప్పుడు మా ఇంట్లో పనిమనిషికి అయిదుగురు పిల్లలు.అందరినీ పనిలో పెట్టేసింది.చదివించవా అంటే"ఖర్చు ఎవరు భరిస్తారమ్మా?పనిలోకెళ్తే అందరి సంపాదనతో ఇల్లు గడుస్తుందమ్మా."అనేది.పనులుచేసి రెండువేలు సంపాదిస్తోందని పెద్దకూతురికి పెళ్ళిసమ్మంధాలు కూడా చూసేది కాదు.
hum..మంచి పోస్ట్
రిప్లయితొలగించండి"ఛోటూ" లేని ఇరానీకేఫ్ ఉంటుందా హైదరాబాదులో? నేను హైదరాబాదులోఉన్నప్పుడు రోజూ పొద్దున్నే ఠంచనుగా ఆరింటికి నేనుండే వీధి మలుపులోఉండే ఇరానీ కేఫ్‌లో చాయ్ తాగేవాడిని. పొద్దున్నే ఐదున్నరకి లేచి పనిలోకొచ్చే ఆ పదేళ్ళబ్బాయి నేనురాత్రి పదిగంటలపుడు తిరిగి నారూముకెళ్ళే వరకు పనిచేస్తూనేఉండేవాడు. పేదరికాన్ని అరికట్టలేనప్పుడు ఎన్నిచట్టాలున్నా ఏమిలాభం ?
రిప్లయితొలగించండిభవానీ చేసిన పనే నేను చేసినప్పటి అనుభవం, ఒక స్త్రీ, బహుశా మద్యం కూడా తీసుకునివుండొచ్చు, నా మీద మీదకి వచ్చి తోసి, చాలా పరుష భాషలో నిందించింది. అంతా వినోదం చూసారే కానీ ఏ ఒక్కరూ నన్ను లేపే ప్రయత్నం కూడా చేయలేదు. నిరక్ష్యరాస్యత ఒక కారణం. ఎక్కువమంది పిల్లలు ఎక్కువ ఆదాయం అనే కానీ demand and supply లో సమతుల్యం పోవటానికి జనాభా పెరుగుదల ఒక కారణం అని వారికి తెలియదు. తెలియచెప్పేంత మంచి నాయకులు మనకు లేరు. నా పిల్లలు ఇక్కడ పబ్లిక్ స్కూల్లోనే చదువుతారు. చాలా మంది మనవాళ్ళు నన్ను అడుగుతారు కూడా "బాగా చెప్తారా? మీ పిల్లలకి మళ్ళీ మీరు ఇంట్లో చెప్పుకుంటారా? వాళ్ళు అంత బాగా ఎలా చదువుతున్నారు" అని. ప్రభుత్వపాఠశాల పట్ల మన మనసుల్లో తిష్ఠ వేసుకుపోయిన అభిప్రాయానికి ఇదే గుర్తు. భావన, రావు, తృష్ణ, ఉమాశంకర్ గార్ల అభిప్రాయాలకి నాకు కూడా ఓ డిట్టో కొట్టుకోండి. త్వరలో నేనొక టపాగా వ్రాద్దామనుకున్నాను, ఇది నాందీ కావచ్చు. ఎప్పటినుండో మనసులో వున్న సంకల్పాన్ని మేము ఒక కార్యక్రమంగా తీర్చిదిద్దుతున్నాము, మీ చివరి పేరాలోని కొన్ని ప్రశ్నలకి సమాధానంగా మా janyaa.org చివరిగా Every child is a gift in strengthening our community, our humanity. Children are our hope for the future. ఈ మాటల్లో ఇక్కడి కొందరి మిత్రులకైన తెలిసేవుంటుంది నా ఆత్మ దాగుందని. 06/13-15 తారీఖులతో ఎంతో ముడిపడున్న మన పాఠశాల అనుభవాలు ఓ సారి తిరగతోడుకుని, మా కృషిని కూడా ఇక్కడ ప్రకటించే అవసరం కల్పించిన దైవానికి, లౌకికంగా కారణమైన మురళీ గారికి నా కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండివిద్యా వ్యవస్థ మారాలంటే ముందు తల్లి తండ్రుల్లోని మార్పు రావాలి. ప్రభుత్వ పాఠశాలల సంగతి సరే .. మరి ప్రైవేటు పాఠశాలలు ఏమైనా తక్కువ తిన్నయా.. నిజంగానే వాళ్ళు నాణ్యమైన విద్యను అందిస్తున్నారా.. వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారు కాని..
రిప్లయితొలగించండిChild labor is not only a crime..it is a felony...we all are responcible for that...we are killing their future by that we are hampering the nation's growth....we are losing so many Einsteins, Tagores and Rahamans through child labor...
రిప్లయితొలగించండిఏదైతేనేమండి బడులన్నీ ఒక్కసారిగా చిలుకలు వాలిన చెట్లలాగా కళకళలాడుతున్నాయి. నాకు మాత్రం మా అమ్మకి ఫోన్ చెయ్యాలంటే సాయంత్రం దాకా అగాల్సిందే. ఇంతకాలం సెలవలు కాబట్టి ఓఫ్ఫిసేలో ఖాళీ ఉంటే కుదిరేదీ. ఇప్పుడు నేను ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వదు
రిప్లయితొలగించండి@భవాని: అక్షరాస్యత లేకపోవడం బాలకార్మిక సమస్యకి ఒక ముఖ్య కారణం అండి.. కుటుంబ నియంత్రణ అంటే ఏదో పాపం చేయడం అనుకునేవాళ్లు ఇప్పటికీ ఉండడం విషాదం. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ప్రయాణం: కొత్త డిజైన్ ఎలా ఉంటె బాగుంటుందో సూచించండి, అలాగే ఈ డిజైన్ తో ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా.. ధన్యవాదాలు.
@భావన: వీళ్ళు చదువుకుంటే వీళ్ళ తర్వాతి తరమైనా బాగు పడుతుంది కదండీ.. పల్లెలనే చూడండి.. ఒక తరంలో కూలి చేసి కష్టపడి పిల్లల్ని చదివించిన వాళ్ళ తర్వాతి తరాలు పెద్దలతో పోలిస్తే సౌఖ్యవంతమైన జీవితం గడుపుతున్నారు కదా.. ధన్యవాదాలు
@పద్మార్పిత: నేనూ ఆశావాదినేనండి.. చూద్దాం.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: తప్పదు కదండీ.. ధన్యవాదాలు.
@rao: నిజమేనండి.. ధన్యవాదాలు.
@తృష్ణ: ఆమె కొంచమైనా చదువుకుని ఉంటే పిల్లల్ని మరికొంచెం చదివించే ప్రయత్నం చేసి ఉండేదండి.. మీ అమ్మాయి స్కూలు అనుభవాలతో టపా రాస్తున్నారా ఇంతకీ? ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@నేస్తం: ధన్యవాదాలు.
@ఉమాశంకర్: నిజమేనండి.. కేఫ్ లు, హోటళ్ళలో మొదట పలకరించేది వీళ్ళే. ఇంకా మెకానిక్ షాపులు, బట్టల షాపుల్లో కూడా.. చట్టాలున్నాయి కానీ వాటిని అమలు పరిచే చిత్తశుద్ధి ఏ స్థాయిలోనూ కనిపించడం లేదండి.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@ఉష: మీ టపా కోసం ఎదురు చూస్తూ... ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కథాసాగర్: ప్రైవేట్ స్కూళ్ళదో పెద్ద కథ అండి.. ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.. ధన్యవాదాలు.
@సుబ్బు: నిజమేనండి.. పరిస్థితి మారుతుందని ఆశిద్దాం. ధన్యవాదాలు.
@Subrahmanya Chaithanya Mamidipudi:'చిలకలు వాలిన చెట్టు' యెంత చక్కని పోలిక! ...ధన్యవాదాలు.
"సర్కారు స్కూళ్ళ విద్యార్ధులకి ఎప్పటిలాగే సమస్యలు స్వాగతం చెబుతున్నాయి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పాఠ్య పుస్తకాలింకా సిద్ధం కాలేదు."
రిప్లయితొలగించండిఎందుకు ప్రతిసారీ సర్కారీ పుస్తకాల గురించి ఇంత రాద్దంతమో నాకర్ధం కాదు. పోయిన ఏడాది పుస్తకాలను ఈ ఏడాది ఎందుకు ఉపయోగించ కూడదో నాకర్ధం కాదు. ప్రతి ఏడాది సిలబుస్ మారుతోందా అంటే అది లేదు. పోయిన ఏడాది కంటే ఎక్కువ మంది పిల్లలుంటే అనొచ్చు, అప్పుడు అదనపు పుస్తకాల కోసం సర్కారు పైన ఆడరపడటం సబబు. ఈ పని వల్ల పుస్తకాలను జాగ్రత్తగా వుంచుకునేల మన పిల్లలను పురమాయిస్తే. ప్రతి వస్తువుకు యెంత విలువ ఇవ్వాలో వాళ్ళకి చిన్నప్పుడే తెలిసి వస్తుంది అది భవిష్యత్తులో చాల వుపయోపడుతుందనుకుంటా. టీచర్స్ కి కూడా చదువే కాకుండా కొన్ని మంచి విషయాలు నేర్పాలన్న బాధ్యతా తెలిసి వస్తుంది. మొదటి సారి తపాలానే ఇంత పెద్దగ రాసినందు ఏమి అనుకోవద్దు. అన్నింటికీ వేరే వారి పైన ఆధార పడే గుణం నాకు నచ్చాడు అందుకే ఇది రాసా. బై డి వే..మీ బ్లాగ్ నాకు చాల నచ్చింది...కీప్ ఇట్ అప్ దీన్ని ఇలాగె పై పైకి తీసుకెళ్ళండి...సుభ దినం.....శేఖర్...
మీ పాయింట్ నాకు అర్ధమయ్యిందండి.. నేనూ ఇలాగే ఆలోచించాను చాలా రోజులు. కొందరు ఉపాధ్యాయులతో మాట్లాడాక విషయం కొంచం అర్ధమయ్యింది. ఒకసారి వచ్చిన పుస్తకాలను అవసరం తీరాక అయినా సరే తిరిగి ఇవ్వడానికి చాలా మంది పిల్లలు/వాళ్ళ తల్లిదండ్రులూ ఇష్టపడరు. వానల్లో తడుస్తూ చదువుకునే పిల్లలు పుస్తకాలు భద్రంగా దాచుకోడమూ సమస్యే. ఇంట్లో ఎలాఉన్నా, బళ్లోకి వెళ్ళే దారిలోనో వర్షం తప్పదు కదా. బుక్ బ్యాంక్ పథకం అమలు చేస్తే పుస్తకాల సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. కానీ పిల్లల నుంచి కలెక్ట్ చేయడం, భద్రపరచడం, మళ్ళీ తిరిగి పంపిణీ చేయడం లో చాలా ఇబ్బందులే ఉన్నాయి. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమురళి ఇది చూడండి నాకు బాగా interesting గా అనిపించింది. ఇక్కడ మా వూరికి దగ్గర లో ఇలాంటి స్కూల్ ఒకటి వుంది. మంచి ప్రయత్నం కదా..
రిప్లయితొలగించండిhttp://scienceintelugu.blogspot.com/2009/06/1_17.html
@భావన; నిజమేనండి..చాలా ఆసక్తికరంగా ఉంది..
రిప్లయితొలగించండిఇప్పుడే మీ పాత వ్యాఖ్య చూసాను.మా అమ్మయి స్కూలు కబుర్లతో మీ ’గంట మోగింది ’ కి 2రొజులముందరే ’నేనిప్పుడు యు.కె.జి' అనే టపా రాసాను.మీరు చూసారొ లేదో మరి.
రిప్లయితొలగించండి