గ్రీష్మ తాపానికి రోజంతా తల్లడిల్లిన ప్రకృతి సాయంత్రం కాగానే కొంత సేద తీరింది. మాడ్చే ఎండకి, వేడి గాలులకీ కొద్ది విరామం. రాత్రి గడిచే కొద్దీ వాతావరణం లో వేడి కొద్ది కొద్దిగా తగ్గుతోంది..సరిగ్గా నా అశాంతికి వ్యతిరేక దిశలో. నిన్నటి రోజంతా చికాగ్గానే గడిచింది.. ఇంటా, బయటా సమస్యలు.. చిన్న చిన్నవే అయినా మనశ్శాంతిని తగ్గించేవి. రాత్రి ఎవరితోనూ మాట్లాడాలనిపిచలేదు..రెండు మూడు పుస్తకాలు తిరగేసి చూశా.. ప్చ్..లాభం లేదు.
బాల్కనీ లో పచార్లు చేస్తూ యధాలాపంగా ఆకాశంలోకి చూశాను.. మామిడి చెట్టు కొమ్మల చాటు నుంచి నవమి చంద్రుడు పలకరించాడు. 'నవమి నాటి వెన్నెల నీవు..' పాట గుర్తొచ్చింది.. బుర్రలో ఓ మెరుపు మెరిసింది.. 'పాటలు వింటే..' ...రైట్ ...సమస్యకి సరైన పరిష్కారం అనిపించింది. ఓ కుర్చీ బయటికి లాక్కోడం తో పాటు, తలుపు నెమ్మదిగా దగ్గరికి లాగాను. ఇయర్ ఫోన్స్ తగిలించుకుని మొదటి పాట సెలెక్ట్ చేసుకున్నా.. 'ఓం నమః..' గీతాంజలి నుంచి..
ఎప్పుడు మూడ్ బాగోపోయినా వినే మొదటి పాట.. 'ఈ మంచు బొమ్మలొకటై...' జానకి గొంతు వినగానే మరో నిర్ణయం..కేవలం జానకి పాటలు మాత్రమే వినాలని. రెండో పాట 'ఆకాశం ఏనాటిదో..' ఈపాటని ఎప్పుడూ కూడా ఒక్కసారి మాత్రమే వినను. కనీసం రెండు మూడు సార్లు. పాట చివరికి వచ్చేసరికి ప్రతిసారీ ఒకటే అనుభూతి. ఎదురుగా జానకి ఉంటె ఆమెకి సాష్టాంగ ప్రణామం చెయ్యాలని. ఎన్ని గమకాలూ? ఎన్నెన్ని భావాలు? ప్రేమ, బాధ, విరహం, చిలిపిదనం, కరుణ..ఇన్ని రసాలనూ అలవోకగా పలికించే గొంతు.
చుట్టూ చీకటిగా ఉంది..గాలికి రెపరెపలాడుతున్న దీపం లా మబ్బు చాటు చంద్రుడు. ఎందుకో తెలీదు కానీ చెట్లన్నీ ఊపిరి బిగబట్టి నిలబడ్డాయి.. గాలిలేదు.. నేనింకా జానకి మాయలో పూర్తిగా చిక్కుకోలేదు.. ఎందుకంటే నాకు వినిపిస్తున్నవి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' పాటలు. ఈ పాటలు ఎప్పుడు విన్నా నాకు జానకి కన్నా శ్రీదేవే కళ్ళముందు నిలుస్తుంది. 'అందాలలో..' వింటుంటే దేవకన్యలా, 'ప్రియతమా..' వింటుంటే పిలక జడతో, 'యమహో..' పాటకి ఎల్లో డ్రెస్ తో స్టెప్పులేస్తో..
వీటిల్లో 'ప్రియతమా..' మాత్రం పూర్తిగా జానకి మార్కు పాట. విరహం, వేదన కలగలిపి వినిపిస్తాయి ఈ పాటలో. ఒక్కసారిగా పిల్ల తెమ్మెర స్పృశించిన అనుభూతి. నిజమేనా? లేక నా భ్రమా? చెవుల్లో జానకి హమ్మింగ్. 'మౌనమేలనోయి...' పాట.. డౌటే లేదు.. పడిపోయా ఆవిడ మాయలో.. 'ఇది యేడడుగుల..వలపూ మడుగుల..' ...నేనెక్కడున్నాను? ...తర్వాతి పాట.. ఏడేడు లోకాల్లో ఎక్కడున్నా వెంటాడే పాట.. 'మరుగేలరా..ఓ రాఘవా..' 'నిన్నేగాని మదిని ఎన్నజాల నొరుల..' నా చెవుల్లో కేవలం నాకోసమే పాడుతున్నట్టుగా..
నేను నిద్రలోకి జారుకుంటానని సందేహం వచ్చినట్టుంది.. హై పిచ్ లో 'ఆ..అ అ ఆ..' అని మొదలు పెట్టి 'ఆకాశంలో ఆశల హరివిల్లు' చూపించేశారావిడ. ఒక్కసారిగా అలర్టై చుట్టూ చూశాను.. ప్రకృతి అలాగే ఉంది..ఆ చంద్రుడూ, మబ్బులూ.. తలలూపని చెట్లూ.. కళాతపస్వికి సెలవిచ్చేసి వంశీ తో కలిసి వచ్చేశారు జానకి, అల్లరి చేయడానికి..'హాయమ్మ హాయమ్మ హాయమ్మ..' అంటూ.. మౌనమేలనోయి అనీ మరుగేలరా అనీ అడిగింది ఈ అల్లరి గొంతేనా?
'మహర్షి' కోసం పాడిన 'కోనలో..' పాట.. అసలీవిడ పాడలేని పాట లేదేమో.. 'కోయిలమ్మ రాగం..కొండ వాగు వేగం..' ఇంకెవరిది.. ఈవిడ గొంతుదే.. అవుతూనే 'సితార' లో 'జిలిబిలి పలుకుల..' అసలు ఈ పాట మొదట్లో వచ్చే నవ్వు చాలు..'సితార' కథ మొత్తం చెప్పెయ్యడానికి..కాస్త బరువైన ఈ పాట అవ్వగానే అల్లరిపాట 'గోపెమ్మ చేతుల్లో..' అలు.. అరు.. ఇణి.. అనడం యెంత ముద్దుగానో.. ఆతర్వాత 'వయ్యారి గోదారమ్మ..' గోదారమ్మ సంగతేమో కానీ శ్రోతలకి మాత్రం కలవరమే..
అర్ధ రాత్రి దాటి చాలాసేపయ్యింది. 'శ్రీమన్మహారాజ..' వస్తోంది.. ఆపాలనిపించలా.. 'మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ' అనగానే 'నిజమే' అనిపించింది. పదహారేళ్ళ పిల్ల ప్రేమలేఖ రాసుకుంటే ఇంత సుకుమారంగానూ ఉండి తీరుతుందనిపించింది. ఆ పాటల మత్తులోనే హాయిగా నిద్రపోయాను.. ఆఫ్కోర్స్, ఉదయం లేచేసరికి సమస్యలు అలాగే ఉన్నాయి..ఐతే వాటిని పరిష్కరించుకునే మూడ్ కూడా ఉంది..
వారేవా!!!అన్నట్టు నా ప్రయత్నం, ఇలాంటిదే, ఫాలో అయ్యారా? http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.html
రిప్లయితొలగించండిఓం నమః ఎన్ని సార్లు విన్నా మరల కొత్తగానే అన్పిస్తుంది ,,అలానే "జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై " అన్న ప్రాణం ,,ఇది మీకిష్టం లేదా? ఇక "మౌనమేలనోయి ".....ఇక చెప్పవసరం లేదు ...మీరు చెప్పినవన్నీ నా మొబైల్ ల్లొ వున్నాయి ...మీ టపా బాగుంది .
రిప్లయితొలగించండిబావుంది జానకి గళానికి మీ నివాళి.
రిప్లయితొలగించండిజానకి కొన్ని మంచి పాటలు అద్భుతంగా పాడారు, ఒప్పుకుంటా, కానీ రేంజాఫ్ ఇమోషన్స్ ని పలికించడంలో సుశీల గొంతే నాకిష్టం.
ఇళయరాజా తెలుగు సినిమాల మీద విరుచుకుపడిన నేపథ్యంలో జానకి దశ తిరిగింది.
వావ్! నేనూ, మా తమ్ముడూ కూర్చుని మనసారా మాట్లాడుకునేది ఇలనే! పాటల గురించీ మరీ ముఖ్యంగా జానకి గారి గురించీనూ. ఇవాళ మీ టపా చూసి చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు....
రిప్లయితొలగించండిమురళిగారి బుర్రలో బోలెడన్ని ఆలోచనలు....
(జానకిగారు పాడలేని పాటలు లేవు, మీ దృష్టిని దాటిపోయిన విషయాలు కూడా ఏవీ లేవు!!
మీరు నిద్రలోకి జారుకుంటూ ఈ పాటల తారలను మాకోసం జారవిడిచినట్లున్నారు :-)
రిప్లయితొలగించండిఅసలు మెదడుకి సంగీతాన్ని మించిన గొప్ప ఊరట ఇంకోటి లేదేమో!
అన్వేషణ లో "కీరవాణి" పాట, మంచుపల్లకి లో "మేఘమా దేహమా" కూడా తప్పనిసరి గా గుర్తు వస్తాయి జానకి అంటే... ఇంక చాలా.... ఆ ఆ.... ఆ వున్నాయనుకోండి.. ఎంత చక్కటి గొంతు కదా.
రిప్లయితొలగించండిఈ రేయి తీయనిది.. :)
రిప్లయితొలగించండిబాగుంది. ఉదహరించిన పాటలన్నీ చెవుల్లో మోగాయి. జానకి గళం నాకూ చాలా యిష్టం. నాకు గాయకుల గొంతులు గుర్తుపట్టడం చాలా కష్టమెందుకో. అయితే, సుశీల గొంతైనా చెప్పలేనేమో గానీ, జానకి గొంతు వెంటనే గుర్తుపట్టేస్తాను. "మౌనమేలనోయీ" చాలా యిష్టం.
రిప్లయితొలగించండిbaagundi naaku jaanaki gaaru ante chaala ishtam.......especially mounamelanoyee song..........ante adi tane paadali........
రిప్లయితొలగించండిkottapaali gaaru compare cheyakandi......
kondaru konne paadagalaru.
sannajajuloy kannemojuloy song l.r gare padali suseela garu paadaleru.prati okkariki bounds vuntayi..........nenu ghantasala gari gurinchi teliyanapudu balu top anukune vaadini.........ippudu ghantasaala,anthe........
(ఇ-మెయిల్ ద్వారా చక్రి ఇలా అన్నారు)
రిప్లయితొలగించండిమురళి... మీరు వినే పాటలు సూపర్. నేను బ్యాచిలర్ గా వున్నప్పుడు డాబా మీద పడుకొని ఏసుదాస్ హిందీ పాటలు అన్మోల్ రతన్ టేప్ వినేవాణ్ని. ఆఫీసు ఒత్తిళ్ళు, చిరాకులు అన్నీ మరచిపోయేవాన్ని. ఏసుదాస్ పాటలతోపాటు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కీర్తనలు కూడా వినండి లైఫ్ ఇంత ప్రశాంతంగా వుంటుందా అనిపిస్తుంది. తెల్లారితే మళ్లీ ఒత్తిళ్ళు మాములేకదా..
చక్రి
మనసు గాయాన్ని మాన్పే మందు జానకి గారి గళం అన్నమాట !
రిప్లయితొలగించండిసమస్యలు , చికాకులూ ఎన్నున్నా పరిష్కరించుకొనే ఉత్తేజాన్ని కలిగించిన జానకి గారి గాత్రానికి నమస్సులు .ఇంత మంచి అనుభూతిని మాతో పంచుకున్నందుకు థాంక్స్ !అన్నట్టు 'ఓం నమః..' పాట నాక్కూడా చాలా ఇష్టం . 'ఓ పాపా లాలీ 'కూడా ....
@భాస్కర్ రామరాజు: మర్నాడు చూశా.. మాకప్పుడు అర్ధరాత్రి అవ్వడంతో గాఢ నిద్రలో ఉన్నాను.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిన్ని: ఇష్టం లేకపోవడం కాదండి.. నా ఇష్టమైన పాటల జాబితా చాలా పెద్దది.. ఆ సమయంలో విన్న పాటల గురించి మాత్రమే రాశాను.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: సుశీల-జానకి విషయంలో నేను చాలా పోరాటాలు చేసి (కుటుంబ సభ్యులు, మిత్రులతో) చివరికి ఎవరి ప్రతిభ వాళ్ళది, ఏ ఇద్దరినీ పోల్చకూడదు అనే కంక్లుజన్ కి వచ్చేశానండి.. ధన్యవాదాలు.
@మందాకిని: జానకి పాటల చర్చ దాదాపు ప్రతి ఇంట్లోనూ జరుగుతుందన్న మాట.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పద్మార్పిత: మీ వ్యాఖ్య నా కన్నా మీకే బాగా వర్తిస్తుందండి.. రవి గాంచని చోట కవి (కవయిత్రి కూడా) గాంచున్ అన్నారు కదా.. ధన్యవాదాలు.
@నిషిగంధ: నిజమేనండి.. ఇదే మొదటి సారి కాదు.. గతంలో చాలాసార్లు రిలీఫ్ పొందాను పాటలతో..
@భావన: నిజమేనండి.. ఆ జాబితా చాలా పెద్దది.. చెప్పాను కదా.. నేను ఆ టైం లో విన్న పాటల గురించి మాత్రమే రాసుకున్నా.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మేధ: నిజం అండి.. ధన్యవాదాలు
@మెహెర్: నాకు హిందీ వాళ్ళతో ఈ సమస్య వస్తుందండీ.. తెలుగు వాళ్ళు పర్లేదు.. ధన్యవాదాలు.
@వినయ్ చక్రవర్తి: ఆవిడ ఆ పాత పాడడం ప్రత్యక్షం గా చూశానండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చక్రి: జేసుదాసు నా అభిమాన గాయకుడండి.. వింటూ ఉంటాను ఆయన్ని కూడా. బాలమురళి పాటలు పెద్దగా లేవండి.. అప్పుడప్పుడు 'మౌనమే నీ భాష..' వింటూ ఉంటా..కొంచం ఓదార్పు..
@పరిమళం: ఒక విచిత్రం ఏమిటంటే నాకు ఓం నమః పాట వినడమే ఇష్టమండి.. చూడడం కాదు.. 'పుర్రెకో బుద్ధి' కదా:) ధన్యవాదాలు.
మరళీ.. మీ బ్లాగ్ భావుకంగా వుంది. శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఒక చిన్న ప్రశ్న ... మీది భీమవరమా. నేను ఎంసెట్ కోచింగ్ కోసం గుంటూరు లో వున్నపుడు పరిచయమైన మురళి ఏమో అని ఒక చిన్న ఆశ. అతనూ ఇలాగే మంచి అభిరుచి వున్న వాడు. తరువాత కెరీర్ తో పరుగులతో ... ఇప్పుడున్నంత కమునికేషన్ సదుపాయాలు ( సెల్ ఫోనేలూ, ఈమెయిల్ లూ ..) లేక నెమ్మదిగా కాంటాక్ట్ పోయినా .. ఆ భావుక పరిమళం ... అప్పట్లో అతను రాసిన వుత్తరాలూ అన్నీ నా మనసులో అలా వుంది పోయాయి. తెలుగు బ్లాగ్ లో మీ కామెంట్ చూసి.. ఇలా వచ్చాను. ఆ రోజుల్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
మూర్తి
@మూర్తి: మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందుకు బాధగా ఉందండి.. మీరు వెతుకుతున్న మురళి ని నేను కాదు. ఉత్తరాలు గుర్తుంచుకున్నారంటే ఆ మిత్రుడి పట్ల మీ అభిమానం అర్ధం అవుతోంది.. త్వరలోనే అతన్ని మీరు కలుసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.. నా బ్లాగు చదివి, వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపరవాలేదండి . అయినా అలాంటి భావుకతా..అభిరుచీ వున్న మరో మిత్రుడు ఈ అంతర్జాలం లో దొరికాడు కాబట్టి నిరాశ ఏమీ లేదు..మరింత ఆనందం గా వుంది. నేనెప్పుడూ ఆశావాదినే. శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమూర్తి
@మురళి, ఐతే ఇహనేం, మీకు రాజకీయాల్లో ప్రవేశించడానిక్కావల్సిన మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసింది! :)
రిప్లయితొలగించండి@మూర్తి: ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@కొత్తపాళీ: నేనేమీ ఒపీనియన్స్ చేంజ్ చేసుకోలేదే? నేను చేసిందల్లా జానకే గొప్ప గాయని అని పోట్లాడకుండా మౌనంగా ఉండడం... ఒకవేళ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం మొదట మిమ్మల్నే గుర్తు చేసుకుంటాను :):)
సినిమా పేరు తెలీదు గానీ "నిను వినా నాకెవ్వరూ" అంటూ బాలుతో కలిసి పాడిన పాటో? అన్వేషణ లో 'ఎదలో లయ" అంటు అడవి పిట్టతో పోటీపడిన పాటో?
రిప్లయితొలగించండి"ఈ ఎర్రగులాబీ విరిసినదీ తొలిసారీ" అని పాడుతుంటే శ్రీదేవి పరిగెత్తుకురాదూ మన ఊహల్లోకి?
"కన్నె పిల్లవని కన్నులున్నవని" అని పాడుతుంటే శ్రీదేవి కమల్ హాసన్ తో సహా వస్తుందీ సారి! తల్చుకుంటే ఊటబావిలో నీరులా ఊరిపోతున్నాయి పాటలు.
అయినా సుశీలనూ, జానకినీ పోల్చలేమండీ మురళీ! ఎవరి స్వరం వారిదే, ఎవరి మాధుర్యం వారిదే! మీ టపాలో చెప్పినట్లు "జానకి పాటలు తప్ప వినకూడదు" అనుకుంటూ ఉండగానే "నీ చెలిమీ నేడె కోరితినీ"అంటూ సుశీల వచ్చారనుకోండి, ఒట్టు తీసి గట్టున పెట్టాల్సిందే! మళ్ళీ ఇంకో పాటతో జానకి వస్తే అటు! రెండూ రెండు విభిన్న రుచుల అమృత భాండాలే! వాటిని మౌనంగా ఆస్వాదించడమే చేయాల్సిన పని!
అన్నట్లు జానకి త్యాగరాజ కీర్తనలు విన్నారా? ఇప్పుడు మార్కెట్లో దొరకట్లేదు(ట) రికార్డు. నా దగ్గరుందోచ్!
@సుజాత: జానకి పాటలు మాత్రమే వినాలి అనుకోగానే ఆవిడ పాటలు కొన్ని ఓ ఫోల్డర్ లో వేసుకున్నానండి... వినలేకపోయినవి చాలానే ఉన్నాయి. మీరుచెప్పినట్టుగా ఊట ఊరుతూనే ఉంటుంది.. సుశీల పాటల జాబితా కూడా పెద్దదే 'చినుకులా రాలి..' 'లేత చలిగాలులు..' ఇలా చాలా ఉన్నాయి. అరుదైన పుస్తకాలు, డిస్కుల సేకరణలో మీ రికార్డుని ఎవరూ బద్దలు కొట్టలేరండి.... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమురళీ, నా కెంత మేలు చేసారో మీకు చెప్పటం నేను మరవకూడదు. "గ్యాస్ పొయ్యి కట్టానా లేదా?, గరాజు తలుపు మూసానా లేదా" ఇటువంటి ప్రశ్నలు పదే పదే వేసుకుని నాకూ మతిమరపు వచ్చేస్తోందేమోనని మనసు పెట్టుకున్న దిగులు, మీచలవ వల్ల నా టేస్టుకి తగ్గ జానకి పాటల లిస్టు వ్రాద్దామన్న సాధనతో మటుమాయం. ఎంతకీ తరగదే, రాసి రాసి అయ్యో ఎవరైనా consultant ని పెట్టుకుంటే పోతదేమో, పని త్వరగా పూర్తి అవుతదనిపించింది ;) ఎడం బ్రెయిను కుడిదాన్ని కలేసుకొని మరీ గనులు తవ్వినట్లు, గుట్టలు గుట్టలుగ పాటలు తోడిపోసేస్తుంది. అమ్మో వుండండి, నన్ను కప్పెట్టేట్టున్నాయవి చూడబోతే!
రిప్లయితొలగించండిఇకపోతే నాడే కాదు, నేడు కూడా సృజన, అంకితభావం వుండి సంగీతం సమకూర్చేవారు, సాహిత్యం, గాత్రం అందిచేవారు వున్నారు. కాలానుగుణంగా మారే అభిరుచులకీ వారూ అతీతులు కారు కదా. ఈ బ్లాగు లోని పాటలు వినండి. http://navaragam.blogspot.com/
Janakiamma gari pata antha maduramga undi mee post
రిప్లయితొలగించండి@ఉష: బాగుందండి నవరాగం.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@Haripriya: చాలా పెద్ద ప్రశంస.. ధన్యవాదాలు.