ఆదివారం, జులై 24, 2011

హడావిడి

ఆదివారం అన్న పేరే గానీ ఎంత హడావిడిగా జరిగిపోయిందో రోజంతా.. ఉన్నట్టుండి ఏవేవో పనులు.. బిజీ బిజీ.. వీటిలో పడి అసలు 'హడావిడి' విషయం మరిచిపోయాను. అదే, సుమన్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పించు ప్రీమియర్ షో 'హడావిడి.' సుమన్ బాబు కేవలం నిర్మాణ బాధ్యతలకి మాత్రమే పరిమితం అయినందువల్లనేమో ప్రచారం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. టీవీలో అరుదుగా క్లిప్పింగులూ, పేపర్లో ఒకటి రెండు ప్రకటనలూ మాత్రం ఇచ్చేసి ఊరుకున్నారంతే.

సరే, నా హడావిడి కారణంగా ఈ 'హడావిడి' ని శ్రద్ధగా కూర్చుని చూడడం వీలు పడలేదు. అలాగని పూర్తిగా వదిలిపెట్టలేం కదా. అందుకని చెప్పేసి అప్పుడోసారీ, అప్పుడోసారీ ఓరకంట చూసి కథ, కథనం, సంభాషణలు, హాస్యం, సెంటిమెంటు తదితర నవరసాలు, మరీ ముఖ్యంగా నిర్మాణ విలువలని వీలు మేరకి పరిశీలించాను. ఈ షోతో జానకిరాం అనే కొత్త టెక్నీషియన్ కి సుమన్ ప్రొడక్షన్స్ లో దర్శకుడిగా ప్రమోషన్ రావడం తో పాటు, సుమన్ బాబు కథానాయకుడిగా విజయవంతమైన షోలు తీసిన దర్శకుడు ఇంద్రనాగ్ (పూర్వాశ్రమంలో నటుడే) కి హీరోగా ప్రమోషన్ వచ్చింది. కానైతే, కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఇంద్రనాగ్ నటన చూసినప్పుడు, దర్శకత్వం వహించింది సుమన్ బాబేమోనని అని అనుమానం వచ్చేసింది నాకు.

అసలు, 'అయ్యాం బాల్రాజ్ ఫ్రం బలభద్రపురం' అంటూ ఇంద్రనాగ్ పలికిన డైలాగుని ఒకానొక ప్రకటనలో చూసినప్పుడే, ఇంద్రనాగ్ అసలుపేరు నాగేంద్ర అనీ, సుమన్ బాబు సూచనల మేరకి ఇంద్రనాగ్ అని మార్చుకున్నాడనీ, అతని సొంతూరు బలభద్రపురం అనీ అప్పుడెప్పుడో కర్ణ పిశాచులు కూసిన విషయం గుర్తొచ్చింది. సరే, సొంతూరు మీద అభిమానం ఉండడం అభినందించాల్సిన విషయమే కదా. అసలంటూ ఏదో ఒక ఊరుండా లని సన్నివేశం బలవంతం చేసింది కాబట్టి (సిట్యుయేషన్ డిమాండ్ చేసింది కాబట్టి అన్నమాట) తన ఊరి పేరు వాడుకొని ఉంటాడు అనుకున్నా.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించిన ముక్కోణపు ప్రేమ కథలు ఒకటి కాకపొతే ఒకటైనా వెండితెర మీద చూసే ఉంటారు కదూ.. అంటే హీరో, హీరోయిన్ని మూగగా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆ హీరోయిన్నేమో మరొకడితో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉంటుంది. అప్పుడు హీరో ప్రేమ త్యాగాన్ని కోరి, హీరోయిన్నీ, ఆమె ప్రేమికుడినీ కలపడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాడు. చివర్లో హీరోయిన్ను తను ప్రేమించిన వాడి దుర్మార్గాన్నీ, హీరో ప్రేమనీ ఏకకాలంలో అర్ధం చేసేసుకుని, పెళ్ళిపీటల మీద నుంచిలేచొచ్చి హీరోతో నువ్వేకావాలి అంటుంది.

కొన్నైనా తెలుగు సినిమాలు గుర్తొచ్చాయి కదూ. అదేం విచిత్రమో కానీ, సుమన్ ప్రొడక్షన్స్లో పని చేసే ఏ ఒక్కరూ కూడా ఈ కథతో వచ్చిన ఏ ఒక్క సినిమానీ కూడా చూడలేదు. చూసి ఉంటే, ఇదే కథతో మళ్ళీ ఓ ప్రీమియర్ షో నిర్మించరు కదా.. బాలరాజు తను ప్రేమించిన అమ్మాయిని, ఆమె ప్రేమించే వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం చేసే 'హడావిడి' ని మూడుగంటల పాటు బుల్లితెర మీద చూపించారు. నిర్మాణ విలువలు కూడా నిర్మాణ సంస్థ స్థాయిలోనే ఉన్నాయి. అయినప్పటికీ, ఈ షోని సమర్పించడానికి పోటీలు పడుతూ వచ్చారు స్పాన్సర్లు.

అనేకానేక సినిమాల్లో మళ్ళీ మళ్ళీ చూసిన సన్నివేశాలు, వినేసిన డైలాగుల్ని ఇంద్రనాగ్ అండ్ కో ద్వారా మళ్ళీ చూపించారు ఇందులో. సుమన్ బాబు ఏదన్నా ప్రత్యేక అతిధి పాత్రన్నా చేసి ఉండకపోతాడా అన్న ఆశతో చివరికంటా ఓ కన్నేసి ఉంచాను ఈ షో మీద. చివరాకరికి పెళ్ళికూతురు, పీటల మీదనుంచి లేచొచ్చేసి, హీరో మోటార్ సైకిల్ మీద వాళ్ళిద్దరూ పారిపోయేటప్పుడు కూడా, సుమన్ బాబు కార్లో వచ్చి "ఇలా రోడ్డు మీద కాదు, ఇంటికెళ్ళి ప్రేమించుకోండి" అని సందేశం ఇవ్వడమో, లేక దగ్గరుండి పెళ్లి చేయడమో చేయకపోతాడా అని ఎదురు చూశాను. ప్చ్.. ఆ రెండూ కూడా జరగలేదు.

అయితే, నన్ను నిరాశ పరచని సంగతులు రెండు కనిపించాయి. మొదటిది ఒకానొక బ్రేక్ లో వచ్చిన ఒకానొక ప్రకటన. అప్పట్లో ఈ తరం 'మాయాబజార్' గా అనేకానేకుల ప్రశంశలు అందుకున్న నిరుపమాన పౌరాణిక చిత్రం 'ఉషాపరిణయం' త్వరలో ఈటీవీలో ప్రసారం కాబోతోందన్నది మొదటి ప్రకటన. థియేటర్లో ఈ సినిమాని చూడని వాళ్ళు, పౌరాణికాల్లో ఎన్టీఆర్ కి నిజమైన వారసుడు సుమన్ బాబేనన్న పెద్ద మనుషుల ప్రశంశలని గుర్తు చేసుకుని మరీ ఈ సినిమాని చూడాలి. అలాగే యూట్యూబ్లో భద్ర పరిచే ఏర్పాట్లూ జరగాలి. ఇక రెండోది, ఎండ్ టైటిల్స్ రోలవుతుండగా, క్లాప్ కొట్టిన సుమన్ బాబు కాళ్ళకి ఇంద్రనాగ్ భయముతో, భక్తితో, అనురక్తితో నమస్కరించడం. ఇంద్రనాగ్ హీరోగా మరికొన్ని ప్రీమియర్ షోలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కదూ.

26 కామెంట్‌లు:

  1. హతవిధీ :( ఎంత ఘోరం జరిగింది. గత రెండు రోజుల నుండీ ఈనాడు పేపర్లో ఈ కళా ఖండం ప్రకటనలు చూస్తున్నప్పటికీ విధి వక్రించి, నా మందబుద్ధి సమయానికి గుర్తు చేయక ఈ చిత్ర రాజాన్ని వీక్షించే అద్భుత, అరుదైన, అపురూప అవకాశమును కోల్పోతినే. ఎంతటి దురదృష్టవంతుడనో కదా. ఏది ఏమయినననూ ఇకపై ఇటువంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడెదను. అన్నట్టు మురళీ గారూ మన సుమన్ బాబుకు త్వరలో జరగనున్న ఘోర అవమానము గూర్చి, దానిని ఎదుర్కొనుటకు మనము చేపట్టవలసిన ఉద్యమం గూర్చి ఈ క్రింది లింకులో చూడండి. కమిటీ సభ్యులలో మీదీ ప్రధాన పాత్ర మరి.
    https://plus.google.com/112277186449974183364/posts/TQUe6brHuzg

    రిప్లయితొలగించండి
  2. నిన్న నేను కూడా ఈ చిత్ర రాజాన్ని చూద్దామనుకున్నాను.. కానీ ఎలాగూ మీరు, బులుసు గారూ చూసి టపా రాస్తారు కదా మళ్ళీ నాకెందుకొచ్చిన రిస్క్ అని చూడలేదు.. ఎప్పటిలాగే టపా అదుర్స్.. సుమన్ బాబు ఇలాంటివి మరిన్ని తీయాలని అవి చూసే మహద్భాగ్యం మీకు కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.. :P

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. wow.. usha pariNayamaa? maLLeeenaa??
    ee saari miss avvakoodadu..
    nice post andeee.. ;) :)
    ninna ending titles maatrame choodagaligaanu... ;( ;(

    రిప్లయితొలగించండి
  5. మీ మిసెస్ ఎంత మంచి వారండీ ! నిజంగా !

    మిమ్మల్ని కూడా మెచుకోవాలండీ. మీది మామూలు అభిమానం కాదు. ఇది ఇలానే కంటిన్యూ చెయ్యండి. ఏదో ఎమోషన్ తో నా గొంతు choke అయిపోయింది.

    రిప్లయితొలగించండి
  6. 'హడావిడి' ప్రసారమయి పోయిందా?!!! తెలీలేదండీ..
    శంకర్ గారు,
    మీ బజ్ చూశాను. చాలా ఆశ్చర్యపరచే వార్తే చెప్పారు.

    రిప్లయితొలగించండి
  7. అదేం విచిత్రమో కానీ, సుమన్ ప్రొడక్షన్స్లో పని చేసే ఏ ఒక్కరూ కూడా ఈ కథతో వచ్చిన ఏ ఒక్క సినిమానీ కూడా చూడలేదు. చూసి ఉంటే, ఇదే కథతో మళ్ళీ ఓ ప్రీమియర్ షో నిర్మించరు కదా.
    .........
    హహహహ..మొత్తానికి అంత హడావిడిలోనూ మీ అభిమానాన్ని చూపించుకున్నారు. :)

    రిప్లయితొలగించండి
  8. ఆత్రేయగారు,
    "గుంటూర్ లో విసినాధం ( శేఖర్ ) అని సైకియాట్రిస్ట్ ఉన్నారు కలవండి !!
    కాకపోతే ఇప్పుడు ఆయనే పెద్ద చిక్కుల్లో ఉన్నాడు !!"
    సరదాగా రాశారా? నాకు తెలిసి ఆ పేరుతో గుంటూర్లో సైకియాట్రిస్ట్ ఎవరూ లేరు. ఇంక కష్టాలు కూడానా!

    రిప్లయితొలగించండి
  9. మొత్తానికి ఇంద్రనాగ్, సుమన్ కాళ్ళకి దండం పెట్టాడా లేదా అన్న విషయం మాత్రం మీరు గమనించకుండా సినిమా చూడటం పూర్తి చేయరు కదా:) అవునులెండి కథెలా ఉన్నా ఇదిమాత్రం చాలా ముఖ్యమైన విషయమే. బహుశ: ఇకముందంతా హీరో గానే వస్తాడేమో అది చూడండి. అప్పుడు మీకు ఇద్దరు అభిమాన హీరోలవుతారు:)

    రిప్లయితొలగించండి
  10. అధ్యక్షా,
    ఆత్రేయ గారు అభిమానాన్ని అబ్సెషన్ వంటి పదాలతో అవమానించడం చాలా దారుణం. సుమన్ బాబు అభిమానిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు ఏ కారణంతో ఎవరు ఆత్మహత్య చేసుకున్నా వారు సుమన్ బాబు కోసం అమరులైనట్టుగా, ఎవరు గుండెపోటుతో మరణించినా వాళ్లు ఈ వ్యాఖ్యలు విని జీర్ణించుకోలేక గుండాగినట్టుగా ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాం అధ్యక్షా. సుమన్ బాబు ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజాసేవ చేయాలని డిమాండ్ చేసే లోగా ఈ వ్యాఖ్యలు నా మనోభావాల్ని గాయపరిచాయి.
    కాబోయే ముఖ్యమంత్రి సుమన్ బాబుకీ.....

    రిప్లయితొలగించండి
  11. ...జై

    అవునధ్యక్షా. దీన్ని నేను కూడా ఖండిస్తున్నాను. పక్కింటబ్బాయి గారూ.. సారీ.. ఇల్లు మారాడు గారు.. సారీ.. సారీ.. పక్కింటబ్బాయి(ఇల్లు మారాడు) గారు.. మీ డిమాండ్‌ని నేను కూడా బలపరుస్తున్నాను. మన సుమన్‌బాబంటే ఎవరు? అహ.. అసలు సుమన్‌బాబు గొప్పతనం మీకెవరికైనా తెలుసా అంట. అలాంటి సుమన్‌బాబుని అవమానిస్తారా..? దీన్ని అతి తీవ్రంగా, తీక్షణంగా ఖండిస్తునాను.

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. ఈ చిత్రరాజాన్ని నేను చూడలేకపోయాను. మీ యొక్క ఆ యొక్క ఓర్పునకు, పట్టుదలకున్నూ నేను కడుంగడు ముగ్ధుడనైతిని. మీకు శతసహస్ర వీరతాళ్ళు. మీకు సుమన్ రత్న అనే బిరుదును ఇవ్వాలని బ్లాగ్ముఖంగా సుమనాభిమాను లందరికి విజ్నప్తి చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  14. సుమన్ బాబు అభిమానుల కోసం...:)

    http://www.tollywoodspice.com/2011/07/etv-suman-comedy.html

    రిప్లయితొలగించండి
  15. హ్హహ్హహ్హా!! అసలు ఈ షో వచ్చిన విషయమే తెలీదండీ...అదేంటీ ఇక్కడ అందరు సుమన్ బాబుకే ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు..మరి ఇంద్రనాగ్ బాబుకి లేరా? ;) ఉంటే...బజ్జుల్లో..బ్లాగుల్లో హోరెత్తించొద్దూ...మన ఇంద్రనాగ్ ప్రీమియ షో అని! బొత్తిగా కళాహౄదయం లేకుందా పోతోందీ :))

    మీ టపా ఎప్పటిలాగే సూపరండీ! మీరు జరగాలనుకుని....జరగని ఆ రెండు సీన్లు భలే ఉన్నాయ్! ;)

    ఇక ఆ టాలివుడ్ స్పైస్ లింక్ ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు :)) మరీ కామెడీగా ఉన్నాయ్ ఆ జిఫ్ ఇమజెస్! :)))

    రిప్లయితొలగించండి
  16. @శంకర్.ఎస్ : మీరు నమ్మేస్తున్నారా, ఆ వార్తలు? నాకైతే సుమన్ బాబు ప్రతిష్టని తగ్గించడం కోసం 'సాక్షి' వాళ్ళు చేస్తున్న కుట్ర అని అనుమానం అండీ.. ఒకవేళ అదే జరిగినా బాబు సొంతంగా చానల్ పెట్టుకుంటాడు.. మీరు మాత్రం 'ఉషా పరిణయం' అస్సలు మిస్సవ్వద్దు..అలాంటి పౌరాణికాన్ని మీరు జీవితంలో మళ్ళీ చూడలేరు.. ధన్యవాదాలు.
    @కార్తిక్: ప్చ్.. సుమన్ బాబు కనిపించక పోవడం నన్ను బాగా నిరాశ పరిచిందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @కృష్ణప్రియ: ధన్యవాదాలండీ..
    @ఆత్రేయ: మీ అభిమానానికి చాలా ధన్యవాదాలండీ..
    @రాజ్ కుమార్: టీవీలో మొదటిసారండీ.. గతంలో థియేటర్ రిలీజ్!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @సుజాత: అదేమిటండీ, తను చూసే సీరియల్స్ ని నేనూ భరిస్తున్నాను కదా మరి!! ..ధన్యవాదాలు.
    @శిశిర: అవునండీ.. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు.. బజ్జు వార్త చూసి నిరాశ పడకండి :)) ..ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య: సుమన్ బాబు లేక పొతే చూడడం టైం వేస్ట్ అండీ.. ఇంకెవరూ అంత బాగా కామెడీ పండించలేరు మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @yaramana : ధన్యవాదాలండీ..
    @జయ: అవునండీ.. సుమన్ బాబు క్రమశిక్షణ కి ప్రాణం ఇచ్చే వ్యక్తి మరి.. ఇద్దరు హీరోలా... సుమన్ బాబు లాంటి మరో హీరోని చూపించండి ముందు!! ..ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: అప్పుడే రాజకీయాలు వద్దండీ.. అసలే కన్ఫ్యూజ్ మాస్టర్.. ఇంకా కన్ఫ్యూజ్ అవుతాడేమో, ప్రీమియర్ షో లు కంటిన్యూ చేయాలా వద్దా మరియు వారసత్వ సమస్య.. ఇవన్నీ ఉంటాయి కదా.. :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @ది చాణక్య: మరీ అంత అభిమానం వద్దండీ. ఏదో కామెడీ షోలు చూసి ఎంజాయ్ చేయడం వరకూ అయితే ఓకే.. ఏమంటారు? ..ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: అబ్బే.. నేనేమీ ఏక దీక్షగా చూడలేదండీ.. ఇంట్లో పన్లు చూసుకుంటూ ఓ కన్ను వేసి ఉంచానంతే.. కాబట్టి, బిరుదులూ అవీ అస్సలు వద్దండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @Tollywood Spice : వావ్.. చాలా బాగుందండీ.. ధన్యవాదాలు.
    @ఇందు: మీరు మరీ నక్కకీ నాక లోకానికీ పోలిక తెస్తున్నారు.. (నక్కెవారు అని మాత్రం అడక్కండీ!!) ..మీరు మాత్రం కాసేపైనా 'ఉషా పరిణయం' చూడండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. అడ్డెడ్డెడ్డే... హెంత పని జరిగిపోయిందీ? సినిమా చివరి దాకా సుమన్ రానేలేదా? సాటి సుమనాభిమానిగ మీ బాధని అర్ధం చేసుకోగలను.
    శంకర్ గారూ, ఏమిటండీ ఈ దుర్వార్త? నేను హైదరాబాద్ రావాలీ, సుమన్ సినిమా టీవీలో చూడాలి అన్న నా కల తీరకుండానే ఇలాటీ ఘోరాలు జరిగుతాయా?ఇహ తప్పదు, యూట్యూబే గతి!
    శారద

    రిప్లయితొలగించండి
  23. ఓహో.. మీరు అలా అర్థమైందా..? కానివ్వండి.

    రిప్లయితొలగించండి
  24. @శారద: మీరేమీ దిగులు పడక్కర్లేదండీ.. అలాంటిదేమీ జరగదు.. మీరు ఇండియా వచ్చేలోగానే యూ ట్యూబ్లో కొన్ని షోలైనా చూడొచ్చు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి