ఐదేళ్ళ నాడు మొదలు పెట్టిన బ్లాగు ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాస్తుండగానే 'నెమలికన్ను' కి ఐదో పుట్టినరోజు వచ్చేసింది!! యథా ప్రకారం, సింహావలోకనం.. నాలుగో పుట్టినరోజు అయిన వెంటనే అభిమాన గాయని ఎస్. జానకి కి ప్రభుత్వం 'పద్మ భూషణ్' ప్రకటించిందన్న కబురు తెలియడంతో 'పరిమళించిన పద్మం' టపాతో ఐదో సంవత్సరానికి శుభారంభం జరిగింది. సంవత్సరం చివరిలో 'జానకి పాటలు' సిరీస్ రాయడం కేవలం యాదృచ్చికం..
మునుపటి సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు టపాల సంఖ్య కొంచం మెరుగు పడింది. కానైతే, బ్లాగింగ్ మీద శీతకన్ను వేస్తున్నానన్న హెచ్చరికని మిత్రులనుంచి చాలాసార్లే అందుకున్నాను. కొని, చదవకుండా ఉంచిన పుస్తకాలు చాలానే కనిపిస్తున్నాయి కాబట్టి, పుస్తకాలు బాగానే చదివాను అని చెప్పలేను. చదివిన వాటిలో బాగా నచ్చినవి అంటే మళ్ళీ ఆత్మకథలే కనిపిస్తున్నాయి. బుచ్చిబాబు 'నా అంతరంగ కథనం' ఒకందుకు నచ్చితే, జ్యోతిరెడ్డి రాసిన '...ఐనా, నేను ఓడిపోలేదు!' మరొకందుకు గుర్తుండిపోయింది.
చూసిన సినిమాలే బాగా తక్కువ.. ఇక వాటిలో నచ్చినవంటూ ఏవీ లేవనే చెప్పాలి. వెనక్కి తిరిగి బ్లాగుని చూసుకుంటే నాకు ప్రత్యేకంగా అనిపించిన టపాలు 'అబ్బాయి తండ్రికి...' 'అందుకో నా లేఖ...' రెండూ కూడా అనుకోకుండా రాసినవే.. వీటిలో మొదటిది 'నేనే రాశానా!' అన్న ఆశ్చర్యం కలుగుతోంది ఇప్పుడు చదువుకుంటే. 'పురుషార్ధం' అనే చిన్నకథ కూడా అనుకోకుండా మొదలుపెట్టి ఏకబిగిన రాసిందే. ఆలోచనలు చాలానే ఉన్నాయి కానీ, అక్షరాల్లో పెట్టడం వాయిదా పడుతూ వస్తోంది.
మిత్రులు చాలామంది ఈ బ్లాగుని తలచుకోగానే 'జ్ఞాపకాలు' పోస్టులే గుర్తొస్తాయి అని చెబుతూ ఉంటారు మెయిలుత్తరాలలో. వాటిలో కూడా రాయాల్సినవి చాలానే ఉన్నాయి. బ్లాగు ప్రయాణం సాగుతూ ఉంది కాబట్టి, రాయాల్సిన వాటన్నింటికీ ఒక్కోరోజు వస్తుందనే అనుకుంటున్నాను. నన్ను దగ్గరకు తీసుకున్న పరకాల పట్టాభి రామారావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యాలని తనతో తీసుకుపోయింది పోయిన సంవత్సరం. వైరాగ్యపు అంచులవరకూ వెళ్లి, కర్తవ్యాలు గుర్తుచేసుకుని వెనక్కి రావడం.. అంతే చేయగలిగేది.
బ్లాగు ప్రయాణం దగ్గరికి వస్తే, సాఫీగానే సాగుతోంది.. అడపా దడపా మిత్రులు మెయిల్ లో పలకరిస్తున్నారు. రోజువారీ కబుర్లకి గూగుల్ ప్లస్ ఉండనే ఉంది. అసలు 'జానకి పాటలు' పుట్టింది ప్లస్ లోనే. రాబోయే సంవత్సరంలో ఈ బ్లాగులో టపాలు ఉధృతంగా వచ్చి పడతాయా లేక అడపా దడపా పలకరిస్తాయా అన్నది ఇప్పుడు చెప్పలేని విషయం. ఇదివరకోసారి నేనే రాసినట్టు, బ్లాగింగ్ అన్నది కేవలం ప్లానింగ్ ఉన్నంత మాత్రానే జరిగిపోయేది కాదు.. ఇంకా చాలా చాలా కలిసిరావాలి.
చెయ్యాల్సిన పనులు, చదవాల్సిన పుస్తకాలు, చూడాల్సిన సినిమాలు ఇవన్నీ ఎదురు చూస్తున్నాయి. ఒక్కొక్కటిగా పూర్తిచేయాలి. వీటిలో చాలా వరకూ వాయిదా వెయ్యగలిగే పనుల జాబితాలో చేరిపోతూ వస్తున్నాయి. బ్లాగింగుదీ అదే దారి అయిపోతోంది ఒక్కోసారి. ఇలా సింహావలోకనం చేసుకున్నప్పుడల్లా 'బ్లాగింగు కి కొంచం ఎక్కువ సమయం కేటాయించాలి' అని బలంగా అనిపిస్తూ ఉంటుంది. ఆచరణ విషయానికి వస్తే, ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి... చూడాలి. ఐదేళ్ళ పాటు బ్లాగు రాయడానికి, ఇంకా రాయాలన్న ఉత్సాహాన్ని మిగుల్చుకోడానికి కారకులైన మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు!!
(మరో యాదృచ్చికం.. పోస్టుల సంఖ్య ఆరువందలు అయ్యింది ఈ టపాతో!!)
"నెమలికన్ను" కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!! పొగడదండలు తప్పవీపూట మీకు.. :)
రిప్లయితొలగించండినిబధ్ధత + సంతులనం +మృదువైన అభివ్యక్తి = నెమలికన్ను
అయిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు మురళిగారు..... నిజం చెప్పాలంటే, ఈఅందరు నెట్ ప్రపంచంలో గలగలా కబుర్లు చెప్పేస్తుంటే సరదాపుట్టి నేను కూడా బ్లాగింగ్ మొదలు పెట్టాను. కానైతే మీఅందరికీ ఈమధ్య బ్లాగింగ్ మీద ఇదివరకటి ఆసక్తి తగ్గిందేమో అనిపిస్తోంది మీ పాత పోస్టులు వాటికి వచ్చిన వాక్యలు చూస్తున్నపుడు.ఇప్పుదు ఎవరూ అంతబాగా రెస్పాండ్ కావటంలేదు అనిపిస్తోంది.
రిప్లయితొలగించండిHeartiest congratulations Murali garu, I still remember your first post and it seems like yesterday. Five years, wow!!! so fast and quick!!! I wish you all the best and keep blogging
రిప్లయితొలగించండి-Laxmi
Heartiest Congratulations Murali garu. I still remember commenting on your first blog post, and it's already five years, wow!!! Very fast and quick!!! Wish you all the best and keep blogging
రిప్లయితొలగించండి-Laxmi
మా నెమలికన్ను బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిఅభినందనలు...
రిప్లయితొలగించండిమీ(మా)"పంచకళ్యాణి" ప్రయాణం "సహస్ర" అవధానం తొందరలోనే చేరుకోవాలని మా ఆశ అభిలాష
రిప్లయితొలగించండిఅభినందనలు మురళి గారు :-)
రిప్లయితొలగించండిమీ ఆరువందల 'పంచ'కళ్యాణికి, శతాధిక అభినందనలు మురళి గారు.
రిప్లయితొలగించండిcongrats andi.
రిప్లయితొలగించండినమస్కారం మరళి గారికి.నెమలికన్నుకు పుట్టినరోజు శుభాకాంక్షలు .ఇదే మొదటిసారి మీ బ్లాగు చూడడం .బాగుంది.నెమ్మదిగా అన్నీ చదువుతాను.మీ నెమలికన్ను పంచకల్యాణిలా శరవేగంతో పరుగులు తీయాలి.అభినందనలు.
రిప్లయితొలగించండిCongrats Murali gaaru :-)
రిప్లయితొలగించండిCongrats...!
రిప్లయితొలగించండిhappy b-day, happy reading n writing.
రిప్లయితొలగించండిcongrats
రిప్లయితొలగించండిశుభాభినందనలు :-)
రిప్లయితొలగించండిCongrats Murali garu :)
రిప్లయితొలగించండిcongrats!
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: చాలా బరువైన పొగడ దండండీ!! ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@నాగ శ్రీనివాస: వ్యాఖ్యల గురించి ఆలోచించకండి.. మీరు రాయదల్చుకున్నది మీరు రాస్తూ ఉండండి.. బ్లాగు మనకోసం మనం రాసుకుంటాం కదా... ధన్యవాదాలు
@లక్ష్మి: చాలా సంతోషంగా ఉందండీ.. చిన్ననాటి మిత్రులని కలిసినట్టుగా! చదువుతున్నారన్న మాట అయితే.. వెరీ హేపీ.. థాంక్యూ..
@పరుచూరి వంశీకృష్ణ: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@బోనగిరి: ధన్యవాదాలండీ..
@పప్పు శ్రీనివాస రావు: మీ అందరి ప్రోత్సాహంతో, అలాగేనండీ... ...ధన్యవాదాలు..
@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ
రిప్లయితొలగించండి@జయ: ధన్యవాదాలండీ..
@మలాకుమార్: ధన్యవాదాలండీ
@నాగరాణి: ధన్యవాదాలండీ
రిప్లయితొలగించండి@శ్రావ్య: ధన్యవాదాలండీ
@రంగరాజన్: ధన్యవాదాలండీ
@పురాణపండ ఫణి: ధన్యవాదాలండీ
రిప్లయితొలగించండి@స్వాతి: ధన్యవాదాలండీ
@నిషిగంధ: ధన్యవాదాలండీ
@మేధ: ధన్యవాదాలండీ
రిప్లయితొలగించండి@హిమబిందు: ధన్యవాదాలండీ..