ఓ కొత్త అంశంతో కథను రాసి పాఠకులని మెప్పించడం కన్నా, బాగా నలిగిన విషయాన్ని కొత్తగా చెప్పడం రచయితలకి కత్తిమీద సాము. ఈసాముని అవలీలగా చేశారు కథా రచయిత గోపరాజు రాధాకృష్ణ. దేశభక్తి ని ఇతివృత్తంగా తీసుకుని ఈయన రాసిన కథ 'జనయిత్రీ దివ్యధాత్రి' తొమ్మిదేళ్ళ క్రితం 'ఈనాడు' ఆదివారం లో ప్రచురితమయ్యింది.
కార్గిల్ యుద్ధం ముగిసిన సమయంలో రాసిన ఈ కథలో కథానాయిక తులసి. ఎన్నో ఏళ్ళ తర్వాత తండ్రి వస్తున్నాడన్న కబురు తులసికి తెలియడంతో కథ ప్రారంభమవుతుంది. "తాతగారు వస్తున్నారు చిన్నా.." అని తన కొడుక్కి చెబుతుంది. తులసి తండ్రి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగి. పదిహేనేళ్ళ క్రితం కనిపించకుండా పోతాడు. బోర్డర్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు కిడ్నాప్ చేశారని, కాల్చి చంపేశారనీ వార్తలు వస్తాయి.
తండ్రి మరణ వార్త తెలిసి గుండె ఆగి మరణిస్తుంది తల్లి. తల్లిదండ్రులది ప్రేమ వివాహం కావడంతో బంధువులెవరూ లేరు. అనాధాశ్రమంలో చేరుతుంది తులసి. ఇంటర్ పూర్తవ్వడంతోనే పార్ట్ టైం ఉద్యోగాలు వెతుక్కుని, ఆశ్రమం నుంచి లేడిస్ హాస్టల్ కి మారుతుంది. వయోలిన్ నేర్చుకోవాలన్న చిన్నప్పటి కోరిక గుర్తొచ్చి దగ్గరలోనే ఉన్న మ్యూజిక్ స్కూల్లో చేరుతుంది.
మ్యూజిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మేనల్లుడు రఘు తొలిచూపులోనే ప్రేమలో పడతాడు తులసితో. అతను సైనికుడు. ఆమె అంగీకారంతో పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ ఓ కొడుకు చిన్నా. రఘు గురించి తండ్రికి ఎలా చెప్పాలా అని తులసి మధనపడుతున్న సమయంలోనే కూతుర్ని వెతుక్కుంటూ ఆయన వస్తాడు. ఫోటోలో ఉన్న నాన్నతో పోలికలు వెతుక్కుని తండ్రిని గుర్తుపడుతుంది తులసి.
వృద్ధుడైన ఆ తండ్రి కూతురి ముఖం చూడగానే అడిగిన మొదటి సంగతి అల్లుడికి ఏమైందనే.. రాష్ట్రపతి నుంచి తాను శౌర్య పతకం తీసుకుంటున్న ఫోటో చూపించి, కార్గిల్ యుద్ధంలో రఘు మరణించాడని చెబుతుంది తులసి. పాకిస్తాన్ వాళ్ళు తనని కిడ్నాప్ చేసి జైల్లో ఉంచిన వైనం వివరిస్తాడాయన. ఇంటికి ఉత్తరాలు కూడా రాయనివ్వలేదనీ, జైలు నుంచి విడుదలయ్యాక మిత్రుల సహాయంతో తులసి చిరునామా పట్టుకోగాలిగాననీ చెబుతాడు.
తను స్కూల్లో వేసి ప్రైజు గెల్చుకున్న వీరసైనికుడి ఏకపాత్రాభినయాన్ని తాతగారికి ప్రదర్శించి చూపుతాడు చిన్నా.. అమ్మే రాసిచ్చిందనీ, కష్టపడి నేర్పించిందనీ చెబుతాడు. చిన్నాని కోరుకొండ సైనిక స్కూల్లో చేర్చాలని నిర్ణయించుకున్న తులసి, తండ్రి ఏమంటాడో అని భయపడుతుంది. కూతుర్ని ఆయన అబినందించడం కథకి ముగింపు. ఆసాంతం ఊపిరి బిగపట్టి చదివించే కథనం ఈ కథ ప్రత్యేకత. చివరి వాక్యం చదవగానే ఓ నీటి చుక్క కంటి చివరినుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయక మానదు. బ్లాగ్మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
జనయిత్రీ దివ్యధాత్రి అంటే అర్ధం ఏమిటండీ?
రిప్లయితొలగించండిIs really heart touching one...
రిప్లయితొలగించండిస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు. జై హింద్!!
రిప్లయితొలగించండిఇవాల్టి మీ టపా నన్ను బాగా కదిలించేసింది..
రిప్లయితొలగించండితొమ్మిదేళ్ళ నాడు జరిగిపోయినవన్నిగుర్తు చేసింది..
అందరిని ఆసాంతం ఊపిరి బిగపట్టి చదివించే ఈ కధ నాకు నిజ జీవితం లో అనుభవం..
మా అన్నయ్య తన సర్వీసు మొదలు పెట్టింది కార్గిల్ యుద్ధం తోనే..
"ఫస్ట్ లెఫ్ట్ నెంట్" గా కమిషన్ తీసుకున్న వెంటనే తన మొదటి పోస్టింగ్ "సియాచిన్"..
వెంటనే కార్గిల్ యుధం..
చాలా తీవ్రంగా గాయ పడ్డాడు ..
బ్రతుకుతాడనుకోలేదు ..
చాలా రోజులు పట్టింది కోలుకోడానికి ..
ఇంకా ఒక స్ప్లింటర్ ముక్క తన పక్కటెముకల్లో లో వుండిపోయింది ..
అది ఎప్పుడు ఇబ్బంది పెడితే అప్పుడే ఆపరేట్ చేద్దామని ఇప్పుడు ఏమి కదిలించవద్దని చెప్పారు డాక్టర్లు ..
ఇప్పుడు తను "మేజర్" ఇన్ ఇండియన్ ఆర్మీ ..
జమ్మూ నించి 80కిమి దూరంలో రియాసి అనే ప్లేస్ లో వున్నాడు..
మా ఈ కధ లో ఇంకో చిన్న ఎడిషన్ ఏంటంటే ..
మా నాన్నగారు కూడా ఆర్మీ ఆఫీసర్..
కానీ ప్రస్తుతం లేరు ..
నాకు 5 నెలలు వున్నప్పుడే చనిపోయారు ..
అయన ఇన్స్పిరేషన్ తోనే అన్నయ్య ఆర్మీ జాయిన్ అయ్యాడు..
జన్మ భూమిని రక్షించుకునే మహా యజ్ఞం లో తన వంతు ఉడతా భక్తీ సాయం చేసాడు..
మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
చాలా మంచి కథ ని పరిచయం చేశారు మురళి. బాగుంది. మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిబావుందండీ.
రిప్లయితొలగించండి@శేఖర్ .. ప్రసిద్ధి పొందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దేశభక్తి గేయంలో పంక్తి అది .. జయజయజయ్ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి. జనయిత్రి అంటే తల్లి. దివ్యధాత్రి అంటే దివ్యమైన భూమి.
@కొత్తపాళీ గారు,
రిప్లయితొలగించండిమీ వివరణకు థాక్సండీ..
@ప్రణీత గారు, ఆర్మీ వీరుల గురించి మాకు తెలియని విషయాలు, అలాగే మీ అన్నయ్య మీకు చెప్పిన విషయాలు మాతో టపా ద్వారా పంచుకుంటారని ఆశించొచ్చా?
"జయజయ జయ శతసహస్త్ర నరనారీ ....హృదయనేత్రి " ఈ గీతం నాకు చాల ఇష్టం ...మా చిన్నప్పుడు ప్రార్ధనలో పాడేవాళ్ళం.చక్కటి జ్ఞాపకాన్ని గుర్తుచేశారు.
రిప్లయితొలగించండిప్రణీత గారు నమస్కారం ! మీ కుటుంబం గురించి ఇక్కడ అది ఈ రోజు తెలుసుకోవటం చాలా స్పుర్తిదాయకయం గా ఉంది !శేఖర్ గారి రిక్వెస్ట్ నాది కూడా !
రిప్లయితొలగించండిమురళి గారు స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు!
remote memory recalls that i have read it but again I could be wrong. nice review. Thanks for bringing up these neat plots and novels. Kudos.
రిప్లయితొలగించండిశేఖర్ గారు, శ్రావ్య గారు.. తప్పకుండానండి..నాకు తెలిసినవి తప్పకుండా చెప్తాను.
రిప్లయితొలగించండిస్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమురళి గారు
రిప్లయితొలగించండిమీ ప్రోత్సాహం తో బ్లాగ్ (స్నిగ్ధకౌముది) ఇవ్వాళ్ళే మొదలు పెట్టాను..
కానీ బ్లాగ్ పేరు తెలుగు లో కాకుండా ఇంగ్లీష్ లో కనిపిస్తోంది ..
ఏం చెయ్యాలో ఎలా మార్చాలో నాకేమీ అర్ధం కాలేదు..
అసలు మారుతుందో లేదో కూడా తెలిదు
ప్లీజ్ హెల్ప్ చెయ్యరూ..
మురళి గారికి... మీ బ్లాగ్ చదివిన తరువాత నేను ఒక బ్లాగ్ మొదలు పెడదామనుకున్నా.. ఆ కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది.. మీ బ్లాగ్ చూసి.. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేనుకూడా చిన్న బ్లాగ్ ఒకటి మొదలుపెట్టా.. మూడే టపాలు వున్నాయి ప్రస్తుతానికి.. సలహాలు, సూచనలు ఇస్తారని ఆశిస్తూ...
రిప్లయితొలగించండిసత్య...
www.allaribudugu.blogspot.com
www.ragasofgitam.co.nr
మురళి గారు ఇలా నిజముగా జరిగిన సంఘటనల గురించి ,నేను పొస్ట్ రాద్దామని అన్నీ తయారు చేసుకున్నాను ,మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అనుభవాలు రాసి ఇచ్చారు.కాని మావారు, జనరల్ రాజారాం గారు అభ్యంతరము చెప్పటము ,పబ్లిష్ చేయలేక పోయాను. ఝండా మటుకు పెట్టివూరుకున్నాను !
రిప్లయితొలగించండిస్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా మురళి... మంచి పాట గుర్తు చేసేరు..
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు; కొత్తపాళీ గారు చెప్పేశారు కదండీ... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పద్మార్పిత: ధన్యవాదాలు
@సృజన: ధన్యవాదాలు.
@ప్రణీత: ఈ కథ కన్నా మీరు చెప్పిన విషయం బాగా కదిలించిందండీ.. మీ 'స్నిగ్ధ కౌముది' తపాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు
@చిన్ని:ధన్యవాదాలు
@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలు
@ఉష: చదివే ఉంటారు మీరు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భాస్కర రామిరెడ్డి; ధన్యవాదాలు.
@సత్య: బాగుందండీ మీ బ్లాగు.. రాస్తూ ఉండండి.. ధన్యవాదాలు.
@మాలాకుమార్: అరె.. రాస్తే మంచి విషయాలు తెలుసుకోగలిగే వాళ్లమండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భావన: ధన్యవాదాలు.
మీ కధ , ప్రణీత గారి జీవితానుభవం స్ఫూర్తి దాయకం .....
రిప్లయితొలగించండిఇప్పటికీ వీరుల త్యాగఫలమే మన సుఖజీవనం ...
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కాస్త ఆలశ్యంగా ....
@పరిమళం: ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి