"నాన్నగారూ మీకోసం గోపాలరావు అన్నయ్య గారు వచ్చారు.." అమ్మ వాళ్ళ చిన్నప్పుడు తాతగారింట్లో ఈ మాట వినబడగానే యెంతో సహనవతి అయిన అమ్మమ్మకి కోపం వచ్చేసేది.. తాతగారికి వార్తని చెప్పిన వాళ్ళతో సహా ఇంటిళ్ళపాదికీ ముఖాలు మాడిపోయేవి.. ఇందుకు భిన్నంగా తాతగారి ముఖం మాత్రం వెలిగిపోయేది.. చేస్తున్న పని వదిలి వీధిగదిలోకి నడిచేవాళ్ళు. మళ్ళీ ఆయన ఇంట్లోకి ఎప్పుడు తిరిగొస్తారనేది ఇంట్లో వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉండేది.
సదరు గోపాలరావు గారు అప్పటికి ఒకప్పుడు ఓ పిల్ల జమిందారు.. పరిస్థితులు తలకిందులు కావడం తో తాతగారి ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చేశారు. తన ఆస్తులకి సంబంధించి దాయాదులతో వ్యాజ్యాలు నడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. వారానికో, పదిరోజులకో ఒకసారి తాతగారి దగ్గరికి వచ్చి జరిగిపోయిన సంగతులన్నీ కలబోసుకోవడం ఆయన అలవాటు. వాళ్ళిద్దరికీ కబుర్లలో గంటలు నిమిషాల్లా గడిచిపోయేవి. ఎటొచ్చీ ఇంట్లో వాళ్లకి నిమిషాలు రోజుల్లా గడిచేవి.
గోపాలరావు గారు ఉదయాన్నే వచ్చారంటే మిట్ట మధ్యాహ్నం దాటాకే తిరిగి వెళ్ళేవాళ్ళు. ఆయన వెళ్ళాకా తాతగారు భోజనం చేస్తే, ఆ తర్వాత అమ్మమ్మ తినాలి. ఒకవేళ గోపాలరావు గారు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చారంటే ఊరు మాటు మణిగే వరకూ కబుర్లు సాగిపోతూనే ఉండేవి. ఆయన ఉన్నంతసేపూ కాఫీ టీలు వంటింట్లో నుంచి వీధి గదిలోకి కాలువలు కట్టి ప్రవహించాల్సిందే. ఏదైనా ప్రాణావసరం వచ్చి "ఓ మాటు ఇటు రండి" అని అమ్మమ్మ పిల్లల చేత కబురెట్టినా తాతగారు లోపలికి వెళ్ళేవారు కాదు.
ఎంతైనా గోపాలరావు గారు జమీందారు కాబట్టి ఆయన వచ్చారంటే ఇంట్లో పెద్ద పిల్లలతో సహా ఆడవాళ్ళంతా ఘోషా పాటించాల్సిందే.. ఆయన వీధిలో ఉన్నారంటే అందరూ పెరటి దోవన మసలాలి. ఇక ఆయన చెప్పే కబుర్లలో ఎక్కువ భాగం విమర్శలే.. అవి కూడా ఆయనకి వదిన వరుసయ్యే బంధువులావిడ మీదే.. "నాలుగు పుంజీలెంటుకలు లేవు.. నాగరం పెడతాది నానా... పట్టీలు నానా.. ఆ బోద కాళ్ళకి మువ్వల పట్టీలూ.." ఇలా సాగిపోయేది వరుస..
ఇవి కాకపొతే తన గత వైభవాన్ని తలుచుకుని మురుసుకునే వాళ్ళు.. తను గుర్రం మీదెక్కి ఊళ్ళో తిరుగుతుంటే ఊరి వాళ్ళంతా ఎలా భయపడేవాళ్ళో, వాళ్ళింటి పద్ధతులు అవీ ఎలా ఉండేవో కథలు కథలుగా చెప్పెవాలు. తాతగారు తక్కువ తిన్నారా? చివరి క్షణాల్లో ఉన్నవాళ్ళని కూడా తను ఎలా వైద్యం చేసి బతికించారో, తన వైద్యాన్ని ఎవరెవరు ఎలా మెచ్చుకున్నారో వర్ణించి వర్ణించి చెప్పేవాళ్ళు. పాపం ఇంట్లో వాళ్లకి ఇవన్నీ వినక తప్పని పరిస్థితి.. తప్పించుకునే మార్గం లేదు కదా..
గోపాల రావు గారి మిగిలిన ఆస్తిలో చాలా భాగం వ్యాజ్యాల నిమిత్తం ఖర్చయి పోవడం తో ఊళ్ళో ఆయనకి గౌరవం మరికొంచెం తగ్గింది.. ఆయన వస్తే పిల్లలు "నాన్నగారూ మీకోసం గోపీ అన్నయ్య వచ్చారు.." అనడం మొదలు పెట్టారు. కబుర్ల పరంపర అలాగే కొనసాగుతూ ఉండడంతో అమ్మమ్మకి సహనం నశించి పిల్లలమీద విసుక్కోడం మొదలు పెట్టింది.. "ఊరిఖే మా తాతలు నేతులు తాగారు అని తల్చుకుంటే ఉపయోగం ఏముందీ.. ఇప్పుడు నోట్లోకి ముద్ద వెళ్ళే మార్గం చూడాలి కానీ.." అంటూ.. వీధి గదిలో ఉన్న పెద్ద మనుషులిద్దరి గొంతులూ పెద్దవి కావడం తో వాళ్ళ గొంతుల ముందు పాపం అమ్మమ్మ గొణుగుడు వినిపించేది కాదు..
పాపం మీ అమ్మమ్మ గారి పరిస్థితి...ప్చ్..
రిప్లయితొలగించండిఅసలు అమ్మమ్మ ఆ తరం వారు కాబట్టి అలా సహనంతో భరించారు గానీ ఇప్పటివారు ఎవరైనా ఇంటికి వచ్చి అలా విసిగిస్తే కాఫీ కప్పులో ఓ చెమ్చాడు కారం వేసి కసి తీర్చుకుంటారు కదండీ..:)
ప్చ్ ...పాపం గోపాలరావుగారు !
రిప్లయితొలగించండిబాగుంది, కానీ ఎందుకో అసంపూర్తి గా ఆపేసారు అనిపించింది. కంక్లూజన్ ఉంటే బాగుండేదేమో
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండిఇది కూడా ఏ కధనో, నవలనో పరిచయం చేస్తూ వ్రాయలేదు కదా అని తెగ అనుమానం వచ్చేసింది. అంత ఫిక్షనల్‌గా అనిపించింది ఆ పిల్ల జమీందారు క్యారెక్టరు. మీకిలాంటి వాళ్ళు కూడా ఎదురయ్యారన్న్నమాట. మిగతావాళ్ళ గురించి కూడా త్వరగా చెప్పెయ్యండి.
రిప్లయితొలగించండిబాగుంది. ఇన్ని ఇబ్బందులు లేకపోయినా, మేమూ మా ఇంటికి వచ్చే కొందరి వల్ల ఇబ్బందులు పడేవాళ్ళం. కొందరు ఎంత సేపైనా జిడ్డులా అసలు వదిలేవాళ్ళు కాదు.
రిప్లయితొలగించండినమస్కారం మురళి గారు, నేను మీ బ్లాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. ముఖ్యం గా మీ చిన్నప్పటి విషయాలు మీరు రాశే విధానం చాలా బాగుంటుంది. మీ పాత బ్లాగ్స్ అన్నీ కూడ లెక్కప్రకారం కిందనించి మీదకి చదివి, ఈ మధ్యనే ముగించాను. మీకు కామెంట్ రాసే అవకాసం కొసం చూస్తూ ఉన్నాను. మీ బ్లాగ్ తెలుగు బ్లాగ్స్ లొ నా ఫెవరెట్ బ్లాగ్స్ లో ముందు ఉంటుంది. మీ బ్లాగ్ ఫొల్లౌఎర్స్ లో జాయిన్ అవ్వొచ్చా?? మీ అనుమతిస్తే సంతొషిస్తాను.
రిప్లయితొలగించండిపాపం వినేవాళ్ళు వుంటే చెప్పుకుంటారు ...గొప్పకి కాకపోయినా తన జ్ఞాపకాలు ....నాకైతే గోపిఅన్నయ్య మీద జాలి అన్పించిందండీ ....
రిప్లయితొలగించండిఅయ్యో పాపం అనిపిస్తుంది గోపాలరావుగారిని తలచుకుంటే!!
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: నిజమేనండీ.. సందేహం లేదు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: ప్చ్.. ఏం చెయ్యగలమండీ? ..ధన్యవాదాలు.
@లక్ష్మి: ఇవి మా చిన్నప్పుడు అమ్మ మాకు చెప్పిన విశేషాలండీ.. గోపాలరావు గారు వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో కథలు కథలు గా చెప్పింది అమ్మ.. కథ అయితే కంక్లుజన్ ఇవ్వొచ్చు కానీ జరిగినవాటికి, అందులోనూ నేను ప్రత్యక్షంగా చూడని వాటికి.... అయినా ఇకపై మీ సూచనని గుర్తుపెట్టుకుంటాను.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: :-) :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భవాని: యెదురవుత నాక్కాదండి.. అమ్మకి.. ఇవి అమ్మ చెప్పిన కబుర్లు.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: అలాంటి అనుభవాలు మాకూ ఉన్నాయండి.. ధన్యవాదాలు.
@రూత్: చాలా చాలా ధన్యవాదాలండీ.. ఫాలోయర్ గా చేరడానికి నా అనుమతి అవసరం లేదు.. 'బ్లాగ్మిత్రులు' దగ్గర క్లిక్ చేసి జాయినవ్వండి.. అన్నట్టు మీ 'ముద్దమందారం' చాలా బాగుంది..
రిప్లయితొలగించండి@చిన్ని: మరి మా అమ్మమ్మ, అమ్మ వాళ్ళ సంగతి ఏమిటి చెప్పండి? ..ధన్యవాదాలు.
@పద్మార్పిత: ఆయనతోపాటు నాకు అమ్మమ్మ వాళ్ళ మీద కూడా అలాగే అనిపిస్తుందండీ.. ధన్యవాదాలు.
అప్పుట్లోనే కాదు, ఇప్పట్లోకూడా ఈ పరంపర నడుస్తూనే ఉంటుంది. నేను కోడ్ రాసానంటే అసలు ఏ ప్రాజెక్టైనా గడువుకన్నా ముందే ఐపోవాల్సిందే, నేను సర్వర్ ని ఇలా టచ్ చేస్తే చాలు ఏ సమస్యైనా తీరిపోవాల్సిందే, నేను పట్టుపట్టికూర్చోవాలే కానీ ఏ సాఫ్ట్వేర్ ఐనా ఇట్టే నేర్చేస్కుని దున్నేస్తా - ఇలా వెళ్తూనే ఉంటాయ్ గా!! ఇక బోదకాలుకి వెండిపట్టీల బదులు, వాడికేమీ రాదు, వాడి కోడంతా బొక్కలే, వాడుజూడు రాజాలా తిరుగుతాడేం పనిమాత్రం రాదు, ఆమెచూసావా ఎంత టిప్పుటాపుగా వచ్చిందో కోడంతా బూతులే ఇలా! :):)
రిప్లయితొలగించండిఇది మాత్రం అదిరింది
>>గోపాల రావు గారి మిగిలిన ఆస్తిలో చాలా భాగం వ్యాజ్యాల నిమిత్తం ఖర్చయి పోవడం తో....
నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు, ఇలా చిక్కుకుపోయి, అటులాక్కోలేక ఇటు పీక్కోలేక లక్షలకొద్దీ ఆస్థీ ఉన్నా, తినటానికి అణాలేక కొట్టకలాడుతున్నాయి...
ఇలా చచ్చినట్టు వినాల్సిన ఇరుకు సందర్భాలు ప్రతి ఒక్కళ్ళం ఎదుర్కున్నవే. నాకో స్నేహితురాలు కొంచం పెద్దావిడే, (నా కున్న చిన్న స్నేహితురాలు 16 ఏండ్లది, ఇంకో ఆవిడ 50 ఏండ్ల వారు) ఎపుడో ఆవిడ పెళ్ళి లోను ఆ తరువాత అత్తగారింట్లోను ఆవిడ పడ్డ బాధలూ,ప్రత్యక్షం గా ఆ రోజుల్లో ఆయన (ఆవిడ భర్త)సపోర్ట్ చెయ్యలేదని ఈ రోజుకీ అందరి ముందు సాధిస్తుంది , నా కైతే ఓ 20 సార్లు చెప్పి ఉంటుంది. ఆవిడ ఫోను రాగానే మావారు లాప్ టాప్ తీసుకుని బెడ్ రూములోకు వెళ్ళిపోతారు. మా పిల్లలు ఓ కొత్త సీడీ తీసుకుని ఆన్ చేసి మాం! ప్లీజ్! మా రూం లోకి కార్డ్లెస్స్ తీసికెళ్ళవా అని ముందు సైగలతోను ఆ తరువాత చెవిలోను చెబుతారు, నేనా కాల్ ముగించేలేపు నాకు ఆదివారం సంపూర్ణంగా ఐపోయి మా ఇంటిల్లపాదీ నిద్ర పోతూ ఉంటారు.
రిప్లయితొలగించండిఇలాంటి ఎక్ష్ పిల్ల జమీందార్లు, ఎప్పుడంటే అప్పుడు అలా విసిగిస్తుంటే, ఫ్రీ గా తిరగడానికి లేకుండా "ఆడవాళ్ళ స్వేచ్హని" హరించే వాళ్ళని చూస్తుంటే, కోపం రాదా మరి. మీ అమ్ముమ్మ గారు చాలా ఎక్కువగానే భరించారని నా అభిప్రాయం. పాపం.
రిప్లయితొలగించండిచాలా బాగుందనే పాతపాటకు కొత్త పదాన్ని వెతికి వెతికి వచ్చేసరికి ఇంత లేటైంది మరి..:)
రిప్లయితొలగించండినాకేమీ "గోపీ అన్నయ్య" పాపం అనిపించలేదు.కొందరితో రెలేషన్ అలా ఏర్పడుతుంది..మాట్లాడుతూంటే సమయం తెలీకుండా కాలం గడిచిపొతుంది.అది మాట్లాడుకునే వాళ్ళకే అర్ధం అవుతుంది.
కాలేజీ రొజుల్లో మా ఇంటి దగ్గర ఒకమ్మాయి ఉండేది.మేము స్నేహితులం కాకపోయినా రోడ్డు మీద కలిసినప్పుడల్లా చాలా సేపు మాట్లడుకుంటూండేవాళ్ళం.నా కన్నా 2,3ఏళ్ళు పెద్దదే తను.ఎవ్వరూ పిలవని పేరుతో నన్ను పిలిచేది.
వాళ్ళు ఊరు మారిపోయేదాకా ఆ రోడ్డే మా మీటింగ్ ప్లేస్..
గంట,గంటన్నర తక్కువ ఏ రోజునా మాటడుకుని ఎరుగం..రోడ్దు మీద అటుగా వెళ్ళిన వారు వెనక్కు వచ్చేసేవారు కాని మేము మాత్రం అలానే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం....మేడ మీంచి అమ్మ పిలిచే దాకా...వాళ్ళ వాళ్ళు తనని పిలిచేదాకా...
ఇవాళీ పోస్ట్ చూసే సరికీ ఆ అమ్మాయి గుర్తు వచ్చిందండి.. ఇప్పుడెక్కడుందో మరి..Thanks to your post which made me nostalgic.
బాగుంది పాపం గోపలరావు గారి కధ.మా నాన్న గారు లాయర్ కదా.. చూస్తుండే వాళ్ళం ఇలాంటి వాళ్ళను కాని మా అమ్మ కు సణిగే పని లేదు, మా నాన్న గారే కట్ చేసే వారు. నాకైతే జాలి లేదు గోపాల రావు గారి మీద.భాస్కర్ గారు అన్నట్లు ఇప్పుడు కూడా, ఇక్కడ కూడా బోలెడంతమంది గోపాల రావు గార్లను చూడటం మూలం గానేమో మరి.
రిప్లయితొలగించండిమా ఇంట్లో అయితే, ఇలాంటి వాళ్ళని "జిడ్డు చుట్టాలు" అంటాం.
రిప్లయితొలగించండితరువాత గోపాలరావుగారు ఏమయ్యారు?
రిప్లయితొలగించండిilanti valla vallane mallik cartoon antha nachedhi
రిప్లయితొలగించండి"nanna neetho matladuthunna nasagadu vellipothey amma upma pedathanandhi"
@భాస్కర్ రామరాజు; నిజమే.. ఇప్పటికీ చాలా మంది కనిపిస్తూ ఉంటారు.. కానీ అమ్మ వాళ్లకి ఇంటిల్లపాదికీ ఇబ్బంది, గోపాలరావుగారు వస్తే.. అదొక్కటే సమస్య :):) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సునీత: మీ కుటుంబ సభ్యుల ప్రిపేర్డ్ నెస్ ముచ్చట గొలుపుతోందండీ.. ఎంతగా అలవాటు పడిపోయారో కదా.. ధన్యవాదాలు.
@జయ: శేఖర్ పెద్దగోపు గారు చెప్పినట్టు ఆవిడ ఆకాలం మనిషి కదండీ.. అదీ సంగతి.. ధన్యవాదాలు.
@తృష్ణ: అలా మాట్లాడడం తప్పు అని కాదండీ.. కానీ వెనుక వాళ్ళ ఇబ్బందులు వాళ్లకి ఉన్నాయి కదా.. వీధిలో ఉన్న పెద్ద మనిషి కి మర్యాద ఇవ్వాలి..కానీ ఎంతసేపు?? అదీ సమస్య.. ఎవరికీ ఇబ్బంది లేకపోతె యెంత సేపైనా మాట్లాడుకోవచ్చు.. ఆ అమ్మాయి గురించి ఒక టపా రాయండి వీలయితే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భావన: అమ్మ వాళ్ళు బాగా సఫర్ అయ్యారండీ.. తను చాలాసార్లు తల్చుకుంది.. వాళ్ళ అక్క చెల్లెళ్ళు కలుసుకున్నప్పుదల్లా మర్చిపోకుండా గోపీ అన్నయ్యని తిట్టుకుంటూ ఉంటారు, ఇప్పటికీ :):) ధన్యవాదాలు.
@కిరణ్మయి:'జిడ్డు చుట్టాలు' పేరు బాగుందండీ.. ధన్యవాదాలు.
@బోనగిరి: కొన్నాళ్ళకి కాలధర్మం చెందారండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మోహనవంశీ: బాపు-రమణ 'బుడుగు' లో 'మినపరొట్టి' సన్నివేశం కూడా ఇలాగే ఉంటుంది.. గమనించారా? ..ధన్యవాదాలు.