శుక్రవారం, సెప్టెంబర్ 11, 2009

స్నేహితుడు

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఒక విషయంలో చాలా అదృష్టవంతులు. ఆ విషయం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముఖ్యమంత్రి పదవి పొందడం కాదు.. అన్నీ తానే అయ్యి రెండో సారి కూడా పార్టీని గెలిపించడం కాదు.. ఎంత బలమైన శత్రువుతోనైనా మడమ తిప్పని పోరాటం చేయగలగడమూ కాదు.. మరి?? ఒక 'గొప్ప' స్నేహితుడిని సంపాదించుకోవడం. ఆ మిత్రుడి పేరు కెవిపి రామచంద్ర రావు.

అరవై ఒక్క సంవత్సరాల కెవిపి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకి కేంద్రబిందువు. పార్టీ రాష్ట్ర శాఖకీ, హైకమాండ్ కీ మధ్య వారధి. వైఎస్ వారసుడి ఎంపికలో పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి. వైఎస్ జీవించి ఉన్నంతకాలం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదున్నరేళ్ల కాలంలోనూ, ఇష్టులకి 'చాణుక్యుడి' గానూ, కిట్టని వాళ్లకి 'రాజ్యాంగేతర శక్తి' గానూ కనిపించిన కెవిపి కి వైఎస్ తో నలభై ఒక్క సంవత్సరాల అనుబంధం.

విద్యార్ధి నాయకుడు మొదలు, ముఖ్యమంత్రి వరకు వైఎస్ చేపట్టిన ప్రతి పదవి వెనుక, తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక, పాదయాత్రతో సహా వేసిన ప్రతి అడుగు వెనుకా కెవిపి ఉన్నారు. ఇన్ని మాటలెందుకు.. కెవిపి మాట వైఎస్ కి సుగ్రీవాజ్ఞ. ఆయన గీసిన గీత లక్ష్మణ రేఖ. వాళ్ళిద్దరి పరిచయం, అది స్నేహం మారి ధృడంగా కొనసాగుతున్న వైనాన్ని మొన్నటి స్నేహితుల దినోత్సవం నాడు వాళ్ళిద్దరూ సాక్షి 'డబుల్ ధమాకా' కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

అప్పటికే వాళ్ళిద్దరి స్నేహాన్ని గురించీ కొంత తెలిసినా, ఆ ఇంటర్వ్యూ వల్ల పూర్తిగా తెలుసుకోగలిగాను. ఆ ప్రభావమే కాబోలు, సరిగ్గా నెల్లాళ్ళ తర్వాత వైఎస్ మరణ వార్త తెలియగానే నా కళ్ళు టీవీ చానళ్ళలో కెవిపి కోసం వెతికాయి. శవ పేటికని తడుముతూ, మిత్రుడి కోసం వెతుక్కున్న కెవిపి ని చూడగానే నాకు తెలియకుండానే - మరణ వార్త విన్నాక మొదటిసారిగా - నా కళ్ళు తడిశాయి. "ఎంత అదృష్టవంతుడివి వైఎస్" అనుకోకుండా ఉండలేక పోయాను.

తన ఏకైక ప్రాణ స్నేహితుడిని కోల్పోయిన కెవిపి ఇప్పుడు ఏకాకి. గడిచిన పది రోజుల్లోనే ఆయనకి పదేళ్ళ వయసు మీద పడింది. ఇంత దుఖం లోనూ మిత్రుడి కుటుంబంకోసం ఆయన పడుతున్న తపన, శ్రమ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మిగిలిన రాజకీయ నాయకుల్లాగా ఆ తపనంతా కేవలం తన పదవి నిలుపుకోడం కోసమే అనిపించడం లేదు. తప్పదు కాబట్టి చేస్తున్నారన్న భావనా కలగడం లేదు. ఆయన చర్యల్లో కనిపిస్తున్న పట్టుదల, అంకిత భావాలే ఇందుకు కారణం కావొచ్చు.

"స్నేహితుడంటే ఇలా ఉండాలి.." అని పదే పదే అనిపిస్తోంది కెవిపి ని చూస్తుంటే. ప్రస్తుత పరిస్థితులని బట్టి భవిష్యత్ రాజకీయ సమీకరణాలు మునుపటిలా ఉండవన్న సంగతి ఆయన ఊహించలేనిదేమీ కాదు. అన్నీ అనుకున్నట్టే జరిగినా భవిష్యత్తులో తన పాత్ర మునుపటంత శక్తివంతంగా ఉండదన్నదీ తెలిసే ఉంటుంది. అందుకే కెవిపి చర్యల్లో స్వార్ధాన్ని చూడలేక పోతున్నా.. తను చేస్తున్న ప్రతి పనీ తన ప్రాణ మిత్రుడికోసమే చేస్తున్నారేమో అనిపిస్తోంది.. మిత్రుడికి అర్పిస్తున్న నివాళిలా కనిపిస్తోంది..

25 కామెంట్‌లు:

  1. hhahahahah........daily u r writing post...u have lot of patiency,.....great ...keep itup

    రిప్లయితొలగించండి
  2. mmhooooo ...KVP ki CM ayye chances takkuva ..so jagan kosam try chestunnaru anukontanu ....
    YSR CM ga unnappudu KVP ki personal benifits yem leka pothe ippudu kooda niswardham ani oppukontanu ...YSR sampadinchukonte chaalu ani KVP anukonnaraaaa...ayyundaka povachu ...

    Appudu YSR CM ga unnappudu KVP ki unna comforts/powers malli Jagan CM ayithe vachestayi ..


    Friend ship ni blame cheyyalani kaaadu ...monna monna ne new govt. form ayyindi ..ippudippude yevarikem kavalo choosukontunnaru ...YSR sudden ga vellipothe avvanni nilabettukovadam kastam ....home minister antunnadi ...YSR maakintha chesaru , intha pedda post icharu ...so valla abbayi kosam memu kasta padathamu ani ....isn't it mutual understanding????

    రిప్లయితొలగించండి
  3. factionists families lo ila nammakastudu/friend undatam chala important la unnadu ...movies kooda boldanni ive kada chepthayi ....

    duryodhanudu, karnudu koodaaa manchi friends ...kani KVP ni karnuditho polchalekunnanu ...:)

    రిప్లయితొలగించండి
  4. ఆగస్టు 24న బాపు గారిని కలిసినపుడు బాపుగారు వేసిన KVP, YSR (ఇద్దరి క్రింద కృష్ణార్జునులను గీసిన) బొమ్మ చూపించారు. బొమ్మ చాలా బాగుంటుంది. అపుడే బాపు గారు వారి స్నేహం గురించి చెప్పారు.

    రిప్లయితొలగించండి
  5. ఏమో నాకు వాళ్ళ స్నేహం మీరనుకున్నంత పవిత్రంగా అనిపించదు.
    రాష్ట్రాన్ని చెరిసగం పంచుకునా వాళ్ళలానే అనిపిస్తుంది.
    తప్పు అనిపిస్తే సారీ

    రిప్లయితొలగించండి
  6. @Vinay Chakravarthi.Gogineni: This is my personal diary, which i made public. I am writing my thoughts and opinions here. I got your point. Thank you.

    రిప్లయితొలగించండి
  7. @మౌళి: "ప్రస్తుత పరిస్థితులని బట్టి భవిష్యత్ రాజకీయ సమీకరణాలు మునుపటిలా ఉండవన్న సంగతి ఆయన ఊహించలేనిదేమీ కాదు. అన్నీ అనుకున్నట్టే జరిగినా భవిష్యత్తులో తన పాత్ర మునుపటంత శక్తివంతంగా ఉండదన్నదీ తెలిసే ఉంటుంది." అని చివరి పేరాలో రాశాను. వ్యక్తులుగా వాళ్ళు ఎలాంటి వాళ్లైనా కావొచ్చు, ఇక్కడ నేను ప్రస్తావించింది వాళ్ళ స్నేహం గురించి మాత్రమే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. రాజకీయాలగురించీ,మీరు రాసిన వాళ్ళ గురించీ తెలియదు కానీ నాకు తెలిసినది ఒకటుంది..స్నేహాలను చెయ్యటం చాలాతేలికే,కానీ కాలప్రవాహంలో వాటిని నిలబెట్టుకోవటం కష్టం...అలా నిలబడేదే నిజమైన స్నేహం..!!

    రిప్లయితొలగించండి
  9. @విజయ్ వర్ధన్: ఎందుకో అనిపించిందండీ.. బాపు గారు వీళ్ళిద్దరి బొమ్మా గీస్తే ఎలా ఉంటుందా అని? త్వరలోనే చూడబోతున్నామన్న మాట.. ధన్యవాదాలు.
    @మాఊరు: ఇక్కడ విషయం 'పవిత్రత' కాదండి, ధృడత్వం.. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా చెదరకుండా కొనసాగడం.. వ్యక్తులుగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న విశ్లేషణ జోలికి నేను వెళ్ళలేదండి.. ఇక మీ అభిప్రాయం మీరు చెప్పారు.. సారీ అవసరం లేదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. నలభయ్యేళ్ళ స్నేహం...నిజంగానే సామాన్యమైన విషయం కాదండి.

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు చాల బాగా రాసారండి ! డబల్ ధమాకా ఇప్పుడే చదివాను చాల నచ్చింది మంచి లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు .
    నాకు వీళ్ళిద్దరూ నచ్చరు కాని వాళ్ళ స్నేహబంధం నుంచి చాల నేర్చుకోవాలని ఎప్పుడు అనుకోనేద్దాన్ని. నాకు ఎప్పుడు వీళ్ళని చూసిన దుర్యోధనుడు, కర్ణుడు గుర్తుకొస్తారు:)

    రిప్లయితొలగించండి
  12. "శవ పేటికని తడుముతూ, మిత్రుడి కోసం వెతుక్కున్న కెవిపి" మీరు చెప్పిన ఈ దృశ్యం టీవీ లో చూసినప్పుడు వాళ్ళిద్దరి స్నేహమెంత గొప్పదో నాకు తెలీదు. (అసలు వై.ఎస్.ఆర్ గారు చనిపోకముందు నాకు కేవీపి ఎవరో తెలీదండి - పాలిటిక్స్ లో నేను చాలా పూర్)..కాని ఆ దృశ్యం చూసినప్పుడు నా కళ్ళు చమర్చాయి..ఇప్పుడు మీ టపా చదివి మళ్ళీ తడిశాయి. ఎంత గొప్ప స్నేహం వాళ్ళిద్దరిదీ..

    రిప్లయితొలగించండి
  13. meeru vrasinadi sneham gurinchi matrame ..kani adi valla private vishayam kaadu ...aa interview chadivithe, YSR paripalana KVP help tho chesaru anipistondi ...ante they shared the state ...if KVP is that great person he should have taken a a legally acceptable role ...(finally he became MLC but.) ..so they put in some woman as home minister and KVP guide YSR on home minister's role is etc..(just an example ..) is a friendship to appriciate ....hmmm...little bit worried....

    a person who can do this much from back end , and also has capacity to pressurise high command for making jagan CM ...I wonder why he him self can't be CM???? as a friend he also can be CM and take forward the schemes started by YSR ...why Jagan ...?

    KVP can demand anything to Sonia...and he can not continue the administration????


    see KVP can control rosaiah also from now on ...with a tag of YSR's friend ..

    రిప్లయితొలగించండి
  14. మురళి గారు మీరిచ్చిన లింక్ చదివాను . ఇంటర్వ్యు ఆసక్తికరంగా సాగింది .ముఖ్యంగా "ఒక స్నేహితుడి కష్టాల్లో తోడుండటం కష్టం కాదుగానీ ...అతను వృద్ధిలోకి వస్తుంటే తోడుండటం కష్టం " ఇది అక్షర సత్యం ! "స్టేజ్ కట్టేవాడు స్టేజ్ కట్టాలి ...స్టేజ్ మీద మాట్లాడే వాడు స్టేజ్ మీద మాట్లాడాలి " స్నేహితుల మధ్య ఇగో ఉంటే ఇన్నేళ్ళు వాళ్ల స్నేహం కొనసాగదు . రాజకీయాలు పక్కనపెడితే (వాటిగురించి నాకు తెలీదు కాబట్టి ) వారిద్దరూ ఆదర్శ స్నేహితులన్నది నిర్వివాదాంశం!

    రిప్లయితొలగించండి
  15. @తృష్ణ: నాలుగు దశాబ్దాలు స్నేహాన్ని నిలబెట్టుకోడం వాళ్ళిద్దరి గొప్పదనం అండీ.. వ్యక్తులుగా వాళ్ళు ఎలాంటి వాళ్లైనా కావొచ్చు, నేను రాసింది వాళ్ళ స్నేహాన్ని గురించి.. ధన్యవాదాలు.
    @భవాని: అవునండి.. ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: ఆ ఇంటర్వ్యూ చదివిన నెలరోజులకే ఇలా జరగడం వల్లనో ఏమో, నేను కెవిపి గురించే ఎక్కువ ఆలోచించానండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @ప్రణీత స్వాతి: అవునండీ.. గొప్ప స్నేహం.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: ధన్యవాదాలు.
    @మౌళి: ధన్యవాదాలు.
    @పరిమళం: ఆ క్రెడిట్ వాళ్ళిద్దరికీ దక్కుతుందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. ఆయన ఆశయాలను తీర్చి చూపించాలని కొరుకుంటూ ..
    స్నేహనికి ఒక మంచి example మీ పొస్ట్ బావుంది

    రిప్లయితొలగించండి
  18. మీదైనా రీతిలో 'స్నేహం' చూపించారు ....ఉదాహరణ తో ...బాగుందండీ .

    రిప్లయితొలగించండి
  19. I don't follow politics and don't like to be part of any related. Yet as per friendship this is an interesting article. Friends are what presents yourself otherwise.

    రిప్లయితొలగించండి
  20. సరిగ్గా చెప్పారు.

    వై.ఎస్ మరణం తరవాత దుఃఖించిన వాళ్ళను ఎంతోమందిని టీవీల్లో చూసాం. వాళ్ళందరికంటే వై.ఎస్‌కు ఆప్తుడు కేవీపీ. ఎక్కడా అతి లేకుండా, సమతుల్యత కోల్పోకుండా, ఆయన మసలిన తీరు నాకెంతో నచ్చింది. శవపేటికపై తలపెట్టి ఆయన నిలబడ్డ దృశ్యం ఆయన మనసులోని బాధను బయటపెట్టింది.

    తండ్రికి ఇంత మంచి స్నేహితుడుండటం వై.ఎస్‌ బిడ్డల అదృష్టం కూడా!

    రిప్లయితొలగించండి
  21. vari sneham gurinchi chadivinappudu nenu chala asuya paddanu .nijanga varu adrushtavanthulu .

    రిప్లయితొలగించండి
  22. @హరేకృష్ణ: నాకు నచ్చింది కూడా ఆ స్నేహమేనండీ.. ధన్యవాదాలు.
    @చిన్ని: అలాంటి స్నేహితులు అరుదుగా ఉంటారండీ.. ధన్యవాదాలు.
    @ఉష: you are absolutely right.. thank you.

    రిప్లయితొలగించండి
  23. @చదువరి: నిజమేనండీ.. రాజకీయాల పరంగా చూసిన ఇప్పుడు కెవిపి నే జగన్ కి కొండంత అండ.. ధన్యవాదాలు.
    @అనఘ: అవునండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. ఇక్కడా మురళిగారు రాసింది కేవిపి గురించో, వై.ఎస్ గురించోకాదు.వారిద్దరిమద్యన ఉన్న స్నేహాన్ని గురించిమాత్రమే. చదివేవాళ్లు దాన్ని అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.
    మురళిగారు మీఅనుమతిలేకుండా వకాల్తా తెసుకున్నందుకు క్షమించగలరు. నాబ్లాగులో వై.ఎస్ గురించి రాసేప్పుడు ఈయన మిస్ అయ్యడే అని బాధపడ్డాను. ఇప్పుడు మీటపా కొంత ఊరట. రాజకీయనాయకులకు స్నేహితులు దొరకడాం చాలాకష్టం. అందరినీ వాళ్లు నమ్మలేరు.( అందుకు వాళ్లని నిందించలేం.) వాళ్లునమ్మిన వాళ్లు తిరిగి అలాంటి అభిమానాన్ని ఇచ్చే స్థితిలో ఉండకపోవచ్చు. నిజంగా వై. ఎస్ అదృష్టవంతుడూ.

    రిప్లయితొలగించండి
  25. @సుబ్రహ్మణ్య చైతన్య: నా టపా స్నేహాన్ని గురించే అని క్లియర్ గానే రాసినా, సరిగా కమ్యూనికేట్ చేయలేక పోయానేమో అనిపించిందండి, కొన్ని వ్యాఖ్యలు చూశాక.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి