అడుసుమిల్లి బసవపున్నమ్మకీ పర్వతనేని పరశురామయ్యకీ ఓ పెళ్ళి పందిట్లో మొదలైన శతృత్వం పెరిగి పెద్దదై వాళ్ళ ఊరి మొత్తానికి సమస్యై కూర్చుంది. విడిపోయిన ఆ రెండు కుటుంబాలూ ఏకమైతే తప్ప ఊళ్ళో ఎవరికీ మనశ్శాంతి దొరకని పరిస్థితి. అలాగని సయోధ్యకి ప్రయత్నించే ధైర్యం ఎవరికీ లేదు. అటు బసవపున్నమ్మన్నా, ఇటు పరశురామయ్యన్నా అందరికీ హడల్ మరి. ఈ సమస్య ఎలా పరిష్కారమయ్యిందన్నదే ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన 'పెద్దరికం' సినిమా కథ.
మలయాళంలో విడుదలై విజయం సాధించిన 'గాడ్ ఫాదర్' సినిమాని తెనిగించారు దర్శక నిర్మాత ఏ.ఎం. రత్నం. నేటివిటీ విషయంలో అక్కడక్కడా కొంచం తడబడినా, దర్శకుడిగా మొదటి సినిమా కాబట్టి మొత్తమీద బాగా తీసినట్టే అనుకోవాలి. బసవపున్నమ్మ, పరశురామయ్య పాత్రలు రెండూ శక్తివంతమైనవి. వీటికి భానుమతి, మళయాళ నటుడు ఎన్.ఎన్. పిళ్ళై లను ఎంచుకున్నాడు దర్శకుడు. బసవపున్నమ్మ మనవరాలు జానకిగా తమిళ నటి సుకన్య, పరశురామయ్య నాలుగో కొడుకు కృష్ణమోహన్ గా జగపతిబాబు నటించారు.
అటు పరశురామయ్యకీ ఇటు బసవపున్నమ్మకీ నలుగురేసి కొడుకులు. పరశురామయ్య పెద్ద కొడుక్కి చేయాలనుకున్న అమ్మాయిని, పెళ్ళి మండపం నుంచి తీసుకొచ్చి తన పెద్ద కొడుక్కిచ్చి పెళ్ళి చేస్తుంది బసవపున్నమ్మ. ఆ తగాదాలో పరశురామయ్య భార్య చనిపోగా, బసవపున్నమ్మ భర్తని నరికి తను జైలుకి వెళ్తాడు పరశురామయ్య. తన ఇంట్లో స్త్రీలకి ప్రవేశం లేదని ప్రకటించిన పరశురామయ్య, ఏ ఒక్క కొడుక్కీ పెళ్ళి చేయడు. చివరి కొడుకు కృష్ణమోహన్, జానకి ఒకే కాలేజీలో లా చదువుతూ ఉంటారు.
రాష్ట్ర హోం మంత్రితో జానకి పెళ్ళి నిశ్చయం చేస్తుంది బసవపున్నమ్మ. అయితే పరశురామయ్య కారణంగా ఆ పెళ్ళి రద్దు కావడంతో రెండు కుటుంబాల మధ్యా విభేదాలు మళ్ళీ భగ్గుమంటాయి. కృష్ణమోహన్ తో ప్రేమ నటించి, అతను ప్రేమలో మునిగాక అతనిద్వారా అతని కుటుంబాన్ని నాశనం చేసి పగ తీర్చుకోమని జానకికి సలహా ఇస్తుంది బసవపున్నమ్మ. అటు, కృష్ణమోహన్ కి కూడా ఇలాంటి సలహానే ఇస్తాడు అతని స్నేహితుడు ప్రసాద్ (సుధాకర్). ఒకరితో ఒకరు ప్రేమ నటించడం మొదలుపెట్టిన కృష్ణమోహన్, జానకి నిజంగానే ప్రేమలో పడిపోతారు. బద్ధ శతృవులైన రెండు కుటుంబాలనీ ఒప్పించి ఎలా పెళ్ళి చేసుకున్నారన్నదే సినిమా ముగింపు.
సినిమా చూడడం పూర్తి చేశాక కూడా బసవపున్నమ్మ, పరశురామయ్య గుర్తొస్తూనే ఉంటారు. బసవపున్నమ్మ పాత్ర నాయకురాలు నాగమ్మని పోలిఉంటుంది. భానుమతి ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఇక పరశురామయ్యగా చేసిన పిళ్ళై కి తెలుగులో ఇది తొలి సినిమా(బహుశా ఏకైక సినిమా). భానుమతితో పోటీ పడి నటించారనడానికి అభ్యంతరం లేదు. జగపతిబాబు, సుకన్య ఇద్దరికీ నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు. జగపతిబాబుకి వేరే ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పించారు. ప్రసాద్ పాత్రలో సుధాకర్, జగపతిబాబు అన్నావదినలుగా చంద్రమోహన్, కవిత చక్కని హాస్యం పండించారు. లాయర్ గా కనిపించిన అల్లు రామలింగయ్య నటన క్లైమాక్స్ సన్నివేశాల్లో మెప్పిస్తుంది.
'పెద్దరికం' అని తలచుకోగానే మొదట గుర్తొచ్చే పాట జేసుదాస్ పాడిన 'ఇదేలే తరతరాల చరితం...' వెంటాడే పాట ఇది. జానకి పెళ్ళి సందర్భంలో వచ్చే 'ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే..' పాట అప్పట్లో ప్రతి పెళ్ళి వీడియోలోనూ వినిపించిది. ఈ రెండు పాటలూ నాకు చాలా ఇష్టం. తరచూ వింటూ ఉంటాను. రెండు డ్యూయట్లు 'నీ నవ్వే చాలు చామంతీ మాలతీ..' 'ప్రియతమా.. ప్రియతమా..' వినడంతో పాటు చూడడానికీ బాగుంటాయి. రాజ్-కోటి సంగీతంలో పాటలన్నీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే. వీటితో పాటు నేపధ్య సంగీతమూ బాగుంటుంది.
చాలా రోజులపాటు నటి విజయశాంతి దగ్గర హెయిర్ డ్రెస్సర్ గా పనిచేసి, 'కర్తవ్యం' తో నిర్మాతగా మారిన రత్నం రెండో సినిమా ఇది. శ్రీ సూర్య చిత్ర పతాకంపై నిర్మాణంతో పాటు దర్శకత్వ బాధ్యతనూ తీసుకున్నారు. పరశురామయ్య, బసవపున్నమ్మల కొడుకుల చేత తెల్లని పంచెలని ధరింప జేయడం, పోరాట దృశ్యాలు లాంటిచోట్ల మలయాళం వాసనలు తగిలినప్పటికీ సినిమా ఆసాంతమూ కట్టిపడేసే విధంగా తీయడం మెచ్చుకోవాల్సిన విషయం. షూటింగ్ లో సింహభాగం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. సిద్ధిఖీ కథకి పరుచూరి సోదరులు సంభాషణలు అందించారు. ఇప్పటికీ చూడడం మొదలుపెట్టిన ప్రతిసారీ సినిమాలో లీనమైపోయి పూర్తిగా చూసే సినిమా ఇది.
manchi cinema. sarada ga untundi,
రిప్లయితొలగించండిthank you sir,
"'పెద్దరికం' అని తలచుకోగానే మొదట గుర్తొచ్చే పాట జేసుదాస్ పాడిన 'ఇదేలే తరతరాల చరితం...' వెంటాడే పాట ఇది."
రిప్లయితొలగించండిYes! ఇప్పటికీ ఈ పాట కోసమే ఎన్నిసార్లైనా చూస్తుంటాను. మంచి సినిమా! అన్నీ సమపాళ్లలో కుదిరిన సినిమా!
ఈ సినిమా నాకు కూడా చాలా ఇష్టం. చాలా వరకు షూటింగ్ తడ పరిసరాల్లో తీసారు. అన్నదమ్ములందరూ కొట్టుకునే ఒక సీన్ సూళ్ళూరుపేట బజారు వీధిలో తీసారు. నేను అపుడు అక్కడే ఉన్నా, జగపతి బాబు, సుధాకర్, మంజుల భర్త ని చూసాను. పాటలు ఒకదానికొకటి పోటీ పడుతాయి.
రిప్లయితొలగించండినాకు ఇది బాగా నచ్చిన సినిమానండీ. ముఖ్యంగా మీరు పేర్కొన్న పాట హృదయానికి హత్తుకొంటుంది. ఈ సినిమాలో రెండు, మూడు సన్నివేశాలు రాజమండ్రి ప్రక్కనున్న ధవళేశ్వరంలో ఉన్న మా అక్క గారింట్లో తీసారు. చంద్రమోహన్ తన భార్య, పిల్లలను ఉంచిన పెంకుటిల్లు ఉంది కదా అది.
రిప్లయితొలగించండిశ్రీవాసుకి
ఎన్ని సార్లు చూసినా ఈ movie బోర్ కొట్టదు. భానుమతి గారి నటన గురించి మనకు తెలుసు. కాని ఆ ఎన్.ఎన్. పిళ్ళై ని తలచుకుంటే భలే భయ్యం వేస్తుంది ఇప్పటికి! అంత గొప్పగా నటించాడు అతను..మంచి సినిమా మీద పోస్ట్ రాసారు. Thank you!
రిప్లయితొలగించండిఏమిటో, ఈ సినిమా నాకు డబ్బింగ్ సినిమాలాగే ఉంటుంది.
రిప్లయితొలగించండిఒకసారి మాత్రమే, చాలా కష్టపడి చూసాను.
నేనైతే జలతారు వెన్నెల గారితో అటూ ఇటూ చూడకుండా అంగీకరిస్తాను.. పెద్దరికం అంటే నాకు పరశురామయ్యే గుర్తుకువస్తాడు!
రిప్లయితొలగించండిఈ సినిమాలో నాకు బాగా నచ్చేవి -- పరశురామయ్య, ప్రియతమా పాట, చంద్రమోహన్-కవిత ల జంట :-)
@ది ట్రీ : ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@చాణక్య: అవునండీ.. నేటివిటీ ఓ పాలు తగ్గినా అన్నది నా మాట!! ధన్యవాదాలు
@శ్రీ: కొంత రాజమండ్రిలో చేశారండీ.. ధన్యవాదాలు.
@శ్రీవాసుకి: పిల్లలకి కవిత నాట్యం నేర్పే ఇల్లు!! .రెండు ఫైట్స్ గోదారి ఒడ్డున తీశారండీ.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@జలతారు వెన్నెల: పిళ్ళై ని ఎంచుకోడమే తెలివైన నిర్ణయం అండీ.. భానుమతి తో పోటీ పడ్డారు.. ధన్యవాదాలు..
@బోనగిరి: అక్కడక్కడా కొంచం ఇబ్బందండీ.. మొత్తం మీద చూసినప్పుడు నాకు నచ్చుతుంది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@నిషిగంధ: మరి భానుమతి? :-) ..ధన్యవాదాలండీ..
లేదండీ, నాకెందుకో భానుమతి ఇందులో కాస్త ఓవర్ చేసినట్లనిపించింది.. :-)
రిప్లయితొలగించండిఈ సినిమా గురించి మీరిదివరకే ఎప్పుడో రాసినట్లు నేను చదివేసినట్లు, ఇపుడు మళ్ళీ చదువుతుంటే పేరా మొదలెట్టగానే అందులో కంటెంట్ ముందే తెలిసిపోతూ ఉంది ఎందుకంటారూ ? నాకేమైనా అతీంద్రియ శక్తులు వచ్చాయంటారా :)) కొన్ని కామెంట్స్ కూడా చదివినట్లే అనిపిస్తున్నాయ్.
రిప్లయితొలగించండిఇక సినిమా విషయానికి వస్తే బసవపున్నమ్మ గారిని మర్చిపోలేకపోయినా, సినిమా గురించి తలచుకోగానే మాత్రం బోసినోరేసుకుని హహ్హహ్హ అంటూ పెద్దగా నవ్వే పిళ్ళై గారే గుర్తొస్తారు. పాటలు మీరు చెప్పినవే నాక్కూడా ఇష్టం అదే క్రమంలో. సుధాకర్ కామెడీ కూడా బాగుంటుంది :)
భలే మంచి సినిమా గుర్తుచేశారు.
రిప్లయితొలగించండి'ముద్దుల జానకి పెండ్లికి మబ్బుల పల్లకి తేవలనే..'
'ఇదేలే తరతరాల చరితం...'
'నీ నవ్వేచాలు..పూబంతీ..'
ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాటలు
మురళి గారు ఆలస్యంగా చూశాను ఈ పోస్ట్. చాలా బాగా రాసారు. మలయాళం రేమకే అయినా తెలుగుదనం ఉట్టిపడుతుంది. పిళ్ళై నటనను ఎప్పటకి మరచిపోలేం. ఆయనకి డబ్బింగ్ పంతులు అనే ఆయన డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ పూర్తైన వెంటనే ఆయన కన్నుమూసారు. అన్నట్టు పిళ్ళై కుమారుడు కూడా మలయాళంలో పేరున్న నటుడే... తెలుగులో విలన్ పాత్రలకి సరిపోతాడు. మనవాళ్ళు ఎందుకో ఇంకా ఆయన్ని దిగుమతి చేసుకోలేదు.
రిప్లయితొలగించండిఅవునండీ...ఎన్నిసార్లు చూసినాబోర్ కొట్టదు....బసవపున్నమ్మగారిల్లు మావూరి మద్దిపాటివారిది :)
రిప్లయితొలగించండి@నిషిగంధ: :-) :-)
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: నేను మరీ రొటీన్ గా రాసేస్తున్నానేమో వేణూ గారూ, ఆలోచించాల్సిన విషయమే :-) :-) .. నేను ఇదే రాయడం అండీ ఈ సినిమాని గురించి.. చంద్రమోహన్-కవిత సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి కదండీ.. ధన్యవాదాలు.
@శ్రీ: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@చక్రవర్తి: మనవాళ్ళకి మలయాళం హీరోయిన్లు నచ్చినంతగా, మిగిలిన నటులు నచ్చరేమోనండీ :-) ధన్యవాదాలు..
@పరిమళం: అవునా!! చాలా బాగుందండీ ఇల్లు.. ధన్యవాదాలు..
Good movie.
రిప్లయితొలగించండి@లక్ష్మణ్: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి