ఆదివారం, సెప్టెంబర్ 18, 2011

సుమనుడిచ్చిన 'ట్విస్ట్'

బుల్లితెరపై ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే సుమన్ బాబు చేసిన తాజా ప్రయోగం 'ట్విస్ట్.' ఇంద్రనాగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రీమియర్ షో పేరులో ఒక ట్విస్టే ఉన్నా, ప్రేక్షకులని మాత్రం మూడుగంటల పాటు అనుక్షణం ట్విస్టుల్లో ముంచెత్తింది. తన కథల్లో హీరో ఎవరు, విలన్ ఎవరు అన్నది ప్రేక్షకులకి సస్పెన్స్ గా ఉంచడం, ఆ సస్పెన్స్ విప్పినవారికి ఖరీదైన బహుమతులు అందించడం అలవాటుగా ఉన్న సుమన్ బాబు (అన్నట్టు 'నాన్ స్టాప్ కామెడీ' శాంత్రో కారు విజేత ఎవరు?) ఈసారి కూడా అదే పోకడని కొనసాగించారు.

ముందుగా కొంచం పిడకల వేట. మహిళా రచయిత్రుల హవా నడిచిన రోజుల్లో వాళ్ళు అలవోకగా రాసేసిన నవలల కారణంగా కనీసం ఓ తరం మహిళలు ఒకలాంటి అసంతృప్తితో బతికేస్తున్నారేమో అనేది మా మిత్రుల మధ్య చర్చల్లో వచ్చే ఒకానొక విషయం. అతి సామాన్యమైన అమ్మాయిని వెతుక్కుంటూ ఓ ఆరడుగుల అందగాడు కారు తాళాలు గాల్లో ఎగరేసుకుంటూ రావడం ఆయా నవలల్లో సాధారణ విషయం అవ్వడం వల్ల, వాటిని చదివిన అమ్మాయిల్లో కొందరైనా అలాంటి వాడు రాక, వచ్చిన వాడిలో నవలానాయకుడి లక్షణాలు కనబడక నిట్టూర్పులు విడిచి ఉంటారు కదా అనుకుంటూ ఉంటాం.

ఈతరం కాలేజీ పిల్లల్లో ఎవరన్నా ఓ కుర్రాడిని - మరీ కెరీర్ ఓరియంటెడ్ కేసుని కాదు - టీకి పిలిచి కబుర్లలో పెట్టి చూడండి. వాళ్ళ నాన్న చిరంజీవో, నాగార్జునో కనీసం అల్లు అరవిందో అయినా కానందుకు వాడిలో ఏమూలో ఉన్న అసంతృప్తిని గమనించొచ్చు. తన తండ్రి ఫలానా అయితే, తను హీరో అవడానికి పుట్టుకతోనే పాస్పోర్టు దొరికేసేది కదా అన్న విషయాన్ని వాడు మర్చిపోలేడు గాక మర్చిపోలేడు. ఇప్పుడీ అసంతృప్తుల జాబితా మన సుమన్ బాబు కారణంగా మరికొంచం పెద్దదయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

ఇన్నాళ్ళూ దొరికిన భార్యతోనూ, పుట్టిన పిల్లలతోనూ, నా అంతటి వాడు లేడనుకుంటూ ఖుషీ ఖుషీగా బతికేస్తున్న కుటుంబరావుల గుండెల్లో చిచ్చు పెట్టేస్తున్నాడు సుమనుడు. "మా నాన్నకో టీవీ చానలూ, సినిమా స్టూడియో ఉండి ఉంటే, నేను కూడా విగ్గు పెట్టుకుని, దొరికిన వీరోవిన్నుతో డ్యూయట్లు పాడుకుని ఉందును కదా.." అని అనేకానేక మంది నిట్టూర్చడానికి కారణం కాబోతున్నాడు. అవును మరి బుల్లితెర మహానటి భావనతో కలిసి 'అందాల తారక.. అరుదైన కానుక..' అనే పాటకి వాళ్ళ నాన్నారి ఫిలింసిటీ వేదికగా వైవిద్యభరితమైన స్టెప్పు లేశాడు మన సుమన్ బాబు.

అడుగడుగునా ట్విస్టులే ఉన్న తాజా ప్రీమియర్ షోను గురించి పూర్తిగా చెప్పాలంటే బ్లాగర్లో గూగులమ్మ ఇచ్చిన చోటు చాలదు. అయినప్పటికీ ఏదో, కొండని అద్దంలో చూపించే ప్రయత్నం. కొండంత మంచి మనసున్న మంచి మనిషి శ్రీరామ్ కి ఏదో శాపం పెట్టినట్టు అన్నీ కష్టాలే. బహుశా ఆ పాత్ర పోషించింది సుమన్ బాబు అని తెలియడం వల్ల శ్రీరామ్ ని లెక్కకి మిక్కిలి కష్టాలు చుట్టుముట్టి ఉండొచ్చు. ఇళయరాజా స్వరాలని గుర్తు చేసేవిధంగా భోలేషా వలీ మీటిన విషాద వాయులీనాల సాక్షిగా శ్రీరామ్ హీనస్వరంతో ఏకరువు పెట్టే కష్టాలని వింటుంటే రాళ్ళైనా కరగాల్సిందే. అలాంటిది రాయిలాంటి పోలీసాఫీసర్ శిరీష (ప్రవళిక) కరగదా?

సరే, కథని మూడు ముక్కల్లోకి కుదించుకుందాం. తన కష్టాలని మర్చిపోవడం కోసం, ఓ పెద్ద నగరంనుంచి బయలుదేరిన శ్రీరామ్ ఆర్టీసీ వారి ఆర్డినరీ బస్సెక్కి, కళ్ళు చెదిరే తన పల్లెటూరి ప్యాలస్ చేరుకుంటాడు. చిన్నప్పుడెప్పుడో చూసిన పని వాళ్ళు చటుక్కున గుర్తు పట్టేసి, ఆనంద భాష్పాలతో ముంచెత్తుతారు. తను పేరు కూడా మర్చిపోయిన చిన్న నాటి స్నేహితుడు వచ్చి, తనని తాను పరిచయం చేసుకుని చెల్లెలి పెళ్లికి ఆహ్వానించడం, ఆ పెళ్ళికూతురు 'వెన్నెల' శ్రీరామ్ కి అంతకు ముందే పరిచయం ఉండడం, 'ముత్యాలముగ్గు' సినిమాలోలాగా తాళి కట్టబోతుండగా పెళ్ళికొడుకుని పోలీసులు అరెస్టు చేయడంతో, నడిచే దేవుడైన శ్రీరామ్ తన స్నేహితుడి కోసం వెన్నెల మెళ్ళో తాళి కట్టేయడం చక చకా జరిగిపోతాయి.

ప్యాలస్ లాంటి సొంతిల్లు వదిలేసి, తన పనివాళ్ళతో సహా బావమరిది మామూలు ఇంటికి మకాం మార్చేస్తాడు శ్రీరామ్ (కాస్ట్ కటింగ్ అనుకుంటా). కాపురం మొదలెట్టబోతుండగా, మొదటి భార్య రాధిక ఆటో దిగడం, అప్పటికే నేను ఎన్నోదో మర్చిపోయిన ట్విస్ట్ ఈ కథలో. వెన్నెలతో సహా అందరూ ఆ వచ్చినావిడ రాధికే అంటారు, ససేమిరా కాదంటాడు శ్రీరామ్. కాదని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నించి భంగపడతాడు. ప్రతి ప్రయత్నంలోనూ ఒక ట్విస్ట్. మరావిడ రాధిక కాకపోతే ఎవరన్నది, మామూలుగా అయితే పోలీసులు లాకప్పులో వేసి ఇంటారాగేట్ చేస్తే తెలిసిపోయే విషయం. కానీ ఆ నిజం శ్రీరామ్ చేత చెప్పించడానికి పోలిస్ డిపార్ట్మెంట్, సి.బి.ఐ. లాంటి సంస్థల్లోపెద్ద ఉద్యోగులంతా పన్లు మానుకుని, మారు వేషాలు వేసుకుని ఇతగాడి చుట్టూ చేరడమే చివరికి అసలైన ట్విస్ట్. సుమన్ బాబా? మజాకానా?

నటీనటులు అందరూ కూడా తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికీ పది రూపాయల అవుట్పుట్ ఇవ్వడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులతో పోటీ పడ్డారు. ప్రతిపాత్రా శ్రీరామ్ ని ప్రతి డైలాగులోనూ పొగిడే విధంగా సంభాషణలు రాయబడ్డాయి. సుమన్ బాబు నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది.. ఎప్పటిలాగే అన్నిభావాలూ అభావంగా పలికించేశాడు. మేకప్,కాస్ట్యూమ్స్ విషయంలో సుమనుడు ఎప్పట్లాగే రాజీ పడలేదు. కాకపోతే రెండు మొదటి రాత్రుల్లోనూ ఒకే దుస్తులు ధరించడం కొంచం నిరాశ పరిచింది. అలాగే తొలి పెళ్ళిలో ధరించిన ఆకుపచ్చ టీ షర్ట్ మళ్ళీ ఓసారి రిపీటయ్యింది కూడా. దర్శకుడు ఇలాంటివి సరిద్దుకోవాలి. టైటిల్స్ దగ్గరనుంచి ప్రతి విషయంలోనూ 'కళ్ళు చెదిరేలా చేయడం' అన్నది ఆశయంగా పెట్టుకున్నాడు దర్శకుడన్నది సుస్పష్టం. కొన్ని సన్నివేశాలు చూసేటప్పుడు కలిగిన కళ్ళు (బుర్ర) తిరుగుడు ఇంకా తగ్గలేదంటే, 'ట్విస్ట్' ఇవ్వడంలో దర్శకుడు కృతకృత్యుడయినట్టే.

35 కామెంట్‌లు:

  1. ఈతరం కాలేజీ పిల్లల్లో ఎవరన్నా ఓ కుర్రాడిని - మరీ కెరీర్ ఓరియంటెడ్ కేసుని కాదు - టీకి పిలిచి కబుర్లలో పెట్టి చూడండి. వాడిలో ఏమూలో వాళ్ళ నాన్న చిరంజీవో, నాగార్జునో కనీసం అల్లు అరవిందో అయినా కానందుకు వాడిలో వాడిలో ఏమూలో ఉన్న అసంతృప్తిని గమనించొచ్చు. తన తండ్రి ఫలానా అయితే, తను హీరో అవడానికి పుట్టుకతోనే పాస్పోర్టు దొరికేసేది కదా అన్న విషయాన్ని వాడు మర్చిపోలేడు గాక మర్చిపోలేడు.
    మీ పరిశీలనాశక్తికి జోహార్లు.

    రిప్లయితొలగించండి
  2. Wav. I was waiting for ur reaction to this world premier. Lucky u . I cdnt hav d fun becos we prefered another channel.

    రిప్లయితొలగించండి
  3. జయహో సుమనాభిమాన సంఘ నాయకా. జయహో

    మొదటి సారి భావనాతీతమైనసుమనోహర యుగళగీతంలో బాబు స్టెప్స్ వేస్తుంటే చూసిన ఆనందం చాలు మురళీ గారూ. ఈ జన్మకి ఇది చాలు నాకు.

    రిప్లయితొలగించండి
  4. మురళిగారు, మీ రివ్యూ చదివాక సినిమా చూసే ప్రయత్నం చేస్తున్నా. నా చావుకి కారణం నెమలికన్ను బ్లాగు ఓనర్ అనే లెటర్ వ్రాసి జేబులో పెట్టుకుని చూస్తున్నా. నా ఆయుష్షు, మీ భవిష్యత్తు ఏం కానుందో మరి.

    రిప్లయితొలగించండి
  5. హ హ ఈ సుమనడికి ఈ పిచ్చ సలహాలు ఇచ్చేదేవరో కాని వాళ్ళు గాని నాకు దొరికితే :)))
    మీకీ నేనో డాక్టరేట్ ఇచ్చేస్తున్నానండి మీరు చేస్తున్న "Ph .d ఇన్ సుమన్ కలాపోషణ" కి గాను :)))

    రిప్లయితొలగించండి
  6. ఆర్యా! మీరు నేర్పిన విద్యయే.. మీరు చూపిన బాటయే! చిత్తగించవలెను. :)

    http://kothavakaya.blogspot.com/2011/09/blog-post.html

    రిప్లయితొలగించండి
  7. wow...నిన్న నేను ఈ ట్విస్ట్ వస్తొంది అని చూసి ఆయన గారి మొదటి రెండు టీషర్ట్శ్ తో మతిపోయింది. సరే ఎలాగో మీరు రాస్తారు కదా అని అనుకుంటున్నాను. మీ లాంటి అభిమానుల్ని ఆయన ఎలా నిరాశ పరచలేదో, మా లాంటి అభిమానుల్ని మీరు కూడా యేమాత్రం నిరాశ పరచలేదు. కాని ఆయన గారి డ్యుయెట్ చూసాను మధ్యలో ( చూడాల్సి వచ్చింది ఎందుకు అంతే ఇంట్లో ట్విస్ట్ ని మొదటి నుంచి చివర దాక చూసి ఆదరించారు వాల్లున్నారు నిన్న)

    రిప్లయితొలగించండి
  8. మీకు అసూయ కాకపోతే మరీ అంత తెగడాలా?
    ధనపూర్వక ధోరణిలో ఆలోచించండి.
    నాకైతే ఆయన్ని చూస్తే నా మీద నాకు విశ్వాసం పెరుగుతుంది.
    నేను కూడా హీరో గా చెయ్యొచ్చని.
    నాకూ కొంచం బట్టతల ఉంది (విగ్గచ్చు)
    నాకూ చిరు బొజ్జ ఉంది (గాలి లోపలి లాగి పట్టుకోగలను)
    లేని వల్లా
    మా నాన్నకో చానెల్, ఫిలిం సిటీ లేవు
    నాకు ముద్దు ముద్దు మాటలూ రావు.
    అదే తేడా !!

    రిప్లయితొలగించండి
  9. Very good analysis. Reminds of Late Mr. Ramireddy dialogue 'tidu tonda pogudu tonda'

    రిప్లయితొలగించండి
  10. modaTi bhaarya vaadana coostE meeku idi rivars parMjyOti anna anumaanaM raaledoo? - jaMpaala caudari

    రిప్లయితొలగించండి
  11. సుమన్ బాబు చేసే బుల్లితెర గాయాలకు నెమలికన్ను మలామ్ :)





    (*మలామ్ = ఆయింటుమెంటు)

    రిప్లయితొలగించండి
  12. అన్ని భావాలను అభావంగా పలికించేసాడా?
    అదెలాగ మురళి గారు? ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నేర్పించారట?
    అయినా బాబుని ఇలా కామెంట్ల కోసం వాడుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం అధ్యక్షా.

    రిప్లయితొలగించండి
  13. :)))

    హతవిధీ...తెలుగు బ్లాగర్ల మీద బజ్జర్ల మీద మీ అందరికీ ఎందుకండీ ఇంత కసి. ఏదో టి.వి లో తప్పించుకున్నాం అనుకుంటే ఇక్కడ తప్పటం లేదుగా.

    అయినా ఎంత ధైర్యం, ఎంత ఓపిక..ఎంత సహనం..ఎంత సుమనాభిమానం మీ అందరికి. ట్విస్టు చూసి సుమనుడి నటనా కౌశల్యం చూసి మీరు ఇంకా బజ్జులు..బ్లాగులు వ్రాయగలుగుతున్నారంటే వామ్మో మీరు చాలా గుండెశాలులు..శూరులు..ధీరులు..వీరులు..ఇక మాటలు రావటం లేదు.

    ఈ లోకంలో ఎలాంటి బాధలైనా..ఎన్ని కష్టాలైనా అవలీలగా ఎదుర్కోగలరు మీరంతా! ఎలాంటి చెత్త పిచ్చి అర్థం కాని సినిమా అయినా చూసే గుండె ధైర్యం ఇక మీ సొంతం అన్నమాట!

    జయహో సుమనాభిమానులు.

    మీరంతా కలిసి ఆయన నటనా కౌశల్యాన్ని అంతర్జాల వీధిన పెడుతున్నారండి. ఔరా తగునా మీకిది? అభిమానం గుండెల్లో ఉంచుకోవాలి కానీ ఇలా బ్లాగులకెక్కిస్తారటండి!

    మన బ్లాగర్లు వ్రాసిన టపాలన్నీ వ్యాఖ్యలతో సహా ఎవరైనా సుమన్ బాబుకి చదివి వినిపిస్తే బాగుండు.

    రిప్లయితొలగించండి
  14. ఇంతటి మహానటుడ్ని గురించి వ్యాఖ్యానించే స్థోమత నాకు లేదు.
    జై సుమనాభిమానానికి,సుమనాభిమానులకీ జై.

    జై సుమన సంకల్ప,జై ట్విస్ట్ కల్పా,
    జై "భావనా"తల్ప,జై నటన హింసా,
    నీవు కలిపించేటీ ఈ ట్విస్ట్ కధలూ,
    రాసినా చూసినా చదివినెల్లరునూ,
    మార్గదర్శీలోన సభ్యత్వమొందా,
    జన్మరాహిత్యంబు ఫలియించునయ్యా...

    (మాయాబాజార్ లో ఆఖరి పద్యం లా చదువుకోండి అభిమానులారా)

    రిప్లయితొలగించండి
  15. మీరంతా ఇంతలా అంటున్నారని నేనూ ఒక పది నిమిషాలు చూశాను. 'దేవుడి లాంటి' చిన బాబుకి బస్ స్టాండ్ లోనే వెన్నెల దొరికి పొగడటం. ఆయన్ని చూస్తూనే దుండగులు పారిపోవటం,.. ఇంటికి రావటం.. పెళ్లికి వెళ్లటం..పాత కాలం దర్శకత్వం చూస్తూనే 'ఆగండి' అన్న పిలుపు విని చాలా కాలం అయింది.. వస్తే బాగుండు.. అనుకున్నా అంతే.. వినపడింది.

    పాత కాలం పెళ్లి గెస్టులు డైలాగులు, వారిని సుమన్ బాబు తలలు వంచుకునేలా చేయటం.. దేవుడు లాంటి సుమన్ బాబు షూ లతో పెళ్లి మంటపం ఎక్కి తాళి కట్టటం.. అమ్మాయి కళ్ళు చెమర్చటం.. శోభనం సీన్..తర్వాత ఇంక చూడలేక వదిలేశా...

    కానీ ఇప్పుడు మీ బ్లాగుల ద్వారా అర్థమవుతోంది. నేను ఆయన ద్యుయేట్లు మిస్సయ్యానని :-((

    రిప్లయితొలగించండి
  16. సినిమా చూసిన వెంటనే ఒక గంట లోపుల ఈ టపా పోస్ట్ చేసేశారంటే మీది వజ్రసమానమైన గుండె అని డిసైడ్ అయిపోయాను. చూస్తూ చూస్తూ పడిపోయిన వాళ్ళు, చూసి మర్నాడు ఉదయం దాకా కోలుకోలేని నాలాంటి వాళ్ళు అంతా సుమనాభిమానుల మని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాము.

    అన్నీ భావాలను అభావం గా పలికించడం ఒక్క సుమన్ కే చెల్లు. ఈ సినిమాలో సుమన్ చిలిపి సుమన్ గా డ్యూయట్ పాడి, అదేదో డాన్స్ ట చేసి అందరినీ అలరించేశాడు.

    మీ టపాలో పిడకల (పీడకల ల) వేట బాగుంది. మీకు సుమనాభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. "మా నాన్నకో టీవీ చానలూ, సినిమా స్టూడియో ఉండి ఉంటే, నేను కూడా విగ్గు పెట్టుకుని, దొరికిన వీరోవిన్నుతో డ్యూయట్లు పాడుకుని ఉందును కదా.."
    ----------------
    అరే... మురళి గారు నిజం నాకూ ఇలానే అనిపించింది . సుమన్ బాబు తెలివితేటలూ సినిమాకే పరిమితం చేయడం నాకూ నచ్చలేదు ఆయన అమోఘమైన తెలివి తేటలు వాళ్ళ నాన్న గారి పత్రికకు కూడా ఉపయోగపడాలని నేను డిమాండ్ చేస్తున్నాను

    రిప్లయితొలగించండి
  18. అర్రెర్రెర్రె... ఇంత మంచి ట్విస్ట్ మిస్ అయిపోయానే. ఏదైనా జనాన్ని పీడించుకు తినాలని డిసైడ్ అయితే సుమన్ బాబు తరవాతే ఎవరైనా..!

    రిప్లయితొలగించండి
  19. ఉగాండాలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఇడి అమిన్ అవార్డు ( ??? ) దీనిని మన సు మన్ను కు ఇవ్వాలని నేను కోరుతున్నాను . తెలుగు బ్లాగర్ లు అందరు మన మల్టీ లెవెల్ హీరో కి sms ద్వారా వోటు వెయ్యండ హో !!!

    రిప్లయితొలగించండి
  20. సుమన్ బాబు స్టెప్పులేసాడా !!
    ప్చ్ బాబుగారి నటనాకౌశలం చూసే సుమనోహర అవకాశం నాకెప్పుడు వస్తుందో :( :(

    రిప్లయితొలగించండి
  21. సుమన్ బాబు డాన్సు చూసే ఛాన్స్ మిస్సయ్యారా.. మీ అందరి కోసం నా చిరు కానుక.. బాబు గారి వీడియోలు కింది లింకులో..... మంచి తరుణం మించిన దొరకదు..... బాబు గారి శత్రువులు నా బ్లాగ్ ని hack చెయ్యక ముందే చూసి ఆనందించండి.

    మురళిగారికి అభినందనలతో...

    http://www.tollywoodspice.com/2011/09/etv-suman-comedy-twist.html

    రిప్లయితొలగించండి
  22. @పక్కింటబ్బాయి: వాక్యంలో దొర్లిన తప్పుని సరిద్ద గలిగానండీ.. :)) ధన్యవాదాలు
    @వనజ వనమాలి: కాదండీ 'వలవలా నాయకుడు' ..ఆసాంతమూ దుఃఖ పడుతూనే ఉన్నాడు మరి! ..ధన్యవాదాలు.
    @సుజాత: ఇప్పుడు యూ ట్యూబులో లభ్యం!! ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  23. @శంకర్. ఎస్: అప్పుడేనా? జానపద చిత్రం వద్దా మీకు?? :)) ధన్యవాదాలు.
    @మురళి: ఏం పర్లేదండీ. చాలా బోల్డంతమంది చూశారు.. ఎవరికన్నా ఏమన్నా అయ్యిందా? అన్నట్టు ఇన్సూరెన్స్ చేశారుగా?? :)) ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: ఇంకా చాలా మంది ఉన్నారండీ.. వాళ్ళని కాదని నన్ను ఎంచుకోడం బాలేదు.. :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @కొత్తావకాయ: ఏం చెప్పమంటారు? 'ట్విస్టు' ని మీ నాలుగు కళ్లతోనూ చూపించారు కదా!! ధన్యవాదాలు.
    @వెన్నెల్లో ఆడపిల్ల: పోన్లెండి డ్యూయట్ చూశారు కదా.. మొత్తం చూసినట్టే.. :)) ధన్యవాదాలు.
    @ఆత్రేయ: ధనపూర్వక ధోరణి ఆంటే పాజిటివ్ అనా అండీ? కొత్తగా వింటున్నాను, బాగుంది.. నాదీ మీ సమస్యేనండీ మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @మోచర్ల: ఆ డైలాగు కోట శ్రీనివాసరావుది కదండీ.. ధన్యవాదాలు.
    @చౌదరి: అదేమిటోనండీ.. సుమన్ బాబు సినిమాలు చూస్తుంటే ఇహంతో సంబంధం తెగిపోతుంది, చూస్తున్నంత సేపూ.. పరంజ్యోతి అస్సలు గుర్తు రాలేదు నాకు.. ధన్యవాదాలు.
    @శ్రీ: :-) :-) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  26. @బోనగిరి: 'ఏ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నేర్పించారట?" ..యెంత అవమానం?!! బాబుకి మరొకరు నేర్పడమా.. ఆయనే ఒక నడిచే నట విశ్వవిద్యాలయం అండీ.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: మీ కోరిక తీరాలని ఆశిస్తున్నానండీ... ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: మీ అభిమానం చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయ్ పప్పు గారూ.. (పెరుమాళ్ళు టోన్లో చదువుకోండి) :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. @కృష్ణ ప్రియ: సుమన్ సినిమాల్లో సౌలభ్యం అదేనండీ.. మనం ఏ సీన్ రావాలని/వస్తుందని అనుకుంటామో అదే వస్తుంది!! డ్యూయట్ యూ ట్యూబులో ఉంది లెండి.. ఎపుడన్నా చూడొచ్చు.. ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: అవునండీ.. డేన్స్ మేష్టారికి పాద నమస్కారం కూడా చేశాడు భక్తిగా.. ధన్యవాదాలు.
    @బుద్దా మురళి: వద్దండీ.. పత్రిక కి వెళ్తే టీవీ మీద ఇంతగా దృషి పెట్టడానికి ఉండకపోవచ్చు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. @The Chanakya:యూ ట్యూబులో ఉందండీ.. చూడొచ్చు మీరు.. :)) ధన్యవాదాలు.
    @cricketLover:ధన్యవాదాలండీ..
    @Swathi: :)) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  29. @రాజశేఖర్ దాసరి: మరాయన అవార్డులు స్వీకరిస్తారో, లేదోనండీ.. ధన్యవాదాలు.
    @నాగార్జున: యూట్యూబులో చూసేయండి :)) ..ధన్యవాదాలు.
    @టాలీవుడ్ స్పైస్: అవునండీ.. అసలే బాబుకి శత్రువులు పెరిగిపోతున్నారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. ప్చ్ ఏమిటో ఈసారీ మిస్ అయ్యాను సుమనుడి సినిమాని :(
    మీ పిడకలవేట మాత్రం సూపర్! :))

    రిప్లయితొలగించండి
  31. @ఆ.సౌమ్య: డోంట్ వర్రీ అండీ.. యూ ట్యూబులో లభ్యం!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. టి వి చానెళ్ళ ప్రేక్షకులు తొమ్మిదో నంబరు ప్రమాద సూచిక ఎగురవేసి వణుకుతూ ఎదురు చూస్తున్నారు. ఈ అభినవ నటాగ్రేసరుడు, మరొక ప్రివ్యూ త్వరలోట. మీరు చూసి తరించి, మమ్మల్నీ తరింపచేస్తారుగా!

    రిప్లయితొలగించండి