బుధవారం, జులై 15, 2009

నాయికలు-జయంతి

ప్రతిరోజూ ఉదయాన్నే ఓ నల్లటి పొడవాటి కారు వచ్చి ఆమె ఇంటి ముందు ఆగుతుంది. ఆమె ఆ కార్లో ఆఫీసుకి బయలుదేరుతుంది. మళ్ళీ సాయంత్రం అదే కారు ఆమెని ఇంటి దగ్గర దింపి వెళ్తుంది. ఆమె కలక్టరో, జిల్లా జడ్జీనో కాదు. కారు తాళాలు గాల్లో ఎగరేసి పట్టుకునే ఆరడుగుల అందగాడు రాజశేఖరం దగ్గర 'సెక్రటరీ.' ఆమె పేరు జయంతి.

'నవలాదేశపు రాణి' గా కీర్తి కిరీటం అందుకున్న యద్దనపూడి సులోచనారాణి తొలి నవల 'సెక్రటరీ.' 1965 లో తొలిసారి ముద్రింప బడ్డ ఈ నవల గడిచిన 44 సంవత్సరాలలో 80 పునర్ముద్రణలు పొందింది. తెలుగు నవలా సాహిత్యానికి సంబంధించి బహుశా ఇదొక రికార్డు. అసలు ఏముందీ నవల్లో? సులోచనారాణి నవలలకి మహారాణి పాఠకులు మహిళలే. వాళ్ళని ఉర్రూతలూగించిన పాత్ర రాజశేఖరం.

మరి రాజశేఖరం గురించి రాయకుండా జయంతి గురించి ఎందుకు? ఎందుకంటే అంతటి రాజశేఖరమూ దాదాపు పిచ్చివాడైపోయింది ఈ జయంతి ప్రేమ కోసమే. మధ్యతరగతి నేపధ్యం ఉన్న అందమైన అమ్మాయి జయంతి. చిన్నప్పుడే తల్లినీ తండ్రినీ పోగొట్టుకుని బామ్మ పెంపకంలో పెరిగింది. బీయే చదివి, టైపు నేర్చుకుంది కానీ టైపు పరీక్షలు పాస్ కాలేదు. నాయనమ్మ పెళ్లి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటూ ఉండగా ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం మెండుగా ఉన్న జయంతి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడుతుంది.

'వనితా విహార్' అన్న మహిళలకి సంబంధించిన సేవాసంస్థలో 'సెక్రటరీ' గా తొలి ఉద్యోగం వస్తుంది జయంతి కి. అక్కడ సభ్యులైన ప్రముఖ మహిళలందరి నోటి వెంటా 'రాజశేఖరం' పేరు ఎన్నోసార్లు వింటుంది. అనుకోని సందర్భంలో అతనితో పరిచయం అవుతుంది. ఆత్మాభిమానం తాకట్టుపెట్టలేక వనితావిహార్ ఉద్యోగం మానేస్తుంది జయంతి. అప్పటికే బామ్మ ఆరోగ్యం పాడవ్వడంతో వెంటనే మరో ఉద్యోగం వెతుక్కోడం అవసరం.

పిలిచి తన 'సెక్రటరీ' గా ఉద్యోగం ఇస్తాడు రాజశేఖరం. 'తనకి మరో ఉద్యోగం దొరకగానే పంపించేయాలని' కండిషన్ పెట్టి ఉద్యోగంలో చేరుతుంది జయంతి. పొద్దున్నే పడవలాంటి కార్లో, విశాలమైన రాజశేఖరం బంగ్లా కి వస్తుందా.. అక్కడ మరింత విశాలమైన డైనింగ్ టేబిల్ మీద రాజశేఖరం తో కలిసి ఫలహారం, కాఫీ తీసుకుంటుంది. రాజశేఖరానికి వచ్చే ఉత్తరాలను విభజించి, జవాబులు రాయాల్సినవి అతనికి ఇస్తుంది. అతను జవాబులు రాసేస్తే వాటిని టైపు కొడుతుంది. ఒకవేళ ఆమె టైపు కొట్టకపోయినా రాజశేఖరం ఏమీ అనడు, తనే స్వయంగా టైపు చేసుకుంటాడు.

మధ్యాహ్నం రాజశేఖరం తో కలిసి భోజనం. తర్వాత పెద్దగా పనుండదు.. కారెక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. రాజశేఖరానికి బోల్డన్ని ఇన్విటేషన్లు వస్తూ ఉంటాయి.. నాటకాలు, డాన్స్ ప్రోగ్రాములు ఇలా.. అతనికి వెళ్లడానికి తీరుబడి ఉండదు కదా.. తనకి నచ్చినవి తీసుకుని జయంతి తన స్నేహితురాలు సునందతో కలిసి వెళ్లి వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా బాస్ తో సినిమాలు, డిన్నర్లు ఉంటాయి. ఆమె ఆత్మ గౌరవానికి భంగం కలిగే పనులేవీ చేయడు రాజశేఖరం. మామూలుగా ఐతే ఎవరికైనా ఈ ఉద్యోగం స్వర్గంలా అనిపించాలి.. కానీ అదేమిటో జయంతికి ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది.

రాజశేఖరం తన మీద చూపించే అభిమానాన్ని తన అందానికి వల విసరడంగా భావిస్తుంది జయంతి. ఆమెకి ఆరోగ్యం బాగోనప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయిస్తాడు రాజశేఖరం. అప్పుడే బామ్మ ద్వారా జయంతి తన మరదలని తెలుస్తుంది అతనికి. జయంతిని, బామ్మని తన ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఏకాకి రాజశేఖరం. ఆమె మీద ప్రేమ రెట్టింపై, ఆమె తనకు తానుగా తనని ఇష్టపడెంత వరకూ బంధుత్వం విషయం బయట పెట్టకూడదు అనుకుంటాడు. జయంతి కోలుకునేలోగా గుండెపోటు తో బామ్మ మరణిస్తుంది.

వనితావిహార్ వాళ్ళు వచ్చి జయంతి ని పెళ్లి చేసుకుంటే రాజశేఖరం వ్యాపారం దివాలా తీస్తుందని, అతని క్షేమం కోరి అతన్ని పెళ్లి చేసుకోవద్దని చెబుతారు జయంతికి. ఆమెకి ఎలాగూ అతని మీద బోలెడన్ని సందేహాలు. చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది జయంతి. కొన్ని అత్యంత నాటకీయమైన మలుపుల తర్వాత రాజశేఖరం, జయంతి కలుసుకోవడం నవల ముగింపు. ఓ ఊహా ప్రపంచాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించడంలో రచయిత్రి కృతకృత్యు లయ్యారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అప్పట్లో నేను ఎనిమిదో తొమ్మిదో మిడుకుతున్నా.. మొదటిసారి ఈ నవల చదివినప్పుడు 'చేస్తే ఎప్పటికైనా ఇలాంటి ఉద్యోగం చేయాలి' అనుకున్నా, జయంతి ఉద్యోగం చూసి. డిగ్రీ లో ఉండగా మళ్ళీ చదివినప్పుడు మాత్రం నేనే రాజశేఖరం ఎందుకు కాకూడదు? అనిపించింది. ఈ నవలని ఇదే పేరుతో సినిమాగా తీశారు.

రాజశేఖరం గా అక్కినేని నాగేశ్వర రావు, జయంతిగా తెలుగు తెరమీద 'ఆత్మాభిమానా' నికి పర్యాయపదంగా నిలిచిన వాణిశ్రీ నటించారు. సినిమా నాకు నచ్చలేదు. 'ఏంటీ తిక్కా..' డైలాగు విన్నప్పుడల్లా తిక్క పుట్టింది. ఎమెస్కో ప్రచురించిన 'సెక్రటరీ' వెల రూ. 75. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది.

25 కామెంట్‌లు:

  1. నేను ఈ సినిమా గురించి రాద్దామనుకుంటే మీరే రాసేసారు.సీరియల్ గా కూడా వచ్చిందనుకుంటా. యద్దనపూడిగారు మహిళా పాఠకులను దృష్టిలో పెట్టుకుని హీరోని తయారు చేసేవారు. అందుకే అమ్మాయి ఐతే బాపు బొమ్మలా ఉండాలి. అబ్బాయి ఐతే యద్దనపూడి హీరోలా ఉండాలనేవారు. ఇక దానికి తిరుగులేదు. నేను పుస్తకం చదవుకున్నా సినిమా చూసాను. వాణిశ్రీ మాత్రం భలే పొగరు చూపించిందిలెండి..కాని నాకు అస్సలు నచ్చలేదు ఈ సినిమా.. అందుకే ఇల్లంతా తిరుగుతూ , పని చేసుకుంటూ సినిమా చూసేదాన్ని.. అప్పుడు ఇన్ని చానెల్స్ లేవు మరి.

    రిప్లయితొలగించండి
  2. 'చేస్తే ఎప్పటికైనా ఇలాంటి ఉద్యోగం చేయాలి' idi maatram super!!!

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు,
    హమ్మయ్య..ఇన్నాళ్టికి నేను కూడా చదివిన నవల గురించి చెప్పారు :)
    సినిమా కూడా చూసాను నేను. చిత్రం ఏంటంటే.. నవల, సినిమా రెండూ కూడా ఈ మధ్యనే (ఒక ఆరు నెలలు అయ్యుండచ్చు) చూడటం జరిగింది.
    సినిమా అయితే అంతగా నచ్చలేదు. సరిగ్గా మీరు చెప్పిన 'తిక్క' అస్సలు నచ్చలేదు నాకు కూడా.
    రాజశేఖరం పాత్ర నవలలో చాల హుందాగా ఉంటుంది. ముఖ్యంగా జయంతి, రాజశేఖరం పరిచయం..అవన్నీ చాలా హుందాగా ఉంటాయి. సినిమాలో మాత్రం మొదటి సీన్ నుంచే హీరో గారో రోడ్ సైడ్ రోమియో లాగా హీరోయిన్ వెంట పడుతుంటాడు. అది అస్సలు నచ్చలేదు నాకు.
    నవల్లో కూడా కొన్ని విషయాలు నచ్చలేదు. కానీ, ఈ నచ్చకపోవడానికి కారణం 2009 లో చదవడం అనుకుంటాను. నేను ఈ మధ్యనే యుద్దనపూడి గారి ఇతర నవలలు కొన్ని చదివాను. జ్యోతి గారన్నట్టు, సాధారణంగా ఆవిడ నవలల్లో కథానాయకులందరూ చాలా ఉన్నత వ్యక్తిత్వం కలవారై ఉంటారు. అది నాకు కూడా నచ్చుతుంది :)
    హి హీ :) ఎంత పెద్ద కామెంట్ రాసానో కదా.!

    రిప్లయితొలగించండి
  4. నేనయితే ఆ రాజశేఖర్ ని ఇప్పటికి మరిచిపోలేకపోతున్నాను :) బాగుంది మీ టపా .

    రిప్లయితొలగించండి
  5. నా చేతులాడని టైము చూసి ఇలా ఊరించటం బాలే :(
    నాకు యద్దనపూడి నవలలతో ఉన్నది అవినాభావ సంబంధం...మా ఇంట్లో సెక్రటరి ఒక్కటే ఉండేది.అది చిన్నప్పటి నుంచీ ఒక 7,8సార్లు చదివేసి ఉంటాను.డైలాగులతొ సహా కంఠతా నాకా నవల.మిగిలిన ఆవిడ రచనలన్ని మా పెద్దమ్మ,పిన్ని ఇళ్ళల్లో చదివాను.ఇప్పుడు కొన్ని ఇష్టమైనవి కొనుక్కున్నాను.కీర్తికిరిటాలు,మినా,జీవనటారంగాలు,అభిశాపం,స్నేహమయి,గిరిజా కల్యాణం etc.my alltime favourite is "కీర్తి కిరీటాలు".I just love that novel.అది మాత్రం రాయటానికి నాకు వదిలేయండి.please.

    రిప్లయితొలగించండి
  6. ఎమోనండి నాకైతే సినిమా నచ్చింది. అందులోని "మనసులేని బ్రతుకొక నరకం" అనే పాట కూడా.

    రిప్లయితొలగించండి
  7. Hai murali garu,
    Nenu kuda yuddanapudi gari navalalu chadivandi,nijanga ela chadivina naval nu malli friends tho share chesukunte a anndhame verukada? me ee vishleshana chadivaka naku kuda na fevarate navala 'manchumutham' writer polkampalli shanthadevi di me andharitho panchukovalani undhi.kani telugulo ela type cheyyalo ardham kavatledu,telugu lo ela type cheyalo koncham chepparu.

    రిప్లయితొలగించండి
  8. @జ్యోతి: తప్పకుండా రాయండి సినిమా గురించి. ఈ సినిమా నచ్చని వాళ్ళు ఇంకా ఉన్నారని తెలిసిందండి ఈ టపా వల్ల. మా ఇంట్లో డీవీడీ ఉంది.అప్పుడప్పుడూ కొన్ని సీన్స్ చూస్తూ ఉంటాను. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @సునీత: నిజమేనండీ.. అప్పటికే హైదరాబాద్ లో ఉద్యోగం చేయడం అనే లక్ష్యం నిర్ణయించేశారు తాతయ్య. 'ఇలాంటి ఉద్యోగం ఐతే యెంత బాగుంటుందో కదా' అని చాలాసార్లు అనుకున్నా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @మధురవాణి: నాకూడా సరిగ్గా సినిమా రాజశేఖరం రోడ్ సైడు రోమియో లా ప్రవర్తించడమే నచ్చలేదండీ. అదీ కాకుండా సులోచనారాణి వర్ణించిన రాజశేఖరం, జయంతి లని హీరో హీరోయిన్లలో చూడలేక పోయాను. ఈ టపా కోసం చదివినప్పుడు నాక్కూడా చాలా అభ్యంతరాలు కనిపించాయి..బహుశా మీరన్నట్టు 2009 ప్రభావమేమో :-) పెద్ద వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @కొత్తపాళీ: ధన్యవాదాలు.
    @చిన్ని: రాజశేఖరాన్ని మర్చిపోలేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి.. ధన్యవాదాలు.
    @తృష్ణ: మీరు కూడా 'సెక్రటరీ' గురించి రాయండి, మీ శైలిలో. 'కీర్తి కిరీటాలు' నాకూ ఇష్టమండి.. మళ్ళీ చదవాలి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @పద్మార్పిత: బహుశా మీరు నవల చదవకుండా సినిమా మాత్రమే చూసి ఉంటారు. ధన్యవాదాలు.
    @మహిపాల్: బ్లాగులోనే తెలుగు లో రాసే అవకాశం ఉంది, సెట్టింగులు చూడండి. అది సౌకర్యంగా లేకపోతె జిమెయిల్ లో కూడా తెలుగులో రాయొచ్చు. అది కూడా కుదరక పొతే ఈ లింక్ ప్రయత్నించండి. http://www.google.co.in/transliterate/indic/telugu
    పోల్కంపల్లి శాంతాదేవి గారి 'మంచుముత్యం' నాక్కూడా ఇష్టమేనండి.. మీ టపా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. నిజానికి ఇది జ్యోతి సర్క్యులేషన్ కి బాగా పెంచిన సీరియల్ .. అప్పట్లో ముళ్ళపూడి రమణగారు ఆ పత్రిక కి సంపాదకులు గా ఉన్నారు ... (స్వాతి లో కోతి కొమ్మొచ్చి ఆధారంగా చెపుతున్నా ). మా ఇంట్లో దీని పేపర్ కట్టింగ్ బైండు పుస్తకం ఉండేది. తర్వాత సినిమా చూసాను డ్వ్డ్ వచ్చినప్పుడు. ప్రేమనగర్ నవలని సినిమాకి మార్చినప్పుడు చాలా మార్పులు జరిగాయి... అలాగే.. ఈ నవలని కూడా అదే దర్శకుడు (కోవెలమూడి సూర్య ప్రకాష్ రావు గారు , కోవెలమూడి రాఘవేంద్ర రావు , బి.ఎ గారి తండ్రి గారు ) దాని వల్ల సినిమాకు కావాల్సిన విదంగా చేడిపారు. సినిమా అప్పట్లో బాగానే పోయింది (బాగా డబ్బు చేసింది ). యదన్నపుది నాయకులి లాగ నాగేశ్వర రావు గారు ఆరడుగులు లేరు కాని సినిమాకి డబ్బు మాత్రం బాగానే వచ్చింది.. నవల నవల లాగా తెసింది అంటే మీనా .. చాల వరకు మార్పూ లేకుండా తీసారు ...

    రిప్లయితొలగించండి
  13. డిగ్రీ లో ఉండగా మళ్ళీ చదివినప్పుడు మాత్రం నేనే రాజశేఖరం ఎందుకు కాకూడదు?


    ha ha joke cheppanaa, ammayilanthe valle jayanthi ani kooda anukuntaru telusaaa...

    maa aayana mari naaku rajashekharam lane kanabadatam vinabadatam anni...nenu koodaa ditto nemO...(andam kaadu lendi) ...khi khi

    adee sangathi ....kabatti mee aavida kooda alaane feel avutharu lendi :) ...

    రిప్లయితొలగించండి
  14. @శ్రీ అట్లూరి: ముందుగా తెలుగులో వ్యాఖ్య రాసినందుకు అభినందనలు! ఈ సినిమా మాత్రమే కాదండి, చాలా నవలా చిత్రాలతో నాకు ఇదే సమస్య.. నవల నచ్చుతుంది, సినిమా నచ్చదు. 'డాక్టర్ చక్రవర్తి' (చక్ర భ్రమణం) లాంటి మినహాయిపులు ఉన్నాయి. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @Testing Wheel: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. Yaddanapudi novels cheadivi addapillalu kallalu kanntuu life ni paduchesukontarani ekkado chadivanu..bahusa nijamenemoo...avida novels lo hero chala perfect ga untadu... kani heroine chala immature ga egoistga untundi.. chala false prestige chupisthundhi..Example secretery teesukondi... Hero antha help chesina.. heroine dveshisthundi.. Hero ki heroine rakhi kattadam heroine stupidity ki parakasta... Selfrespect undali kani daniki base kuda undali....

    Meena ni tesukondi... heroine entha lazy no .. andam annadi pakkana pedithe nacchadaniki aa charachter lo emi qualities levu.. Heroine ego , immaturity ni Hero anandanga baristhaduu..endhuko ardam kadu..
    :) Ippudo confession:
    నేను ఇన్తర్ చదువుతున్నపుదు సెసరెత్రి చదివను.. అప్పత్లొ రాజషెఖెర్ కొసమ్ తెగ వెతికను...తరువాత చల silly గా అనిపిన్చిన్ది

    రిప్లయితొలగించండి
  16. కాలేజీ డేస్ లో ఒక ఫ్రెండ్ కామెంట్ చేసింది సులోచన రాణి నవల లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకళ్ళు బాగా రిచ్ ఒకళ్ళు బాగా పూర్ ఉంటారు ...ఇంకా అమ్మాయి కి సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంకా మొండి మరియు నిజాయితీ కూడా ఉంటాయి . ఓవర్ అల్ గ చాల బాలన్సుడ్ పర్సనాలిటీ ఇస్తుంది అమ్మాయికి . ఆమె కధ లో హీరో ఎంత గొప్ప వాడు ఆయినా ఆ అమ్మాయి మెప్పు కోసం తపస్సు చెయ్యాల్సిందే ...సో అమ్మాయి స్వభావం అంత గొప్పగా ఇస్తుంది ....(అలాగని చదివిన అమ్మాయిలని శేఖరం లాంటి అబ్బాయి కోసం తపించేల ఉండవు నిజానికి .. శేఖరం లో నచ్చని విషయాలు బోల్డన్ని ఉంటాయి ..అమ్మాయిలకి అయితే ) ...ఇంకా జయంతి లాంటి మంచి అమ్మాయి ,తెలివితేటలు కల అమ్మాయి ల ఉండాలనిపించేల ఉంటాయి ...అమ్మాయి ఏదైనా మిస్తకె చేసింది అంటే ఇంకా బలమైన కారణము , బయట పడే మార్గం తప్పకుండ ఉంటాయి కధ లో ....సో ఎప్పుడు ఎక్కడ ఉన్న ఎలా బ్రతుక గలగాలి , ప్రొబ్లమ్సు వస్తే ఎలా పేస్ చెయ్యాలి బాగా చూపిస్తుంది .సో ప్రొబ్లెంస్ రావాలంటే అమ్మాయి కూడా పొరపాటులు చెయ్యాలి కదా...ఊరికే అబ్బాయి బాగున్నాడు అని పెళ్ళికి ఒప్పేసుకొంటే ఇంకా కధ ఏమి ఉంటుంది ....అనుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  17. @హరిప్రియ: జయంతి రాజశేఖరానికి రాఖీ కట్టదండి.. కట్టాలని అనుకుంటుంది.. అనవసర సన్నివేశాలు చాలా ఉన్నాయి ఆ నవల్లో.. కాకపొతే అది 44 ఏళ్ళ క్రితం వచ్చిన నవల. ..ధన్యవాదాలు.
    @Testing Wheel: మీరు సులోచనారాణి నవలలన్నీ చదివారా? ఊరికే తెలుసుకోవాలని అనిపించిందండి... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. naku chala istamina novel adi.bahusa na teenagelo vunnapudu chadivinia modati novel emo ento gadamgha mudrinchukupoinid.ippatiki a novel lona nni sanniveslasu gurthuvunnayi.novel ante yaddanapudi gare gurhtu vastharu. avida vuha sakthiki hatsoff.midawara marosari gurthuchesukuntunaanduku miku kuda thanks.

    రిప్లయితొలగించండి
  19. "డిగ్రీ లో ఉండగా మళ్ళీ చదివినప్పుడు మాత్రం నేనే రాజశేఖరం ఎందుకు కాకూడదు? " :) :)

    రిప్లయితొలగించండి
  20. hi,
    మీరు రాసిఅన విశ్లేషణ బాగుంది.చిన్న కామెంట్.హరిప్రియగారు యద్దనపూడి నొవెల్స్ గురించి కామెంట్ చేసారు ముఖ్యం గ మీనా గురించి గాని సెక్రటరీ గురించి గాని.మీనలో మీనా తనకి నచ్చిన పని చేయలేదు .తన తల్లికి ఎదురు తిరిగితే ఆవిడా బాధ పడుతుందని .కనీసం పెళ్లి అయిన తరవతైన తనకంటూ ఇష్టమైన పని cheyalanukuntundi.అంతే కాదు ఆమె రాజేశ్వరి కి జరగబోయే పెళ్లి గురించి ,అది ఆమెకు తన అన్నయకు మంచి అనుకుని ఒప్పుకుంటుందనితెలిసి ఆమెను వారిస్తుంది.అంతేకాదు ఆమెకు కష్టం వచ్చి పెళ్లి ఆగిపోతే తోడుగా వుండి ఆమె గాత్రానికి మంచి ప్రోత్సహం యిచి రేడియో లో అవకశం లభించేట్టు చేస్తుంది.కృష్ణ వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తుంది.స్వాభిమానం తో పొలం వదిలేసుకోబతడు.తను దాని విలువ తెలుసు కబ్బటి తనే కొనిస్తూ.మీనా లో ఎన్నో గుణాలు వుంటాయి.డబ్బున అమ్మయి అయిన తనకు నచ్చిన అబ్బయి కోసం డబ్బుని ,సర్వ సుఖాలను కడునుంకుంటుంది.చాల గొప్ప character.అంతే కాదు యద్దనపూడి నొవెల్స్ లో ఎప్పుడు స్త్రీ పురుషులు సమానముగా వునడాలని,స్త్రీ కష్టం వచ్చినప్పుడు వొంటరిగా ఎదుర్కునే సహాసం వుండాలని తన నయకల ద్వార cheptharu.మీనా నోవెల్ స్టొరీ లైన్ base మీకు బొమ్మరిల్లు లో వుంటుంది.కాకపోతే తండ్రి -కొడుకుల అభిప్రయాలు గ vuntayi.sorry i wrote a big కామెంట్

    రిప్లయితొలగించండి
  21. @ప్రియ: మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. E novel ante naku kuda chala eshtam. Eppakatiki oka 40-50 times chadivanu.

    రిప్లయితొలగించండి