గురువారం, జూన్ 17, 2010

వేదం

కొత్త దర్శకులకి 'రెండో సినిమా గండం' సెంటిమెంట్ ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో 'గమ్యం' లాంటి వైవిధ్య భరితమైన సినిమాతో కెరీర్ ప్రారంభించిన క్రిష్ రెండో సినిమా ఎలా ఉంటుంది? అన్న కుతూహలం చాలా రోజులుగా వెంటాడుతోంది నన్ను. అయితే సినిమా విడుదలకి ముందు అనుష్క పోషించిన సరోజ పాత్రకి విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం, ఆమె ప్రొవొకింగ్ స్టిల్స్..ఇంకా మన సెన్సార్ వారు ఈ సినిమా కి 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వడం లాంటి కారణాలు సినిమా మీద ఆసక్తిని కొంతవరకూ తగ్గించిన మాట వాస్తవం.

సినిమా విడుదలైన రెండో వారంలో, 'పర్లేదు' అన్న టాక్ విన్నాక చూశానీ సినిమాని. ఐదు పాత్రల కథల్ని వైవిధ్య భరితంగా చెప్పడానికీ, ఎక్కడెక్కడో ఉన్న పాత్రలన్నింటినీ ఒక చోటకి చేర్చి కథని కంచికి పంపడానికీ దర్శకుడు పడ్డ శ్రమ రెండో సగంలో బాగా కనిపించింది. ఇలా ఒక్కో పాత్ర కథనీ చెప్పుకుంటూ ముగింపుకి వెళ్ళడం సాహిత్యంలో ఎప్పటి నుంచో ఉన్నదే. కొన్నేళ్ళ క్రితం మణిరత్నం 'యువ' సినిమాని ఇదే పంధాలో తీశాడు. (పోలిక ఇక్కడి వరకే)

రాక్ స్టార్ కావాలని కలలు కనే ఆర్మీ నేపధ్యం ఉన్న కుర్రాడు, వేశ్యా గృహం నుంచి బయటపడి తనే సొంతంగా కంపెనీ పెట్టుకోవాలని ఆశ పడే వేశ్య, మత కలహాల కారణంగా పుట్టబోయే పిల్లల్ని పోగొట్టుకుని ఆ కోపంతో దేశం విడిచి వెళ్లి పోవాలనుకునే ముస్లిం యువకుడూ, కొడుకు చదువు కోసం కిడ్నీ అమ్ముకోడానికి సిద్ధపడ్డ నిరక్షరాస్యురాలైన ఓ పేద తల్లి మరియు డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవాలనుకునే ఓ బస్తీ కుర్రాడు... ఓ సంవత్సరం డిసెంబర్ ముప్ఫయ్యొకటో తారీఖు వీళ్ళందరి జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చిందన్నదే 'వేదం' సినిమా కథ.

స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు తగినంత శ్రద్ధ చూపక పోవడం, మల్టీ స్టారర్ గా ప్రచారం జరిగిన ఈ సినిమాలో సదరు స్టార్లెవరూ వారి స్థాయికి తగ్గ పెర్ఫార్మన్స్ చేయకపోవడం ఈ సినిమాలో ప్రధాన లోపాలు. ఐదు పాత్రల కథలు చెప్పే క్రమంలో చాలా చోట్ల సాగతీత కనిపించింది. అక్కడక్కడా సినిమా నడక డాక్యుమెంటరీ ని తలపించింది. ముఖ్యంగా సినిమా మొదటి సగంలో ఈ లోపం బాగా కనిపించింది. విశ్రాంతి వరకూ పాత్రలు, వాటి లక్ష్యాల పరిచయం జరిగింది. రెండో సగంలో కథనం వేగాన్ని అందుకుని ఒక బలవంతపు ముగింపుకి చేరింది.

నాకీ సినిమా 'పర్లేదు' అనిపించడానికి ముఖ్యమైన కారణం సహాయ పాత్రల నటన. నిజానికి ఇదే ఈ సినిమాని నిలబెట్టిందని చెప్పాలి. కిడ్నీ అమ్ముకునే తల్లిగా నటించిన శరణ్య, ఆమె మావ గా చేసిన నాగయ్య, వాళ్ళ ఊరి ఆరెంపీ డాక్టర్ గా చేసినతను, వేశ్య సరోజకి సహాయంగా ఉన్ననపుంసక పాత్ర 'కర్పూరం' గా చేసిన నటుడు/నటి... వీళ్ళందరి నటన చాలా బాగుంది. తెలుగు లో సహాయ పాత్రలు చేసే నటులకి కొదవ లేదనిపించింది. వీళ్ళ నుంచి చక్కని నటనని రాబట్టుకున్న దర్శకుడు ప్రధాన పాత్రల నుంచి ఎందుకు రాబట్టుకోలేక పోయాడన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

సరోజపాత్రలో ఎక్స్ పోజింగ్ మినహా అనుష్క చేసిందేమీ లేదు. నిజానికి నటించేందుకు అవకాశం ఉన్న సన్నివేశాలు కొన్ని ఉన్నాయి ఈ పాత్రకి. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సన్నివేశం. స్టేషన్ ఆఫీసర్ గా అతిధి పాత్ర వేసిన పోసాని కృష్ణ మురళి నటన కూడా అనుష్క కి తగ్గట్టుగానే ఉంది. 'చమేలి' లాంటి హిందీ సినిమాల ప్రభావం ఉంది అనుష్క నటనపై. సరోజ పాత్ర పరిచయంలో 'సరోజ, అమలాపురం' అని చూపించారు. అయితే ఆమె భాషలో ఎక్కడ ఆ ప్రాంతపు యాస వినిపించదు. ఈ 'అమలాపురం' కేవలం పబ్లిసిటీ కి మాత్రమే ఉపయోగ పడింది.

నేను చూసిన మంచు మనోజ్ గత చిత్రం 'ప్రయాణం' తో పోలిస్తే ఇందులో అతని నటన కొంచం మెరుగు పడిందనే చెప్పాలి. కొన్ని ఫ్రేముల్లో అతన్ని చూసినప్పుడు విలన్ గా బాగా రాణిస్తాడని అనిపించింది. ఇక అల్లు అర్జున్ ని వెండితెర మీద చూడడం నాకిదే మొదటిసారి. హాస్పిటల్ లో జరిగే దొంగతనం సన్నివేశం, అక్కడ అతను ప్రదర్శించిన నటన బాగున్నాయి. మనోజ్ బాజ్పాయ్ పాత్ర రూపకల్పనలో దర్శకుడి కన్ఫ్యూజన్ అతని నటనలోనూ కనిపించింది. బాజ్పాయ్ భార్యగా చేసిన నటి కొన్ని సన్నివేశాల్లో నటనలో అతన్ని డామినేట్ చేసింది.

మాస్ ని ప్రతిబింబించే పాత్ర, డబ్బున్న వాళ్ళ మీద సెటైర్లు, 'బుల్లెబ్బాయి' అనే పేరున్న పాత్ర, ముగింపుకి ముందు నాటకీయ డైలాగులతో ఉండే సన్నివేశం... ఇవి 'గమ్యం' 'వేదం' సినిమాలకి ఉన్న పోలికలు. స్క్రిప్టు విషయంలో దర్శకుడు తొలి సినిమాకి తీసుకున్న శ్రద్ధలో పదో వంతు కూడా రెండో సినిమాకి తీసుకోక పోవడం బాధాకరం. సంగీతం, ఎడిటింగ్ సో సో. నిర్మాతకి లాభాలు తెచ్చి పెడుతుందేమో కానీ, దర్శకుడికి ఈ సినిమా విజయాన్ని ఇచ్చిందా? అంటే చెప్పడం కష్టమే.

33 కామెంట్‌లు:

  1. ఇంతకు మీ bottom line content ఇవ్వలేదు

    అదే సినిమా ని చూడొచ్చా లేదా? ధియేటర లో చూడొచ్చా , ఇంట్లో DVD చూడొచ్చా అని?
    నేను మాత్రం ధియేటర లోనే చూశాను :-)

    రిప్లయితొలగించండి
  2. హమ్మయ్యా.. వచ్చేసారా? ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా మిస్ అయిపోయామండీ మురళీ గారూ! అయితే, వేదం మరీ అంత గొప్పగా లేదన్నమాట! ఈ సినిమా గురించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి మరి నాకేం అనిపిస్తుందో చూడాలి ;-)

    రిప్లయితొలగించండి
  3. మల్టీ స్టారర్ గా ప్రచారం జరిగిన ఈ సినిమాలో సదరు స్టార్లెవరూ వారి స్థాయికి తగ్గ పెర్ఫార్మన్స్ చేయకపోవడం

    to be frank............asalu naaku ekkada natana choopinchagala scene kanipinchaledu.........

    nagayya ki marala dabbulu dorikina scene lo vunna dialogue patade ayina aa scene tappite.....ekkada koncham kooda choodaalanipinchaledu.........

    asalu ee movilo emi kotta vundo vaallake teliyaali....

    prati okkaru idi keka ani reviews ni fallow avvatam tappite asalu em scens baagunnayo cheppatam ledu.....

    nijam ga prasthanam and vedam choodagaane blogs raase valla anta chetta taste evariki vundadu ani decide ayipoya.especially kattini kummeyalani pinchindi.........

    రిప్లయితొలగించండి
  4. మురళీ గారూ..వెల్ కం బాక్..సుదీర్ఘ విరామం తరువాత మొదటి టపా...ఎప్పట్లానే బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. ఆలస్యంగా అయినా మీదైన శైలిలో బాగారాసారండి!

    రిప్లయితొలగించండి
  6. క్లాసులో ప్రతి సారీ ఫస్ట్ మార్కొచ్చే కుర్రాడు ఒక్కసారి ఒక్క మార్కు తక్కువ తెచ్చుకుంటే "బాగా చదివే వాడివి నీకేమొచ్చిందిరా?" అని తిడతారు మాస్టారు మొద్దు పిల్లల్ని వదిలేసి.

    అలాగే గమ్యం సినిమా నీట్ గా తీయగానే ప్రేక్షకులంతా క్రిష్ మీద మరీ ఎక్కువ expectations పెట్టుకున్నారల్లే ఉంది. సినిమా బావున్నా దశకుడికి అక్షింతలు బాగానే పడుతున్నాయి.నవతరంగంలో మహేష్ కుమార్ కూడా దర్శకుడు ఇంకా రాణించాలనేశారు.

    ఇదివరలో కపిల్ దేవో,సచినో బాటింగ్ లో విఫలమైనపుడు "మిడాన్ లో అలా ఆడి ఉండకూడదు. ఫుల్ టాస్ బంతిని అలా కొట్టకూడదు. బౌన్సర్ వస్తుంటే అలా నిర్లక్ష్యంగా నా ఉండేది?"అని బోలెడు విమర్శలు గుప్పించేవాళ్ళం క్రికెట్ చూసేటపుడు.ఒకరోజు మా నాన్నగారు "ఇక్కడ కూచుని బాగానే విమర్శించొచ్చు!అక్కడ ఆడేవాడికి తెలుస్తుంది నొప్పి"అన్నారు వెటకారంగా! అక్కడితో దార్లో పడ్డాము!అలాగే స్వయంగా దర్శకత్వం చేసేవాడికి తెలుస్తుందేమో అందులో కష్ట నష్టాలు! (విమర్శకులూ..క్షమించాలి)మురళీ,మీకూ సినిమా రంగంలో అనుభవముంటే సరే లెండి.మీకూ తెలుస్తాయిగా ఆ విషయాలు!

    నేననుకోవడం నాగయ్య పాత్ర వేసిన(రాములు అనుకుంటాను పేరు)
    వ్యక్తికి కాస్తో కూస్తో రంగస్థల అనుభవం ఉందేమో అని! అదీ కాక పాత్ర స్వభావం, ఆహార్యం ఇవన్నీ కూడా నటన లో కొన్ని మార్కులు కొట్టేస్తాయి. అందువల్ల కూడా నాగయ్యకు ఎక్కువ మార్కులు(నటన బాగానే ఉందనుకోండి)పడ్డాయి.

    అనుష్క వేశ్య పాత్ర వేయడానికి సాహసించడం తప్ప ఆమెకు పెద్దగా నటించేందుకేమీ లేదు.

    విమర్శనా దృష్టితో చూసినా నాకైతే బాగానే ఉంది సినిమా!

    రిప్లయితొలగించండి
  7. ఏమయిపొయ్యారు సర్ ఇన్నాళ్ళూ? హైదరాబాదొచ్చా మిమ్మల్ని కలుద్దామని కాని మీ ఆనుపానులు దొరకలేదు.ఎప్పటికో దర్శనభాగ్యం మరి????????????????

    రిప్లయితొలగించండి
  8. చాలా రోజులకి టపా వ్రాసినట్లున్నారు...
    Hope everything is fine..

    వేదం అందరూ ఆహా-ఓహో అంటున్నారు.. మరీ అన్ని "హా"లు లేకపోయినా హాలు కి వెళ్ళి చూడచ్చు కదా..!? :)

    రిప్లయితొలగించండి
  9. చాలా రోజులనుండి ఎవరికీ కనిపించకుండా అఙాతంలో ఉంటూ చక్కగా సినిమాలు చూసేస్తున్నారా? :) బాగుందండి రివ్యూ. ఇంకా చూడలేదు సినిమా. చూడాలి.

    రిప్లయితొలగించండి
  10. నేను గమ్యం చూడలేదు
    నాకైతే ఈ సినిమా నచ్చింది
    బ్లాగులోకానికి పునః స్వాగతం

    రిప్లయితొలగించండి
  11. నాకైతే ఈ సినిమా చాలా నచ్చిందండి...చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ కలిగింది. అల్లు అర్జున్, మనోజ్ నటన కూడా నాకు బాగానే అనిపించింది..బహుశా నేను అంత నటన కూడా వాళ్ళకు రాదన్న ఫీలింగ్ లో ఉన్నానేమో! అనుష్క అరుంధతితో పోలిస్తే కాస్త ఎక్స్ ప్రెషన్స్ పలికించిందనిపించింది...సహాయ నటులు మాత్రం సూపర్బ్ గా చేసారు మీరన్నట్టే...

    చాలా రోజులకు మళ్ళీ మీ టపా కనిపించింది...సో హేపీ నేను...

    రిప్లయితొలగించండి
  12. అవును మురళి గారు. మీరు చాలా చక్కగా వ్యక్తీకరించారు. ఈ సినిమా నేనూ చూసాను. కాని దీని గురించి ఎక్కువ ఆలోచించే ఇంట్రెస్ట్ మాత్రం నాకు రాలేదు.

    రిప్లయితొలగించండి
  13. "సరోజ పాత్ర పరిచయంలో 'సరోజ, అమలాపురం' అని చూపించారు. అయితే ఆమె భాషలో ఎక్కడ ఆ ప్రాంతపు యాస వినిపించాడు. ఈ 'అమలాపురం' కేవలం పబ్లిసిటీ కి మాత్రమే ఉపయోగ పడింది."

    Murali garu!nenu cinema chudaledu.mee tapa chadivaka chinna vishayam cheppali anipinchindi..

    meeru cheppinattu AMP Ante publisity ki matrame use avutundi..adi kuda movies lo vyamp caracters publisity ki matrame use avutundi.aa ..ante amalapuram song,etu peddapuram..atu amalapuram song,enka movies lo konni bits ..andra pradesh lo amp ante oka red light area laa matrame create chestunnaru.
    hyd lo amp peru chebite public kisukkuna navvu tunnaru.antala publisity chestunnaru movie vallu.

    edi konaseema vallu badha padavalasina vishayam.anduko teliyadu gani okappudu peddapuram peru chebite navve janam ,eppudu amp peru cheppina alaane navvu tunnaru.ee cinema valla daya valla future lo mana childrens amp peru cheppukovadaniki bayapadataremooo..

    mee tapa bagundi.

    రిప్లయితొలగించండి
  14. ఏమో నాకైతే చూడగానే చాలా రోజుల తరువాత మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ కలిగింది. గమ్యం బావుంది అంటారేంటి దీనికంటే అందరూ. నాకు అది పెద్దగా నచ్చలేదు గాలి శీను పాత్ర మినహా. చాలా స్లో గా, డల్ గా, దర్శకత్వం లో పరిపక్వత లేకుండా ఉందనిపించింది.
    జిహ్వకో రుచి.

    నాకు,నాకు తెలిసిన వాళ్ళందరికీ బాగా నచ్చింది. బహుశా నేను కామన్ ఆడియన్ (సామాన్య ప్రేక్షకుడు) ఏమో. క్రిటిక్స్ కి నచ్చదేమో :)

    రిప్లయితొలగించండి
  15. @ వినయ్ గారూ,

    nijam ga prasthanam and vedam choodagaane blogs raase valla anta chetta taste evariki vundadu ani decide ayipoya.especially kattini kummeyalani pinchindi.........


    ఇందాకా చెప్పినట్టు, జిహ్వకో రుచి. చాలా మంది గొప్పగా అభివర్ణించే కొన్ని తమిళ్ సినిమాలు నాకు పరమ చెత్తగా అనిపిస్తాయి. అలాగే ఇదీనూ.
    అన్నట్టు మీకు పితామగన్ ఇష్టమా?

    రిప్లయితొలగించండి
  16. @ సుజాత గారూ,
    సినీమాలో నాగయ్య పాత్రధారి నటనకి కొత్తేనటండీ! ఓసారి ఈ లింక్ చూడండి.might be interesting for you.
    http://idlebrain.com/movie/postmortem/vedam.html
    మీరన్నట్టు తీసేవాళ్ళకే ఆ కష్టం తెలుస్తుంది. ఈ ఆర్టికల్ చదివాక నాకు అదే ఫీలింగ్ వచ్చింది.
    Valid point!

    రిప్లయితొలగించండి
  17. హమ్మయ్య ...వచ్చేశారా ? చాన్నాళ్ళ విరామం ! వేదం సినిమాలో లోపాలు ఉన్నాకూడా చివరిలో మానవత్వపు పరిమళాన్ని చూపించి కొద్దిపాటి మార్కులు కొట్టేశారు. కాని మీరన్నట్టే ముగింపు బలవంతపు ముగింపులాగే అనిపించింది ముఖ్య పాత్రలకంటే సహాయనటులే చక్కగా చేశారు. మల్టీ స్టారర్ అనటానికీ లేదు టైటిల్స్ లో మనోజ్ ది ప్రత్యేకపాత్రగా వేశారుకదా ! మూసపోసినట్టు ఉండే సినిమా కధలకు కాస్త భిన్నంగా ఉంది కాబట్టి ఫర్వాలేదు ఓసారి చూడొచ్చని నా అభిప్రాయం .

    రిప్లయితొలగించండి
  18. ఈ సినిమా పెద్దగా నచ్చలేదు కాని పర్వాలేదు. అసలు తనేం చెప్పాలనుకున్నాడో ఇప్పటకీ అర్థం కాలేదు. హీరోలని చంపవలసిన అవసరం లేదనిపించింది. మీరు చెప్పినట్లు బలవంతంగా ముగింపు ఇచ్చాడనిపించింది.

    రిప్లయితొలగించండి
  19. నా కామెంట్ పబ్లిష్ కాలేదు ఎందుకో :(

    రిప్లయితొలగించండి
  20. నాకైతే అసలు అనుష్క ఆ సరోజ పాత్రకి సూట్ అయినట్టు అనిపించలేదు!

    రాములు పాత్రధారి నటన బాగుంది... specially 'ఇల్లు కుట్టేవాడికి ఇల్లు ఉంటుందా' అనే dialog బాగా నచ్చింది.

    ఇంకా పోలీసు ఆఫీసర్ గా చేసిన రవికాంత్ నటన కూడా నచ్చింది నాకు.

    అనుష్క, పోసాని సీన్ వచ్చినప్పుడు... కొన్ని సీరియస్ dialogs expect చేసాను. కాని expectation వచ్చే టైం కి సీన్ అయిపోయింది!

    సినిమా 'బాగుంది' లేదా 'బాగోలేదు' అని చెప్పలేని స్థితి!

    అన్నట్టు... మనోజ్ భార్యగా నటించింది 'శీయ'... పూరి జగన్నాథ్ 'నేనింతే' సినిమాలో హీరొయిన్.

    రిప్లయితొలగించండి
  21. ఇదేంటి, నేను కాస్త ఓ నెల్రోజులు లీవు పెట్టి అలా వెళ్ళొస్తే, మీలాంటి రెగ్యులర్ బ్లాగర్లు కూడా మొహం చాటేస్తే ఎలా?
    నాలుగు వారాలకి ఒక్క టపానా?

    రివ్యూ బాగుందని వేరే చెప్పక్కర్లేదు

    రిప్లయితొలగించండి
  22. నాకు నచ్చింది [అంటే నేను ఈ సినిమా ప్రస్తావన తెచ్చే వారందరికీ నచ్చి తీరాలి] అలాగనీ నటులెవ్వరికీ, అసలా యూనిట్ వాళ్ళేవరికీ నాకూ ఏ బంధుత్వం లేదు.. ఇక, పాటలు వాయించేస్తున్నాను... "మళ్ళీ పుట్టనీ, ప్రతి నిమిషం, నౌ ఆర్ నెవర్.." ఇలా అన్నీను. గౌతమి/వృద్దగోదావరి/... ఇలా ఐదుపాయలు కలిసిన గోదావరిలా నాకు మాత్రం చక్కని ప్రవాహంలో ఈదులాడిన భావన. అర్జున్ మాట పెరుగువడలో పెరుగు ఉంటుంది కానీ పులిహోరలో పులి ఉండదు." అనుష్క చివరి డైలాగ్ "గాడిద, ఎద్దుల మీద.." ఇవన్నీ ఒక్కసారి చూడగానే గుర్తుండిపోయాయి అంటే నేను లీనమైన తీరు తెలియదా..:) నేను థియేటర్, అదీ పక్క ఊరు వెళ్ళి, వర్కింగ్ డే రాత్రి [అమెరికా లో ఇవి కాస్త "అతి"] మరీ చూసాను. మురళీ గారు, చూసారాండీ, డిఫరెంట్ పేజ్ మీద ఉంటే ఎంత లాగుతామో జీళ్ళపాకాన్ని.

    రిప్లయితొలగించండి
  23. @పానీపూరీ: 'చూడొచ్చు' అని అండీ :-) ...ధన్యవాదాలు.
    @మధురవాణి: ఇంతకీ చూశారా అండీ?? ..ధన్యవాదాలు.
    @వినయ్ చక్రవర్తి: Please don't compare 'Vedam' with 'Prasthanam.' ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
    @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
    @సుజాత: బహుశా ఎలాంటి ఎక్స్పెక్టేషన్లూ లేకుండా చూడడం వాళ్ళ అనుకుంటానండీ, 'గమ్యం' నాకు చాలా నచ్చింది. ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చూసే సినిమాల జాబితాలో ఉంది. ఈ కారణానికి అనుకుంటా 'వేదం' నుంచి నేను చాలా ఆశించాను. చాలా చోట్ల క్లారిటీ లోపించిందన్నది ఓ ప్రేక్షకుడిగా నా భావన. రాములుకి నటనానుభవం ఏదీ ఉన్నట్టు లేదండీ.. రోజు కూలీ అని విన్నాను. మీరన్నట్టుగా అతని గొంతు ఆ పాత్రకి చాలా బాగా సరిపోయింది. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @శ్రీనివాస్ పప్పు: వచ్చేశానండీ.. :-) ధన్యవాదాలు.
    @మేధ: చూడొచ్చండీ.. ఈ పాటికి చూసేసే ఉంటారు మీరు :-) ..ధన్యవాదాలు.
    @శిశిర: చూసేయండి.. :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. @హరేకృష్ణ: ధన్యవాదాలండీ..
    @శేఖర్ పెద్దగోపు: నేను నటుల నుంచి కన్నా దర్శకుడి నుంచి కొంచం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి నిరాశ పడ్డానండీ.. ధన్యవాదాలు.
    @జయ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  27. @తువ్వాయి: ఆలోచించాల్సిన విషయం అండీ.. నిజానికి 'సరోజ, పెద్దాపురం' అని ఇవ్వాలనుకుని తర్వాత అమలాపురం అని మార్చారట.. ధన్యవాదాలు.
    @వాసు: నేను కూడా సామాన్య ప్రేక్షకుడినేనని మనవి చేసుకుంటున్నానండీ.. ముందుగా చెప్పినట్టుగా కొంచం ఎక్కువ ఆశించాను అంతే.. ధన్యవాదాలు.
    @పరిమళం: ఒకసారి చూడడానికి పర్లేదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. @సవ్వడి: ధన్యవాదాలండీ..
    @శ్రీ: ధన్యవాదాలండీ..
    @హను: 'ఇంకా బాగా తీయొచ్చు' అని నా అభిప్రాయం అండీ.. ధన్యవాదాలు.
    @పరిమళం: నేను బ్లాగు ఓపెన్ చేయక పోవడం వల్లనండీ.. ఇప్పుడు పబ్లిష్ అయింది చూడండి :-)

    రిప్లయితొలగించండి
  29. @చైతన్య: నేను 'నేనింతే' చూడక పోవడం వల్ల ఆమెని ఎవరో కొత్త నటి అనుకున్నానండీ.. అనుష్క-పోసాని సీన్ నుంచి నేను కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బహుశా సెన్సార్ లో పోయిందేమో అని సరిపెట్టుకున్నాను. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: అనివార్య పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందండీ.. వచ్చేశానిప్పుడు.. ధన్యవాదాలు.
    @ఉష: మీరు సినిమాలు కూడా చూస్తారా?!!!! నేనేమో ఓ చేత్తో కృష్ణశాస్త్రి పుస్తకాన్నీ, మరో చేత్తో షెల్లీ దో కీట్స్ దో పుస్తకాన్ని పట్టుకున్నఉష గారిని ఊహించుకుంటూ ఉంటాను, మీ కవితలు చదివినప్పుడల్లా... ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. మురళి గారు ఎలా అయినా ఈ సినిమా చూసి తీరాలని గాట్టి నిర్ణయం తో ఉన్నానండి అందుకే మీ టపా ( ఆ మాటకొస్తే ఈ సినిమాకి సంబంధించిన ఏ రివ్యూకూడా ) చదవకుండా తప్పించుకుంటున్నా . సినిమా చూసాకా అప్పుడు మీ టపా చదువుతా మరి ఉంటా .

    రిప్లయితొలగించండి