లోక్ సభ, రాజ్యసభ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని ఆమోదించాక, రాష్ట్రపతి ఆమోదం కేవలం ఒక లాంఛనమే కాబట్టి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న మిత్రులకి అభినందనలు చెబుతూ వస్తున్నాను. వీళ్ళలో సుదీర్ఘ కాలంగా ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళు, ఉద్యమం కోసం ఉద్యోగం వదులుకోడానికి సిద్ధపడ్డ వాళ్ళు, చిన్న ఉద్యోగాలతో సద్దుకుపొయిన వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యంగా, వాళ్ళ నాయకుల ప్రసంగాలలో విద్వేషపూరితంగా వినిపించే ప్రాంతానికి చెందిన నాతో స్నేహం చెయ్యడం వాళ్ళెవ్వరికీ అభ్యంతరం కాలేదు. రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు అనుకున్నారేమో బహుశా.
ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం చేస్తూ, ఖాళీ సమయాలని తెలంగాణా సాహిత్యం కోసం కేటాయించి, ఈమధ్యనే రిటైరైన మిత్రులొకరితో కొంచం సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. తెలంగాణలో బాగా వెనుకబడిన జిల్లాకి చెందిన వ్యక్తి. వామపక్ష భావజాలం నుంచి తెలంగాణా ఉద్యమానికి వచ్చిన మధ్యతరగతి మనిషి. "తెలంగాణ వచ్చేసింది కదా.. ఇప్పుడేమిటి?" అన్నాను నేను. "నిజానికి ఇదే కీలకమైన సమయం. జరగాల్సింది అంతా ముందుంది. రాబోయే కాలంలో చాలా సవాళ్ళే ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఇప్పటి తెలంగాణ పరిస్థితి, స్వతంత్రం వచ్చిన తొలిరోజుల్లో ఇండియా పరిస్థితి లాంటిది," అన్నారు.
"స్వతంత్రం వచ్చిన కొత్తలో అన్ని సమస్యలనీ గాంధీ నెహ్రూలు పరిష్కరించేస్తారన్న ఆశ ఒకటి చాలామందిలో ఉండేది. ఆ ఆశ వాళ్ళని ఏళ్ళ తరబడి మంచి రోజుల కోసం ఎదురు చూసేలా చేసింది. మరి, తెలంగాణ లో అలాంటి ఆశ ఉందా?" అని అడిగాను. "ఉంది. గాంధీ, నెహ్రూల మీద ఉన్నంత కాకపోయినా కేసీఆర్ మీద కొంత ఆశ ఉంది అందరికీ. ప్రాజెక్టులు వస్తాయన్న ఆశ ఉంది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశ ఉంది. మన బతుకులు మనం బతకొచ్చు అన్న ఆశ ఉంది. ఇవి ఎంతవరకూ తీరతాయి అన్నది చూడాలి. ఇవి తీరడం ఆలస్యం అయ్యే కొద్దీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. 47 లో స్వతంత్రం వచ్చాక, అరవైల నుంచీ ఉద్యమాలు మొదలై, డెబ్భైల నాటికి బాగా బలపడ్డాయి కదా.."
"ఇన్నాళ్ళూ తెలంగాణ సమస్యలు అన్నింటికీ కారణం ఒకటి సిద్ధంగా ఉండేది.. 'ఆంధ్రోళ్ళు' అనో 'వలస పాలకులు' అనో.. ఇప్పుడు, పాలన మారాక ఏమని జవాబు చెబుతారు? జనాన్ని ఎలా ఒప్పిస్తారు?" అని అడిగాను. "నిజమే.. ఇది కొంచం కష్టమైన విషయమే. ఎందుకంటే ఉద్యోగాలిచ్చి అందరినీ తృప్తి పరచగలిగే పరిస్థితి లేదు. లక్ష ఉద్యోగాలు ఉంటే, పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగం రాని వాళ్లకి నిరాశ ఉంటుంది. అయితే, రాన్రానూ వలసలు ఆగొచ్చు. ఉన్నవాళ్ళలో కొందరు వెనక్కి వెళ్ళొచ్చు. దీనివల్ల తెలంగాణ వాళ్ళు కొందరికి పని దొరకొచ్చు. ఉద్యోగం తర్వాత చూడాల్సింది వ్యవసాయం. కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. రైతులకి, కూలీలకి పని దొరుకుతుంది.."
"వెనక్కి వెళ్ళడం అంటే? అందరూ వెనక్కి వెళ్ళిపోవడం అన్నది సాధ్యమయ్యే పనేనా?" అని అడిగాను. "అట్లా కాదు. ఇప్పుడు ఆంద్ర లో కూడా పనులు మొదలవుతాయి. రాజధాని కట్టాలి.. అక్కడికీ కొన్ని ప్రాజెక్టులు ఇస్తారు.. వాటిలో పని చేయడానికి వలస వచ్చిన వాళ్ళు కొందరు వెనక్కి వెళ్ళొచ్చు. అందరూ వెనక్కి వెళ్ళడం సాధ్యం కాదు. అలా వెళ్ళిపోవాలని ఎవరూ అనుకోడం లేదు కూడా. ఇక్కడ దళితుల సమస్యలు, ఆదివాసీల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి.." అని చెబుతూ ఉండగా నాకు గుర్తొచ్చింది..."తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు?" ..."చెయ్యాల్సిందే.. లేకుంటే ఊర్కునే పరిస్థితి లేదు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ బయటికి వస్తాయి. ఇప్పటి కన్నా, ఒక ఐదేళ్ళ తర్వాత సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.."
"మళ్ళీ స్వతంత్ర భారత దేశం పోలికేనా?" అని అడిగాను. "చెప్పాను కదా.. అసలు పనంతా ఇప్పటినుంచీ ఉంది. ఏమేం చెయ్యాలి అన్నది నిర్ణయించుకోవాలి. అందరి సమస్యలూ చూడాలి. అందరికీ కూడా తెలంగాణ వచ్చేసింది కదా.. అన్నీ బాగవుతాయి అన్న ఆశ ఉంది. అది పోగొట్ట కూడదు. సమస్యలుంటాయి కానీ, స్వతంత్రం అన్నది చాలా పెద్ద విషయం కదా. ఇప్పటికైతే ఆ సంతోషం బాగా ఉంది. సిటీల్లో కన్నా, పల్లెల్లో బాగా కనిపిస్తోంది. వలసలు మొదలైన కొత్తలో వచ్చినవాళ్లు ఉర్దూ నేర్చుకునేవాళ్ళు. రాన్రానూ, ఇక్కడి వాళ్ళే అక్కడి భాష నేర్చుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి మారుతుంది కదా ఇప్పుడు..అదీ సంతోషం, ఇకపై అన్ రెస్ట్ పెరక్కుండా చూడాల్సింది పాలకులే.." అంటూ ముగించారు.
మొట్ట మొదటి ప్రాధాన్యత -
రిప్లయితొలగించండినల్గొండలో ఫ్లోరోసిస్ ను రూపుమాపడం.
ఆ పైన -
ప్రాణహిత చేవెళ్ళ, ఇచ్చంపల్లి, శ్రీరంసాగర్ ప్రాజెక్ట్ రెండవ, మూడవ, నాలుగవ దశలను త్వరితంగా పూర్తి చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
వేలాది మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుకోవాలి.
తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ, సాహిత్య చరిత్రలను పునస్సమీక్షించుకొని, తిరగ వ్రాసి ప్రపంచానికి చాటుకోవాలి. విద్యాధికుల శాతాన్ని గణనీయంగా పెంచుకోదానికి అన్ని జిల్లాలలో చాలా విద్యా సంస్థలను నిర్మించుకోవాలి.
--- ఇంకా చాలా ఉన్నాయి.
ఉద్యోగాల దేముంది? ఏ ప్రయత్నం లేకుండానే సహజంగానే ఇప్పటి కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది.
ముందు పదవుల కోసం కాట్ల కుక్కల్లా దెబ్బలాడుకోకుండా చూడండి..ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబం అంతా కలసి కోట్లు దండుకున్న ఘనులు ఇప్పుడు గాంధీ లు మీ దృష్టిలో..
రిప్లయితొలగించండి@ voleti meee edupu padu ganu kotlu evaru kuda bettukunnaru basu ....oka lagadapati, oka raypati , oka sujan, oka CM ramesh oka ramoji rao , oka ramki oka jagan , oka chandrabau nayudu , oak narne ....chala liste aaa kotha gaaa Kiran kumar reddy ... villantha kasta pade smapa dincharaaa ... first mee snagthi chusukondi vila daggara vunna dabbulo oka paisa mandham anna KCR dharaaa vunnayee anukonu
రిప్లయితొలగించండిabbaa..chaaa..very poor, pure family..keep it up..best of luck..
రిప్లయితొలగించండి@ఆచార్య ఫణీంద్ర, ఓలేటి, చందు: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి