tag:blogger.com,1999:blog-3179111145102142975.post6710483168440103613..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: 'బహుముఖీన కథకుడు' వంశీమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-13322503347210166502011-07-03T18:29:01.362+05:302011-07-03T18:29:01.362+05:30@కొత్తావకాయ; yaramana గారికిచ్చిన జవాబే మీకూను.. స...@కొత్తావకాయ; yaramana గారికిచ్చిన జవాబే మీకూను.. సినిమాలన్నీ అధ్బుతాలు కానట్టే, కథలు కూడా అన్నీ అద్భుతాలు కాదన్నది నా అభిప్రాయం అండీ..
మీ తెనిగింపు చక్కగా ఉంది. అసలు దానికి అస్సలు తీసిపోకుండా! :) ...ధన్యవాదాలండీ.
@సందీప్; ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48379436130295410562011-07-03T18:27:21.922+05:302011-07-03T18:27:21.922+05:30@శ్రావ్య వట్టికూటి: అంతేనంటారా? :-) :-) నిజానికి &...@శ్రావ్య వట్టికూటి: అంతేనంటారా? :-) :-) నిజానికి 'పసలపూడి' సంకలనంలో కన్నా మంచి కథలు 'ఆనాటి వానచినుకులు' లో ఉన్నాయండీ.. కానైతే అవి రాసేటప్పటికి వంశీ దర్శకుడిగా పీక్ లో ఉండడం వల్లా, తరచుగా కాకుండా అప్పుడోటీ అప్పుదోతీగా కథలు రాయడం వల్లా వాటికి రావల్సినంత పేరు రాలేదేమో అనిపిస్తుంది. ధన్యవాదాలు.
@yaramana: నిజమేనండీ పసలపూడి కథలు చదవడం గొప్ప అనుభూతి. అదే సమయంలో తను తీసిన సినిమాల్లో గొప్పవీ, చేత్తవీ ఉన్నట్టే సృజించిన కథల్లోనూ గొప్పగా అనిపించేవీ, పేలవంగా అనిపించేవీ ఉన్నాయి.. ఒక్కో సినిమా చూస్తున్నప్పుడు "ఆ సినిమా తీసినతనే ఈ సినిమా కూడా తీశాడా?" అని సందేహం.. కొన్ని కథలు చదివేటప్పుడు కూడా అంతే.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20451732154772312752011-07-03T18:23:18.745+05:302011-07-03T18:23:18.745+05:30@విశ్వనేత్రుడు: కేవలం రచయితా దర్శకుడు మాత్రమే కాదం...@విశ్వనేత్రుడు: కేవలం రచయితా దర్శకుడు మాత్రమే కాదండీ. గీత రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు కూడా. తన దగ్గర చాలా గొప్ప మ్యూజిక్ కలెక్షన్, చక్కని లైబ్రరీ ఉన్నాయని విన్నాను.. ఈరకంగా చూస్తే మీరు చెప్పిన 'బహుముఖ ప్రజ్ఞాశాలి' తనకి సరిపోయే టైటిలే.. ధన్యవాదాలు.
@పక్కింటబ్బాయి: నిజానికి నాకు వంశీ కథల్లో 'మా పసలపూడి కథలు' కన్నా కూడా అంతకు ముందు రాసిన కథలు బాగా నచ్చుతాయి. మీరు 'ఆనాటి వానచినుకులు' కథా సంకలనం చదివారా? కొన్ని గొప్ప కథలు ఉన్నాయందులో.. ఇకపోతే, 'పసలపూడి' లో కొన్ని కథలు బాగా నచ్చుతాయి.. వాటితోపాటు కేవలం వర్ణనల మీదే ఆధారపది విసుగు రప్పించే కథలూ ఉన్నాయి. కానైతే తనకి రచయితగా పేరొచ్చింది మాత్రం 'మా పసలపూడి కథలు' తోనే అన్నది నిజం.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-92100946229519192822011-07-03T01:15:03.606+05:302011-07-03T01:15:03.606+05:30చక్కటి వ్యాసాన్ని ఎంచుకుని తెనుగీకరించడంలో కృతకృత్...చక్కటి వ్యాసాన్ని ఎంచుకుని తెనుగీకరించడంలో కృతకృత్యులైనారు. అభినందనలు.Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-27940750911561156442011-07-02T18:34:57.345+05:302011-07-02T18:34:57.345+05:30yaramana గారితో నేనూ ఏకీభవిస్తాను. సినిమాలు తిసే వ...yaramana గారితో నేనూ ఏకీభవిస్తాను. సినిమాలు తిసే వంశీ వేరు. కథలు రాసే వంశీ వేరు. ఒక్కో చోట "ఏంట్రా ఇతనూ!" అనిపిస్తుంది, సినిమాలు చూస్తే! ఆణిముత్యాలు ఉన్నాయి. కాదనను. అదే కథకుడిని చూస్తే "అసలేంటితనూ!" అని భలే ముచ్చటేసేస్తుంది.

మీ తెనిగింపు చక్కగా ఉంది. అసలు దానికి అస్సలు తీసిపోకుండా! :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21295332625500222522011-07-02T16:50:45.053+05:302011-07-02T16:50:45.053+05:30వంశీ పసలపూడి కథలు చదువుతుంటే నాకు సత్యం శంకరమ...వంశీ పసలపూడి కథలు చదువుతుంటే నాకు సత్యం శంకరమంచి ' అమరావతి కథలు ' , మహమద్ ఖదీర్ బాబు ' దర్గా మిట్ట కథలు ' గుర్తొచ్చాయి . పసలపూడి కథలు చదవటం ఒక అద్భుత అనుభూతి . కథకుడు వంశీకి సినీ దర్శకుడు వంశీ ఏ మాత్రం సరితూగడు .y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18145752580153772172011-07-02T10:23:08.360+05:302011-07-02T10:23:08.360+05:30వంశీ గారంటే మీకున్న అభిమానానికి మరో గుర్తు ఈ పోస్...వంశీ గారంటే మీకున్న అభిమానానికి మరో గుర్తు ఈ పోస్టు :)

నాకు వంశీ దర్శకుడు గా కంటే రచయిత గా ఇష్టం , పసలపూడి కథలు గోదావరి పరిసరాలను మరీ ముఖ్యం గా పసలపూడి ని కళ్ళ ముందు చూపిస్తాయి .Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75973012533593181732011-07-02T07:37:13.611+05:302011-07-02T07:37:13.611+05:30సినిమాల్లో వంశీ ముద్ర గొప్పదే. కానీ, ఆయనని సాహిత్...సినిమాల్లో వంశీ ముద్ర గొప్పదే. కానీ, ఆయనని సాహిత్యమే భవిష్యత్తరాలకు పరిచయం చేస్తుంది. గత పది సంవత్సరాల్లో తెలుగు సాహిత్యంలో దాదాపు చెదురుమదురు సంఘటనలు తప్ప స్తబ్దతే రాజ్యమేలింది. అలాంటి సమయంలో ముళ్లపూడి వారి"కోతి కొమ్మచ్చి", వంశీ "మా పసలపూడి కథలు" లాంటివి కొన్ని మాత్రమే తెలుగు సాహిత్యంలో నిలబడే రచనలు వచ్చాయి. అందులో ముఖ్యంగా మా పసలపూడి కథలు తెలుగు కథల గురించి చెప్పేటప్పుడు చెప్పి తీరాల్సిన స్థాయిలో ఉన్నాయి. మన మహా కథకులలో వంశీ ఓకడయ్యాడు, అదీ చూస్తూ చూస్తూ ఉండగానే అనుకుంటేనే నాకేదో పులకింత కలుగుతుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-32980653225812799972011-07-01T21:34:11.049+05:302011-07-01T21:34:11.049+05:30వంశి బహుముఖీన కథకుడు మాత్రమే కాదు ...బహుముఖ ప్రజ్ఞ...వంశి బహుముఖీన కథకుడు మాత్రమే కాదు ...బహుముఖ ప్రజ్ఞా శాలి కూడా...అతని ప్రజ్ఞా పాటవాలు అన్ని మచ్చుకు సితార, అన్వేషణ లాంటి చిత్రాలలో ఇప్పటికీ మనకు కనిపిస్తూనే వుంటాయి..దధీచిhttps://www.blogger.com/profile/06740593661229262307noreply@blogger.com