కొన్ని సినిమాలు తీయడానికి కేవలం డబ్బుంటే చాలు. మరి కొన్ని సినిమాలు తీయడానికి మాత్రం సాహసం, గుండె ధైర్యం కావాలి. ఇవి నిర్మాత, దర్శకుడు ఇద్దరికీ ఉండాలి. అలాంటి సాహసం, గుండె ధైర్యం ఉన్న దర్శక నిర్మాతల నుంచి వచ్చిన సినిమా 'సిరివెన్నెల.' కథానాయకుడు అంధుడు.. నాయిక మాట్లాడలేని అమ్మాయి.. ఆమె అతన్ని మూగగా ప్రేమిస్తూ ఉంటుంది.. అతని మనసు మాత్రం తనకి కొత్త జీవితాన్నిచ్చిన మరో అమ్మాయి దగ్గర ఉంటుంది.
ఈ రెండు లైన్ల కథకి సున్నితమైన భావోద్వేగాలు మేళవించి రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాగా మలచడానికి ఎంత సాహసం, ఓర్పు, నేర్పు కావాలి? అవన్నీ పుష్కలంగా ఉన్న అతికొద్ది మంది తెలుగు దర్శకుల్లో ఒకరైన కే.విశ్వనాధ్ అపూర్వ సృష్టి ఈ 'సిరివెన్నెల.' కథానాయకుడు హరి ప్రసాద్ గా బెంగాలీ నటుడు సర్వదమన్ బెనర్జీ, అతన్ని ప్రేమించే మాటలు రాని అమ్మాయి సుభాషిణి గా సుహాసిని, అతను ఆరాధించే 'జ్యోతి' పాత్రలో హిందీ నటి మూన్ మూన్ సేన్ నటించారు.
పుట్టుకతోనే అంధుడైన హరి కి వేణుగానంలో అపూర్వ ప్రతిభ ఉంది.. చెల్లెలు సంయుక్త సాయంతో చిన్న చిన్న ప్రదర్శనలు ఇచ్చి పొట్ట పోసుకుంటూ ఉంటాడు. ఈవెంట్ మేనేజర్ జ్యోతి పరిచయం అతని జీవిత గతిని మార్చేస్తుంది. ఓ గొప్ప వేణు గాన విద్వాంసుడవుతాడు హరి. చిత్రంగా అతని జీవితంలో ప్రవేశించిన జ్యోతి అంతే చిత్రంగా మాయమవుతుంది. ఓ ప్రయాణంలో అతనికి పరిచయమైన సుభాషిని కవితలు రాస్తుంది, బొమ్మలు గీస్తుంది, శిల్పాలు కూడా చెక్కుతుంది. కానీ మాట్లాడలేదు. హరి ప్రేమ కథ తెలిసి అతన్ని జ్యోతితో కలపడానికి యెంతో ప్రయత్నిస్తుంది.
పాత్రల పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది.. ముందుగా సుభాషిణి బొమ్మలు గీస్తుందని చూపిస్తారు.. తర్వాత ఆమెకి మాటలు రావని, అలాగే వేణు గాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ అంధుడనీ తెలుస్తుంది. టైటిల్స్ పూర్తయ్యేసరికి జ్యోతి మినహా ప్రధాన పాత్రలన్నీ కథాస్థలానికి చేరుకుంటాయి. వేణుగానంలో హరి ప్రతిభను ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు దర్శకుడు 'విధాత తలపున' పాటతో. ప్రేక్షకుల్లో ఉన్న సుభాషిణి హరిని అభిమానించడం మొదలు పెడుతుంది.
చాలా ఏళ్ళ తర్వాత తను పుట్టి పెరిగిన ఊరికి తిరిగి వచ్చిన హరి పాడుకునే పాట 'ఈగాలి..ఈనేల..' పాట చివరి చరణం 'కన్నెమూగ కలలుగన్న స్వర్ణ స్వప్నమై..' లో సుభాషిణి ప్రేమని ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఆమె రాసిన కవితలో అక్షరాలు వాన నీటిలో కరిగి హరి వేణువు నుంచి నీలిరంగులో బయటికి రావడం బహు చక్కని వ్యక్తీకరణ. (పనిలో పనిగా విశ్వనాధ్ సెంటిమెంట్ అయిన స్నాన దృశ్యం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది.. మరికొన్ని స్నాన దృశ్యాలూ ఉన్నాయి.. )
ఇప్పుడింక సుభాషిణి తన ప్రేమని వ్యక్తీకరించాలి..ఎలా? తన అన్న గిరీష్ ('సప్తపది' లో హరిబాబు గా చేసిన నటుడు గిరీష్) ని అర్ధరాత్రి నిద్రలేపి, పెళ్లి ప్రస్తావన తెచ్చి, హరి పాట వినిపిస్తుంది. గిరీష్ హరి గతాన్ని గురించి తెలుసుకోడం ద్వారా ప్రేక్షకులకీ హరి గురించి తెలుస్తుంది.శివమణి డ్రమ్స్ తో పోటీ పడుతూ ఎగిసే అగ్ని జ్వాలలకి అనుగుణంగా వేణువు వాయించే పందెంలో గెలిచి జ్యోతి దృష్టిలో పడతాడు హరి. అది మొదలు అతనికి సర్వమూ జ్యోతే..
హరికి జ్యోతి సూర్యోదయాన్ని పరిచయం చేస్తుంది.. ఇదొక బ్రిలియంట్ సీన్.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చి తీరే సీన్. వర్షపు సౌందర్యాన్ని చూపిస్తుంది.. ('చినుకు చినుకు' బిట్ సాంగ్.. నాకు చాలా ఇష్టం) సమస్త ప్రకృతినీ అతను తన మనో నేత్రంతో తిలకించేలా చేస్తుంది. ('ప్రకృతి కాంతకు..' మరో మంచి పాట) జ్యోతి తో పీకలోతు ప్రేమలో మునిగిపోతాడు హరి..కానీ వ్యక్తం చేయడు. అంధ బాలిక రేణు (బేబి మీనా) కి వెన్నెల్లో బృందావనం చూపిస్తానని మాటిస్తాడు హరి. ఆమె తాతగారు (రమణ మూర్తి) తన రికార్డింగ్ కంపెనీ ద్వారా హరి రికార్డు విడుదల చేస్తారు. హఠాత్తుగా మాయమైపోతుంది జ్యోతి.
'కొన్నేళ్ళకి' ఒక పెద్ద విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నా తను కట్టుకున్న ఇల్లు మొదలు, విడుదల చేసే రికార్డు వరకూ జ్యోతికే అంకితం ఇస్తూ ఉంటాడు హరి. అది కేవలం కృతజ్ఞతా? ప్రేమా? అతనికి మాత్రమే తెలుసు. అది తెలుసుకోకుండా పెళ్లి ప్రస్తావన తేవడం మంచిది కాదంటాడు గిరీష్. ఆలోచనలో పడుతుంది సుభాషిణి. ఇప్పుడు సుభాషిణి హరికి ఎదురు పడాలి.. తను అతన్ని ప్రేమిస్తోంది.. కానీ అతని మనసు మరొకరి దగ్గర ఉంది.. తన భావాలన్నీ ఆమె కేవలం తన కళ్ళతోనే వ్యక్తీకరించగలదు.. కానీ అతను వాటిని చూడలేడు.. జ్యోతినీ హరినీ కలపమని శివుణ్ణి కోరుకుంటుంది.. (నేను తరచూ వినే 'ఆదిభిక్షువు..' పాట)
తనకి వచ్చిన విద్యని ఉపయోగించి జ్యోతి బొమ్మ చెక్కాలనుకుంటుంది సుభాషిణి.. కానీ జ్యోతి ని తనెపుడూ చూడలేదు.. ఆమెని ప్రేమించిన హరీ ఆమెని చూడలేదు.. అతని ద్వారా జ్యోతి రూపు రేఖలు తెలుసుకుని బొమ్మ చెక్కుతుంది. నిజానికి జ్యోతిని సంయుక్త చూసింది..ఇంకా మరికొందరూ చూశారు.. కానీ ఆమె రూపు రేఖల గురించి వాళ్ళెవరినీ అడగదు సుభాషిణి.. ఆమెకి కావలిసింది హరి మనోఫలకంపై ఉన్న జ్యోతి రూపం. దానికే రూపు కడుతుంది. సరిగ్గా అప్పుడే జ్యోతి మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. వెన్నెల్లో బృందావనం చూపించమంటూ రేణు వస్తుంది.. అదేమిటో ఈ కొన్నేళ్ళ లోనూ ఆమె యెదగదు.. సంయుక్త కూడా అంతే. ('చందమామ రావే..' పాట..)
జ్యోతి రూపంతోనూ, గుణగణాల తోనూ పని లేకుండా ఆమెని ప్రేమిస్తున్నానంటాడు హరి. సినిమా క్లైమాక్స్ కి పరిగెడుతుంది. నాకు కొరుకుడు పడని ఒకే ఒక్క అంశం జ్యోతి ఆత్మార్పణం. హరి లో ఉన్న కళాకారుడిని గుర్తించి వెలుగులోకి తెచ్చింది. అతను తనని ప్రేమించాడు.. తను అందుకు అర్హురాలు కాదనుకుంది.. ఇద్దరి జీవితవిధానాలూ వేరనుకుంది.. తను అతనికి దక్కకపోయినా హరి మునుపటిలాగే పాడాలని మాట తీసుకుంది.. తన కళ్ళని అతనికి ఇవ్వడం కోసం ఆత్మహత్య చేసుకోవడం.. ప్చ్.. నేను కన్విన్స్ కాలేను.
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సుహాసిని నటన. హరి మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత, జ్యోతిని మొదటి సారి కలిసినప్పుడు ఆమె గుర్తుండిపోయే నటనని ప్రదర్శించింది. మహదేవన్ సంగీత సారధ్యంలో ఏ ఒక్క పాటనీ బాగాలేదు అనలేం.. ఇప్పటికీ రోజూ విన్నా బోర్ కొట్టని పాటలు. హరిప్రసాద్ చౌరాసియా తన వేణుగానం తో సినిమాకి ప్రాణం పోశారు. ఈ సినిమా తో గేయ రచయితగా పరిచయమైన సీతారామశాస్త్రి సినిమా పేరునే తన ఇంటిపేరుగాచేసుకున్నారు. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే విశ్వనాధ్ సమకూర్చుకున్నారు. గీతాకృష్ణ ఆర్ట్స్ సంస్థ 1986 లో నిర్మించింది ఈ సినిమాని.
తనకి వచ్చిన విద్యని ఉపయోగించి జ్యోతి బొమ్మ చెక్కాలనుకుంటుంది సుభాషిణి.. కానీ జ్యోతి ని తనెపుడూ చూడలేదు.. ఆమెని ప్రేమించిన హరీ ఆమెని చూడలేదు.. అతని ద్వారా జ్యోతి రూపు రేఖలు తెలుసుకుని బొమ్మ చెక్కుతుంది. నిజానికి జ్యోతిని సంయుక్త చూసింది..ఇంకా మరికొందరూ చూశారు.. కానీ ఆమె రూపు రేఖల గురించి వాళ్ళెవరినీ అడగదు సుభాషిణి.. ఆమెకి కావలిసింది హరి మనోఫలకంపై ఉన్న జ్యోతి రూపం. దానికే రూపు కడుతుంది. సరిగ్గా అప్పుడే జ్యోతి మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. వెన్నెల్లో బృందావనం చూపించమంటూ రేణు వస్తుంది.. అదేమిటో ఈ కొన్నేళ్ళ లోనూ ఆమె యెదగదు.. సంయుక్త కూడా అంతే. ('చందమామ రావే..' పాట..)
జ్యోతి రూపంతోనూ, గుణగణాల తోనూ పని లేకుండా ఆమెని ప్రేమిస్తున్నానంటాడు హరి. సినిమా క్లైమాక్స్ కి పరిగెడుతుంది. నాకు కొరుకుడు పడని ఒకే ఒక్క అంశం జ్యోతి ఆత్మార్పణం. హరి లో ఉన్న కళాకారుడిని గుర్తించి వెలుగులోకి తెచ్చింది. అతను తనని ప్రేమించాడు.. తను అందుకు అర్హురాలు కాదనుకుంది.. ఇద్దరి జీవితవిధానాలూ వేరనుకుంది.. తను అతనికి దక్కకపోయినా హరి మునుపటిలాగే పాడాలని మాట తీసుకుంది.. తన కళ్ళని అతనికి ఇవ్వడం కోసం ఆత్మహత్య చేసుకోవడం.. ప్చ్.. నేను కన్విన్స్ కాలేను.
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సుహాసిని నటన. హరి మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత, జ్యోతిని మొదటి సారి కలిసినప్పుడు ఆమె గుర్తుండిపోయే నటనని ప్రదర్శించింది. మహదేవన్ సంగీత సారధ్యంలో ఏ ఒక్క పాటనీ బాగాలేదు అనలేం.. ఇప్పటికీ రోజూ విన్నా బోర్ కొట్టని పాటలు. హరిప్రసాద్ చౌరాసియా తన వేణుగానం తో సినిమాకి ప్రాణం పోశారు. ఈ సినిమా తో గేయ రచయితగా పరిచయమైన సీతారామశాస్త్రి సినిమా పేరునే తన ఇంటిపేరుగాచేసుకున్నారు. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే విశ్వనాధ్ సమకూర్చుకున్నారు. గీతాకృష్ణ ఆర్ట్స్ సంస్థ 1986 లో నిర్మించింది ఈ సినిమాని.
మీరు రాసిన సినిమా వ్యాసాల్ని నవతరంగంలో కూడా పెడితే బాగుంటుందికదా!
రిప్లయితొలగించండిమురళి గారు,
రిప్లయితొలగించండిమీ శైలి లో బాగా అభివర్ణించారు...
తెలిసిన సినిమా అయినా కొత్తగా పరిచయం చేసారు.
చక్కటి పరిచయం..
రిప్లయితొలగించండి>>హరికి జ్యోతి సూర్యోదయాన్ని పరిచయం చేస్తుంది.. ఇదొక బ్రిలియంట్ సీన్..
True..
>>నాకు కొరుకుడు పడని ఒకే ఒక్క అంశం జ్యోతి ఆత్మార్పణం
నాకు అదే అర్ధమవదు.. అలా ఎందుకు చేసిందా అని..?
>>ఇప్పటికీ రోజూ విన్నా బోర్ కొట్టని పాటలు.
అవును..
మురళి గారూ!
రిప్లయితొలగించండి‘సిరివెన్నెల’ సినిమా గురించి మీరు చాలా స్పందించి రాసినట్టు మీ టపా చెపుతోంది. దీనిలోని గొప్ప అంశాలతో పాటు లోపాలను కూడా చెప్పటం బావుంది. అభినందనలు!
హరికి జ్యోతి ప్రకృతిని పరిచయం చేసే దృశ్యాలు చాలా బావుంటాయి. భూపాల రాగాన్ని హరి అప్రయత్నంగానే సృజించటం ఆకట్టుకునేలా ఉంటుంది.
తన కళ్ళని అతనికి ఇవ్వడం కోసం జ్యోతి ఆత్మహత్య చేసుకోవడం విషయంలో మీలాగే నేనూ కన్విన్స్ కాలేదు.
'ఈగాలి..ఈనేల..' పాట చివరి చరణంలో 'కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై..' అనేది సరైన రూపం.
‘సిరివెన్నెల’ గురించి కె.విశ్వనాథ్ గారు చెప్పిన విశేషాల లింక్ ఇవ్వటం బావుంది. ఇక- నా బ్లాగు పోస్టు ‘వెన్నెలా...వేణువూ’ ను ఈ సందర్భంలో స్మరించి, లింక్ ఇచ్చినందుకు థాంక్యూలు!
మురళిగారు,
రిప్లయితొలగించండిజ్యోతి ఆత్మహత్య చేసుకున్నది తన కళ్ళని ఇవ్వడం కోసమే కాదు. ఆమెకి హరిప్రసాద్ తనపై చూపించిన ప్రేమని చూసి, తన బతుకు మీద అసహ్యం ఏర్పడింది. దాన్ని మరిచిపోయి హరిప్రసాద్ తో కొత్త జీవితం మొదలుపెట్ట లేకపోయింది. బహుశా తనకింక జీవించాలన్న కోరిక నశించి ఆ పని చేసిందని నాకనిపించింది. మరోవైపు సుహాసిని ప్రేమ గురించి కూడా ఆమెకి తెలుసు. ఇలా దీనికి రకరకాల కోణాలని చూడవచ్చు. దర్శకుని ప్రతిభ ఎక్కడుందంటే, ఇదీ కారణం అని చూపించకుండా/చెప్పకుండా (మామూలుగా క(వి)నిపించే భారీ డైలాగులు లేకుండా!) ఆ పని చేయించాడు. మనిషి చేసే ప్రతి పనికి కచ్చితమైన లాజిక్కు ఉండక్కరలేదు కదా!
ముఖ్యపాత్రల పేర్లతో సహా ప్రతిది భావుకతతో తీర్చిదిద్దిన ఒక గొప్ప కావ్యంలా అనిపిస్తుంది నాకీ సినిమా.
సిరివెన్నెల సినిమా మొత్తం సీతారామశాస్త్రి మీదనే వెళ్ళిపోయింది. "ఈ గాలి ఈ నేల", "విధాత తలపున" నా ఆల్ టైము ఫావరేట్లు. మరీ ప్రత్యేకం గా ఈ సినిమా తరువాతనే హరిప్రసాద్ చౌరాసియా గురుంచి తెలుసుకున్నాను, మరలా ఆ మురళీ నాదం "చాందిని", సినిమా పాటల్లోనూ విన్నాను.ఆ సినిమా లో నాకు నచ్చని ఒకే ఒక్క నటి సుహాసిని.( నా అభిప్రాయం మాత్రమే మురళీ నొచ్చుకోకూడదు) ఆమెను కాకుండా ఇంకెవ్వరిని పెట్టినా ఆ సినిమా అలానే ఆడి ఉండేది.మిగిలిన దంతా దర్శకుడి ప్రతిభే.
రిప్లయితొలగించండిఈ సినిమా ద్వారా ఒక అద్భుతం ఆవిష్కరించబడింది సీతారామ శాస్త్రి రూపంలో! అదొక్కటి చాలు ఈ సినిమాని వెయ్యేళ్ళపాటు మర్చిపోకుండా ఉండేందుకు! ఆయన కలం లోంచి జాలువారే ప్రతి పాటా ఒక రసాత్మక కావ్యం...ఈ సినిమాలోనే కాదు , ఏ సినిమాలో అయినా సరే! ఆదిభిక్షువు పాటకు ఎన్ని అవార్డులిచ్చినా చాలనే చాలవు..చాలవు! శివుడు విన్నా కరిగి నీరైపోతాడేమో అనిపించేంత గొ...ప్ప పాట!
రిప్లయితొలగించండి(మురళీ, నా డిమాండ్ ఏమిటంటే సీతారామ శాస్త్రి గారి పాటల గురించి మీరొక టపా రాయాలి! )
అంతకు మించి సినిమా మాత్రం బోరు కొట్టేస్తుంది(నాకు..)ముఖ్యంగా సుహాసిని మూగ నటన చాలా బోరు! ఇక మీకు కొరుకుడు పడని అంశమే నాకూ నచ్చనిది. అతని కళ్ళకోసం వేరే ఏర్పాటు ఏదైనా చేసే అవకాశం ఉంది కదా!
(పనిలో పనిగా విశ్వనాధ్ సెంటిమెంట్ అయిన స్నాన దృశ్యం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది...:-)!భలే పట్టుకున్నారు.
ఏమైనా, సంగీతాన్ని వదిలేసి ఈ సినిమాని ఆస్వాదించాలంటే మాంఛి లోతైన కళాత్మక హృదయమూ, కాసింత సహనమూ కూడా అవసరమని నాకనిపిస్తుంది!
మురళి గారూ ! వెన్నెలా -వేణువూ లో ఈ టపా నేనూ చూశానండీ ....
రిప్లయితొలగించండిమంచిసినిమాలు అరుదుగా వస్తాయి కానీ కలకాలం గుర్తుండిపోతాయి ...ఒకవేళ మర్చిపోతే గుర్తుచేస్తుంది నెమలికన్ను!
ఇలాంటి సినిమా తీయటానికి ముఖ్యంగా మనసుండాలి. నాకు చాలా నచ్చిన సినిమాల్లో ఇదొకటి.
రిప్లయితొలగించండినాకు ఎంతో ఇష్టమైన సినిమాని మళ్ళీ గుర్తు చేసారు.
రిప్లయితొలగించండినా అభిమాన సంగీత దర్శకుడు కె. వి. మహదేవన్ సమకూర్చిన చివరి (బహుశా) అద్భుత స్వరాలు.
సీతారామశాస్త్రి ఇంతబాగా మళ్ళీ వ్రాయలేకపోవచ్చు.
మురళీ గారూ,
రిప్లయితొలగించండిమరోసారి సిరివెన్నెల చూపించారు మీ నెమలికన్నులో. ధన్యవాదాలు :)
జ్యోతి చనిపోవడమనే సీన్ గురించి భైరవభట్ల గారు చెప్పిందే నా అభిప్రాయం కూడానూ.!
అయినా, ఆ అమ్మాయి చనిపోవడం అనే సీన్ ఎందుకో త్వరగా డైజెస్ట్ చేస్కోలేని విధంగానే అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు.
ఇక పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే.. జీవితాంతం విన్నా బోర్ కొట్టే ప్రసక్తే లేదు. మహదేవన్ అద్భుత సంగీత సారధ్యం, సిరివెన్నెల సాహిత్యం ఎప్పటికీ మర్చిపోలేనివి.
అన్నట్టు.. విశ్వనాథ్ 'స్నాన దృశ్యం' సెంటిమెంట్ గురించి ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నా ;)
మీ సినిమా వ్యాసాల్ని నవతరంగంలో పెడితే బావుంటుందేమో.!
అప్పట్లో విశ్వనాధ్ గారు దైర్యంతో ఈ చిత్రాన్ని తీసినా మొదటి పదిరోజులు జనాలకి ఎక్కలేదండి!........గొప్పతనం గుర్తింపుకి కొన్నాళ్ళు పడుతుందేమో అనుకున్నాను నేను అప్పుడు. ఆ చిత్రం ఒక ఆణిముత్యం.
రిప్లయితొలగించండిమొత్తానికి ఎలాగూ ఈ సినిమా చూడ్డం పడలేదు. డీవీడీ చేతికి దొరికినప్పుడు కూడా చూడకుండానే దాన్ని ఇంకోళ్ళకి బహుమతి ఇచ్చాను.
రిప్లయితొలగించండిఈ స్నానఘట్టాల సెంటిమెంటు మీద మీరు వేరే విశ్లేషణ రాయాలి!
జ్యోతి మరణం విషయం లో నేను కూడా భైరవభట్ల గారితో ఏకీభవిస్తాను. అతనికి కళ్ళు తెప్పించడానికి వేరే మార్గాలు ఉన్నప్పటికీ, తన ప్రతి రికార్డ్ నీ ఆమెకే అంకితమిచ్చి, తన హృదయం లో అత్యున్నతమైన స్థానం ఇచ్చిన హరి ఈ లోకాన్ని చూడటానికి తన కళ్ళు ఉపయోగ పడితేనన్నా, తన లాటి వ్యక్తికి అతను ఇచ్చిన గౌరవానికి సార్ధకత లభించదు అని ఆమె ఆపని చేసి ఉండచ్చు.
రిప్లయితొలగించండికన్నెమూగమనసు కన్న... చరణం లో సుభాషిణి ప్రేమ వ్యక్తీకరణ అధ్బుతం, చూసిన ప్రతీ సారీ నేను ఆ సినిమాలో, సంగీతంలో, ఓ అందమైన అనుభూతి లో ఎంతగా లీనమవుతానంటే అది వానపాట అన్న స్పృహే ఉండదు.
రివ్యూ నిజాయితీగా నిస్పక్షపాతం గా చాలా బాగుంది.
Good post...i like sirivennala garu...
రిప్లయితొలగించండి@కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@హను: ధన్యవాదాలు
@మేధ: ధన్యవాదాలు.
@వేణు: మీకు నేను బోల్డన్ని థాంకులు చెప్పాలి.. ముందుగా టైపో ని సరి చేసినందుకు. అసలు మీ టపా చూశాకే నాకు ఈ సినిమా గురించి రాయాలనిపించింది.. సినిమా ఓ ఐదారు సార్లు చూసి ఈ ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భైరవభట్ల కామేశ్వర రావు: ఒక చిన్న విషయం అండీ.. ఆత్మహత్య ఏ మాత్రం సమర్ధనీయం కాదని నా అభిప్రాయం.. కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మారే విలువలు ప్రాణం కన్నా విలువైనవి కాదు అనుకుంటాను నేను. నిజమే.. ప్రతిపనికీ లాజిక్ ఉండనవసరం లేదు.. కానీ తను కొత్తజీవితం ఇచ్చిన వాడు తనని ప్రేమిస్తే, అతనికి తను తగను అనే భావన తో (ఆమె సూసైడ్ నోట్) చనిపోవడం నాకు కొరుకుడు పడదండీ.. ఆమెకి జీవితేచ్చ నశిస్తే.. దురదృష్టవశాత్తూ అందుకు కారకుడు హరి ప్రసాదే అవుతాడు.. ఎందుకంటే అతను తనని ప్రేమిస్తున్నాడని తెలిసే క్షణం వరకూ జ్యోతి సంతోషంగానే ఉంది.. 'మనసున కొలువై..' పాట తర్వాతే ఆమె ఆలోచనలో పడుతుంది.. ఆమెని చంపెయ్యడానికి కారణం విషయమై దర్శకుడికి కూడా స్పష్టత లేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు.. ఇదొక్కటీ మినహాయిస్తే కచ్చితంగా గొప్ప సినిమానే.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సునీత: అయ్యయ్యో..నేనెందుకు నొచ్చుకుంటానండి.. నాకైతే సుహాసిని బాగా చేసింది అనిపిస్తుంది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సుజాత: "ఏమైనా, సంగీతాన్ని వదిలేసి ఈ సినిమాని ఆస్వాదించాలంటే మాంఛి లోతైన కళాత్మక హృదయమూ, కాసింత సహనమూ కూడా అవసరమని నాకనిపిస్తుంది!" ..కళాత్మక హృదయం సంగతి నాకు తెలియదు కానీ, ఓపిక మాత్రం ఎక్కువేనండి నాకు :-) శాస్త్రి గారి పాటల గురించి టపా అంటే, యెంత పెద్ద టపా రాసిన ఇంకా చాలా పాటలు మిగిలిపోతాయి.. అందరం కలిసి ఒక బ్లాగు మొదలుపెడితే ఎలా ఉంటుందంటారు? ..ధన్యవాదాలు.
@పరిమళం: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@భవాని: ధన్యవాదాలు.
@బోనగిరి: ధన్యవాదాలు.
@మధురవాణి: జ్యోతి విషయంలో నా అభిప్రాయం భైరవభట్ల గారికి చెప్పాను చూడండి.. విశ్వనాధ్ సెంటిమెంట్ గురించి ఇప్పటివరకూ తెలియకపోవడం ఆశ్చర్యమే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సృజన: ధన్యవాదాలు
@కొత్తపాళీ: చూడాల్సిన సినిమా.. కాకపొతే కొంచం ఓపిగ్గా.. విశ్లేషణ? అన్ని స్నాన దృశ్యాలనూ ఓసారి గుర్తుచేయ్యమనా మీ ఉద్దేశ్యం? :-) ..ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: "రివ్యూ నిజాయితీగా నిస్పక్షపాతం గా చాలా బాగుంది." ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@లక్ష్మణ్: ధన్యవాదాలు.
బహు మంచి సమీక్ష! జాబు పెద్దదైపోతుందని భావించారేమోగానీ.. పాటల గురించి మరింత రాసి ఉండొచ్చు. హరిప్రసాదు సన్మానంలో సుహాసిని వేసిన బొమ్మను ఆవిష్కరించే సీను గురించి కొంత రాయొచ్చు. సున్నితమైన హాస్యం గురించి కూడా రాసి ఉండొచ్చు.
రిప్లయితొలగించండిఅసలు కొత్తపాళీ గారు అడిగినట్టు విశ్వనాథ్ సినిమాల్లో ఉండే సున్నితమైన హాస్యం గురించి ఒక వ్యాసం రాయవచ్చు.
ఏంటి చాలా అడిగేస్తున్నాడు అని అనుకోకండి.. పళ్ళచెట్టుకే రాళ్ళదెబ్బలు సార్!
ఒక ముక్క చెప్పడం మర్చాను కిందటి వ్యాఖ్యలో..
రిప్లయితొలగించండి"ఆదిభిక్షువు వాడినేది కోరేది" గురించి చివుకుల కృష్ణమోహన్ గారు ఏమన్నారో చూడొచ్చిక్కడ! ఈ పాట నాకు బాగ నచ్చిన పాటల్లో ఒకటి. అసలీ పాట చాలా పెద్దది. సినిమాలో కొంతే వాడారు.
నేను,మా తమ్ముడు వినీ వినీ అరగ్గొట్టిన క్యాసెట్లలొ ఈ సినిమా పాటలది ఒకటి."స్వాతిముత్యం,సిరివెన్నెల " రెండు సినిమా పాటలు ఉన్న క్యాసేట్ అది.ప్రతి వాక్యం,ప్రతి అక్షరం బట్టీ...అప్పట్లో నాకైతే"మనసున కొలువై""ప్రకృతి కాంతకూ.." ఇష్టం ఉండేవి.మా వారి ఆల్ టైం ఫేవొరేట్ మాత్రం"విధాత తలపున...".
రిప్లయితొలగించండిఇక కధ విషయంలో జ్యోతి క్యారెక్టర్ ని అలా దిగజార్చి ఎందుకు చూపించారో,ఎందుకు చంపివెయ్యాలొ ఇప్పటికీ నాకు అర్ధం కాని ప్రశ్నలు...ఎంతొ ఉన్నతంగా చూపించిన ఆ క్యారెక్టర్ని అలా డిమీన్ చెయ్యాటం నాకు నచ్చని విషయం. Except that,
its a good film with great theme.
చాలా బాగుందండి..మంచి సినిమాలు చూడాలంటే మీ బ్లాగ్ ఓపెన్ చేస్తే చాలుననిపిస్తుంది.
రిప్లయితొలగించండిఇందులో సుభాషిణి హరి బొమ్మ గీయడం, అతని సన్మాన సభ లో దాన్ని వర్ణించడం నాకు బాగా నచ్చిన సన్నివేశం. అలాగే సాక్షి రంగారావు గారికి వున్న "అబ్బ...ఛి" అన్న మానరిసం నాకు చాలా బాగా నచ్చింది. మొత్తంగా ఒక అద్భుతమైన సినిమా. ఇక పాటలైతే చెప్పనే అక్కరలేదు..అమృత ధారలు.
@చదువరి: జాబు పెద్దదైపోతుందని కాదండీ.. పాటల గురించి 'వేణువు' వేణు గారు వివరంగా రాశారు కదా.. ఆ లంకె ఇచ్చాను.. అలాగే సినిమా గురించి విశ్వనాధ్ ఇంటర్వ్యూ (లంకె ఉంది) లో చెప్పిన విషయాలు చర్విత చర్వణం కాకుండా జాగ్రత్త పడ్డాను.. నిజమే హాస్యాన్ని గురించి కొంచం రాసి ఉండాల్సింది..నాకెందుకో ఈ సినిమాలో హాస్యం కన్నా సీరియస్ సన్నివేశాలే బాగా నచ్చుతాయి.. మీ పుణ్యమా అని 'ఆదిభిక్షువు..' పాట పూర్తి సాహిత్యం తెలుసుకోగలిగాను.. మీకు, కృష్ణ మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. "పళ్ళ చెట్టు" హమ్మో..చాలా పెద్ద ప్రశంశ అండీ... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@తృష్ణ: అన్ని పాటలూ చాలా బాగుంటాయండీ.. నిజమే..జ్యోతి పాత్ర నాక్కూడా మిష్టరీ లాగే అనిపిస్తుంది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ప్రణీత స్వాతి: సాక్షి రంగారావు బాడీ లాంగ్వేజి కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఈ సినిమాలో.. గమనించారా? ధన్యవాదాలు.
అన్నాయ్-
రిప్లయితొలగించండినాదో ప్రశ్న.
నిజజీవితంలో, నే చూసినంతవరకూ, మూగవాళ్ళకు చెవుడుకూడా ఉంటుంది.
సినిమాల్లో ఈ విషయాన్ని ఎందుకు పక్కనపెడతారో అర్ధంకాదు.
ఔనా కాదా?
"అన్ని స్నాన దృశ్యాలనూ ఓసారి గుర్తుచేయ్యమనా మీ ఉద్దేశ్యం? "
రిప్లయితొలగించండితథాస్తు!
సినిమా పారడీజో అని ఒక ఇటాలియను సినిమా ఉన్నది. అందులో ఒక చిన్న పల్లెటూళ్ళో ఒకే సినిమా హాలుంటుంది. ప్రతి వారం కొత్త హాలీవుడ్ సినిమా. సినిమాకి జనాల్ని వదిలే ముందు ఊరి కేథొలిక్ ఫాదరీ గారు ముందు చూసి ముద్దు సీన్లన్నీ కత్తిరింపిస్తాడు. ప్రొజెక్షను ఆపరేటరు చని పోతూ, అలా కత్తిరించిన ముద్దుసీన్ల మాంటాజ్ ని కథానాయకుడికి బహుమతిస్తాడు. అది గుర్తొచ్చింది మీ ఆఫర్ చదివి. :)
నా మట్టుకి సాగరసంగమంలో అసందర్భంగా కనిపించే జయప్రద స్నానం తప్ప ఇంకేం గుర్తుకి రావట్లా.
మరి మొదలెట్టండి, శుభస్య శీఘ్రం.
విశ్వనాథ్ గారి ప్రతీ సినిమాలో సాక్షి రంగారావు ఉంటాడు.
రిప్లయితొలగించండిఅలాగే ఆయన పాత్రకి ప్రతీ సినిమాకి ఒకో మేనరిజం ఉంటుంది కామెడీగా.
ఉదా. స్వర్ణకమలం, సూత్రధారులు, సాగరసంగమం మొ.
పల్లెటూర్లో ఊసుబోదనుకున్నాను గానీ పెద్ద కాంపెయిన్ కే అవకాశముందేఅన్నాడు గురుడు గిరీశం!
రిప్లయితొలగించండిఈ టపా చూసి చదివి ఆ ఏముంది ఎప్పటిలాగానే బాగారాసారు పెద్ద వింతేముందీ అనుకుని ఊరుకున్నా.కానీ కామెంట్లను చూస్తూ ఊరుకోలేక ఇలా...
సిరివెన్నెల సినిమా ఆర్ధికంగా పెద్ద విజయంసాధించలేదు.అందుకు కె.విశ్వనాధ్ చెప్పిన సమాధానం కూడా నాకు అర్ధంకాలేదు.దీనికి కాస్త ముందొచ్చిన సాగరసంగమం ప్రభావం ప్రేక్షకులమీద ఇంకా గాఢంగా ఉండటంవల్ల సిరివెన్నెలను పెద్దగా ఆదరించ లేదని ఆయన వివరణ.
వేణుగానసామ్రాట్ హరిప్రసాద్ చౌరాసియా స్ఫూర్తితో రూపొందించిన ఈ చిత్రకధానాయకుడి స్వస్థలం లా చూయించిందంతా రాజస్థానే గానీ తెలుగునేల కాదు,ఆపాట గొప్పదే(ఈ గాలీ,ఈనేల) కానీ చూస్తూ మాత్రం నేను ఆరాజస్థానీ వాతావరణంతో తాదాత్మం చెందలేకపోయాను.
మూన్ మూన్ సేన్ పాత్రగానీ అసలాపాత్రకు ఆమె ఎంపికకానీ నాకు ఇప్పటికీ అంతుబట్తటం లేదు.పైగా ఆమెను దాసరి,నాగార్జున కలయికలో వచ్చిన మజ్ను లో కూడా ఒక కధానాయిక వేషమిచ్చారు.ఈలోపు బాలకృష్ణ కూడా తయారవగా ఎవరో వారించారని ఆమధ్య కర్ణపిశాచాలు కూసాయి.
ఇహ మీరు విశ్వనాద్ సినిమాల్లోని స్నానఘట్టాలను వివరింపబూనుకుంటే మాత్రం ‘ఎందుకంటే ఏమి చెప్పను’గురించి కూడా ముందే చెప్పేయాలి మరి :)
@భాస్కర్:చెవిటితనం తో పుట్టినవారికి ఎలాంటిశబ్దాలు,మాటలు వినిపించక క్రమంగా మూగవారవుతారని విన్నాను.
గగనపు విరితోట లోని గోగుపూలు అన్నపలుకు మాత్రం, అద్భుతం.
@భాస్కర్ రామరాజు: కథ కోసం.. ఈ సినిమాలో ప్రేక్షకులకి అలాంటి డౌట్ రాకూడదనే సంయుక్త చేత అనిపించేస్తారు "మీకు చిన్న చిన్న శబ్దాలు కూడా బాగానే వినిపిస్తాయే.." అని.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కొత్తపాళీ: నాకా ఇటాలియన్ సినిమా చూడాలని ఉంది :-) 'శంకరాభరణం' లో నిలువెత్తు మంజుభార్గవి నూతిగట్టు మీద నిలబడి స్నానం చేసి శాస్త్రిగారింట్లోకి నీళ్ళ బిందె తీసుకెళ్ళే సీన్ మర్చిపోయారా? అవునులెండి.. జయప్రద కి ఉన్న సమ్మోహన శక్తి అలాంటిది.. మిగిలిన వాళ్ళు ఎందుకు గుర్తుంటారు? :-) :-)
@బోనగిరి: అవునండీ.. నిన్నమొన్నటి 'స్వరాభిషేకం' లో కూడా ఉన్నారు సాక్షి..
రిప్లయితొలగించండి@రాజేంద్రకుమార్ దేవరపల్లి: గిరీశం కామెంట్ బహుచక్కని పోలిక. థాంకులు. నాక్కూడా ఆ రాజస్థాన్ లో ఈ తెలుగువాళ్ళంతా ఏం చేస్తున్నారా అని ఎప్పుడూ డౌట్.. ఒకరిద్దరు పెద్ద హీరోల పక్కన చేసిన ప్రతి హీరోయిన్కీ బాలకృష్ణ అవకాశం ఇస్తారని వినికిడి.. 'ఎందుకంటే ఏమి చెప్పను?' ..ఇదొక్కటీ అర్ధం కాలేదండీ.. కొంచం చెప్పరూ ప్లీజ్.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిhttp://www.chitramala.com/audio-songs/pop_new.php?sid=6159&wid=834
రిప్లయితొలగించండిఇక్కడ వినండా పాటను :)
@రాజేంద్రకుమార్ దేవరపల్లి; ఓహ్.. 'జీవన జ్యోతి' లో పాట!! ఒక్క క్షణం కన్ఫ్యుస్ అయ్యాను.. పాట కి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిee sakshi paper lo next part ekkada undi ?
రిప్లయితొలగించండిpls give me the link
@లలితా స్రవంతి పోతుకూచి: ధన్యవాదాలు.. ఇక్కడ చూడండి:
రిప్లయితొలగించండిhttp://nemalikannu.blogspot.com/2009/02/blog-post_25.html